బార్ లో మందు కొట్టాడు..పొట్ట చీలిపోయింది! ఎలా అంటే?

Posted By:
Subscribe to Boldsky

మగవారికి పార్టీలు, పబ్ లు సహజం. సంతోషం వచ్చినా..బాధొచ్చినా ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటారు. ఎంత పార్టీ చేసుకున్న ఆరోగ్య గురించి కొంచె జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. పార్టీలో కొన్ని వింత విషయాలు అప్పుడప్పుడు జరుగుతుండటం మనం గమనిస్తుంటాము. అయితే ఒక వింత విషయం ఏంటంటే, పార్టీలో మందు తాగిన వ్యక్తి పొట్ట చెక్కలైందంటే ఆశ్చర్యమేస్తోంది. నిజం, ఈ క్రేజీ ఇన్సిడెంట్ రీసెంట్ జరిగింది.

ఆ వ్యక్తి కాక్కటైల్ గా పిలుచుకునే నైట్రోజెన్ లిక్విడ్ తాగిన తర్వాత అతని పొట్ట మీద రంద్రం పడిందంట. ఈ వింత విషయాన్ని గమనించిన వ్యక్తి హాస్పటల్ పాలయ్యాడు. ఆ వివరాలేంటో కొంచెం వివరంగా తెలుసుకుందాం..

1. దేశ రాజధాని ఢిల్లీలోని గుర్గావ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది.

1. దేశ రాజధాని ఢిల్లీలోని గుర్గావ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది.

ఓ బారులో మద్యం తాగిన ఒక యువకుడి పొట్ట చీలి రంధ్రం ఏర్పడింది. ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల యువకుడు(వ్యాపారి) స్నేహితులతో కలిసి బారుకు మందు తాగడానికి వెళ్లాడు. అనంతరం పొగలు కక్కే కాక్‌టెయిల్‌ ఆర్డర్ ఇచ్చాడు. అది తాగిన కొద్ది సేపట్లోనే అతడి పొట్ట ఉబ్బడం ప్రారంభమైంది. చూస్తుండగానే అతడికి ఊపిరి కూడా అందడం కష్టమైంది.

ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే శరీరంలో జరిగే మార్పులు..

2. అతను ఏం చేశాడు ?

2. అతను ఏం చేశాడు ?

అసలు ఇక్కడ జరిగిందేమిటంటే… మద్యం త్వరగా చల్లబడేందుకు లిక్విడ్ నైట్రోజన్‌ను పోస్తారట. దీని వల్ల పొగలు ఏర్పడతాయి. ఆ పొగలు పూర్తిగా ఆవిరైపోయిన తర్వాతే ఆ మద్యం తాగాలి. కాని ఆ యువకుడు లిక్విడ్ నైట్రోజన్‌తో సహా తాగేయడంతో కడుపులో రంధ్రం ఏర్పడింది.

3. ఆ షాక్ నుండి అసలు అతను తేరుకోలేకపోయేడు:

3. ఆ షాక్ నుండి అసలు అతను తేరుకోలేకపోయేడు:

ఏదో సరదాగా ఎంజాయ్ చేయాలకున్న అతను పొగలు కక్కే కాక్‌టెయిల్‌ను ఆర్డర్ చేశాడు. అది తాగిన కొద్ది సేపట్లోనే అతడి పొట్ట ఉబ్బడం మొదలైంది. చాలా అసౌకర్యంగా అనిపించింది. ఊపిరి కూడా అందలేదు.

దాంతో తీవ్రమైన నొప్పితో కేకలు పెట్టడం మొదలెట్టాడు. ఇది గమనించిన అతడి స్నేహితులు వెంటనే గుర్గావ్‌‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి చికిత్స చేసిన వైద్యులు కడుపు చిలీపోయి.. రంధ్రం ఉండటం చూసి అవాకయ్యారు. దీంతో కొంత భాగం తొలగించి, కుట్లు వేశారు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు.

4. అతను తాగిన డ్రింక్ :

4. అతను తాగిన డ్రింక్ :

లిక్విడ్ నైట్రోజన్ కాక్ టైల్ తాగాడు. ఈ లిక్విడ్ త్వరగా చల్లబడేందుకు లిక్విడ్ నైట్రోజన్‌ను పోస్తారట. దీని వల్ల పొగలు ఏర్పడతాయి. ఆ పొగలు పూర్తిగా ఆవిరైపోయిన తర్వాతే ఆ మద్యం తాగాలి. కాని ఆ యువకుడు లిక్విడ్ నైట్రోజన్‌తో సహా తాగేయడంతో కడుపులో రంధ్రం ఏర్పడిందని, ఈ లిక్విడ్ గురించి అతనికి పూర్తిగా తెలియపోవడము, అవగాహన లేకపోవడమే అని డాక్టర్లు, అతని స్నేహితులు చెప్పారు.

ఆల్కహాల్ సెక్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

5. ఫ్యాన్సీ లుక్ తో తయారుచేస్తారు:

5. ఫ్యాన్సీ లుక్ తో తయారుచేస్తారు:

ఆ కాక్టైల్ లిక్విడ్ నైట్రోజెన్ ను ఫ్రీజ్ ఫుడ్స్, మరియు డ్రిక్స్ తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు. అది కాకుండా హాని చేయని కలర్ లెస్ లిక్విడ్ కఫ్యూటర్స్ కూల్ చేయడానికి మరియు వైద్యపరంగా క్రయోజనిక్ లో ఉపయోగించి, వ్రాట్స్ మరియు క్యాన్సర్ టిష్యులను తొలగించడానికి ఉపయోగిస్తుంటారు .

6. అతను ఏం చెప్పాడంటే..

6. అతను ఏం చెప్పాడంటే..

ఇంటర్వ్యులో ‘లిక్విడ్ కాక్టైల్ ను నోట్లో పోసుకుని మింగిన వెంటనే, చాలా అసౌకర్యంగా అనిపించింది, ఎలా అంటే మనం ఎసిడిటి ఉంటే ఎలా ఇబ్బందిగా ఉంటుందో, అదే విధంగా అసౌకర్యంగా అనిపించింది. తర్వాత బార్టెండర్ మరో డ్రింక్ పంపాడు, అది కూడా తాగాను. అయితే ఈ అసౌకర్యాన్ని పెద్దగా నేను పట్టించుకోలేదు. కొన్ని నిముషాల్లోనే పొట్ట బారీగా వాపు వచ్చింది. తర్వాత విపరీతమైన నొప్పి, శ్వాసకూడా అందలేదు’’.

అలర్ట్ : ఆల్కహాల్ మానేయడానికి 8 నేచురల్ రెమెడీస్

7. డాక్టర్లు ఏమన్నారు :

7. డాక్టర్లు ఏమన్నారు :

ఈ లేటెస్ట్ ట్రెండ్ లో ఐస్ క్రీములు తినడం, ఫ్యాన్సీ డ్రింక్స్ ను తాగడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. అయితే వీటి వల్ల చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. అనారోగ్య సమస్యలను ఎవ్వరు లెక్కచేయడం లేదు. అయితే చాలా మంది కొన్ని పానీయాలు, ఆహారాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల వారీ జీవక్రిల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో అని కూడా తెలిసుకోకుండా ఇలా లిక్విడ్ నైట్రోజెన్ తీసుకోవడం వల్ల అతని పొట్ట రంద్రం పడిందని అంటున్నారు.

English summary

Man Drank Liquid Nitrogen In Bar; Ended With A Hole In His Stomach

A man was left with a hole in his stomach after he gulped a cocktail with liquid nitrogen.
Subscribe Newsletter