For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మాయిల నగ్న ఫొటోలతో ఆగుతున్న పెళ్లిళ్లు, ఫొటో మార్పింగ్ తో కూలుతున్న కాపురాలు

ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి లేదంటే అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు తీసి పెళ్లి చేసుకోబోయే వారికి పంపిస్తున్నారు కొందరు దుర్మార్గులు. ఫొటో మార్పింగ్, నగ్న ఫొటోలు.

|

తనకు కాబోయే భార్య ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్ధంగా ఉండాలని ప్రతి వరుడూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి లేదంటే అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు తీసి పెళ్లి చేసుకోబోయే వారికి పంపిస్తున్నారు కొందరు దుర్మార్గులు. అలాగే మరికొందరు తమ శత్రువుల ఫొటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో జీవితాలు నాశనం అవుతున్నాయి.

భార్య నగ్న దృశ్యాలు చూసి షాక్

భార్య నగ్న దృశ్యాలు చూసి షాక్

తాజాగా ఒక వరుడు తనకు కాబోయే భార్య నగ్న దృశ్యాలు చూసి షాక్ తిన్నాడు. అంతే ఆమెతో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడిలో జరిగిందీ ఘటన. స్థానిక యువతికి, ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన యువకుడి‌తో పెళ్లి నిశ్చయమైంది. జూలై 8 శనివారం రోజు వీరి వివాహం జరగాల్సి ఉంది. కొత్తలంకలో వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

వధువు స్నానం చేసిన దుస్తులు మార్చుకుంటున్నట్టు

వధువు స్నానం చేసిన దుస్తులు మార్చుకుంటున్నట్టు

అయితే పెళ్లికి ఒక్క రోజు ముందు వరుడు పేరుతో ఓ స్పీడు పోస్టులో కవర్ వచ్చింది. దాన్ని వరుడు విప్పి చూడగా, అందులో ఓ మొబైల్ ఫోన్ వుంది. ఆ ఫోన్‌లోని వీడియోలు ప్లే చేసి చూడాలని ఓ పేపర్‌పై రాసి ఉంది. దీంతో వరుడు ఆ వీడియోను తిలకించి తేరుకోలేని షాక్‌కు గురయ్యాడు. ఆ వీడియోల్లో వధువు స్నానం చేసిన అనంతరం దుస్తులు మార్చుకుంటున్నట్టు ఉంది. కాబోయే భార్య నగ్న దృశ్యాలను చూసిన వరుడు పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పాడు.

వీడియోలు పంపింది స్వయాన పెళ్లి కూతురి బావే

వీడియోలు పంపింది స్వయాన పెళ్లి కూతురి బావే

దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అలా పెళ్లి కొడుకుకు వీడియోలు పంపింది స్వయాన పెళ్లి కూతురి బావే. మరదలిపై కన్నేసిన అక్క మొగుడు ఆమెకి కాబోయే వరుడుకి మార్ఫింగ్‌ ఫొటోలు పంపి ఆఖరి నిమిషంలో పెళ్లి నిలిపివేయించాడు. తన భార్య ఉపాధి కోసం కువైట్‌కి వెళ్లడంతో.. మరదలిని పెళ్లి చేసుకోవాలని అతను ఆశించాడు. కానీ.. ఆమెకి ఇటీవల పెళ్లి నిశ్చయం అయ్యింది. దీంతో ఎలాగైనా ఆ వివాహాన్ని ఆపించాలని ఆమె బావ ఈ దుశ్చర్యకి పాల్పడ్డాడు.

