ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్ భార్య దగ్గర ఎలా ఉండేవాడో తెలుసా!

Written By:
Subscribe to Boldsky

యుద్ధం అంటే అతనికి కొత్తకాదు. యుద్ధం చేస్తే ఇలా చేయాలని లోకానికి చాటి చెప్పిన వీరుడు అలెగ్జాండర్. చిన్నతనంలోనే తెలిసిన ప్రపంచాన్ని ఆక్రమించుకున్న మాసిడోనియన్ వీరుడు ఇతను. శత్రువు ఎలాంటి వాడైనా ఎంత వాడైనా యుద్ధంలో ఎలా ఓడించాలో తెలిసిన వీరుడు ఇతనే. ఆ గ్రీకు వీరుడే... అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ గురించి చరిత్ర కు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి.

తల్లే స్నేహితురాలు

తల్లే స్నేహితురాలు

తండ్రి ఫిలిప్ శౌర్యం, తల్లి ఒలింపియస్ సౌందర్యం కలిస్తే... అలెగ్జాండర్. ప్రాచీన గ్రీకు పట్టణం పెల్లా అతని ఊరు.

పన్నెండేళ్ల వరకు అలెగ్జాండర్‌కు తల్లే స్నేహితురాలు. తన కొడుకుపై ఫిలిప్‌కు పెద్ద ఆశ ఉండేది. గ్రీసు దేశానికి అలెగ్జాండర్సార్వభౌమాధిపతి కావాలని ఫిలిప్ కోరిక.

Image Source :https://list25.com

అలెక్స్

అలెక్స్

అలెగ్జాండర్ ను అలెక్స్ అని అనేవారు. అలెక్స్ గురువు అరిస్టాటిల్‌. అలెక్స్ భార్య రొక్సానా. ప్రపంచం మొత్తానికి వీరుడైన అలెగ్జాండర్ రొక్సానా దగ్గర మాత్రం తన అహాన్ని చూపించేవాడు కాదు. వాళ్ల పెళ్లికి ముందు గానీ, పెళ్లి తర్వాత గానీ రొక్సానా దగ్గర ఎప్పుడు కూడా నటించడం చెయ్యలేదు. నేను గొప్ప అని గర్వపడలేదు. అది రొక్సానాకు గ్రేట్ అనిపించింది.

Image Source : https://list25.com

అది కూడా గౌరవమే

అది కూడా గౌరవమే

శత్రువును గెలిచినప్పుడు అతనికి గౌరవంగా ఉండేది. స్త్రీ ఎదుట కిరీటం తీసి నిలబడడం విషయంలోనూ అతడికి గౌరవంగానే ఉండేది. అయితే ఇంత గొప్ప చక్రవర్తి అలెక్స్ నిజంగానే ఏ స్త్రీ ముందైనా మోకరిల్లి ఉంటాడా అంటే ఉండి ఉండొచ్చేమో.

Image Source : https://list25.com

తండ్రి, గురువులు మంచి సమర్థులు

తండ్రి, గురువులు మంచి సమర్థులు

అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్. మంచి రాజనీతిజ్ఞుడు. సైనిక వ్యూహకర్త. అతడు అడుగు బైటికేస్తే సామ్రాజ్య విస్తరణ సాగాల్సిందే. అయితే తండ్రినే మంచిపోయాడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్. మంచి ఫిలాసఫర్. రాజనీతితో పాటు శిష్యుడికి లోకరీతీ చెప్పాడు. అన్నిశాస్త్రాలపై అవగాహన కలిగిలే చేశాడు. హోమర్ ‘ఇలియడ్'ను, ‘ఒడిస్సీ'ని అలెగ్జాండర్ చదివి అందులో ఉండే నీతి పాటించేలా చేశాడు అరిస్టాటిల్.

Image Source : https://list25.com

తండ్రిని చంపారు

తండ్రిని చంపారు

అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్‌ను శత్రువులు హతమార్చారు. అప్పడు మేసిడోనియాకు అలెగ్జాండర్ రాజయ్యాడు. అప్పటికి అతని వయస్సు చాలా తక్కువ. అలెక్స్ తన సైన్యాలతో ప్రపంచాన్ని అంత గడగడలాడించాడు. ఇరవై రెండవ యేట ఆసియా మైనర్ (టర్కీ) అతడి వశం అయింది. ఇరవై ఐదవ యేట పర్షియా పాదాక్రాంతం అయింది. తర్వాత ఏడేళ్లలో ... ఇప్పటి యుగోస్లేవియా నుంచి ఇండియా వరకు అన్ని ప్రాంతాలు అలెగ్జాండర్ అధీనంలోకి వచ్చాయి.

ఎవ్వరికీ అర్థం అయ్యేది కాదు

ఎవ్వరికీ అర్థం అయ్యేది కాదు

అఖండ ఖ్యాతి గడించిన అలెగ్జాండర్‌ విజయ రహస్యం ఏమిటనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. అలెక్స్ వ్యూహం ఏమిటో ఇప్పటికీ అంతుపట్టలేదు. అలెగ్జాండర్‌ లాంటి వాడు ఒక్కడు తమ రాజ్యంలో ఉంటే చాలు అని చాలామంది రాజులు అనుకునేవారు.

చివరిగా భారతదేశంపై

చివరిగా భారతదేశంపై

పర్షియా తర్వాత, గ్రీకులకు తెలిసిన భూభాగాలన్నిటినీ జయించాడు అలెగ్జాండర్. లాస్ట్ భారతదేశం వైపు వచ్చాడు. అయితే అతని సైనిక బలం మొత్తం చిక్కిపోయింది. సైనికులు యుద్ధాలు చేసి చేసి బాగా అలిసిపోయారు. సింధూనదిని దాటి తక్ష శిల నగరంలోకి చొరబడ్డాడు. క్రీ.పూ 326 వ సంవత్సరంలో భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర మొదలైంది.

