For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిపా వైరస్ అంటే నాకేం భయం.. 400 గబ్బిలాలను సాకుతున్నా అంటున్న గుజరాత్ బామ్మ

నిఫా వైరస్ ఆమె పేరు శాంతాబెన్ ప్రజాపతి. గుజరాత్‌ ఫైనాన్షియల్ సిటీ అహ్మదాబాద్‌కు 50 కిలోమీటర్ల దరంలోని రాజ్‌పూర్‌ గ్రామంలో ఉంటోంది. ఆమె తన ఇంట్లో ఏకంగా 400 గబ్బిలాలను పెంచుకుంటోంది. బ్యాట్ ఉమన్

|

నిఫా వైరస్.. యావత్ దేశాన్ని వణికిస్తుంది. ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దేశంలో నెపా భయం ప్రజల వెన్నుల్లో వణకు పుట్టిస్తోంది. ఈ ప్రాణాంతక అంటువ్యాధి నుంచి ఎలా కాపాడుకోవాలో వైద్యులు గట్టి సూచనలు చేస్తున్నారు.

గబ్బిలాలు, చిలకలు గట్రా తిన్న పళ్లను తినొద్దని, పందులను ముట్టుకోవద్దని చెబుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదని, రాకుండా చూసుకోవడం తప్ప ఏమీ చేయలేమని అంటున్నారు.

వినడానికి ఆశ్చర్యం

వినడానికి ఆశ్చర్యం

ప్రాణాలు తీస్తున్న నిఫా వైరస్ అంటేనే భయపడుతున్న వేళ.. గుజరాత్‌లో ఓ మహిళ ఏకంగా 400 గబ్బిలాలను పెంచుకుంటోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. ఈ గుజరాత్‌ గబ్బిలాల బామ్మ ఇప్పుడు అంతటా హాట్ టాఫిక్ అయ్యింది.

400 గబ్బిలాల పెంపకం

400 గబ్బిలాల పెంపకం

ఆమె పేరు శాంతాబెన్ ప్రజాపతి. గుజరాత్‌ ఫైనాన్షియల్ సిటీ అహ్మదాబాద్‌కు 50 కిలోమీటర్ల దరంలోని రాజ్‌పూర్‌ గ్రామంలో ఉంటోంది. ఆమె తన ఇంట్లో ఏకంగా 400 గబ్బిలాలను పెంచుకుంటోంది. గత పదేళ్ల కాలం నుంచి శాంతాబేన్.. గబ్బిలాలతోటే కాలం గడుపుతోంది. వాటికి అనుగుణంగా ఇంట్లోని గోడలను నిర్మించింది.

ప్రేమతో ఆహారం

ప్రేమతో ఆహారం

గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ రెండింటినీ గబ్బిలాలకే కేటాయించింది. ఇక పెంచుకోవడం అంటే కొంత స్థలాన్నే ఇవ్వకుండా.. గబ్బిలాలకు ప్రేమతో ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఇటు గబ్బిలాల నుంచి వచ్చే ధూళి, దుమ్ము నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో నిత్యం.. వేప, కర్పూరాన్ని మండిస్తుంది.

దేశవ్యాప్తంగా ప్రచారం

దేశవ్యాప్తంగా ప్రచారం

ఇక ఈ శాంతాబెన్‌ గబ్బిలాల పెంపకంపై చుట్టుపక్కలే కాదు.. దేశవ్యాప్తంగా ప్రచారం పొందింది. ఈమె గబ్బిలాలను ఎలా పెంచుకుంటుందన్న విషయంపై ఢిల్లీకి చెందిన ఓ స్టూడెంట్.. ఓ డాక్యుమెంటరీ కూడా తీశాడు. అయితే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన నిఫా వైరస్.. ముఖ్యంగా గబ్బిలాల నుంచే వ్యాపిస్తుంది.

మొదట భయపడ్డా

మొదట భయపడ్డా

ఇక పదేళ్ల క్రితం ఓ గబ్బిలాల గుంపు ఇంట్లోకి వచ్చిందని వాటిని చూసి చాలా భయపడ్డానని శాంతాబెన్‌ తెలిపారు. రాత్రి పూట అవి బయటకు వెళ్లి, ఉదయాన్నే తిరిగి వచ్చేవని వివరించారు. అప్పటికే తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసినట్లు చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నాడని దాంతో ఇంటికి గబ్బిలాలకే వదిలేసినట్లు వెల్లడించారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకూ గబ్బిలాలతోనే నివసిస్తానని పేర్కొన్నారు.

