మీ రాశి ప్రకారం మీ సన్నిహిత సంబంధాల సమస్యలను తెలుసుకొనవచ్చా?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మనలో చాలామందికి చాలా రకాల భయాలు, ఫోబియాలు ఉంటాయి. అది సహజం. ఇవి ఆయా రాశి చక్రాలను ఉద్దేశించి నిర్ణయించబడుతాయి. ప్రతి రాశిచక్రం ఒక్కొక్క సమస్యని ఒక్కో విధంగా తీసుకుంటాయి. కావున అందరి భయాలు ఒకేలా ఉండవు. కావున ఒక్కో రాశి చక్రం ఒక్కో స్పందనని తెలియజేస్తుంది.

ఒక్కోసారి ఈ భయాలు వేరొక రాశి చక్రంతో సాన్నిహిత్యం వలన కలుగుతాయి. అలాంటి సంబంధాలు ఎదురైనప్పుడు అనేక సమస్యలను సైతం ఎదుర్కొనవలసి వస్తుంది.

ఒక్కో రాశి చక్రానికి ఉన్న భయాల గురించిన వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా భాగస్వామ్యం చెయ్యడం జరిగినది.

ఈ సన్నిహిత సమస్యలు ఎక్కువగా మన రాశి చక్రాల సంకేతాలకు సంబంధించినవి. కావున , మీ రాశిచక్రం గుర్తు ప్రకారం మీ బలహీనత ఏమిటో తెలుసుకోండి.

మేషం : మార్చి 21- ఏప్రిల్ 19

మేషం : మార్చి 21- ఏప్రిల్ 19

వీరు చాలా స్వీయ నియంత్రణ, మరియు స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులు. వీరు ఏదైనా సంబంధంలో ఉన్నప్పుడు ఒకరిపై ఆధారపడవలసి వస్తుందేమో అన్న భయంతో ఉంటారు. తద్వారా వీరు ముఖాముఖి సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు. ఒక్కోసారి ఇది వారి కోపానికి సైతం తావిస్తుంది. అనగా భాగస్వామి పరంగా తేలికగా తీసుకోవలసిన విషయాలలో కూడా ఉద్రేకాన్ని చూపి ఒక క్రూర మృగం లా సైతం ప్రవర్తిస్తుంటారు. ఒక రకమైన అభద్రతాభావానికి లోనవుతుంటారు.

వృషభ రాశి :ఏప్రిల్ 20-మే 20

వృషభ రాశి :ఏప్రిల్ 20-మే 20

వృషభ రాశి వారు ఎల్లప్పుడూ తమ భాగస్వామి వద్ద విషయాలను దాస్తూ ఉంటారు. కొన్ని నిగూడమైన ఉద్దేశాలు కూడా వీరి మనస్సులో ఉంటాయి. దీనికి కారణం, తనను మించిన స్థాయిలో ఉందేమో అని భావించడం. దీనికారణంగా వీరు భాగస్వామితో ఎక్కువ సన్నిహితంగా ఉండలేరు. మరోపక్క భాగస్వామి తమని వదిలి వెళ్లిపోతుందేమో అన్న భయంతో ఉంటారు.

మిధునం : మే 21- జూన్ 20

మిధునం : మే 21- జూన్ 20

వీరు సంబంధాల పట్ల విసుగును కలిగిన వారి ఉంటారు. తద్వారా ఒక నిలకడలేని మనస్తత్వాన్ని చూపుతుంటారు. ఈ మనస్తత్వం కారణంగా సంబంధాలు నాశనం అవుతుంటాయని భయపడుతుంటారు కూడా. దీని కారణాన వీరు త్వరగా సంబందానికి సిద్దంగా ఉండరు, మరియు తక్కువ సౌకర్యాలనే కోరుకుంటారు.

కర్కాటకం : జూన్ 21- జూలై 22

కర్కాటకం : జూన్ 21- జూలై 22

వీరు తమ ఆలోచనలను భాగస్వామితో పంచుకొనుటకు సిద్దంగా ఉండరు. అందుచేత ప్రియమైన వారి వద్ద ఉండుటకు కూడా భయాన్ని చూపిస్తుంటారు. ముఖ్యంగా సనిహిత్యాన్ని కోరుకునే సందర్భాలలో భావోద్వేగాన్ని నియంత్రించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సింహ రాశి: జూలై 23-ఆగస్టు 23

సింహ రాశి: జూలై 23-ఆగస్టు 23

ఏది ఏమైనా వీరు ఆధిపత్య ధోరణిని ప్రదర్సిస్తూనే ఉంటారు. కాని తమ మనసుకి దగ్గరైన వారి వద్ద మాత్రమే ఈ ధోరణిని కాస్త పక్కన ఉంచుతారు. కాని మనిషి కనిపించే తీరులో కాదు, ప్రవర్తించే తీరులోనే జనాకర్షణ ఉంటుంది అనే విషయాన్ని వీరు తెలుసుకోవలసి ఉంటుంది. తమ ఆధిపత్య ధోరణిని తగ్గించే ప్రయత్నానికి వీళ్ళు భయపడుతారు.

