మొబైల్ నెంబర్ ద్వారా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో తెలుసా..

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీ యొక్క లక్షణాల దగ్గర నుండి భవిష్యత్తులో మీరు అందుకోబోయే విజయాల వరకు మరియు మీ వివాహానికి సంబంధించిన విషయాలు ఇలా మీ జీవితంలో చోటుచేసుకోబోయే ఎన్నో విషయాల్లో అంకెలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అంకెలు కేవలం మన లక్షణాల పై మాత్రమే ప్రభావం చూపవు. మన చుట్టూ జరిగే పరిణామాల పై కూడా వాటి యొక్క ప్రభావం ఉంటుంది.

ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ని ఆధారంగా చేసుకొని మీ జీవితం ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది అనే విషయాన్ని ఎలా కనుక్కోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ నెంబర్ ద్వారా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో తెలుసా..

మీ మొబైల్ నెంబర్ ను లెక్కింపు చేయడం ద్వారా కొన్ని విషయాలను మీరు తెలుసుకోవచ్చు. మీరు ఎటువంటి లాభాలు పొందబోతున్నారు మరియు ఎటువంటి కష్టాలను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది.

మీకు సరైన ఫలితాలు రావాలంటే క్రింద చెప్పబడిన విధంగా మీ మొబైల్ నెంబర్ ను గణించండి (కూడండి ). ఉదాహరణకు 89191112234 అనే మొబైల్ నెంబర్ ఉంది. ఈ సంఖ్యను ఇలా కూడండి. 8+9+1+9+1+1+1+2+2+3+4 = 41 : 4+1 = 5.

ఓ సారి పిడికిలి బిగించి చూసుకోండి...మీ వ్యక్తిత్వం ఏంటో ఇట్లే తెలిసిపోతుంది..

పైన చెప్పబడిన విధంగా మీ మొబైల్ నెంబర్ ని ఏకీకృత సంఖ్య వచ్చేవరకు కూడాలి. ఇలా గణించిన తర్వాత వచ్చిన సంఖ్య ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

నెంబర్ #1 :

నెంబర్ #1 :

ఇది చాలా శక్తివంతమైన నెంబర్. ఇది మీలో ఉన్న శక్తిని పెంచుతుంది మరియు మీరు వేరేవాళ్లను ప్రభావితం చేయగలరు. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీకు ఎదురవుతున్న సందర్భాలకు అనుగుణంగా జరుగుతున్న పరిణామాల పై మరీ ఎక్కువగా ఆధారపడి ఆనందపడకండి. ఒకటో నెంబర్ గనుక పునరావృతం అవుతూనే ఉంటే వ్యాపారస్తులకు మరియు వృత్తిపరంగా ఎదగాలనుకున్నవారికి చాలా మంచిది. ఎవరైతే ప్రేమను వెతుక్కుంటున్నారో, తాము తీసుకొనే నెంబర్ గణించినప్పుడు ఫలితం ఒకటి రాకుండా చూసుకోండి.

నెంబర్ #2 :

నెంబర్ #2 :

ఈ నెంబర్ ప్రేమకు చిహ్నం అని చెప్పవచ్చు. ప్రేమపరంగా ఖచ్చితత్వం కలిగిన వ్యక్తులను తమ జీవితంలో ఏ వ్యక్తులైతే కలవాలనుకుంటారో, అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ వల్ల చాలా కలిసి వస్తుంది. ఈ నెంబర్ ఒకసారి కంటే ఎక్కువ గనుక ఉంటే మీలో దయ మరియు హుందాతనం పెరిగేలా చేస్తుంది. ఎవరైతే చాలా దృఢమైన మనస్తత్వాన్ని, ఖచ్చితమైన అభిప్రాయాన్ని మరియు ఎవరైతే అమ్మకాలకు సంబంధించిన విషయాలకు అనుసంధానమై ఉంటారో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ చాలా మంచి చేస్తుంది.

అందరూ ఇష్టపడే విధంగా వ్యక్తిత్వం కలిగి ఉండటం ఎలా

నెంబర్ #3 :

నెంబర్ #3 :

ఈ నెంబర్ ఎవరికైతే వస్తుందో అటువంటి వ్యక్తులు ఎంతో సృజనాత్మకత తో వ్యవహరిస్తారు మరియు ఆ వ్యక్తులతో గడపటం చాలా సరదాగా అనిపిస్తుంది. కళాకారులు, సంగీత విద్వాంసులు మరియు యుక్త వయస్సులో ఉన్న వ్యక్తులకు ఈ నెంబర్ చాలా బాగా సరిపోతుంది. ఎవరైతే రచయితలు ఉంటారో లేదా ఏ వ్యక్తులైతే రాసే వృత్తిలో ఉంటారో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ చాలా ఉత్తమం. మీరు గనుక అన్ని విషయాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరియు మీ యొక్క లక్ష్యాలను ఎలా అయినా చేరుకోవాలనే ఆశ మీలో గనుక ఉంటే అటువంటి వ్యక్తులు ఈ నెంబర్ అస్సలు తీసుకోకండి.

