ఏమిటి! ఇలా కన్పించడానికి ఆమె నిజంగానే 50 సర్జరీలు చేయించుకుందా?!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఎప్పుడైనా ఒక వైరల్ వార్త ఉన్నదంటే, ప్రపంచం మొత్తం దాన్ని పోటీపడి మరీ కథనాలు రాసేస్తాయి, ప్రచురిస్తాయి. కనీసం దాని వెనక వాస్తవాలు, నిజాలు తెలుసుకోకుండానే ఇలా అన్నివైపుల నుంచి ముంచెత్తుతాయి. కానీ చాలామటుకు నకిలీ వార్తలు ఉన్నప్పటికీ, కొన్ని నిజమైనవి కూడా ఉంటాయి.

ఆమె తన సర్జరీల గురించి అబద్ధం చెప్పిందా?

ఇక్కడ, బోల్డ్ స్కైలో మేము ప్రపంచం అంతా తన దారుణ, భయంకర మొహంతో, ఏంజెలినా జోలిలా కన్పించాలని దాదాపు 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నానని నకిలీ వార్తను బయటకి వదిలి, ప్రసిద్ధురాలు కావాలనుకున్న ఒక యువతి నిజాన్ని మీకు తెలియచేయబోతున్నాం!

ఇది ప్రపంచాన్ని తన అద్భుతమైన పిచ్చితనపు లుక్స్ తో షాక్ చేసిన సహార్ తబార్ అనే అమ్మాయి కేసు. ఆమె గురించి మరింత తెలుసుకోండి...

ఆమె కీర్తి

ఆమె కీర్తి

ఇరాన్ కి చెందిన సహార్ తబార్ ఏంజెలినా జోలిలా కన్పించాలని 50 ప్లాస్టిక్ సర్జరీలకు పైగా చేయించుకున్నానని చెప్పి ఇంటర్నెట్ లో వైరల్ వార్తాకథనంతో సంచలనం చేసింది. టాంబ్ రైడర్ నటికి పెద్ద ఫ్యాన్ గా చెప్పుకునే ఈ అమ్మాయి ఆమెలా కన్పించటానికి ఏమైనా చేస్తానని చెప్పింది.

ఇంత జరిగినా ఆమె తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది

ఇంత జరిగినా ఆమె తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది

అనేక సోషల్ మీడియా కథనాల ప్రకారం, ఆమె తన డైట్ పాటిస్తూ 40 కేజీల బరువుతోనే ఉన్నది. 4.8 అడుగులకి కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండి. వైద్యులు ఆమె చాలా అపాయకరమైన తక్కువ బరువు స్థితిలో ఉన్నదని చెప్పారు.

ఆమె ఇన్స్ టాగ్రామ్ జీవితం

ఆమె ఇన్స్ టాగ్రామ్ జీవితం

ఆమె ఇన్స్ టాగ్రామ్ అకౌంట్లో 308,000 ఫాలోవర్లు ఉన్నారు. చాలామంది ఆమె చిత్రాలపై చెత్త కామెంట్లు చేస్తూనే ఉన్నా ఆమెను ఏమాత్రం నిరుత్సాహపర్చలేదు.

అసలు నిజం ఏంటంటే…

అసలు నిజం ఏంటంటే…

తన రాకాసి లుక్ కి ప్రసిద్ధురాలైనప్పుడు సహార్ వద్దకి కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆమెను నిజంగా చూసి భయంకరమైన షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఇన్స్ టాగ్రామ్ లో ఉన్న అమ్మాయి చిత్రాలకి, తనకి అస్సలు పోలికలే లేవు!

ఆమె ఆఖరికి అసలు నిజాన్ని మీడియాకి చెప్పింది…

ఆమె ఆఖరికి అసలు నిజాన్ని మీడియాకి చెప్పింది…

మీడియాకి ఇచ్చిన స్టేట్ మెంట్లో మాట్లాడుతూ, "కాదు.నిజమే, ఇదంతా ఫోటోషాప్ మరియు మేకప్పే. ప్రతిసారీ నేను ఫోటో పెట్టినప్పుడు నా మొహాన్ని హాస్యకరంగా ఎక్కువ పెయింట్ చేసుకుంటాను. ఇదంతా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకునే ఒక కళ మాత్రమే. నా అభిమానులకి ఇది నా నిజం ముఖం కాదని తెలుసు." అని చెప్పింది.

తన నకిలీ సర్జరీల విషయం గురించి కూడా కొంత చెప్పింది.

తన నకిలీ సర్జరీల విషయం గురించి కూడా కొంత చెప్పింది.

ఆమె తను ఎప్పుడూ 50 సర్జరీలు చేయించుకోలేదని, కొన్నే చేయించుకున్నానని చెప్పింది. తను మాట్లాడుతూ, "నేను ముక్కు, పెద్ద నోరు మరియు లిపోసక్షన్ చేయించుకున్నాను. వాటిలో నాకేం తప్పు అన్పించలేదు. ప్రపంచంలో చాలామంది ఇలా చేస్తారు." అని ముగించింది.

ఆమె పిచ్చి టాలెంట్ ను ఆమె ఇన్స్ టాగ్రామ్ అకౌంట్లో చూడవచ్చు.

అదే సమయంలో మీరు ఆమె పిచ్చి టాలెంట్ ను ఆమె ఇన్స్ టాగ్రామ్ అకౌంట్లో చూడవచ్చు.

వచ్చేసారి, ఆన్లైన్ లో ఏదన్నా విచిత్రమైన విషయం చదివాక అది నిజమో, నకిలీ వార్తో నిర్థారించుకుని నమ్మండి!

A post shared by Sahar😈 (@sahartabar_offcial) on Oct 27, 2017 at 3:33am PDT

అదే సమయంలో మీరు ఆమె పిచ్చి టాలెంట్ ను ఆమె ఇన్స్ టాగ్రామ్ అకౌంట్లో చూడవచ్చు.

వచ్చేసారి, ఆన్లైన్ లో ఏదన్నా విచిత్రమైన విషయం చదివాక అది నిజమో, నకిలీ వార్తో నిర్థారించుకుని నమ్మండి!

English summary

Did She Go Through Over 50 Surgeries To Look Like Angelina Jolie?

Teenager Sahar Tabar, from Iran, is reported to be an Angelina Jolie super fan. Pictures show Sahar with razor-sharp cheekbones and an exaggerated pout, but it was revealed that this scary look was nothing but just makeup!
Story first published: Monday, December 11, 2017, 12:45 [IST]