కన్య: ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్య: ఆగస్టు 24-సెప్టెంబర్ 23

వీరు తరచుగా ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు, వేరే వ్యక్తులతో తమని తాము పోల్చుకుని భాధపడుతుంటారు. తాము అందరిచేత ప్రేమించబడాలని కోరుకుంటారు. దీనికారణంగా భాగస్వామితో సంబంధం విషయంలో మరింత ఆలోచన చేయవలసి ఉంటుంది.

తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తుల: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

వీరు జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఆదర్శంగా కనిపిస్తుంటారు. కాని వారి భావోద్వేగాలు సంబంధాలను సైతం దెబ్బతీసేవిలా ఉంటాయి . అందుచేతనే సాన్నిహిత్యానికి సైతం భయపడుతూ ఉంటారు. తమని తమ వాళ్ళు ఎక్కువగా ప్రేమించాలి అని కోరుకుంటారు. ప్రేమిస్తున్నారో లేదో అన్న అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దీనికారణంగా కోపం ప్రదర్శించడం వంటివి చేస్తుoటారు. వీరు తమ ఉద్రేకాలను నియంత్రించుకోవలసి ఉంటుంది.

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చికం: అక్టోబర్ 24-నవంబరు 22

ఎదుటివారిని ఎక్కువగా బెదిరింపులకు గురిచేసే లక్షణం కలవారై ఉంటారు. సంబంధాలను తప్పించుకుని తిరుగుతుంటారు. దీనికి కారణం మిగిలిన రాశుల వారికంటే తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉండి, మొండిగా ప్రవర్తించడమే. తద్వారా సంబంధాలను కోల్పోతామన్న భయంతో , సంబందాలంటేనే భయం కలిగి ఉంటారు.

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు: నవంబర్ 23-డిసెంబరు 22

వీరు నిరంతరాయంగా నిబద్ధతతో ఉంటూ , సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారా జీవితమంతా గడిపేస్తారు. వీరు ఒకరితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే స్వతంత్రం కోల్పోయినట్లుగా భావిస్తారు. ఇది తప్పు అని తెలుసుకోవలసిన అవసరం ఉంది.

మకరం: డిసెంబర్ 23-జనవరి 20

మకరం: డిసెంబర్ 23-జనవరి 20

వీరు భావోద్రేగ నియంత్రణ కలిగిన వారిలా , నెమ్మదస్తునిగా కనిపిస్తూ ఉంటారు. సంబంధాల యందు అయిష్టతను చూపే వారిలా ఉంటారు. కాని ప్రేమ , రక్షణ అనేది రెండూ ఒక సంబంధంలో అవసరం అన్న విషయాన్ని విస్మరిస్తారు. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న రోజు సంబంధం బలపడుతుంది.

కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభం: జనవరి 21-ఫిబ్రవరి 18

వీరు భావోద్వేగ ప్రకటన చేయడం కన్నా తార్కిక ఆలోచనలు చేస్తుంటారు. కాని వీరి తెలివితేటలూ తమ ఒంటరితనాన్ని దూరం చెయ్యలేవని తెలుసుకోవలసి ఉంటుంది. వీరు సంబంధాల వలన స్వేచ్చని కోల్పోతాము అన్న భయములో ఉంటారు. అందువలన భాగస్వామికి అనువైన సమయాన్ని కూడా కేటాయించరు. ఇది తగ్గించుకోవలసిన అవసరం ఉంది.

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

వీరు తమచుట్టూ తము హద్దులను నిర్మించుకుంటూ ఉంటారు. దీనికారణంగా సమయానుసారంగా కొన్ని ముఖ్యమైనవి కోల్పోతూ ఉంటారు. వీరికి ఒక సాన్నిహిత్య అవసరం మాత్రం తప్పకుండా కావలసి ఉంటుంది.

ఎక్కువ అభద్రతా భావాలకి లోనై జీవిస్తూ ఉంటారు.

English summary

Different Intimacy Issues Of Zodiac Signs

Different Intimacy Issues Of Zodiac Signs,These are some of the most intimate issues that each zodiac sign faces. These intimate issues are related to the zodiac sign and they are very specific to each zodiac sign, which can differ from each other.
Story first published: Wednesday, March 14, 2018, 9:00 [IST]