ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం : ముక్కు చూసి వ్యక్తిత్వం తెలుసుకోండి

By: Mallikarjuna
Subscribe to Boldsky

మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే.. వారితో స్నేహం చేయాలా ? అవసరం లేదు.. ముక్కు ఆకారాన్ని చూసి కూడా.. వాళ్ల మనస్తత్వం చెప్పేయచ్చంటున్నాయి అధ్యయనాలు. ఎదుటివాళ్ల ఆలోనలు, అభిప్రాయాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. కానీ.. వ్యక్తిత్వం మాత్రం మార్చలేనిది. అందుకే అది తెలిసుకోవాలంటే.. ముక్కు ఆకారాన్ని గమనించండి.

మనసులోని భావాలు సందర్భాన్నిబట్టి మారవచ్చు. ఒక్కో సమయంలో ఒక్కోలా భావాలు మారిపోతుంటాయి. కాబట్టి ముఖం చూసి అంచనా వేయడం కష్టమే. కానీ ఎప్పటికీ ఒకేలా ఉండే ముక్కు చూసి సరిగ్గా అంచనా వేయవచ్చంటున్నాయి అధ్యయాలు. ఇంతకీ ఏ ఆకారం ముక్కు గలవాళ్లు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారో తెలుసుకుందామా...

రెండు చేతులు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం ఏర్పడితే ఏమవుతుంది ?

నూబియ‌న్ ముక్కు:

నూబియ‌న్ ముక్కు:

నుబియన్ ముక్కు స్ట్రెయిట్ గా ఉంటుంది. నోస్ పాయింట్స్ క్రింది ఉంటాయి. ఇలాంటి ముక్కు ఆకారం ఉన్న వీరు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మార్గాల‌ను అన్వేషిస్తార‌ట‌. వీరు ఏ విష‌యం ప‌ట్ల‌నైనా ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. ఓపెన్ మైండెడ్‌గా ఉంటార‌ట‌. వీరు ఇత‌రుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటార‌ు.

గ్రీన్ నోస్ :

గ్రీన్ నోస్ :

పురాతన గ్రీకు శిల్పాలు ఈ ముక్కు ఆకారాన్ని పోలిఉండటం వల్ల గ్రీక్ నోస్ అని పిలుస్తారు. ఈ ముక్కును రోమ‌న్ ముక్కు అని కూడా పిలుస్తారు. గ్రీక్ నోస్ అంటే.. నిటారుగా.. స్ట్రెయిట్ గా.. ఉంటుంది. వీళ్లు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఇతరులకు సహాయం చేయాలన్న గొప్ప ఆలోచనలతో ఉంటారు.

వీరు జీవితం ప‌ట్ల క‌చ్చిత‌మైన అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటార‌ట‌. వీరికి నిర్దిష్టమైన ల‌క్ష్యాలు ఉంటాయ‌ట‌. ప్ర‌తి దాన్ని నేర్చుకోవాల‌ని చూస్తార‌ట‌. వీరికి కూడా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎక్కువేన‌ట‌. అయితే ఏ అంశంపైనైనా అంత త్వ‌ర‌గా నిర్ణ‌యాలు తీసుకోర‌ట‌. చాలా సేపు ఆలోచించి గానీ ఓ నిర్ణ‌యం తీసుకోర‌ట‌. అలాగే వీరు ఏవిషయాన్ని దాచుకోలేరు. ఏ కొద్ది మాత్రమే కొన్ని సీక్రెట్స్ ను దాచుకుంటారు.

హుక్ నోస్ :

హుక్ నోస్ :

పక్షి యొక్క ముక్కును లేదా ఒక కొక్కీ వంటి ముక్కును పోలి ఉండటం వల్ల దీనికి హుక్ నోస్ అని పేరు వచ్చింది. ముక్కు చివరన క్రిందికి వంగి ఉంటుంది. ఈ రకమైన ముక్కు ఉన్న వారు ఎక్కువగా ఆలోచించే వారు. ఎక్కువ శ్రమిస్తారు, స్వయంగా అభిప్రాయాలు తీసుకోగలరు. ఎలాంటి విషయాలనైనా చాలెంజింగ్ గా తీసుకుంటారు . వీరు దౌత్య, సృజనాత్మకంగా మరియు స్వీయ-ప్రభావశీలంగా ఉంటారు.

