హిట్లర్ యూదుల ఊచకోతకు నిదర్శనం ఈ ఫొటోలు

Written By: Bharath
Subscribe to Boldsky

1933లో జర్మనీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిట్లర్‌ నాయకత్వంలోని నేషనలిస్టు సోషలిస్టు జర్మన్‌ వర్కర్స్‌ పార్టీ (నాజీ) అధి కారంలోకి వచ్చింది. అయితే అధికారంలోనికి వచ్చిన తర్వాత హిట్లర్‌ ప్రదర్శించిన జాత్య హంకారం వల్ల పోలాండ్ శవాల గుట్టగా మారింది. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి రాగానే యూదులను ఊచకోత ఆరంభించాడు. కొందరిని దేశం వదలి పారిపోనిచ్చాడు. వారి ఆస్తుల్ని కొల్లగొట్టడం, స్వాధీనం చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది.

అయితే నాజీలు పోలండ్ లోని లాడ్జ్ ఘెట్టో ప్రాంతాన్ని బాంబులతో నేల మట్టం చేశారు. యూదులు అందరినీ బంధించి హింసించారు. పోలండ్ దేశానికి చెందిన ల‌క్ష‌లాది చిన్నారుల‌ను జ‌ర్మ‌న్ నాజీలు పొట్ట‌న పెట్టుకున్నారు. అయితే అదృష్ట‌వ‌శాత్తూయాభైవేల మంది పోలిష్ పిల్ల‌లు మాత్రం బ‌తికిపోయారు. ఎలా అంటే పోలండ్ పిల్ల‌లు అచ్చం చూసేందుకు కొన్ని యాంగిల్స్‌లో జ‌ర్మ‌న్ పిల్ల‌లుగానే నాజీల‌కు క‌నిపించార‌ట‌. అందుకే వారిని అప‌హ‌రించుకుపోయి త‌మ జ‌ర్మ‌న్ దేశ పౌరుల‌కు ఇచ్చేశారు.

ఒక జంట దిగిన ఫొటో

ఒక జంట దిగిన ఫొటో

1. పోలాండ్ లోని లాడ్జ్ ఘెట్టోను నాజీలు ఆక్రమించుకునే సమయంలో ఒక జంట దిగిన ఫొటో ఇది. ఇది 1940-44 ప్రాంతంలో తీసిన ఫొటో.

తోరాను మోసుకుని వెళ్తున్న వ్యక్తి

తోరాను మోసుకుని వెళ్తున్న వ్యక్తి

2. ఈ ఫోటోను 1940 లో తీశారు. తోరాను మోసుకుని వెళ్తున్న వ్యక్తిని ఇలా క్యాపర్చ్ చేశారు. అప్పట్లో అక్కడి వోల్బర్స్కా వీధుల్లోని పరిస్థితిని ఈ ఫోటో తెలుపుతుంది.

యుద్ధభూమి

యుద్ధభూమి

1940-1944: నాజీలు ఆక్రమించిన సమయంలో ఆ ప్రాంతం మొత్తం యుద్ధభూమిలాగా మారింది. అసలు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అలాంటి సందర్భంలో ఒక పిల్లవాడు తినడానికి ఆహారం కోసం వెతుకుతున్న దీనస్థితి ఈ ఫొటో తెలియజేస్తుంది. అక్కడ ఎక్కువగా ఆళ్లగడ్డలు తింటారు. అవి ఏమైనా దొరుకుతాయోనని ఇలా వెతుకుతున్నాడు.

డెత్ క్యాంప్

డెత్ క్యాంప్

1944: పోలండ్ లోని ఘెట్టో ప్రాంతంలో నాజీలు డెత్ క్యాంప్ నిర్వహించారు. దాంతో అక్కడడున్న జనాలు చాలామంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ నివాసం ఉన్న వారి సామగ్రి మొత్తం రోడ్డుపై వేశారు. ఆనాటి నాజీల బీభత్సాన్ని ఈ ఫొటో మనకు తెలుపుతుంది.

