For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పెయిన్ కిల్లర్ ని వాడటంతో 'గే' గా మారిపోయాడట!

  |

  పెయిన్ కిల్లర్స్ ని తీసుకోవడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయి. జీవితాన్ని తలకిందులు చేసేటువంటి మార్పులు కూడా చోటుచేసుకునే ప్రమాదం ఉందట. ప్రాణాపాయ సమస్యలు కూడా తలెత్తవచ్చట.

  ఒక గాయాన్ని నయం చేసుకోవడానికి పెయిన్ కిల్లర్స్ ని తీసుకున్న వ్యక్తి తనలోని సెక్సువల్ ప్రిఫరెన్సెస్ అనేవి మారిపోయాయన్న విషయాన్ని తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది.

  స్కోట్ పర్దీకి అనే వ్యక్తి ఎదుర్కొన్న ఈ విచిత్రమైన సంఘటన గురించి తెలుసుకుంటే పెయిన్ కిల్లర్స్ అంటేనే భయం పట్టుకుంటుంది. ఈ పెయిన్ కిల్లర్ ను తీసుకునే ముందు వరకు స్కోట్ సాధారణంగానే ఉండేవాడట. పురుషులను 'ఆ' దృష్టితో చూసేవాడు కాదట. అయితే, ఒక పెయిన్ కిల్లర్ ఇతని సెక్స్ ప్రిఫరెన్స్ లను మార్చివేసింది.

  అసలేం జరిగిందంటే...

  కాలికి దెబ్బతగలడం వలన పెయిన్ కిల్లర్ ని వైద్యుడు ఇతనికి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ మెడిసిన్ ను వాడటం వలన ఇతను హోమోఫోబిక్ గా మారిపోయాడట. ఒక యాక్సిడెంట్ ద్వారా కాలికి దెబ్బ తగలటం ఆ తరువాత పెయిన్ కిల్లర్ ని వాడటం వలన ఇతను చివరికి 'గే' గా మారిపోయాడట.

  మెడిసిన్ యొక్క ప్రభావం

  ఈ పెయిన్ కిల్లర్ ని వాడటం వలన ఆపోజిట్ సెక్స్ పై కలగవలసిన ఆకర్షణ ఇతనికి కలగటం లేదట. చివరికి తన గర్ల్ ఫ్రెండ్ ను కూడా దూరంగా ఉంచడం ప్రారంభించాడట. పురుషులకు అట్రాక్ట్ అవడం ప్రారంభించాడట.

  మహిళలపై ఆకర్షణ కలగటం మానేసిన విషయాన్ని ఇతను గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదట. పైగా మేల్ అటెన్షన్ ను కోరుకుంటున్న విషయం ఇతనికి అర్థమైంది. ఇప్పుడు మెడిసిన్ ను ఆపివేసిన తరువాత ఇతను మళ్ళీ సాధారణ స్థితికి చేరుకున్నాడట.

  ఈ విషయం గురించి మాట్లాడుతూ...ఈ డ్రగ్ ని వాడినన్నాళ్లు ఆపోజిట్ సెక్స్ పై ఆకర్షణ తగ్గిపోయింది. పురుషులకు మాత్రమే అట్రాక్ట్ అయ్యాను. కొన్ని వారాల పాటు ఈ మెడిసిన్ ను వాడాను. ఆ సమయంలోనే గర్ల్ ఫ్రెండ్ ని కలిసినప్పుడు నువ్వేమాత్రం నాకు అట్రాక్టివ్ గా కనిపించడం లేదని చెప్పాను. ఇటీవలే ఈ సంఘటన జరిగింది. ఈ మెడిసిన్ వలన కలిగిన సైడ్ ఎఫెక్ట్ ను నేను చాలా యంగ్ ఏజ్ లోనే గమనించవలసి వచ్చింది." అని ముగించాడు.

  ఈ విషయంపై వైద్యుల అభిప్రాయం ఏంటి?

  స్కాట్ తన సైడ్ ఎఫెక్ట్ గురించి వివరించగానే వైద్యులు ఈ విషయాన్ని అనలైజ్ చేయడం ప్రారంభించారు. స్కాట్ లో ఇంతకు ముందు కూడా సేమ్ సెక్స్ డిజైర్స్ ఉండేవని, ఈ పెయిన్ కిల్లర్స్ ని వాడటంతో ఆ డిజైర్స్ కాస్త ఎక్కువయ్యాయేమో గాని దీని వలెనే అతని ప్రిఫరెన్స్ లు మారిపోయాయనడం నమ్మలేమని సందేహాన్ని వ్యక్తపరిచారు.

  అసలీ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది?

  పెయిన్ కిల్లర్ గా ప్రిస్క్రైబ్ చేయబడిన ఈ మెడిసిన్ అనేది నెర్వ్స్ ని కామ్ చేయడానికి, ఎపిలెప్సీ, పెయిన్ డిజార్డర్స్ తో పాటు యాంక్సయిటీను తొలగించేందుకు తోడ్పడుతుందని వివరించారు. ఇప్పుడు జరిగిన ఈ క్లెయిమ్స్ వలన ఈ మెడిసిన్ ని వాడటం వలన సెక్సువల్ డిజైర్ లో మార్పులు, ఆర్గానిజం సామర్థ్యం వంటివి సైడ్ ఎఫెక్ట్స్ లిస్ట్ లో పేరుకున్నాయన్న అనుమానాలు ఎదురవుతున్నాయి.

  డాక్టర్ల ఉద్దేశ్యం

  ఈ కేస్ ను హ్యాండిల్ చేసిన డాక్టర్ల అభిప్రాయం : ఈ మెడిసిన్ ను తీసుకుంటే కొన్ని ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి సమయంలో, వెంటనే వైద్యున్ని సంప్రదించండి. లేదా ఇంకొక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ను సంప్రదించండి.

  ఈ విచిత్రమైన సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ మెడిసిన్ వలెనే ఆ వ్యక్తి యొక్క సెక్సువల్ ప్రిఫరెన్స్ లలో మార్పు ఏర్పడి ఉంటుందా? లేదా మరేదైనా కారణం ఉండి ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్ లో వివరించండి మరి.

  English summary

  A Drug Changed The Sex Choice Of This Man

  A case of medical side-effects reveals about a man named "Scott Purdy", who claims that he was a 'hot-blooded' heterosexual who loved to enjoyed dating women earlier, but after he was prescribed painkillers for a long-term ankle injury, he apparently claims that he lost his sexual attraction to women and has been turned gay.
  Story first published: Saturday, May 5, 2018, 16:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more