పెద్ద అల్లుడు అరాచకమేనని తేల్చారు

పెద్ద అల్లుడు అరాచకమేనని తేల్చారు

పెళ్లి కూతురి బావ సొంతూరు అమలాపురం రూరల్‌ మండలం ఈదరపల్లి. గ్రామంలో అతడు ఒక పార్టీ నాయకుడు. పైగా ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్‌ కావడంతో సునాయసంగా తన మరదలి మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు సృష్టించాడు. ఆ అశ్లీల ఫొటోలను వరుడికి పంపించాడు. దీంతో.. పెళ్లి ఆఖరి నిమిషంలో వరుడు తాను ఈ వివాహం చేసుకోనని బంధువులతో తెగేసి చెప్పాడు. వధువు కుటుంబ సభ్యులు ఆరా తీసి.. అది తమ పెద్ద అల్లుడు అరాచకమేనని తేల్చారు. విచారణ చేపట్టిన పోలీసులు వీడియోల్లో కొంత మార్ఫింగ్‌ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగ్నవీడియోల కారణంగా పెళ్లి ఆగిపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

కరీంనగర్ లోనూ జరిగింది

కరీంనగర్ లోనూ జరిగింది

ఇలాంటి ఘటనే కొన్ని రోజుల క్రితం కరీంనగర్ లో జరిగింది. కొద్ది క్షణాల్లో పెళ్లి.. వరుడు ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలనుకున్నాడు. స్వాగతం పలకడానికి వధువు తరఫున వాళ్లు ఘనంగా ఏర్పాటు చేశారు. ఇంతలో వరుడు ఆ అమ్మాయి మరో యువకుడితో కలిసి ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో చూశాడు. ఆ వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వైరల్ మారిన విషయం తెలిసిందే.

చేసుకోబోయే అమ్మాయి మరో యువకుడితో కలిసి దిగిన సెల్ఫీ

చేసుకోబోయే అమ్మాయి మరో యువకుడితో కలిసి దిగిన సెల్ఫీ

మంచిర్యాలకు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడికి వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారానికి చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఆదివారం (జులై 1) ఉదయం 11 గంటల సమయంలో హుజూరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే.. వరుడు ఫంక్షన్‌ హాల్‌కు వస్తున్న సమయంలో అతడు తన సెల్‌ ఫోన్‌లో తాను చేసుకోబోయే అమ్మాయి మరో యువకుడితో కలిసి దిగిన సెల్ఫీని చూశాడు. అమ్మాయికి ప్రేమ వ్యవహారం ఉందని భావించాడు.

సహ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో పెట్టడం వల్లే

సహ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో పెట్టడం వల్లే

అమ్మాయి మరో యువకుడితో కలిసి దిగిన ఫొటోను వరుడు తన తల్లిదండ్రులను చూపించి పెళ్లికి నిరాకరించాడు. హుజూరాబాద్ పోలీసుల ద్వారా వధువు తల్లిదండ్రులకు విషయం చెప్పించి ఆ యువకుడు పెళ్లి చేసుకోకుండానే తిరిగి మంచిర్యాలకు వెళ్లిపోయాడు. కాగా పెళ్లి కూతురు ఫొటోలను సహ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో పెట్టడం వల్లే ఆ పెళ్లి ఆగిపోయింది.

ఇద్దరూ కలిసి దిగినట్లుగా మార్చి

ఇద్దరూ కలిసి దిగినట్లుగా మార్చి

ఆ అమ్మాయి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ అనే యువకుడు పని చేస్తున్నాడు. యువతి ఫొటోలు సేకరించి, తామిద్దరూ కలిసి దిగినట్లుగా మార్చి వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడని బాధిత యువతి ఆరోపించింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సుమన్‌ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్‌ చేసి

సుమన్‌ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్‌ చేసి

ఇక టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై కొన్ని రోజులుగా కొన్ని కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఫేస్‌బుక్‌లో సుమన్‌ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్‌ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు కొందరు.

దీంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు' అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అలాగే ఇద్దరు మహిళలపై ఎంపీ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ ప్రధానికి పాత్రికేయుల లేఖ రాశారంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు కూడా స్పందించారు.

