స్నానం విషయంలో విడాకుల దాకా వెళ్లకండి.. మన స్నాన సంప్రదాయాల్ని మరవకండి

Written By:
Subscribe to Boldsky

మనం ఒక్కరోజు స్నానం చేయకున్నా కూడా శరీరం నుంచి చెడువాసన వస్తుంది. బాడీ మొత్తం చెమటతో నిండిపోతుంది. స్నానానికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. భార్య స్నానం చేయకుంటే భర్త ఇబ్బందులుపడాల్సి వస్తుంది. భర్త స్నానం చేయకుంటే భార్య ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

కచ్చితంగా చేయాలి

కచ్చితంగా చేయాలి

ఎందుకంటే వారిద్దరూ రోజూ చాలా కార్యకళాపాల్లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి. వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

తైవాన్ లో ఒక ఆమె ఇలా చేసింది

తైవాన్ లో ఒక ఆమె ఇలా చేసింది

తాజాగా తైవాన్‌లోని సంఘటన మనకు ఇందుకు నిదర్శనం. అతను అమ్మాయిని ఇష్టపడి పెళ్లాడాడు. మొదట ఆమె శుభ్రత పాటించకపోయినా పట్టించుకోలేదు. ఆమె రోజూ పళ్లు తోముకోదు. స్నానం చేయదు. తల దువ్వుకోదు.. ఇలా ఉంటే కాపురం సంగతేమో కానీ కనీసం కలిసి మాట్లాడలేక ఆ భర్త ఇబ్బందులుపడి ఉంటారు.

ఏడాదికొకసారి

ఏడాదికొకసారి

మొదట్లో వారానికి ఒకసారి స్నానం చేసే ఈ అమ్మడు తర్వాత ఏడాదికోసారి స్నానం చేయడం మొదలుపెట్టింది. ఇక ఆ స్నానం చేసిన రోజు మాత్రమే ఈ భర్త శృంగారంలో పాల్గొనేవాడు. దీంతో పిల్లలు కూడా పుట్టలేదు. ఆయనకు రోజూ భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఉన్నా కూడా ఆమె స్నానం చేయని కారణంగా ఆ కోరికల్ని చంపుకోవాల్సి వచ్చేది.

ఎందుకు చేయాలి

ఎందుకు చేయాలి

స్నానం చేయకపోవడంతో చాలా రకాలుగా హింసించడంతో ఈ భర్త విడాకుల కోసం కోర్టుకు కూడా ఎక్కాడు. అసలు మనం ఎందుకు స్నానం చేయాలి.. ఎన్ని రకాల స్నానాలున్నాయి. స్నానం చేస్తే వచ్చే ప్రయోజనాలను ఒక్కసారి మీరూ చూడండి.

ఎన్ని రకాలు

ఎన్ని రకాలు

ఇందులో భాగంగా, అభ్యంగన స్నానం, సర్వాంగ స్నానం, తొట్టిస్నానం, ప్రధానంగా ఉంటాయి. వీటిల్లో ఏ స్నానం చేసినా అరగంట దాకా భోజనం చేయకూడదు. భోజనం తర్వాతే అయితే భోజనం చేసిన 3 గంటల తర్వాతచేయాలి.

అభ్యంగన స్నానం

అభ్యంగన స్నానం

శరీరంలోని మాలిన్యాలు చర్మపు సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఒకవేళ అవి పూర్తి స్థాయిలో బయటికి రాకపోతే తిరిగి రక్తంలో కలుస్తాయి. ఇలా రక్తం విషతుల్యమైతే శరీరం పలురకాల వ్యాధులను నిలయమవుతుంది. ఈ స్థితి రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా అభ్యంగన స్నానం చేయాలి.

కావాలసిన వస్తువులు

కావాలసిన వస్తువులు

నువ్వుల నూనె, వెన్న, కొబ్బరినూనె, వంట ఆముదము.. వీటిల్లో ఏదో ఒక నూనె తీసుకోవాలి. దీనికి తోడు సున్నిపిండి (శెనగపిండి లేదా మినప, పెసర, బియ్యం పిండి) ఒంటికి పట్టించి, సీకాయ, కుంకుమకాయ, నురుగుతో బాగా రుద్దుకుని స్నానం చేయుటను అభ్యంగనం అంటారు.

