For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలలో కత్తితోనే 20 కిలోమీటర్లు బైక్ నడిపి ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

క్యూన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయితే ప్యాసింజర్ ను గమ్యానికి చేరిస్తే 15 యువాన్స్ (£ 1.7) చెల్లిస్తానని మొదట అంగీకరించాడు. తర్వాత గమ్యానికి చేరాక ఆ బిల్లు ఇవ్వలేదు.

|

చాలా మంది వారిపై సడన్ గా ఎవరైనా అటాక్ చేస్తే అక్కడికక్కడే కూలిపోతారు. తర్వాత ఎవరి సాయం అందకపోతే చనిపోతారు. కానీ కొందరు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. కొన ఊపిరితో ఉన్నా మళ్లీ బతుకుతారు. అయితే అలా అందరికీ సాధ్యం కాదు. కొందరు మాత్రమే అలా బతికి బట్టగలుగుతారు.

బైక్ పై ఎక్కించుకుని వెళ్తుంటే

చైనాలో ఇటీవల ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అతని పేరు క్యూన్. అతనిది గువాంగ్జో. క్యూన్ వయస్సు 32 ఏళ్లు. అతను ఒక బైక్ ట్యాక్సీ డ్రైవర్. ఒక ప్యాసింజర్ ని బైక్ పై ఎక్కించుకుని వెళ్తుంటే సడన్ గా అతను క్యూన్ పై అటాక్ చేశాడు. బైక్ స్లోకాగానే ప్యాసింజర్ పారిపోయాడు.

తర్వాత క్యూన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాదాపు ఇరవై నిమిషాల పాటు బైక్ నడుపుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. పోలీసుల సాయంతో క్యూన్ హాస్పిటల్ కు వెళ్లాడు.

8 సెంటీమీటర్ల వరకు కత్తి

8 సెంటీమీటర్ల వరకు కత్తి

డాక్టర్లు వెంటనే అతనికి చికిత్స అందించారు. ఎక్స్ రే తీస్తే అతని తలలో 8 సెంటీమీటర్ల వరకు కత్తి దిగబడి ఉంది. ఆ పదునైన కత్తి 20 సెంటీ మీటర్ల పొడువు (7.8-అంగుళాల) ఉంది. అయితే అది కేవలం పుర్రెలోకి మాత్రమే దిగబడింది. రక్త నాళాలకు ఎక్కడా తాకలేదు. ఆ కత్తి కాస్త లోపలికి వెళ్లింతే మాత్రం క్యూన్ చనిపోయేవాడు.

డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు

డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు

కత్తి తలలోకి దిగినా కూడా దానితోనే హాస్పిటల్ వరకు ధైర్యంగా రావడం వల్లే అతన్ని బతికించగలిగామని వైద్యులు చెప్పారు. మొదట క్యూన్ అలా తలలో కత్తితో రావడంతో డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. మొత్తానికి క్యూన్ తలలో నుంచి ఆ కత్తిని తీయగలిగారు. కత్తిని తీసేందుకు డాక్టర్లు సుమారు ఐదు గంటల పాటు చికిత్స అందించారు.

బిల్లు ఇవ్వలేదు

బిల్లు ఇవ్వలేదు

క్యూన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయితే ప్యాసింజర్ ను గమ్యానికి చేరిస్తే 15 యువాన్స్ (£ 1.7) చెల్లిస్తానని మొదట అంగీకరించాడు. తర్వాత గమ్యానికి చేరాక ఆ బిల్లు ఇచ్చేందుకు నిరాకరించాడు. క్యూన్ గట్టిగా అడగడంతో అతను అటాక్ చేసి పారిపోయాడు.

కరెంట్ షాక్ కొట్టిందనుకున్నా

కరెంట్ షాక్ కొట్టిందనుకున్నా

" అతను అటాక్ చేసినప్పుడు మొదట నాకు కరెంట్ షాక్ కొట్టిందని అనుకున్నా. నా బాడీ మొత్తం కూడా నా ఆధీనంలో లేకుండా పోయింది. కానీ కొన్ని క్షణాల్లోనే తేరుకుని నా తలతో కత్తి దిగిందని గమనించాను. ఇక ఆలస్యం చేయకుండా ఎలా అయినా బతకాలి అని బైక్ పై వేగంగా బయల్దేరాను. అలా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాను. ఇవన్నీ నేను చేశాను. కానీ సర్జరీ పూర్తయిన తర్వాత నాకు చాలా సేపటి వరకు కూడా ఇవి గుర్తు రాలేదు." అని క్యూన్ చెప్పాడు.

Image credit (all pics)

English summary

chinese man qin rides bike to police station with a knife lodged in his skull

chinese man qin rides bike to police station with a knife lodged in his skull
Desktop Bottom Promotion