For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 4 రాశుల వారు తెలివైన వారు మాత్రమే కాదు, నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే!

|

మనం పుట్టిన తేదీ బట్టి మనకు ఒక రాశి ఉంటుంది. అలా మొత్తం 12 రాశులు ఉంటాయి. మన రాశిని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కొందరేమో సహజ కళాకారులు, కొందరు ప్రేమికులు. అయితే కొందరేమో పుట్టినప్పటి నుండి నాయకత్వ లక్షణాలతో ఉంటారు.

12 రాశులలో ఈ నాలుగు రాశుల వారికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మిగిలిన రాశుల వారికి నాయకత్వ లక్షణాలు లేవని కాదు, కానీ, ఈ క్రింద సూచించే నాలుగు రాశులతో పోల్చితే మిగిలన వారిలో తక్కువగా ఉంటాయని అర్థం. మరి నాయకత్వం లక్షణాలు పుష్కలంగా ఉండే ఆ నాలుగు రాశుల వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

మేషం :

మేషం :

రాశులవారీగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం. ఈ రాశిని అగ్నితత్త్వంతో పోలుస్తారు. భగభగమండే తత్త్వంతో ఉండి, కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్త్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం. ఒక సారి ఈ రాశివారితో మాట్లాడి చూండి నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి.

ఉదాహరణకు: లారీ పేజ్, గూగెల్ కో ఫౌండర్; బి. ఆర్ అంబద్కేకర్, ఆడోల్ఫ్ హిట్లర్; థామస్ జాఫర్సన్ (యూస్ కు 3వ ప్రెసిడెంట్ )

వృషభం :

వృషభం :

వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు. ఈ గుణం వల్ల వీరు ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. బాధ్యతలను సీరియస్ గా తీసుకుంటారు. వ్యక్తుల గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

ఉదాహరణకు : మార్క్ జూకెర్క్ బర్గ్ , కార్ల్ మార్క్స్ , సద్దాం హుస్సేన్, డేవిడ్ బెక్కా

సింహం :

సింహం :

ఈ రాశి వారికి పుట్టకతోనే నాయకత్వ లక్షణాలుంటాయి. ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ఠ, కులగౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకరి మీద ఆధారపడినా అన్ని విషయాలను చక్కదిద్దే గుణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి. సన్నిహితులు, సేవా వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయ పెట్తి లొంగదీసు కోవడము దాదాపు అసాధ్యము.

ఉదాహరణకు : బరాక్ ఓబామా, బిల్ క్లింటన్, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, ఫిడేల్ కాస్ట్రో

మకరం :

మకరం :

రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశిని 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీ రాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. ఈ రాశి పాలకులను, పాలనాధికారులను, హస్వ స్వరూపులను సూచిస్తుంది. ఈ రాశివారిలో సెల్ఫ్ కంట్రోల్ కారణంగా మకరాశి కలవారిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. వారి శక్తి సామర్థ్యాలతో వారి చుట్టూ ఉన్నవారిని చాలా సులభంగా ఆకట్టుకుంటారు. ఈ రాశి వారు విజయం సాధించడానికి సాంప్రదాయ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు .

ఉదాహరణకు : స్వామి వివేకానంద, కిమ్ జోంగ్-అన్, రిచర్డ్ నిక్సన్, జెఫ్ బెజోస్ (అమెజాన్.కాం. స్థాపకుడు)

English summary

If You Are Born Under These 4 Zodiac Signs, Your Leaderships Skills Are Admirable

People born under these signs show an innate ability to lead. According to astrology, there are 4 such zodiac signs displaying this ability. Now this does not mean that people of other zodiac signs cannot become leaders or are not competent!
Desktop Bottom Promotion