ఆర్చెడ్ నోస్ :

ఆర్చెడ్ నోస్ :

వంపు ముక్కు . ముక్కు సైజ్ పెద్ద‌గా ఉన్న వారు మంచి నాయ‌కులు అవుతార‌ట‌. వీరు అంద‌రినీ ప్ర‌భావితం చేయ‌గ‌ల శ‌క్తి వంతులుగా ఉంటార‌ట‌. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు వీరిలో పుష్క‌లంగా ఉంటాయ‌ట‌. వీరికి స్వ‌తంత్ర భావాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఎలాంటి ఇగోల‌కు పోర‌ట‌. వీరికి త‌మ‌పై అధికారం చెలాయించే వారంటే న‌చ్చ‌ర‌ట‌.

బటన్ నోస్ :

బటన్ నోస్ :

చిన్న మరియు డైంటీ ముక్కును కలిగి ఉంటారు. చిన్న ముక్కు ఉన్న‌వారికి సామాజిక అంశాల పట్ల శ్ర‌ద్ధ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. మృదు స్వ‌భావులు అయి ఉంటార‌ట‌. కొన్ని సార్లు షార్ట్ టెంప‌ర్‌కు లోన‌వుతార‌ట‌.

చిన్న ముక్కు ఉన్నవాళ్లు చాలా స్నేహపూర్వకంగా.. ఆనందంగా ఉంటారు. కానీ.. త్వరగా కోపానికి గురవుతారు. భావోద్వేగాలు ఎక్కువ. సమస్యలు ఎదురయైనా.. ఎక్కువ ఇబ్బందులు పడరు.

స్ట్రెయిట్ నోస్ :

స్ట్రెయిట్ నోస్ :

నిటారైన ముక్కు కలిగిన వీరికి కూడా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎక్కువే. అయితే వీరు వ్యాపార రంగంలో రాణిస్తార‌ట‌. ఇత‌రుల మ‌న‌సులో ఉన్న విష‌యాల‌ను పసిగ‌ట్టే శ‌క్తి వీరికి ఉంటుంద‌ట‌. వీరు ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తార‌ట‌. ఇలాంటి వారితో స్నేహం చేస్తే ఆ స్నేహితుల‌కు వీరు అన్ని స‌మ‌యాల్లోనూ ప‌క్క‌నే ఉంటార‌ట‌. ఎలాంటి క‌ష్టాన్న‌యినా ఎదిరించ‌గ‌ల‌ర‌ట‌. అయితే ఒక్కోసారి వీరు సరిగ్గా ఆలోచించ‌లేర‌ట‌.

వీళ్లు కాస్త మొండిగా వ్యవహరిస్తారు. కొత్త కొత్త అలవాట్లు, పనులు, టూర్ ల ద్వారా వాళ్ల ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. పొడవాటి ముక్కు ఉన్నవాళ్లు ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. సంతోషంగా ఉండలేరు. రిలేషన్స్ ని స్ట్రాంగ్ చేసుకోవడంలో వీళ్లు విఫలమవుతారు.

చిన్న వంపు కలిగిన ముక్కు:

చిన్న వంపు కలిగిన ముక్కు:

ముక్కు ఒక చిన్న వంపు కలిగిన వీరు దృఢ‌చిత్త‌మైన మ‌నస్త‌త్వం, వ్య‌క్తిత్వం కలిగి ఉంటార‌ట‌. వీరిని లొంగ‌దీసుకోవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాద‌ట‌. వీరు ఇత‌రుల‌ను ఎక్కువగా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌ట‌. అంతేకాదు, వీరు ఆవేశంలో నిర్ణ‌యాలు తీసుకోర‌ట‌, ఆలోచించి మాత్ర‌మే నిదానంగా నిర్ణ‌యాలు తీసుకుంటార‌ట‌.

వంగిన ముక్కు:

వంగిన ముక్కు:

వంగినట్లుగా ఉండే ముక్కు గలవాళ్ల వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ల అభిరుచులు అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి. పద్ధతులను రాసుకుని పెట్టుకోవడం వల్ల ఇతరులను కలిసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి లిజనర్స్. వీరు త్వరగా మంచి స్నేహితులను మరియు పార్ట్నర్స్ ను పొందుతారు

వంకర ముక్కు వీరు ఏ విష‌యంపైనైనా చాలా త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటార‌ట‌. ఏ మాత్రం ఆలోచించ‌ర‌ట‌. వీరు స‌హ‌జంగా ప్ర‌తిభావంతులు అయి ఉంటార‌ట‌. స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌.

English summary

The Shape Of Your Nose Can Reveal Your Personality Type

Different nose shapes have different personalities to reveal and here we bring to you the meaning behind each nose shape.
Story first published: Saturday, October 28, 2017, 20:00 [IST]
Subscribe Newsletter