నెంబర్ #4 :

నెంబర్ #4 :

ఈ నెంబర్ చాలా స్థిరత్వం మరియు నమ్మకాన్ని తెలియజేస్తుంది. బ్యాంకులు, చట్ట సంస్థలు మరియు ఏ కంపెనీలు నమ్మకము మరియు పేరు ప్రఖ్యాతలు పై ఆధారపడి ఉంటాయో అటువంటి వారు ఈ నెంబర్ తీసుకోవడం ఉత్తమం. మీకు గనుక పెద్ద కుటుంబం ఉంటే మీరు నెంబర్ 4 ని ఎంచుకోవచ్చు. మీరు ఒంటరిగా ఉంటూ మరియు మీరు చేస్తున్న పనికి పైన చెప్పిన విషయాలతో సంబంధం లేకపోయినట్లయితే నెంబర్ 4 ని మాత్రం అస్సలు తీసుకోకండి.

నెంబర్ #5 :

నెంబర్ #5 :

ఈ నెంబర్ వల్ల మీ జీవితంలో మార్పులు జరుగుతాయి మరియు ఎన్నో సాహసాలు మీకు పరిచయమవుతాయి. ఈ నెంబర్ ఉన్న వాళ్ళు దేనినైనా ఆశించవచ్చు. ఏ వ్యక్తులైతే స్వతంత్రం కోరుకుంటారో, ప్రయాణించడాన్ని ప్రేమిస్తారో మరియు ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ చాలా ఉత్తమం. కుటుంబ సంబంధమైన వ్యక్తులకు ( కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చేవారికి ) మరియు ఏ వ్యక్తులైతే మానసికమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ నెంబర్ తీసుకోకండి.

నెంబర్ #6 :

నెంబర్ #6 :

కుటుంబసంబంధమైన వ్యక్తులకు ( కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చేవారికి ) ఈ నెంబర్ చాలా ఉత్తమమైనది. దీనిని వాడే వారికి భద్రత లభిస్తుంది మరియు సంరక్షించబడతారు అంతే కాకుండా కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో బంధం మరింత బలపడుతుంది. వ్యాపారపరంగా ఎవరైతే ఎక్కువగా ప్రయాణిస్తుంటారో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ బాగా కలిసొస్తుంది. ప్రేమించాలి అనుకునే వ్యక్తులు ఈ నెంబర్ కి బదులు వేరే నెంబర్ తీసుకోవడం చాలా మంచిది.

నెంబర్ #7 :

నెంబర్ #7 :

ఈ నెంబర్ చాలా శక్తివంతమైనది అని ఎంతో మంది భావిస్తారు. విద్యార్థులకు మరియు గొప్పగా ఆలోచించేవాళ్లకు ఈ నెంబర్ సరిగ్గా సరిపోతుంది. ఈ నెంబర్ వాడటం వల్ల మీ యొక్క అంతర్గత సంపద పై సానుకూల ప్రభావం చూపిస్తుంది, స్థిరత్వం లభిస్తుంది మరియు సమతుల్యమైన జీవన విధానాన్ని అలవాటవుతుంది అని చాలా మంది నమ్ముతారు.

నెంబర్ #8 :

నెంబర్ #8 :

ఎవరికైతే సొంత వ్యాపారాలు ఉంటాయో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ నెంబర్ డబ్బుని విపరీతంగా ఆకర్షిస్తుంది. మీ యొక్క భాగస్వాములలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వృత్తిపరంగా ఎదో సాధించాలనే తపనపడే వారికి ఈ నెంబర్ వాడటం వల్ల అది వారిపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది మరియు వారి యొక్క ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.

నెంబర్ #9 :

నెంబర్ #9 :

ఈ నెంబర్ ను వాడే వాళ్లలో రెండు అతి ముఖ్యమైన లక్షణాలున్నాయి, అవే ఆదర్శ భావాలు మరియు దయాగుణం కలిగి ఉండటం. అదృష్టవంతమైన నెంబర్ లలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే దీనిని వాడే యజమానులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది మరియు వారు దానిని అనుభూతి కూడా చెందుతారు. మరో పక్క ఏ వ్యక్తులకు అయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ అనుకూలంగా ఉండదు.

English summary

Your Mobile Number Added Up Can Reveal This

Your Mobile Number Added Up Can Reveal This,Know what your mobile number added up to can reveal about your personality.