చాణుక్య: సీక్రెట్ ఆఫ్ సక్సెస్-జంతువుల నుండి మనం నేర్చుకోవల్సిన విషయాలు

Posted By:
Subscribe to Boldsky

ప్రతీ మనిషి తన జీవితంలో సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాడు.దానికి ఎన్నో దారులు వెతుకుతూ, ఎంతో కష్టపడుతూ ఉంటాడు. వాటిలో కొన్ని విజయవంతం అవుతాయి మరికొన్ని అవ్వవు. కాని ఈ పోరాటంలో ఓడినా గెలిచినా మనిషి ఎన్నో నేర్చుకుంటాడు.

గెలుపులో తనకు తెలిసినవి అవలంభించి గెలుపును సొంతం చేసుకుంటాడు. ఓటమిలో తనకు తెలియనివి ఎన్నో నేర్చుకుంటాడు. మన చుట్టూ ఉన్న మనుషుల నుంచే కాదు, జంతువుల నుండి, పక్షుల నుండి కూడా ఎన్నో నేర్చుకోవచ్చని చాణుక్యుడు చెప్పాడు. ఆరు జంతువుల నుంచి ఈ ఆరు లక్షణాలు నేర్చుకుంటే సక్సెస్ గ్యారెంటీగా సాధించవచ్చని చెప్పాడు. అవేమిటో చూదాం...

1. సింహం- కటినమైన పనిని సాధించడం.

1. సింహం- కటినమైన పనిని సాధించడం.

ఇది కష్టం చెయ్యలేము అని నిరాశపడకండి. ఎంత ఖష్టమైన పనినైనా మనకి తెలిసిన పని అయితే సింహంలా సాధించండి. సింహం తన ఆకలి తీర్చుకోవడానికి తన శక్తిని, తెలివిని ఉపయోగించి వేటాడుతుంది. ఒంటిరిగా పోరాడి అనుకున్నది సాధించుకుంటుంది. అదే విధంగా మనిషి కూడా లాభనష్టాలు, కష్టం అనుకోకుండా చేసే ఏపనిలో అయినా సక్సెస్ సాధించి తీరుతాడు.

2.కొంగ- ఇంద్రియ నిగ్రహం , కార్య సాధన

2.కొంగ- ఇంద్రియ నిగ్రహం , కార్య సాధన

నిగ్రహం అనేది చాలా అవసరం. సాధన చెయ్యనిదే దేన్నీ కూడా సాధించలేము. కొంత తన ఆహారం కోసం నీటిలో ఉండి కీటకాల కోసం ఇంద్రియాలతో వాటి ఏకాగ్రతతో కనిపెట్టుకుని ఉండి చటుక్కున పట్టుకుంటుంది. అదేవిధంగా మనిషిలో కూడా ఇంద్రియ నిగ్రహం, క్యార్యసాధన కలిగి ఉంటే, తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.

3. కోడి-

3. కోడి-

సకాలములో మేల్కొనుట, కలియబడి ఆహారము కనుక్కొనుట, పోరాట పటిమా,చుట్టాలకు తనకు ఉన్న దానిలో పెట్టుట. టైం డిసిప్లెన్ అనేది కోడి నుంచి నేర్చుకోవచ్చు. పోరాడి మరీ మనకు కావాల్సింది సాధించాలి. మనకి ఉన్నదానిలోనే ఎదుటి వారికి మర్యాద చెయ్యాలి. జంతువుల నుంచి ఈ ఆరు లక్షణాలు నేర్చుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు - చాణిక్యుడు

4. గాడిద-

4. గాడిద-

అలసినా ఎంత బరువైనా మోస్తుంది. ఎండనక, వాననక పనిచేస్తుంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుట. అలసిపోతున్నామని భాద్యతలని వదలద్దు. ఇప్పుడు ఎండగా ఉంది, వానగా ఉంది అని దేనికి బద్దకించి పనులు ఆపకూడదు. ఎన్ని భాద్యతలను మోస్తుంటే మనం అంత సక్సెస్ ఫుల్ లైఫ్ అని ఆనందంగా ఉండాలి.

5. కాకి-

5. కాకి-

చాలా తెలివి కలది. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండుట, నిరంతర వస్తు సేకరణ, ఇతరులను నమ్మకపోవడం.

ఏపని చేస్తున్నా ఎపుడు జాగ్రతగా ఉండాలి. ఎప్పుడు ఎదో ఒక విషయాన్ని సేకరిస్తూ ఉండాలి ఆ నాలెడ్జ్ మనకి చాలా ఉపయోగపడతుంది. ఇది ఎవరి కోసమో కాదు, మిమ్మల్ని మీరు రహస్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది.

6. కుక్క:

6. కుక్క:

తక్కువగా తింటుంది, ఎక్కువ విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటుంది. చాలా సైలెంట్ గా ఉంటుంది, కానీ వాసన మాత్రం పసిగడుతుంది. అవసరమైనప్పుడు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఆకలి అయినప్పుడు మాత్రమే అరుస్తుంది, ఆకలి తీర్చుకుంటుంది. మనిషి కూడా అంతే ఇతరు పట్ల, నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడూ సైలెంట్ గా ఉండాలి. అవసరమైతేనే కోపాన్ని ప్రదర్శించాలి.

English summary

The Animals To Make you a Better Human:Chanakya Neeti

The title of this article sounds strange for sure. Trust me! it’s about the animals, in relation with Chanakya, and interesting as well. In the Chapter 6 of Chanakya Neeti, are mentioned a few animals and their characteristics. A man must try to become like those. They are:
Story first published: Friday, August 18, 2017, 15:40 [IST]
Subscribe Newsletter