దినఫలాలు: మంగళవారం 5 డిసెంబర్ 2017

Posted By: Deepti
Subscribe to Boldsky
Daily Horoscope Telugu దిన ఫలాలు 05-12-2017

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది.5-12-2017 మంగళవారం నాటి దినఫలాలు ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ విదియ సాయంత్రం 5 గంటల 32 నిమిషాల వరకూ ఉంది. మృగశిర నక్షత్రం ఉదయం 6 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. ఆరుద్ర నక్షత్రం తెల్లవారితే 5 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం సాయంత్రం 7 గంటల 54 నిమిషాల లగాయతు 9 గంటల 23 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకూ ఉన్నది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకూ ఉన్నది. దుర్ముహర్తం రాత్రి 10.29 నిమిషాల నుండి 11 గంటల 38 నిమిషాల వరకు ఉన్నది. సూర్యోదయ సమయం 6 గంటల 20 నిమిషాలకు మరియు సూర్యాస్తమ సమయం 5.20 నిమిషాలకు జరుగును.

మేష రాశి వారికి ;

మేష రాశి వారికి ;

దగ్గరి ప్రయాణాలు చేస్తారు. భార్యని అర్థం చేసుకొనుటకు ప్రయత్నించాలి. తలచిన పనులు పూర్తి కావటానికి భార్య సహకారం కావాలి. పిల్లల పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభ రాశి వారికి ;

వృషభ రాశి వారికి ;

పనివారి సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అడ్డంకులున్నా శ్రద్ధతో పూర్తి చేస్తారు. భార్యా పిల్లలతో ఆనందంగా గడుపుతారు. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.

మిథున రాశి వారికి ;

మిథున రాశి వారికి ;

అధికారుల మన్ననలు కలవు. వృత్తి వ్యాపారాలకు అనుకూలమైన దినం. చేయు పనులలో అడ్డంకులు వస్తాయి. వ్యక్తిగత శ్రద్ధతో పూర్తి చేయవలసి ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. చేయు పనులలో అడ్డంకులున్నా విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి వారికి ;

కర్కాటక రాశి వారికి ;

ఇంటి పనులందు శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. వ్యవహారాలలో అడ్డంకులున్నప్పటికీ విజయం సాధిస్తారు.

సింహ రాశి వారికి ;

సింహ రాశి వారికి ;

తలచిన పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. పిల్లలను శ్రద్ధగా చూడాలి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ;

కన్యా రాశి వారికి ;

వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. ధనం కోసం వేయు ప్రణాళికలు ఫలిస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి వారికి ;

తులా రాశి వారికి ;

చేయు పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి వారికి ;

వృశ్చిక రాశి వారికి ;

ఎన్నో ఆలోచనలు చేస్తారు. వాటిని సాధించుకోటానికి శ్రమపడతారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది.

ధనస్సు రాశి వారికి ;

ధనస్సు రాశి వారికి ;

ధనం కోసం ఇబ్బంది కలదు. రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చేయు పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. దుర్గా దేవి పూజ చేయటం వలన కొన్ని అవసరాలు తీరతాయి.

మకర రాశి వారికి ;

మకర రాశి వారికి ;

భార్య సహకారంతో అడ్డంకులు తీరగలవు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అధికారుల మన్ననలు పొందుతారు. భూ సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి. అడ్డంకులున్నా విజయం సాధిస్తారు.

కుంభ రాశి వారికి ;

కుంభ రాశి వారికి ;

అనుకున్న పనుల ద్వారా లాభం పొందుతారు. కుటుంబ అవసరాలు తీరుస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. సహచరుల సహకారం ఉంటుంది.

మీన రాశి వారికి ;

మీన రాశి వారికి ;

ఏ పనులు మొదలు పెట్టినా పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. అడ్డంకులున్నా అధిగమించవలసి ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలు శ్రమతో పూర్తి చేయవలసి ఉంటుంది.

ఈ రోజు దినఫలితాలను అందరూ విన్నారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

English summary

Daily Horoscope: 5th December 2017

Daily Horoscope: 5th December 2017,Here is your daily dose of astrology according to your moon sign for December 5th 2017.