ప్రతీ గబ్బిలం ప్రమాదకారే

ప్రతీ గబ్బిలం ప్రమాదకారే

ఇప్పటికే కేరళ నుంచి.. తెలుగు రాష్ట్రాలకు వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో.. ప్రతీ గబ్బిలమూ ప్రమాదకారే. వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి ఇదే విషయమై శాంతాబెన్‌ను ప్రశ్నిస్తే.. గబ్బిలాలతో పదేళ్ల తన అనుబంధాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేనని తేల్చిచెప్పింది.

నిపా వైరస్ వస్తుందని భయం లేదు

నిపా వైరస్ వస్తుందని భయం లేదు

తనదగ్గర పెరుగుతున్న గబ్బిలాల వల్ల నిఫా వైరస్‌ వస్తుందన్న భయం లేదని.. శాంతాబెన్ ధైర్యంగా చెబుతోంది. అంతేకాకుండా.. తనదగ్గర పెరుగుతున్న ప్రత్యేక తోక ఉన్న గబ్బిలాలు.. వైరస్‌ కారకాలు కాదని చెప్పుకొస్తుంది.

బ్యాట్ కాలనీ

బ్యాట్ కాలనీ

ఇక శాంతాబెన్ ఇళ్లున్న ప్రాంతాన్ని బ్యాట్ కాలనీగా పిలుస్తుంటారు. ఆమె ఇంటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. ఏదేమైనా.. ఈ గబ్బిలాల బామ్మకు.. ధైర్యం చాలానే ఉందని జనాలు చెప్పుకుంటారు.

బ్యాట్ ఉమన్

బ్యాట్ ఉమన్

ఇక స్థానికంగా ప్రజలందరూ ఆ బామ్మను ‘బ్యాట్‌ ఉమన్‌' అని పిలుస్తారు.‘నిపా గురించి నేనూ విన్నాను. కానీ నాకేం భయం లేదు. పదేళ్లుగా గబ్బిలాలతోనే జీవిస్తున్నాను. అవే నా కుటుంబం' అని తేల్చి చెప్పింది శాంతాబెన్‌.అందుకే వాటి కోసం ఇంటిని వదిలేసి వరండాలో కాలాన్ని వెళ్లదీస్తున్నట్లు వెల్లడించారు.

మౌజ్ టెయిల్డ్ జాతి గబ్బిలాలు

మౌజ్ టెయిల్డ్ జాతి గబ్బిలాలు

ఇక ఆమె ఆశ్రమిస్తున్న మౌజ్ టెయిల్డ్ జాతి గబ్బిలాల వల్ల నెపా వైరస్ సోకే అవకాశం లేదని వైద్యులు అంటున్నారు. కనుక.. ఈ గబ్బిలాల బామ్మ నిక్షేపంగా వాటితో కాలక్షేపం చేసేయొచ్చు. అయితే అలా అని అందరూ గబ్బిలాలను పెంచుకునేరు. నిపా కచ్చితంగా గబ్బిలాల ద్వారానే వస్తుందనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారించారు. కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు.

Image credit

English summary

Bat Woman’ From Gujarat Is Not Afraid of the Nipah Virus! Says Bats Are Family

At a time when Nipah virus scare has gripped the country – and every bat is under scrutiny – this woman from Rajpur village, about 50 km from Ahmedabad, has no plans of being separated from about 400 winged mammals that live in her two-room house. Villagers call Shantaben Prajapati, 74, ‘chamachidiyawala ba’ (grandma living with bats).“I have heard of Nipah but I am not afraid. I have been living with bats for a decade now. They are my family. Their population inside my house has proliferated after I shifted from inside my house to the courtyard for preparing meals and sleeping. The interiors only have a few belongings,” says Prajapati, who opens the door to show the ‘bat colony’ occupying all four walls on the ground and the first floor.
Story first published:Tuesday, May 29, 2018, 14:30 [IST]
Desktop Bottom Promotion