లైంగిక వేధింపుల ఘటన అవాస్తవం

లైంగిక వేధింపుల ఘటన అవాస్తవం

‘ఎంపీ బాల్క సుమన్‌పై వైరల్‌ అవుతున్న లైంగిక వేధింపుల ఘటన అవాస్తవం. బాధితులుగా చెప్పుకుంటున్న బోయిని సంధ్య, విజేతలు గతంలోనూ పలువురిని బ్లాక్‌మెయిల్‌ చేసి వేధించినట్లు మా విచారణలో వెల్లడైంది. ఎంపీపై ఆరోపణలకుగానూ వారిద్దరిపై ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశాం. ఇప్పుడు బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనూ వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఎంపీని ట్రాప్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ ద్వారా డబ్బు గుంజాలని యత్నించారు. అందులో భాగంగానే ఎంపీ కుటుంబ సభ్యుల ఫోటోను నిందితులు మార్ఫింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో సర్క్యూలేట్‌ చేశారు' అని పోలీసులు వెల్లడించారు.

వివాహం జరిగిన పది రోజుల్లోనే

వివాహం జరిగిన పది రోజుల్లోనే

ఇక ఓ ఆదివాసీ వివాహిత బాయ్‌ఫ్రెండ్‌ ఆమె అశ్లీల చిత్రాలను భర్తకు పంపిన సంఘటన ఇటీవల ఒడిశాలో వెలుగుచూసింది. ఆమె వివాహం జరిగిన పది రోజుల్లోనే ఇటువంటి సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో వివాదాలు తలెత్తాయి. జయపురం సదర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక గ్రామానికి చెదిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన ఓ యువతికి గడిచిన ఏప్రిల్‌ 20వ తేదీన వివాహం జరిగింది. వారు ఇంకా వైవాహిక జీవితం ఆరంభించకుండానే వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ఓ యువకుడు అశ్లీలంగా ఉన్న వధువు ఫొటోలను ఆమె భర్త వాట్సాప్‌కు పోస్ట్‌చేశాడు.

తాను భార్యతో ఉండలేనన్నాడు

తాను భార్యతో ఉండలేనన్నాడు

ఆ ఫొటోలు వాట్సాప్‌లో పెట్టిన వ్యక్తి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అని తెలుస్తోంది. తన వాట్సాప్‌కు వస్తున్న అశ్లీల ఫొటోలను చూసిన వరుడు జయపురం సదర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తాను భార్యతో ఉండలేనన్నాడు. వీడియో క్లిప్పింగ్‌లు వాట్సాప్‌కు పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాగపూర్ కు చెందిన రంజాన్

నాగపూర్ కు చెందిన రంజాన్

తన భార్య బతికుండగానే ఆమె చనిపోయిందని చెప్పి మరో పెళ్ళి చేసుకొనేందుకు నాగపూర్ కు చెందిన రంజాన్ అనే వ్యక్తి కొన్నిరోజుల క్రితం తప్పుడు మార్గాన్ని అనుసరించాడు. అయితే రంజాన్ నిజస్వరూపం తెలుసుకొన్న మహిళ అతడిని దూరం పెట్టింది. అయితే ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యుల ఫోటోలను మార్పింగ్ చేసి ఫేస్‌బుక్ లో అప్‌లోడ్ చేశాడు.

షాదీ. కామ్‌లో ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేశాడు

షాదీ. కామ్‌లో ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేశాడు

మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన చెందిన రంజాన్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి వివాహమై భార్య,పిల్లలు కూడ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి తన భార్య చనిపోయిందని రంజాన్ అలియాస్ రియాజ్ అన్సారీ ప్రయత్నం చేశాడు.

రంజాన్ అలియాస్ రియాజ్ అన్సారీ షాదీ. కామ్‌లో తన ప్రోఫైల్‌ను అప్‌లోడ్ చేశాడు. తన భార్య చనిపోయిందని, తనకు ఓ కూతురు ఉందని ఆ ఫ్రోఫైల్ లో ప్రకటించాడు తన కూతురు కోసం తాను రెండో పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నానని ఆయన ఆ ప్రోఫైల్ లో ప్రకటించారు.