పురుషోత్తముడితో

పురుషోత్తముడితో

అతను సింధు నదీ పరివాహక ప్రాంతాలన్నింటినీ దాటి అక్కడ న్ని రాజ్యాలని ఆక్రమించుకున్నాడు. అక్కడే ఉన్న తక్షశిల రాజైన అంభితో యుద్ధ సంధిని కుదుర్చుకున్నాడు. తర్వాత జీలం, చీనాబ్ నదీ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించే పౌరవ వంశస్థుడు పురుషోత్తముడితో యుద్ధంలో తలపడ్డాడుఅలెగ్జాండర్. అప్పుడు అతని గుర్రం మరణించింది.

ఆ గుర్రంపైనే

ఆ గుర్రంపైనే

తన తొలి దండయాత్ర నుండి అలెగ్జాండర్ ఆ గుర్రం పైనే ప్రయాణించాడు. పైగా ఆ యుద్ధం లో అతని సైన్యం చాల భాగం దెబ్బ తింది. అప్పట్లో చాలా ప్రాంతం నంద రాజ్యం ఆధీనంలో ఉండేది. నదుల సైనిక బలం గురించి విన్న అలెగ్జాండర్ సైన్యం భయంతో వణికి పోయింది.

రాఖీ సంప్రదాయం

రాఖీ సంప్రదాయం

అల‌గ్జాండ‌ర్, పురుషోత్త‌ముడు మధ్య యుద్ధం జరిగేటప్పుడు రోజులు గ‌డిచే కొద్దీ యుద్ధంలో పురుషోత్త‌ముడిదే పైచేయిలా క‌నిపించ‌సాగింది. అత‌ని చేతిలో అల‌గ్జాండ‌ర్ చ‌నిపోవ‌డం ఖాయ‌మనుకున్నారంతా. ఆ విష‌యం తెలుసుకొన్న అలెగ్జాండ‌ర్ భార్య రొక్సానా, పురుషోత్త‌ముడికి ఒక రాఖీని పంపింది. దాంతోపాటు `యుద్ధంలో క‌నుక నా భ‌ర్త నీ కంటప‌డితే ద‌య‌చేసి అత‌ణ్ని ఏమీ చేయ‌వ‌ద్దు` అన్న సందేశాన్ని కూడా అందించింద‌ట‌. ఆ త‌రువాత యుద్ధంలో అలెగ్జాండ‌ర్ని హ‌త‌మార్చే అవ‌కాశం వ‌చ్చినా పురుషోత్త‌ముడు త‌న మాట‌ను నిల‌బెట్టుకున్నాడ‌ట‌.

కుంగిపోయాడు

కుంగిపోయాడు

మొదటిసారి అలెగ్జాండర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓటమిని తట్టుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయాడు. అలెగ్జాండర్‌ను ఊరడించేందుకు జరగవలసిన ప్రయత్నాలన్నీ జరిగాయి. అంతటి యోధుడికి కూడా ఓటమి భయం పుట్టించిన దేశం భారతదేశం. ఓటమి ఎరుగని వీరుడి గుండెల్లో బాణం దింపిన చరిత్ర మనకే సొంతం.

జబ్బున పడ్డాడు

జబ్బున పడ్డాడు

అతను ఓడిపోయి వెను తిరిగిపోయేటప్పుడు చాలా బాధపడ్డాడు. అయితే అప్పటికే అలెగ్జాండర్ జబ్బున పడ్డాడు. వైద్యులు కూడా ఏమి చేయలేకపోయారు. అలెగ్జాండర్‌ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని మరికొన్ని రోజుల్లో చనిపోతాడని వైద్యులు చెప్పారు.

అందరినీ రప్పించుకున్నాడు

అందరినీ రప్పించుకున్నాడు

అప్పుడు అతని పక్కనే మొదటి భార్య రొక్సానా, ఆమె కుమారుడు నాల్గవ అలెగ్జాండర్, రెండో భార్య స్టాటెయిరా, మూడో భార్య పారిశాటిస్, తల్లి ఒలింపియస్ ఉన్నారు. చివరిసారిగా వాళ్లవైపు చూసి, ఓపికలేని కనుసైగతో సమీపంలో ఉన్న ముఖ్య సైనిక అధికారులను దగ్గరకు రప్పించుకున్నాడు అలెక్స్.

మూడు కోరికలు

మూడు కోరికలు

అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు మూడు కోరికలు కోరాడు.

తన శవపేటికను వైద్యశిఖామణులను మోయనివ్వడిని కోరాడు. తన శవపేటిక వెంబడి మణులు మాణిక్యాలు వెదజల్లించండని కోరాడు. తనను ఖననం చేసిన మట్టిలోంచి తన చేతులను పైకి ఉండనివ్వండి అని కోరాడు. కొల్లగొట్టిన ధనరాశులను పోయేటప్పుడు పట్టుకు పోగలం లేదు కదా.. పుట్టినప్పుడు వట్టి చేతులే, ప్రాణం పోయినప్పుడు కూడా వట్టి చేతులతోనే వెళ్తాం అని అతను సందేశం ఇచ్చాడు.

All Images Source :https://list25.com

http://www.history.com

English summary

amazing facts about alexander the great

amazing facts about alexander the great
Subscribe Newsletter