బిడ్డతో ప్రాణాలతో

బిడ్డతో ప్రాణాలతో

1940-1942: నాజీల దాడి నుంచి తన బిడ్డతో ప్రాణాలతో బయపడిన యువతి ఫొటో ఇది. ఈమె ఘెట్టో పోలీసు కుటుంబానికి చెందిన యువతి.

చిన్నపిల్లల్ని దారుణంగా చంపేశారు

చిన్నపిల్లల్ని దారుణంగా చంపేశారు

1940-1944: యూదులకు సంబంధించిన చిన్నపిల్లల్ని నాజీలు దారుణంగా చంపేశారు. ఈ చిత్రంలోని చిన్నారి ప్రాణాలతో బయటపడిందో లేదో తెలియదు.

ప్రవేశం లేదు

ప్రవేశం లేదు

1940-1944: ఘెట్టోలోకి ప్రవేశం లేదంటూ అక్కడ ఒక బోర్డ్ ఏర్పాటు చేశారు. నాజీలు చేస్తున్న హింసఖాండ బయటి ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ఇలా బోర్డ్ ఏర్పాటు చేశారు నాజీలు.

దాచిపెట్టిన ఫొటోలు

దాచిపెట్టిన ఫొటోలు

1945: ఫొటోగ్రాఫర్ హెన్రిక్ తన స్నేహితుల బృందంతో కలిసి లాడ్జ్ ఘెట్టోకు వెళ్లి అక్కడ ఆయన భద్రంగా దాచిపెట్టిన ఫొటో నెగెటివ్స్ ను తీసుకుంటున్న ఫొటో ఇది. హెన్రిక్ నాజీలు యూదులపై చేసిన అనేక దాడులను చిత్రీకరించి వాటిని దాచిపెట్టారు.

ప్రాణాలు అరచేతిలో..

ప్రాణాలు అరచేతిలో..

1940-1944: పోలాండ్ లో నాజీల హింసను తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లను వదిలి పొట్ట చేతపట్టుకుని వెళ్తున్న యూదులు.

డెత్ క్యాంప్ నకు పిల్లలు

డెత్ క్యాంప్ నకు పిల్లలు

1942: ఓ ట్రక్ నిండా యూదులకు చెందిన చిన్న పిల్లలను నాజీలు తీసుకెళ్తున్ ఫొటో ఇది. వారందరినీ చెల్మో నాడ్ నె నెమ్ డెత్ క్యాంప్ నకు తీసుకెళ్లారు.

నాశనం

నాశనం

1940-1944: వోల్బర్స్కా వీధుల్లోని ఇళ్లను నాజీలు పూర్తిగా నాశనం చేశారనడానికి ఆ ఫోటోనే ప్రతీక. చెల్లచెదురుగా మారిన ఆ ప్రాంతంలో యూదులు నిస్సహాయంగా ఉండిపోయారు.

ఫొటోలు

ఫొటోలు

1940: హెన్రిక్ తన కెమెరాతో ఘెట్టోలోని ప్రజలన ఫోటో తీస్తున్నాడు. అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గుర్తింపు కార్డుల కోసం ఇలా ఆయన ఫొటో తీస్తున్నారు.

అంతటా పుర్రెలే

అంతటా పుర్రెలే

1940-1944: యూదులను నాజీలు అతి కిరాతంగా చంపడంతో వారి పుర్రెలు, ఎముకలు ఇలా భయటపడ్డాయి. లాడ్జ్ ఘెట్టో ప్రాంతం మొత్తం ఇలా పుర్రెలతో నిండిపోయింది.

సర్వనాశనం

సర్వనాశనం

1940-1944: ఇక ఈ గడ్డపై మిగిలింది ఏమీ లేదు. అంతా సర్వనాశనం చేశారనడానికి ప్రతీకగా ఉంది ఈ ఫొటో.

బహిష్కరణ

బహిష్కరణ

1944: రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తీసిన ఫొటో ఇది. ఘెట్టోలో ఉన్న చాలామందిని అప్పడు బహిష్కరించారు.

English summary

rare yet evocative pictures that even the nazis found hard to find

Jewish Photographer Captures 15 Extremely Rare Yet Evocative Pictures That Even The Nazis Found Hard To Find.
Story first published: Saturday, November 25, 2017, 15:41 [IST]
Subscribe Newsletter