రెండో వివాహనికి సిద్దం

రెండో వివాహనికి సిద్దం

రెండో వివాహనికి సిద్దం

అయితే ఈ ప్రొఫైల్ ను చూసిన పశ్చిమగోదావరి జిల్లా అతనికి రిక్వెస్ట్ పంపింది. ఆమెకు కూడ భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. రెండో వివాహనికి సిద్దమని ఆమె అంగీకారాన్ని తెలిపింది. ఇద్దరూ కూడ షాదీ.కామ్‌ ద్వారా ఏర్పడిన పరిచయాన్ని కొనసాగించారు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా తమ బంధాన్ని ఇంకా కొనసాగించారు. ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్నట్టు ఆ మహిళను నమ్మించాడు. అంతేకాదు తాను ట్రావెల్స్ వ్యాపారాన్నికూడ నడుపుతున్నానని కూడ ఆయన ప్రకటించాడు.

రంజాన్ భార్య అసలు విషయం చెప్పింది

రంజాన్ భార్య అసలు విషయం చెప్పింది

రంజాన్ ను నమ్మిన వివాహిత తన కుటుంబసభ్యుల ఫోటోలను కూడ అతడికి షేర్ చేసింది. అయితే భర్త ప్రవర్తనతో అనుమానం వచ్చిన రంజాన్ భార్య అతడి ఫోన్ ను ఒకరోజు పరిశీలించింది. భర్త రెండో పెళ్ళి కోసం ప్లాన్ చేస్తున్న విషయాన్ని ఆమె గమనించింది. దీంతో ఆమె పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఫోన్ చేసి తన భర్తను మోసం చేస్తున్నాడని చెప్పింది. తాను బతికే ఉన్నట్టు చెప్పింది. దీంతో ఆ మహిళ రంజాన్ ను దూరంగా పెట్టింది, ఛాటింగ్, ఫోన్లు చేయడం మానేసింది.

నగ్న ఫొటోలను అప్‌లోడ్ చేశాడు

నగ్న ఫొటోలను అప్‌లోడ్ చేశాడు

దీంతో రంజాన్ బాధితురాలి పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేశాడు. తనకు పంపిన ఫోటోలను మార్పింగ్ చేసి ఆమె నగ్న ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. దీంతో బాధితురాలు ఫేస్‌బుక్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఐడీని ఫేస్ బుక్ తొలగించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న బాధితురాలి సోదరి ఫొటోలను సైతం మార్పింగ్ చేసి ఇంటర్‌నెట్‌లో పెట్టాడు. దాంతో వారి ఫోన్ నెంబర్లను కూడా ఫొటోపై రాసి, ఎవరైనా వీళ్లను సంప్రదించాలంటూ అసభ్య పదజాలాలను ఉపయోగించాడు. తమను వేధించవద్దంటూ బాధితురాలు రంజాన్‌ను వేడుకుంది.

బాధితురాలి సోదరి ఫిర్యాదు చేసింది

బాధితురాలి సోదరి ఫిర్యాదు చేసింది

అయితే తనను పెండ్లి చేసుకోవాలని, నాగాపూర్‌కు తీసుకెళ్తానంటూ ఒత్తిడి పెంచాడు. హైదరాబాద్‌లో ఉంటున్న బాధితురాలి సోదరి ఫొటోలను తెలిసిన వారు చూసి ఆమె కు సమాచారం ఇచ్చారు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలి సోదరి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే రంజాన్ హైదరాబాద్‌కు వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని నిందితున్ని అరెస్ట్ చేశారు. ఇలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ లలో పోస్ట్ చేయడంతో చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి.

English summary

brother in law sends morphing photos of sister in law in andhra-pradesh

brother in law sends morphing photos of sister in law in andhra pradesh
Story first published:Monday, July 9, 2018, 12:50 [IST]
Desktop Bottom Promotion