భయపెట్టే విషయం : ఈ మహిళ అరచేతులు, ముఖం నుండి రక్తం చెమటలాగా వస్తుంది

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చెమటకు బదులుగా మీ శరీరం నుండి రక్తం బయటకు వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా ? ఆలా రక్తం తో కూడిన చెమటలు పడితే ఎలా ఉంటుంది అని ఊహించుకోవడానికి చాలా భయానకంగా మరియు భయపెట్టే విధంగా ఉంది కదా. కానీ ఒక ఈ ప్రపంచంలో ఈ పరిస్థితి వల్ల కొంతమంది వ్యక్తుల శరీరం నుండి రక్తం చెమటలాగా బయటకు వస్తుంది. అలాంటి వారు ఉన్నారు కూడా.

ఇది వినడానికి కొద్దిగా అసహజంగా మరియు వికారంగా ఉంది కదా? ఈ మధ్యకాలంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తన శరీరం నుండి చెమటకు బదులుగా రక్తం వస్తుందని ఒక మహిళ వైద్యుల దగ్గరకు వెళ్లి పిర్యాదు చేసింది.

మిమ్మల్ని వెంటాడే.. భయం, ఆందోళన నుంచి బయటపడే సింపుల్ టిప్స్..!!

ఈ వికారమైన సంఘటన గురించి మరియు ఆ మహిళను చుట్టూ ఉన్న వారు ఎలా దూరం పెట్టారు, నలుగురితో కలవడానికి ఆ మహిళ ఎంతలా ఇబ్బంది పడింది మరియు ఎంత అభద్రతా భావానికి లోనైంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మహిళ ఈ వ్యాధి భారిన పడి 3 సంవత్సరాలుగా బాధను అనుభవిస్తుంది :

ఈ మహిళ ఈ వ్యాధి భారిన పడి 3 సంవత్సరాలుగా బాధను అనుభవిస్తుంది :

పేరు బయటకు చెప్పడం ఇష్టంలేని 21 ఏళ్ళ మహిళ ఒక అరుదైన పరిస్థితితో ఆస్పత్రిలో చేరింది. అది ఎంత విపత్కర స్థితి అంటే ఆమె యొక్క ముఖం మరియు అరచేతుల నుండి చెమటకు బదులు రక్తం బయటకు వస్తుంది. ఈ పరిస్థితిని చూసి వైద్యులు మొదట ఆశ్చర్యపోయారు మరియు ఇది ఒక క్లిష్టమైన సమస్యగా భావించి ఆమెను పరీక్షించడం ప్రారంభించారు. ఆమె చర్మం పై ఏమైనా గాయాలు ఉన్నాయా అని క్షుణ్ణంగా పరీక్షించడం ప్రారంభించి, అసలు సమస్య ఏంటి అనే విషయాన్ని కన్నుకొనే దిశలో ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఆమె పరిస్థితి ఎలా ఉందంటే :

ఆమె పరిస్థితి ఎలా ఉందంటే :

వైద్యులు ఆమెను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ' హెమటోహైడ్రోసిస్ ' అనే ఒక అరుదైన పరిస్థితి వల్ల ఆమె బాధపడుతోంది అని గుర్తించారు.ఈ వ్యాధి కోటిమందిలో ఒక్కరికి మాత్రమే వస్తుందట. ఈ యొక్క విపత్కర పరిస్థితి నుండి ఆమెను కాపాడటానికి వైద్యులు బీటా బ్లాకర్ అనే చికిత్సను ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల కొన్ని వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టాయి కానీ, మరో వైపు ఈ చికిత్స ద్వారా పూర్తిగా వ్యాధి నయమయ్యేలా కనపడటం లేదని వైద్యులు గుర్తించారు.

వైద్యులు ఏమని చెప్పారంటే :

వైద్యులు ఏమని చెప్పారంటే :

ఇలా ఎందుకు జరుగుతుంది ? అనూహ్యంగా రక్తం ఎందుకు బయటకు వస్తుంది అనే విషయమై ప్రత్యేకమైన కారణం ఏమి లేదని చెప్పారు వైద్యులు. ఆమె ఏదైనా శారీరిక శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు కానీ లేదా పడుకున్నప్పుడు కానీ ఇలా ఏ పరిస్థిలోనైనా రక్తం బయటకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు రక్తం మరింత ఎక్కువగా బయటకు వస్తున్నట్లు స్వయంగా భాదితురాలే వెల్లడించింది.

మన ఇండియన్స్ లో ఉండే అత్యంత భయంకరమైన ఫోబియాలు

ఇటువంటి పరిస్థితి అబద్దం కాదు అని వైద్యులు వెల్లడించారు :

ఇటువంటి పరిస్థితి అబద్దం కాదు అని వైద్యులు వెల్లడించారు :

ఆ మహిళ చెబుతున్న విషయాలన్నీ నిజమే అని, ఆమె పరిస్థితి అలానే ఉందని, ఆమె అబద్దాలు ఏమి చెప్పడం లేదని, కోటిమందిలో ఒక్కరికి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు వెల్లడించారు. ఆమె యొక్క ఎర్ర రక్త కణాలు మరియు రక్తం గడ్డ కట్టే ప్రక్రియ సాధారణంగానే ఉన్నాయని, రక్తం చర్మం నుండి బయటకు వస్తున్నా వీటిల్లో ఎటువంటి అసాధారణ మార్పులు చోటుచేసుకోలేదని, ఈ విషయం వారి పరీక్షలు ద్వారా తేలిందని వైద్యులు చెప్పారు. రక్తం గడ్డ కట్టే విధానంలో ఎటువంటి సమస్యలు లేవని, మరే ఇతర సమస్యలతో కానీ ఆమె బాధ పడుతున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడలేదని వైద్యులు వెల్లడించారు.

ఈ మహిళ యొక్క పరిస్థితిని మొత్తం విన్న తర్వాత కొద్దిగా వికారంగా ఉంది కదా? ఈ అరుదైన వ్యాధి లేదా పరిస్థితి గురించి మీరేమనుకుంటున్నారు ? మీ యొక్క ఆలోచనలు మరియు అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మరిచిపోకండి.

English summary

A Woman Sweats Blood From Face And Palms

She bleeds intensely when she is under stress…
Subscribe Newsletter