For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్లియోపాత్రాకు శృంగారం పిచ్చి చాలా ఎక్కువ.. ఎంతోమందిని అలాగే లోబరుచుకుంది

క్లియోపాత్రా ఒకప్పుడు ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహారాణి. మహా అందెగత్తె. ఇప్పటికీ ఈమె గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అప్పట్లో ఆమె చేసిన ఘనకార్యాలు అలాంటివి. ఈమె ఎందులోనూ తక్కువ కాదు.

By Bharath
|

క్లియోపాత్రా ఒకప్పుడు ఈజిప్ట్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహారాణి. మహా అందెగత్తె. ఇప్పటికీ ఈమె గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అప్పట్లో ఆమె చేసిన ఘనకార్యాలు అలాంటివి. ఈమె ఎందులోనూ తక్కువ కాదు. పొరపాటున ఆడమనిషిగా పుట్టిందిగానీ.. మగవాడిగా పుట్టి ఉంటే మాత్రం ఈమె జీవితం మరోలా ఉండేదేమో. ఏ మగవాడు కూడా ఈమె కిందికి సాటిరాడు.

సౌందర్యరాశి

సౌందర్యరాశి

ఈమెను అపూర్వ సౌందర్యరాశిగా చాలామంది చరిత్రకారులు అభివర్ణించారు. క్రీస్తుపూర్వం 70ల కాలంలో ఈజిప్టు ఏడో మహారాణిగా ఒక వెలుగు వెలిగింది.

కృత్రిమ కనురెప్పలు

కృత్రిమ కనురెప్పలు

క్లియోపాత్రాకు చాలా పెద్ద కళ్లు ఉండేవి. ఈమె కనులు విశాలంగా కనిపించడానికి అప్పట్లోనే కృత్రిమమైన కనురెప్పలు అతికించుకుందంట. వాటికి కాటుక బాగా దిద్దేదంట. ఈమె ఒళ్లంతా సుగందద్రవ్యాలు పూసుకునేది. వాటిని ఈమె నగ్నంగా ఉంటే వాటిని ఈమె దగ్గర ఉండే చెలికత్తెలు ఒళ్లంతా పూసే వారంట.

ప్రత్యేక శాల

ప్రత్యేక శాల

సుగంధభరిత ఉత్పాదనల ప్రయోగాల కోసం ప్రత్యేకంగా ఒక శాలనేఏర్పాటు చేయగా, అందులో వేల సంఖ్యలో పనివాళ్ళు రేయింబవ ళ్లూ శ్రమించేవారట. పరిమళాలను ఆమె ఎంతగా ప్రేమించేదంటే సుగంధాలు వెదజల్లే విషపు లేపనం పూసుకుని మరీ చనిపోయిందంట. క్లియోపాత్రా కాలం నుంచే సుగంధద్రవ్యాలను తయారుచేయడం తమ హక్కుగా ఈజిప్షియన్లు భావిస్తూ వచ్చారు.

పొడవైన జుట్టు

పొడవైన జుట్టు

క్లియోపాత్రా తన జుట్టు విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించేవారు. ఆమె అప్పట్లోనే విగ్గులు వాడేది. వాటితో శిరోజాలను బారు గా చేసుకునేదట. పొట్టి జుట్టు కోసం బాబ్డ్ హెయిర్ స్టైల్‌ను పోలిన విగ్స్ అనేకం ఆమె వద్ద ఉండేవట. కర్బూజపు తీగలను పోలిన కేశాలంకరణ..అందులో సూర్య, చంద్రుల గుర్తులున్న ఆభరణాలను ధరించేది.

ఆ పెదాలను చూస్తే..

ఆ పెదాలను చూస్తే..

పెదాలకు ఇప్పుడు లిప్ స్టిక్ యూజ్ చేస్తుంటారు. కానీ అప్పడు ఆమె పెదాలు అందంగా కనిపించేందుకు చాలా శ్రద్ధ తీసుకునేది. ఐరన్ ఆక్సైడ్, మట్టి, సముద్రపు పాచి.. ఇతర పదార్థాలను ఉపయోగించి పెదాలకు ఎరుపు రంగును సృష్టించేవారు క్లియోపాత్రా సౌందర్యశాలలోని తయారీదార్లు. ఆ సమయంలోనే కొన్ని రకాల పౌడర్లనూ సృష్టించారు. క్లియోపాత్ర పెదాలను చూస్తే ఎంతటి మగాడైనా ఆమె అందానికి ముగ్దుడు కావాల్సిందే.

ఎదుటివాళ్లను రెచ్చగొట్టేలా దుస్తులు

ఎదుటివాళ్లను రెచ్చగొట్టేలా దుస్తులు

క్లియోపాత్రా మహారాణికి ఉండవలసిన దర్పం, హుందాతనం చూపిస్తూనే ఎదుటివారిని రెచ్చగొట్టే ధోరణిలో వస్త్రాలను ధరించేది. అందం, అధికారం, ఐశ్వర్యం, మేధస్సు మొత్తం క్లియోపాత్రాలో కనిపించేవి. ఆ అందానికి ఏ మగాడైనా ఆమెకు దాసోహం కావాల్సిందే.

శృంగార బానిస

శృంగార బానిస

రాజులు ఏవిధంగా అయితే సుఖాలను అనుభవించేవారో క్లియోపాత్రా కూడా అన్ని రకాల సుఖాలను అనుభవించాలనుకునేది. తన కంటికి నచ్చిన మగాడితో సుఖం అనుభవించాలనుకునేది. క్లియోపాత్రా శృంగార బానిస. ఆమెకు ఆ కోరికలు చాలా ఎక్కువగా ఉండేవట.

