యుద్ధాలు జరగకుండా ఇండియా పాకిస్థాన్ బార్డర్ లో సన్నీ లియోన్ ఫొటో

By Bharath
Subscribe to Boldsky

పంటలకు నరదిష్టి తగలకుండా ఉండేందుకు కొందరు పొలాల్లో దిష్టి బొమ్మలు పెడుతుంటారు. కానీ ఒక రైతు ఈ బాలీవుడ్ నటి, మాజీ శృంగారతార సన్నీలియోన్ ఫొటోలు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో చాలా ఫన్నీ కథనాలు వస్తున్నాయి.

అసలు స్టోరీ ఇది

అసలు స్టోరీ ఇది

పొట్టిశ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు ఎక్కువగా కూరగాయాలను సాగు చేస్తుంటారు. బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి పంటలను ఎక్కువగా సాగు చేస్తారు.

అందరి చూపు అటు వైపే

అందరి చూపు అటు వైపే

కూరగాయల తోటలు పచ్చగా ఉండడంతో దారిన పోయే వారంతా తోటల వైపే చూస్తున్నారు. ఏం పండిదిరా పంట అనుకుంటూ పోతూ ఉంటారు.

అందరి దిష్టి పచ్చని పంట పొలాలపై

అందరి దిష్టి పచ్చని పంట పొలాలపై

ఇలా రోడ్డున పోయే వారంతా తోటలను చూసి ఏవేవో మాట్లాడడం గమనించిన రైతులంతా కాస్త కొత్తగా ఆలోచించారు. అందరి దిష్టి పచ్చని పంట పొలాలపై పడుతుండటం ద్వారా దిగుబడి తగ్గిపోతుందని రైతులు భావించారు.

పొలం గట్లపై సన్నీ లియోన్

పొలం గట్లపై సన్నీ లియోన్

జనాల దృష్టిని పంటల మీది నుంచి మళ్లీంచేందుకు పొలం గట్లపై సన్నీ లియోన్ అర్ధనగ్న పటాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చెంచురెడ్డి కాస్త డిఫరెంట్

చెంచురెడ్డి కాస్త డిఫరెంట్

అందరూ రైతులు ఏవో చిన్నచిన్న ఫొటోలు పెట్టారు కానీ ఒక రైతు మత్రం రెడ్ డ్రెస్లో కాస్త ఎక్కువ స్పైసీగా వున్న సన్నీలియోన్ పోస్టర్‌ని ఏర్పాటు చేశాడు. ఆయన పేరే చెంచురెడ్డి. అలాగే ఫొటో కింద ‘ఒరేయ్ నన్ను చూసి ఏడవకురా' అంటూ క్యాప్షన్ కూడా పెట్టేశాడు.

పదెకరాల పంటభూమి

పదెకరాల పంటభూమి

బండకిందపల్లి గ్రామానికి చెందిన అంకినపల్లి చెంచురెడ్డికి పదెకరాల పంటభూమి ఉంది. ఈ పంటభూమి రోడ్డు పక్కనే ఉంది. ఆ భూమిలో కాలీఫ్లవర్, క్యాబేజ్, బెండ, మిరప పంటలను సాగుచేస్తున్నారు. ఈ పంటలకు కనుదిష్టి తగలకుండా బికినీలో ఉన్న సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ తన పంటభూమి వద్ద రోడ్డు పక్కన చెంచురెడ్డి ఏర్పాటు చేశారు.

ఐడియా బాగానే పని చేసిందట

ఐడియా బాగానే పని చేసిందట

సన్నీ లియోన్ పోస్టర్ ఏర్పాటు చేశాక చెంచురెడ్డికి మంచి దిగుబడి వచ్చిందట. ఇంతకు ముందు అందరి కళ్లు నా పంటపైనే ఉండేవి. ఇప్పుడు దారినపోయే జనం నా పంటను చూడటం మానేసి సన్నీ లియోన్ ఫ్లెక్సీనే చూస్తున్నారు అని చెంచురెడ్డి ఆనందపడుతున్నాడట.

