Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎనిమిదో తరగతితోనే డాక్టర్ అయ్యాడు, పేషెంట్లకు ఆపరేషన్లు కూడా చేస్తున్నాడు, అసలు కథ ఏమిటో తెలుసా!
ఉత్తర్ ప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన నర్‌దేవ్ సింగ్ అనేవ్యక్తి ఎనిమిదో తరగతి వరకే చదివాడు. స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడితో ఆర్యన్ హస్పిటల్ నడుపుతున్నాడు. ఎనిమిదో తరగతితోనే డాక్టర్.
వైద్యుడికి సమాజంలో మంచి పేరు ఉంది. భగవంతుడితో సమానంగా మనం డాక్టర్లను చూస్తూ ఉంటాం. దాదాపు ఎంబీబీఎస్ లేదా ఎండీ డాక్టర్... శస్త్ర చికిత్సలు అయితే ఎంఎస్ డాక్టర్లు సేవలు అందిస్తుంటారు. అయితే ఇప్పుడు వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మానవ శరీరంలో ప్రతీ అవయవం ఓ ప్రత్యేక వైద్య విభాగంగా అవతరించింది.

వివిధ రకాల స్పెషలైజేషన్లు
వైద్య విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లు చేసి ఆ విభాగానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఎంబీబీఎస్ చదవలేదు. కానీ డాక్టర్ గా చలామణీ అవుతున్నాడు. ఆయన ఎంత వరకు చదివారు. ఆయన చేసే వైద్యం ఏమిటని తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఎనిమిదో తరగతి చదివి
వైద్యులను అందరూ దేవుళ్లతో పోలుస్తారు. పునర్జన్మనిచ్చేది వైద్యుడని అందరూ నమ్ముతారు. మరి ఇంతటి విలువైన, పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చాడో వ్యక్తి. ఎనిమిదో తరగతి చదివి స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడితో ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఏకంగా ఆయనే రోగులకు వైద్యం చేస్తున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

ఆర్యన్ హస్పిటల్
ఉత్తర్ ప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన నర్‌దేవ్ సింగ్ అనేవ్యక్తి ఎనిమిదో తరగతి వరకే చదివాడు. స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడితో ఆర్యన్ హస్పిటల్ పేరుతో ఆసుపత్రిని నడుపుతున్నాడు. అంతేకాకుండా భారీ వేతనం ప్రకటించి వైద్యులను కూడా నియమించుకున్నాడు. అయితే ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఒక్కొక్క వైద్యుడిని తొలగిస్తూ వచ్చి చివరికి ఆ ఆసుపత్రిలో ఒక కాంపౌండర్‌ను మాత్రమే ఉంచాడు.

ఆపరేషన్ చేయాల్సి రాగా
అయితే ఇక్కడకు వచ్చిన రోగులకు స్వయంగా ఆసుపత్రి యజమానే చికిత్సలు చేస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ వ్యక్తికి ఆపరేషన్ చేయాల్సి రాగా..కాంపౌండర్ సాయంతో అనెస్థీషియా ఇచ్చి ఏకంగా ఆపరేషన్ కూడా ఆయనే చేయడానికి పూనుకొన్నాడు. అయితే, ఆ వ్యక్తికి తీవ్రస్థాయిలో రక్తస్రావమై కోమాలోకి వెళ్లడంతో నర్‌దేవ్‌పై రోగి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రిని సీజ్ చేసి ఆయనను అరెస్ట్ చేశారు.
మెడికల్ దుకాణంలో పనిచేసి
దీనిపై యాక్టింగ్ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్(ఏసీఎంవో) అశోక్ కుమార్ హండా మాట్లాడుతూ...‘ నర్‌దేవ్ సింగ్ కేవలం ఎనిమిదో తరగతి వరకే చదివాడు. తొలుత ఓ చిన్న మెడికల్ దుకాణంలో పనిచేసిన ఇతడు స్థానికంగా కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తుల ఆసరాతో ఆసుపత్రి నిర్మించుకున్నాడు. దీనికి కనీసం ప్రభుత్వ గుర్తింపు కూడా లేదు. ఇప్పటికే ఈ ఆసుపత్రిని మూడు సార్లు సీజ్ చేశాం. మళ్లీ నర్‌దేవ్ పలుకుబడితో తిరిగి ప్రారంభించి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం దీన్ని సీజ్ చేసి యజమానిని అరెస్టు చేశాం' అని తెలిపారు.



Click it and Unblock the Notifications