ఒకేసారి పదిమందితో

ఒకేసారి పదిమందితో

క్లియోపాత్ర ఎంతో మంది మగాళ్ల ను కూడా తన తెలివితో అందం తో కుట్రలతో పన్నాగాలతో తన కోట మీద ఈగ కూడా వాలకుండా చేసింది. క్లియోపాత్రకు శృగారం అంటే కూడా అంతే పిచ్చి. ఒకేసారి పదిమందితో కూడా ఆమె సరసాలు ఆడేదంట. అయితే అవన్నీ కూడా రాజ్య సంరక్షణలో భాగంగానే చేసేదంట.

అలెగ్జాండర్ మరణాంతరం

అలెగ్జాండర్ మరణాంతరం

అలెగ్జాండర్ ది గ్రేట్ మరణానంతరము ఈజిప్ట్ ను పాలించిన హేల్లెని స్టిక్ కాలపు గ్రీకు సంతతి కుటుంబానికి చెందిన టోలమాక్ రాజవంశపు స్త్రీ క్లియోపాత్ర. ఈజిప్ట్ దేవత యిసిస్ గా క్లియోపాత్ర తనకుతాను భావించుకునేది.

సోదరులను పెళ్లి చేసుకుంది

సోదరులను పెళ్లి చేసుకుంది

ఈజిప్ట్ ల సంప్రదాయం ప్రకారం ఆము తన సోదరులు టోలెమి XIII, టోలెమి XIV వివాహం చేసుకుని వారితో రాజ్యపాలన చేస్తుండేది. తర్వాత ఆమె ఒంటరిగానే పాలన సాగించింది. ఇక ఆమె కూమారుడు సీజర్ హత్య తరువాత, ఆమె మార్క్ ఆంటోనీతో కలిసి పాలన సాగించింది.

జూలియస్ సీజర్ తో సంబంధం

జూలియస్ సీజర్ తో సంబంధం

క్లియోపాత్రా జూలియస్ సీజర్ తో సంబంధం పెట్టుకుంది. రాజ్యంపైకి దాడి చేయడానికి వచ్చిన సీజర్ ను తన అందంతో పడేసింది. క్లియోపాత్ర సీజర్ భార్యగా మారింది. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా పుట్టాడు.

ఆంటోనితో కాపురం

ఆంటోనితో కాపురం

ఆంటోనీతో ఆమె కాపురం చేసి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. క్లియోపాత్రా సేలేనే II, అలెగ్జాండర్ హేలియోస్ లతో పాటు ఇంకొక కొడుకు టోలెమి ఫిలడెల్ఫాస్ లకు ఈమె జన్మనిచ్చింది. అయితే ఈమె సోదరులను పెళ్లి చేసుకున్నా వారితో మాత్రం సంతానాన్ని పొందలేదు. ఆక్టియమ్ యుద్ధంలో ఆక్టవియన్ బలగాల చేతిలో ఓడిపోయిన తర్వాత ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆంటోనీ, క్లియోపాత్రా

ఆంటోనీ, క్లియోపాత్రా

ఆంటోనీ-క్లియోపాత్రాలను చరిత్రలో అత్యంత రోమాంటిక్ జంటగా చరిత్రకారులు పేర్కొన్నారు. వీరి గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆంటోనీని ఆజానుబాహుడిగా అతివల మనసు దోచే మన్మథుడిగానూ, క్లియోపాత్రానయితే ఏకంగా అతిలోక రంభగా ప్రపంచం భావిస్తూ వస్తోంది.

మార్క్ అంటోని, క్లియోపాత్రలకు ఇష్టమైనవి అవే

మార్క్ అంటోని, క్లియోపాత్రలకు ఇష్టమైనవి అవే

మార్క్ అంటోని, క్లియోపాత్రల బంధం అప్పట్లో రికార్డ్. వీరిద్దరూ ఎంతో సరదాగా గడిపేవారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారు. అలాగే ప్రాక్టికల్ జోక్స్ వేయడమంటే ఇద్దరికీ ఇష్టమే. ఇద్దరికీ సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువే. వీరిద్దరూ ఫ్రీ టైమ్ లో ఎక్కువగా సెక్స్ లో ఎంజాయ్ చేసేవారు. ఆ విషయాన్ని బాహాటంగా కూడా చెప్పేందట క్లియోపాత్రా.

క్లియోపాత్రకు 12 భాషలు వచ్చేవి

క్లియోపాత్రకు 12 భాషలు వచ్చేవి

క్లియోపాత్ర మ్యాథ్స్, ఫిలాసపీ చదివారు. ఈమె 12 భాషల్లో మాట్లాడేవారు. చాలా విషయాలపై ఈమెకు ఎక్కువగా నాలెడ్జ్ ఉండేది.

పాముతో కాటు వేయించుకుని

పాముతో కాటు వేయించుకుని

ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర ప్రమాదవశాత్తు పాముకాటుతో మరణించినట్లు కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే క్లియోపాత్ర ఓ సర్పాన్ని తన హృదయంపై పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే కాటు వేయించుకుందని తాజాగా కొందరు వ్యాఖ్యానించారు. ఆమె ఇలాంటి సాహసాలు కూడా చేసే ఉంటుంది.

English summary

16 little known facts about cleopatra

16 little known facts about cleopatra
Desktop Bottom Promotion