ప్రపంచంలోని పలు దేశాల్లో మరణశిక్షలు ఎలా ఉంటాయో తెలిస్తే మీరు సగం చచ్చిపోతారు!

Written By:
Subscribe to Boldsky

మనదేశంలో నిందితులకు మరణశిక్షను ఉరిశిక్ష ద్వారా అమలు చేస్తారు. అయితే ప్రపంచం మొత్తం కూడా నిందితులకు మరణశిక్షను ఇలా అమలు చెయ్యరు. ఒక్కోదేశంలో ఒక్కో రకంగా మరణశిక్షను అమలు చేస్తారు.

అమెరికాలో ఇలాంటి పద్దతులు

అమెరికాలో ఇలాంటి పద్దతులు

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరణశిక్షను కోర్టులు చాలా విధానాల్లో అమలు చేస్తాయి. ప్రధానంగా ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి నిందితుల్ని చంపివేయడం ఒక పద్ధతి. అలాగే విద్యుత్‌షాక్, గ్యాస్‌ చాంబర్, ఫైరింగ్‌ స్క్వాడ్ తో పాటు ఉరిశిక్షలను అక్కడ మరణశిక్షలను అమలు చేస్తున్నారు.

ఎలక్ట్రిక్‌ చైర్‌

ఎలక్ట్రిక్‌ చైర్‌

అమెరికాలో టెన్నెస్సీలో ఎలక్ట్రిక్‌ చైర్‌ను ఉపయోగిస్తారు. ఇక మిగతా 35 రాష్ట్రాల్లో మరణశిక్షను డిఫరెంట్ స్టైల్ లో అమలు చేస్తారు. మరణ శిక్ష పడిన వారికి విష పదార్థాలతో ఉండే ఇంజెక్షన్‌ ఇచ్చి చంపేస్తారు.

ఇంజెక్షన్‌ పద్ధతి

ఇంజెక్షన్‌ పద్ధతి

1977లో ఒక్లొహామాలో మొట్టమొదటి సారిగా ఇలాంటి ఇంజెక్షన్‌ పద్ధతిన అమల్లోకి తీసుకొచ్చారు. ఇక న్యూయార్క్‌లో మరణశిక్ష పడిన వ్యక్తిని విద్యుత్‌ షాక్‌ తో చంపేస్తారు. అలాగే నెవాడాలో గ్యాస్‌ఛాంబర్‌ ద్వారా మరణశిక్షపడిన వ్యక్తిని చంపేస్తారు.

ఒక్కోచోట ఒకలాగా

ఒక్కోచోట ఒకలాగా

ప్రపంచంలో చాలా దేశాల్లో ఉరి, ఫైరింగ్‌ స్క్వాడ్‌తో పాటు కాల్చివేయడం, తుపాకీతో తల వెనక కాల్చడం, తల నరకడం, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం, రాళ్లతో కొట్టి చంపడం, గ్యాస్‌ ఛాంబర్ ద్వారా చంపడం, విద్యుత్‌షాక్ తో ద్వారా చంపడం, ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు పడేయడం వంటి పలు పద్ధతులను పాటిస్తున్నారు

తుపాకీతో కాల్చుతారు

తుపాకీతో కాల్చుతారు

అఫ్గానిస్తాన్, క్యూబా, కువైట్, బహ్రెయిన్, యూఏఈ, యూ ఎస్‌ఏ, వియత్నాం వంటి చాలా దేశాల్లో తుపాకీతో కాల్చిచంపే శిక్ష అమలు చేస్తున్నారు.

రాళ్లతో కొట్టి

రాళ్లతో కొట్టి

ఇక మౌరిటానియా, నైజీరి యా, పాకిస్తాన్, సౌదీ ఆరేబియా, ఇండోనేసియా, ఇరాన్, సూడాన్, యూఏఈ, యెమన్‌ లలో మరణశిక్ష పడ్డ వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు.

