Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
డేంజర్: గుప్పెడు ఉప్పు, ఒక్క గ్లాసు నీళ్లతో ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు!
అకారణంగానే ఇంట్లో గొడవలు, తీవ్రమైన ఒత్తిడితో కొంత మంది సతమవుతుంటారు. ఎంత శోధించినా దీనికి కారణం కనిపించదు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఎంత సంపాదన ఉన్నా దానికి మించి ఖర్చులు పెరిపోతాయి. ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు. అయితే దీనికి నెగెటివ్ ఎనర్జీ కారణమని పండితులు పేర్కొంటున్నారు.

దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైనా ఉంటుందట. ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతే కరువవుతుంది. అయితే ఇటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఈ సింపుల్ ట్రిక్ ఓ గ్లాసు నీటితో పరిష్కరించుకోవచ్చట. నీటి సాయంతో ఇంట్లో ప్రతికూల శక్తులను ప్రభావాన్ని కూడా గుర్తించడం తెలికేనట. అదెలాగో తెలుసుకుందాం..

క్లీన్ గా క్లియర్ గా ఉండే గ్లాస్ తీసుకోవాలి:
దీని కోసం పెయింటింగ్ గానీ, గీతలు లేని పారదర్శకంగా ఉండే ఓ గాజు గ్లాసు తీసుకోవాలి. ఈ గ్లాసు మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఉండకూడదు. అలాగే ఒకసారి ఉపయోగించిన దాన్ని రెండోసారి వాడకూడదట.

సీసాల్ట్ (గడ్డఉప్పు) వేయాలి:
పారదర్శకంగా ఉన్న గాజు గ్లాసును తీసుకుని అందులో 1/3 వంతు గడ్డ ఉప్పు(సీసాల్ట్ ) వేయాలి.

వెనిగర్ జోడించాలి:
తర్వాత అందులోనే మరో 2/3 భాగంలో వెనిగర్ వేయాలి.సూచన: ఇలా ఉప్పు, వెనిగర్, నీరు నింపిన తర్వాత గ్లాస్ ను షేక్ చేయడం లేదా వాటిని మిక్స్ చేయడం చేయకూడదు.

నీళ్లు కూడా జోడించాలి:
మిగతా ఖాళీలో స్వచ్ఛమైన నీరు పోయాలి. అయితే నీళ్ళు చాలా నిధానంగా సైడ్స్ ను పోయాలి గ్లాస్ లో ఉన్న పదార్థాలు ఏమాత్రం కదలకుండా పోయాలి.

ఏ ప్రదేశంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఉందని భావిస్తున్నారో...
ఏ ప్రదేశంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఉందని భావిస్తున్నారో ఆ మూలలోనే ఈ గ్లాసును పెట్టి 24 గంటలు పాటు కదపకుండా, ఇంట్లో ఎవరికి కనబడకుండా ఉంచాలి.

24గంటల తర్వాత :
ఒక రోజు తర్వాత దాన్ని పరిశీలిస్తే ఆ నీటిలో ఎలాంటి మార్పులు లేకపోతే ఇంట్లో ప్రతికూల శక్తులు లేనట్లే.

24గంటల తర్వాత :
ఒకవేళ నీరు రంగు గ్రీన్ కలర్ లో లేదా గ్రే కలర్ లో మారినా లేదా మచ్చలు ఏర్పడినా నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లే.
ఆ ప్రదేశం నుంచి గ్లాసు తీసి అందులో నీరు టాయిలెట్‌లో పారబోసి శుభ్రం చేయాలట. ఇలా కొన్నిసార్లు చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందట.



Click it and Unblock the Notifications