చైనాలో 20,000 ఎకరాల్లో ఎవరికీ తెలియని రహస్య నగరం ఉంది

Written By:
Subscribe to Boldsky

చైనా రాజధాని బీజింగ్ ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతలో ఎవరికీ తెలియని ఒక రహస్య నగరం ఉంది. అది కూడా భూగర్భంలో ఉంది. కొన్ని వేల ఎకరాల్లో ఈ నగరం ఉంది.

21.5 మిలియన్ల మంది

21.5 మిలియన్ల మంది

అయితే ఈ విషయం ఆదేశంలోని వారికి కూడా కొన్ని ఏళ్లకిందట చాలా మందికి తెలియదు. ఈ రహస్య నగరంలో దాదాపు 21.5 మిలియన్ల మంది ఉండొచ్చు. అసలు ఈ నగరం ఎలా ఏర్పడింది.. దీనికి ఉన్న చరిత్ర ఏమిటి అనే విషయాలపై చాలా కథనాలున్నాయి.

Image source : https://www.thevintagenews.com

20,000 ఎకరాల్లో ఉంది

20,000 ఎకరాల్లో ఉంది

ఇదంతా కూడా చైనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతం. మొత్తం 20,000 ఎకరాల్లో ఈ రహస్య నగరం ఉంది. ఇందులో గవర్నమెంట్ కు సంబంధించి కార్యకళాపాలు సాగుతుంటాయి. రహస్యనగరానికి ఉన్న అన్ని ద్వారాల్లోనూ చాలా బందోబస్తు నిర్వహిస్తుంటారు. సెక్యూరిటీ చాలా బలంగా ఉంటుంది.

Image source : https://www.thevintagenews.com

ఎలాంటి టెక్నాలజీ లేకుండానే

ఎలాంటి టెక్నాలజీ లేకుండానే

చైనాలో భూగర్భంలో ఉండే ఈ రహస్య నగరాన్ని డిక్సియా చాంగ్ అని అంటారు. ఈ నగరాన్ని అంతకూడా అప్పట్లో ఎలాంటి టెక్నాలజీని వినియోగించకుండానే ఏర్పాటు చేశారు. సుమారు మూడు లక్షల మంది దీని కోసం పని చేశారు.

Image source : https://www.thevintagenews.com

గడ్డపారలతో తవ్వి

గడ్డపారలతో తవ్వి

గడ్డపారలతో భూమిని తవ్వి.. ఆ మట్టిని వెదురు బుట్టలతో తీసి బయటవేసి అలా ఈ రహస్య నగరాన్ని నిర్మించారు. 1969 లో కొన్ని వేల మందితో ప్రారంభమైన ఈ నగర నిర్మాణం పని 1979 వరకు కొనసాగింది. కొన్ని దశాబ్దాల పాటు ఈ వర్క్ కొనసాగింది.

Image source :https://www.thevintagenews.com

యుద్ధ సమయంలో

యుద్ధ సమయంలో

చైనా, రష్యాల మధ్య ఏర్పడిన ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అక్కడి ప్రభుత్వం ఈ రహస్య నగరాన్ని ఏర్పాటు చేయించింది. 1969 లో ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి వివాదాలు ఏర్పడ్డాయి. అయితే 1991 తర్వాత రెండు దేశాల మధ్య సఖ్యత ఏర్పడింది.

కొందరు సిబ్బంది

కొందరు సిబ్బంది

యుద్ధ సమయంలో కొంతమంది సిబ్బంది రహస్య నగరంలో ఉండి కార్యకళాపాలు నిర్వహించేలా చాలా బందోబస్తుగా దీన్ని నిర్మించారు.

అప్పటి చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ ప్రణాళిక మేరకు అక్కడ రహస్య నగరం ఏర్పడింది.

సైనికులకు అవసరం అయ్యేవి

సైనికులకు అవసరం అయ్యేవి

అందులో కొంత మంది సైనికులు, జనాలుండి సైన్యానికి అవసరమైనే అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సైనికులకు అవసరం అయ్యే తిండి, కనీస సౌకర్యాలకు సంబంధించిన మొత్తం కార్యకళాపాలు అన్నీ ఈ రహస్య నగరం నుంచే సాగేవి.

శత్రు సైన్యాలకు తెలియకుండా..

శత్రు సైన్యాలకు తెలియకుండా..

శత్రు సైన్యాలకు అసలు ఈ రహస్య నగరం గురించి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం. చాలామంది చైనా దేశస్తులకు కూడా ఈ రహస్య నగరం గురించి అప్పట్లో తెలియదు. ఒక వేళ శత్రు సైన్యం అందులోకి ప్రవేశించినా వారిని అక్కడిక్కడే చంపివేసే అనేక సామాగ్రిని రహస్య నగరంలో అప్పట్లో ఉంచిది చైనా ప్రభుత్వం.

అన్నీ ఉండేవి

అన్నీ ఉండేవి

10,000 అణు బంకర్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, గిడ్డంగులు, కర్మాగారాలు, వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు, క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు ఇలా ప్రతిదీ ఈ రహస్య నగరంలో ఉండేవి. చాలా రోజుల వరకు అక్కడ మనుషులు నివసించారు కూడా. ఇప్పుడు కూడా అందులో చాలామంది ఉన్నారని అంటుంటారు.

భూమిపైనే ఉన్నట్లు ఉంటుంది

భూమిపైనే ఉన్నట్లు ఉంటుంది

వెంటిలేషన్ వ్యవస్థను కూడా చాలా బాగుంటుంది. మనం అస్సలు భూ గర్భంలో, సొరంగంలో ఉన్నట్లు ఉండదు. భూమిపైనే ఉన్న అనుభూతి మనకు కలుగుతుంది. 1969 లో బీజింగ్ లో ఉన్న సుమారు 6 మిలియన్ ప్రజలకు యుద్ధ సమయంలో వసతి కల్పించేందుకు వీలుగా దీన్ని రూపొందించింది అప్పటి చైనా ప్రభుత్వం.

దుకాణాలు కూడా

దుకాణాలు కూడా

అయితే 1980 లో అప్పటి ప్రభుత్వం ఈ రహస్య నగర విషయంలో కొన్ని మార్పులుచేర్పులు చేసింది. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించింది. కొంత స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కూడా అప్పగించింది. దీంతో అక్కడ దుకాణాలు కూడా వెలిశాయి.

English summary

beijing has 20000 acre secret underground city

beijing has 20000 acre secret underground city