తైలంతో మర్దన

తైలంతో మర్దన

ముందు ఏదో ఒక తైలాన్ని తీసుకుని తల నుంచి పాదాల దాకా బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాల దాకా అలాగే ఉండాలి. సున్నిపిండిని నీటితో తడిపి, శరీర భాగాలన్నింటికీ పట్టించి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గట్టిగా మర్ధన చేయాలి. ఆ తర్వాత సీకాయ లేదా కుంకుడు రసం చూర్ణంతో రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

గంట దాకా తినకూడదు

గంట దాకా తినకూడదు

స్నానానికి ఉపయోగించే నీరు ఎక్కువగా వేడిగా ఉండకుండా చూసుకోవాలి.వేడి నీటితో స్నానం పూర్తికాగానే, ఒక బకెట్‌ చన్నీటితో స్నానం చేయడం అవసరం. ఆ తర్వాత మెత్తటి టవల్‌తో తడి లేకుండా పరిశుభ్రంగా ఒళ్లంతా తుడుచుకోవాలి. ఆ తర్వాత పలుచుని దుస్తులు ధరించాలి. అభ్యంగన స్నానం చేసిన గంట దాకా భోజనం లేదా ఘనపదార్థాలేవీ తీసుకోకూడదు. అరగంట తర్వాత మజ్జిగ , పండ్లరసం, పాల వంటివి తీసుకోవచ్చు.

రుషిస్నానం

రుషిస్నానం

తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.

భౌమ స్నానం

భౌమ స్నానం

పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది భౌమ స్నానం.

దివ్య స్నానం

దివ్య స్నానం

లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

దివ్య స్నానం

దివ్య స్నానం

లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

ప్రతి స్నానంతో ప్రయోజనాలే

ప్రతి స్నానంతో ప్రయోజనాలే

స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్‌లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది.

దారిద్రాలు తొలగుతాయి

దారిద్రాలు తొలగుతాయి

నేతితో స్నానం చేయుడం వలన ఆయుర్దాయం పెరుగుతుంది.

పెరుగు, ఆవుపేడతో స్నానం చేయుడం వలన లక్ష్మీ వర్ధనము.

దర్భలతో చేయుడం వలన సర్వ పాపాలు తొలగుతాయి.

సర్వ గంధాలతోటి స్నానం చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము అభివృద్ది చెందుతాయి.ఆమలక స్నానము అంటే ఉసిరికాయని వేసి చేసిన స్నానం వలన దారిద్రాలు తొలగుతాయి.

ఆయుష్షు పెరుగుతుంది

ఆయుష్షు పెరుగుతుంది

నువ్వులు మరియు తెల్ల ఆవాలతో చేసిన స్నానం అమంగళనివారకము. నువ్వులతో కాని తెల్ల ఆవాలతో కాని ప్రియంగువుతో కాని స్నానం చేస్తే సౌభాగ్యం. మోదుగ, మారేడాకులు, రెల్లు, తామర, కలువ, కడిమి పువ్వులతో స్నానం చేస్తే లక్ష్మీ వర్ధనమే కాక శుభప్రదం కలుగుతుంది. నవరత్నాలతో స్నానము చేస్తే యుద్ధ విజయం కలుగుతుంది. బంగారము వేసిన నీటితో స్నానం చేస్తే ఆయుష్షు, మేధా శక్తి పెరుగుతుంది.

ముని స్నానం

ముని స్నానం

తెల్లవారు జామున నాలుగు, ఐదు మధ్య చేసే స్నానాన్ని ముని స్నానం అంటారు. ఆ సమయంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. స్త్రీలు ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చెయ్యాలి. మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకుని స్నానం చెయ్యాలి. ఉదయం ఐదు, ఆరు మధ్య చేసేది స్నానాన్ని దైవ స్నానం అంటారు.

విడాకుల దాకా వెళ్లకండి

విడాకుల దాకా వెళ్లకండి

ఆరు, ఏడుల మధ్య చేసేది మానవ స్నానం. ఆపై చేసేది రాక్షస స్నానం. చన్నీటి స్నానం మంచిది. తైవాన్ లో ఆమె మాదిరిగా మీరు కూడా స్నానం చేయకుండా ఉండకండి. ఈ విషయంలో విడాకుల దాకా వెళ్లకండి. మన స్నాన సంప్రదాయాల్ని మరవకండి.

English summary

bathing an ancient method body cleaning

bathing an ancient method body cleaning
Story first published: Friday, January 12, 2018, 11:42 [IST]