Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
తల్లి కడుపులో నుంచి ఎగిరి పడ్డ బిడ్డ, బిడ్డకు ప్రాణం పోసి చనిపోయిన తల్లి
ట్రక్ బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న గర్భిణీ కూడా ప్రమాదానికి గురైంది. ఆమెపై ట్రక్ లోని చెక్కలు మీద పడ్డాయి. ఆమె కడుపుపై ఒత్తిడి ఎక్కువై కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చి ఎగిరి కొద్ది దూరంలో పడింది.
ప్రతి మహిళకు ప్రసవం అనేది పునర్జన్మలాంటిది. తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి కనడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. బిడ్డను కనే సమయంలో తల్లి పడే వేదన వర్ణణాతీతం. ప్రసవ సమయంలో బిడ్డకు ప్రాణం పోసి చనిపోయే తల్లులు కూడా చాలా మందే ఉన్నారు.

గర్భిణీ కడుపులో నుంచి
ఇలాంటి సంఘటనే ఒకటి బ్రెబిల్ లో జరిగింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో గర్భిణీ కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చింది. తల్లి చనిపోతూ తన బిడ్డకు ప్రాణం పోసింది.

ట్రక్ మొత్తం చెక్కలే
ఒక ట్రక్కులో గర్భిణీ ప్రయాణిస్తూ ఉంది. ఆ ట్రక్ మొత్తం కూడా భారీ లోడ్ తో ఉంది. దాని నిండా పెద్ద పెద్ద చెక్కలున్నాయి. అందులో ఉన్న ఆ మహిళ తన కడుపులోని బిడ్డను గురించి ఆలోచిస్తూ సంతోషపడుతూ ప్రయాణం సాగిస్తోంది. అయితే ఆ ట్రక్ కొంత దూరం వెళ్లాక ప్రమాదానికి గురైంది.

చెక్కలు మొత్తం ఆమెపై పడ్డాయి
ట్రక్ బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న గర్భిణీ కూడా ప్రమాదానికి గురైంది. ఆమెపై ట్రక్ లోని చెక్కలు మీద పడ్డాయి. ఆమె కడుపుపై ఒత్తిడి ఎక్కువై కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చి ఎగిరి కొద్ది దూరంలో పడింది. ఆ బిడ్డ పడ్డ ప్రాంతం అంతా పచ్చ గడ్డి ఉండడంతో ఎలాంటి గాయాలు కాలేదు.

పసిపాప ఏడుపు వినిపించింది
కొద్ది సేపటికి ప్రమాదం జరిగిన ప్రాంతానికి స్థానికులు వచ్చారు. వారికి పసిపాప ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూశారు. వెంటనే సహాయ సిబ్బంది అత్యవసర చికిత్స అందించింది. తర్వాత ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
తల్లి చనిపోయి పాపను బతికించింది
అయితే ఈ ప్రమాదంలో ఆ బిడ్డ తల్లి చెక్కలు మీద పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన అందరినీ కలిచివేసింది. తల్లి చనిపోయినా ఆ పసిపాప మాత్రం ప్రాణాలతో బయటపడింది. పాపం.. ఆ తల్లి ఆ సమయంలో ఎంత వేదన పడిందో.



Click it and Unblock the Notifications