చెంచురెడ్డి ఐడియాలే వేరు

చెంచురెడ్డి ఐడియాలే వేరు

చెంచురెడ్డి గ్రామంలో రైతుల్లో కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. అలాగే వెరైటీ పంటలు పండించడం అతని హాబీ. ఊరందరూ ఓ రకం పంటలేస్తే.. చెంచురెడ్డి మాత్రం ఇంకో పంటను ఎంచుకుని సవాల్ విసురుతుంటారు. ఈ ఏడాది కూడా చెంచురెడ్డి పదెకరాల్లో క్యాబేజీ, కాలీ ఫ్లవర్ పంట వేశారు. అలాగే సన్నీలియోన్ ఫొటో కూడా పెట్టడంతో ఆయన టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారారు.

చాలా సెటైర్స్

చాలా సెటైర్స్

ఇక చెంచురెడ్డి ఐడియా బాగా వర్క్ అవుట్ అయ్యింది కదా. అలాగే సన్నీలియోన్ ను రక్షణగా ఇంకా చాలో చోట్ల ఉపయోగిస్తే మేలని కొందరు సోషల్ మీడియాలో, కొన్ని న్యూస్ వెబ్ సెట్లలో పోస్ట్ చేస్తున్నారు.

ఇండియా పాకిస్థాన్ బార్డర్ లో

ఇండియా పాకిస్థాన్ బార్డర్ లో

ఇండియా పాకిస్థాన్ బార్డర్ లో సన్నీ లియోన్ ఫొటో పెడితే బాగుంటుంది కదా. పాకిస్థాన్ వారు మనదేశం వైపు చూడకుండా సన్నిలియోన్ ఫొటో చూస్తూ ఉండిపోతారు. దీంతో మనకు యుద్ధాలుండవు అంటూ కొందరు సెటైరికల్ గా ఒక ఫొటో పోస్ట్ చేశారు.

పద్మావత్ థియేటర్ల వద్ద

పద్మావత్ థియేటర్ల వద్ద

ఆ మధ్య పద్మావత్ థియేటర్ల వద్ద అంతా గలాటాలు జరిగాయి. పద్మావత్ థియేటర్ల ఎదుట సన్నీలియోన్ ఫొటో పెట్టి ఉంటే దాడులు చేయడానికి వచ్చిన కర్ణి సేన సన్నీలియోన్ ఫొటో చేసి వెనక్కి వెళ్లేవారు. అస్సలు దాడులే జరిగి ఉండేవి కావు. చెంచురెడ్డికి వచ్చిన ఐడియా థియేటర్ల వాళ్లకు రాలేదంటూ కొందరు ఒక ఫొటో పోస్ట్ చేశారు.

గోశాలల ఎదుట

గోశాలల ఎదుట

రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లలోని గోశాలల ఎదుట సన్నీలియోన్ ఫొటో పెడితే ఎవరి కన్ను కూడా గోవులపై పడదు. గోవులను రక్షించుకోవొచ్చు అంటూ ఒకరు ఫొటో పెట్టారు. అలాగే ఆర్ ఎస్ ఎస్ వారు కూడా సన్నీలియోన్ ఫొటోను వినియోగించుకుంటే బాగుంటుందని ఒక ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Photo credit (All Images)

https://www.ndtv.com/offbeat/at-this-andhra-pradesh-farm-sunny-leone-posters-are-saving-crops-1813081

https://www.dailyo.in/humour/sunny-leone-rss-karni-sena-padmaavat-andhra-pradesh-farmer-border-security-india-pakistan-ties/story/1/22370.html

https://www.thesun.co.uk/news/5586994/farmer-porn-star-sunny-leone-scarecrows/

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    andhra farmer puts up sunny leone poster to protect crops from evil eye

    Sunny Leone's poster can save crops from 'evil eye', but can it save theatres, cows and Indian Army?
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more