వ్యభిచారం చేస్తే

వ్యభిచారం చేస్తే

అత్యాచారం చేయడం, వ్యభిచారం చేయడం, స్వలింగసంపర్క సం బంధాలు ఉండడం వలంటి కేసుల్లో నిందితులుగా తేలిన వారిని ఆయా దేశాల్లో అలా రాళ్లతో కొట్టి చంపేస్తారు.

తల నరకడం

తల నరకడం

ఇక యెమన్‌, ఇరాన్, సౌదీఅరేబియాలలో తల నరకడం చేస్తారు. అలాగే తైవాన్, థాయ్‌లాండ్, చైనా, గ్వాటామాలా, అమెరికా, వియత్నాంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇచ్చి చంపేస్తారు.

104 ఆ దేశాల్లో మరణ శిక్షనే లేదు

104 ఆ దేశాల్లో మరణ శిక్షనే లేదు

అయితే ప్రపంచంలో 104 ఆ దేశాల్లో మరణ శిక్షనే లేదు.

ఆస్ట్రియా, బెల్జియం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఇటలీ, మెక్సికో, నేపాల్, నెదర్‌లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పనామా, భూటాన్, కెనడా, కొలంబియా, డెన్మార్క్, దక్షిణాఫ్రికా, స్పెయిన్ వంటి చాలా దేశాల్లో మరణశిక్ష అనేది లేదు.

నైట్రోజన్‌ గ్యాస్‌తో

నైట్రోజన్‌ గ్యాస్‌తో

ఇక అమెరికాలోని ఒక్లహామా రాష్ట్ర అధికారులు తాజాగా నైట్రోజన్‌ గ్యాస్‌తో విధించే మరణ శిక్షను అమలు చేసే పద్దతిని పునరుద్దరిస్తున్నట్లు చెప్పారు. దాదాపు మూడేళ్ల పాటు ఒక్లహామాలో మరణ శిక్షలు అమలుకావడం లేదు.

మరణశిక్షలు అమలు కావడం లేదు ఒక్లహామాలో ఇంజెక్షన్‌ ఇచ్చి మరణశిక్ష పడ్డ వ్యక్తిని చంపేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విధానాన్ని రద్దు చేశారు. దీంతో ఒక్లహామా రాష్ట్రంలో మరణశిక్షలు అమలు కావడం లేదు. అమెరికాలోని పలు రాష్ట్రాల ఇదే పరిస్థితి ఉంది.

మరణశిక్షలు అమలు కావడం లేదు ఒక్లహామాలో ఇంజెక్షన్‌ ఇచ్చి మరణశిక్ష పడ్డ వ్యక్తిని చంపేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విధానాన్ని రద్దు చేశారు. దీంతో ఒక్లహామా రాష్ట్రంలో మరణశిక్షలు అమలు కావడం లేదు. అమెరికాలోని పలు రాష్ట్రాల ఇదే పరిస్థితి ఉంది.

ఒక్లహామాలో ఇంజెక్షన్‌ ఇచ్చి మరణశిక్ష పడ్డ వ్యక్తిని చంపేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విధానాన్ని రద్దు చేశారు. దీంతో ఒక్లహామా రాష్ట్రంలో మరణశిక్షలు అమలు కావడం లేదు. అమెరికాలోని పలు రాష్ట్రాల ఇదే పరిస్థితి ఉంది.

ఇంజెక్షన్‌ బదులుగా

ఇంజెక్షన్‌ బదులుగా

ఇంజెక్షన్‌ బదులుగా ఇప్పుడు నైట్రోజన్‌ గ్యాస్‌ను వినియోగించి మరణశిక్షపడ్డ వ్యక్తులను చంపాలని ఒక్లహామా నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్‌ లేకుండా నైట్రోజన్‌ వాయువును పీలిస్తే వ్యక్తి చనిపోతాడు. ఇలాంటి శిక్షను అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు.

Image Credit (All Photos)

English summary

death penalties around the world

death penalties around the world
Story first published: Friday, March 16, 2018, 15:30 [IST]