మృతదేహాలను ఇలా ఉపయోగిస్తారా? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

Posted By: Bharath
Subscribe to Boldsky

మనతో అన్యోనంగా ఉన్నవాళ్లు.. మన కుటుంబ సభ్యులు మన నుంచి దూరమైతే ఆ బాధ చెప్పలేనిది. చనిపోయిన తర్వాత ఎంతటి మహానుభావులైనైనా మనం ఖననం లేదా దహనం చేయకతప్పదు. మృతదేహాలు మట్టిలో కలిసిపోవాల్సిందేనా... వీటిని ఇంకా వేటికన్నా ఉపయోగిస్తారా? మృతదేహాలను పలు రకాలుగా ఉపయోగిస్తారు. వాటి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

ట్రీ ఫెర్టిలైజర్స్

ట్రీ ఫెర్టిలైజర్స్

బయో ఉర్న్స్ అనే సంస్థ 2011 లో ఒక వినూత్న కార్యక్రమం చేపడుతోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే మొక్కల పెంపకం ప్రత్యేకంగా ఉంటుంది. వీరు మృతదేహాన్ని దహనం చేశాక వచ్చే బూడిదను మొక్కల ఎరువుగా ఉపయోగిస్తారు. ఆ బూడిదపై సీడ్ ను నాటుతారు. తర్వాత అది మొక్కగా మారి, పెద్ద చెట్టుగా మారుతుంది. వీరి బిజినెస్ కు ఒక రేంజ్ లో డిమాండ్ ఉంది.

డైమండ్స్

డైమండ్స్

మృతదేహాలతో డైమండ్స్ ఎలా తయారీ చేస్తారని మీకు డౌట్ రావొచ్చు. కానీ అమెరికాలోని ఒక కంపెనీ మృతదేహాలను వీటి తయారీ కోసం ఉపయోగిస్తుంది. మనిషి శరీరంలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వజ్రాల తయారీకి బాగా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి శరీరం ద్వారా 50 కన్నా ఎక్కువ వజ్రాలు తయారు చేయవచ్చు! కొందరు వ్యక్తులు చనిపోయిన తమ ఆత్మీయలు జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునేందుకు మృతదేహాలతో వజ్రాలు తయారు చేయించుకుని వాటిని ధరిస్తుంటారు.

సబ్బు

సబ్బు

చనిపోయిన వారి శరీరాలతో సబ్బులు కూడా తయారు చేస్తారు. కొన్ని కంపెనీలు ఇలా తయారు చేస్తాయి. మనిషిలో ఉండే ఫ్యాట్స్ కు కొన్ని రసాయనాలు కలిపి ఇలాంటి సబ్బులను తయారు చేస్తారు.

కొన్ని మెటల్స్ తయారు చేస్తారు

కొన్ని మెటల్స్ తయారు చేస్తారు

మృతదేహాల నుంచి సేకరించిన కొన్నింటి ద్వారా కొన్నిరకాల లోహాలు తయారు చేస్తారు. ఈ విధానం 2004 లో యునైటెడ్ కింగ్ డమ్ లో ప్రారంభమైంది. వీధి దీపాలు, విమానం ఇంజిన్లు తదితరవాటిలో ఇలా తయారు చేసిన మెటల్స్ ఉపయోగిస్తారు.

పౌడర్

పౌడర్

స్వీడన్ కు చెందిన ఒక కంపెనీ ఇలా మృతదేహాల నుంచి పౌడర్ తయారు చేస్తూ ఉంటుంది. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మృతదేహాలను ముందుగా డీప్ ఫ్రిజ్ లో ఉంచుతారు. అవి ఐస్ మాదిరిగా అయ్యేలా చేస్తారు. తర్వాత వాటిని వైబ్రేటర్ లో ఉంచుతారు. ఆ తర్వాత ఆ బాడీస్ ద్వారా పౌడర్ తయారు చేస్తారు.

టిబెట్లో కాస్త భిన్నం

టిబెట్లో కాస్త భిన్నం

టిబెట్లో ఉన్న సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. అక్కడ మనుషుల మృతదేహాలు ముక్కలుగా ముక్కలుగా చేస్తారు. ఆ ముక్కలకి గోధుమ పిండి వెన్నను కలుపుతారు. వాటిని పర్వతాలపై ఉన్న రాబందులకు ఆహారంగా వేస్తారు. రాబందులు వాటిని ఎంతో ఇష్టంగా తింటాయి. ఒక మనిషి చనిపోయినా అతని శరీరం మట్టిలో కలిసి పోకుండా ఇలా పక్షులకు ఆహారంగా వేయాలని అక్కడి వారు భావిస్తారేమో మరి. అయినా ఇంత దారుణమైనా సంప్రదాయం ఎక్కడా ఉండదు.

కార్ క్రాష్ టెస్ట్స్

కార్ క్రాష్ టెస్ట్స్

కొన్ని కార్ల సంస్థలు కార్ క్రాష్ టెస్ట్స్ కోసం మనుషుల మృతదేహాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి. కొన్నిసంస్థలు డమ్మీ బొమ్మలను పెట్టి కార్ క్రాష్ టెస్ట్స్ చేస్తాయి. అయితే కొన్ని కార్ల సంస్థలు మాత్రం మనుషుల మృతదేహాలను ఇందుకు ఉపయోగిస్తాయి. అందుకోసం మృతదేహాలను కొనుగోలు చేస్తాయి.

English summary

how a dead body can be used to make things

Here are some of the unique and bizarre ideas that people have tried.
Subscribe Newsletter