For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్, కిమ్ భేటీ.. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న క్షణం రానుంది.. భేటీలో ఆ విషయాలు మాత్రం చర్చించరు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోం గ్ ఉన్‌తో తాను ఈనెల 12న సింగపూర్‌లో భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక భేటీ.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌.

|

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోం గ్ ఉన్‌తో తాను ఈనెల 12న సింగపూర్‌లో భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక భేటీ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు తలెత్తిన క్రమంలో మెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రకటన స్వయంగా చేశారు.

తమ భేటీపై అనుమానాలొద్దని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాధినేతల మధ్య భేటీపై వైట్‌హౌస్ అధికారులతో ఉత్తరకొరియా రాయబారి కిమ్ యాంగ్ చోల్ చర్చల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మరోవైపు ట్రంప్‌కు ఉత్తర కొరియా రాయబారి అందజేసిన భారీ కవర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

ఈ నెల 12న ఉదయం 9 గంటలకు

ఈ నెల 12న ఉదయం 9 గంటలకు

మొత్తానికి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సింగపూర్‌ కాలమానం ప్రకారం ఈ నెల 12న ఉదయం 9 గంటలకు సమావేశం కానున్నారు. ట్రంప్‌, కిమ్‌ భేటీ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి శారా సాండర్స్‌ తెలిపారు.

తప్పకుండా భేటీ

తప్పకుండా భేటీ

ఉత్తర కొరియా అణ్వస్త్ర రహితంగా మారేందుకు చర్యలు ప్రారంభిస్తే ఆ దేశంతో తప్పకుండా భేటీ అవుతానని గతంలో ట్రంప్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌ వేదికగా జూన్‌ 12న వీరి సమావేశం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా.. ఈ భేటీని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్‌ అనూహ్యంగా ప్రకటన చేయడం అందరూ మళ్లీ చప్పబడిపోయారు. వీరి సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

భేటీకి మార్గం సుగమమైంది

భేటీకి మార్గం సుగమమైంది

అయితే ఆ తర్వాత ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల మంత్రితో భేటీ అయిన ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కిమ్‌తో సమావేశానికి సంసిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో భేటీకి మార్గం సుగమమైంది.

ట్రంప్‌, కిమ్ సమావేశం నిమిత్తం సింగపూర్‌ అధికారులు దేశంలో భద్రతను ముమ్మరం చేశారు.

చర్చకు రాని అంశాలు

చర్చకు రాని అంశాలు

అయితే.. ఆ ‘చారిత్రక శిఖరాగ్ర సమావేశం'లో చర్చకు రాబోని కీలక అంశాలు కొన్ని ఉన్నాయి.

ఉత్తర కొరియా మిగతా ప్రపంచం నుంచి వేరుగా ఏకాంతంగా ఉంటుంది. కిమ్ కుటుంబం వారే మూడు తరాలుగా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు.అన్నిటినీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సొంత పౌరులపై నిఘా పెడుతుంది. అందుకు విస్తారమైన నిఘా వ్యవస్థలను ఉపయోగించుకుంటుంది. కానీ ఇవి ఏవీ కూడా చర్చకు రాకపోవొచ్చు.

మీడియా నియంత్రణ

మీడియా నియంత్రణ

ఉత్తర కొరియా మీడియా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది.

ఉత్తర కొరియా ప్రజలకు వార్తలైనా వినోదమైనా సమాచారమైనా.. అంతా ప్రభుత్వ మీడియా నుంచే వస్తుంది. ఒకవేళ పౌరులు ఎవరైనా.. అంతర్జాతీయ మీడియా సంస్థలు అందించే సమాచారాన్ని వీక్షించినా చదివినా విన్నా వారు జైలు పాలు కావాల్సిందే. అయితే ఈ విషయంపై కిమ్, ట్రంప్ భేటీలో చర్చింకపోవొచ్చు.

ఇంటర్నెట్

ఇంటర్నెట్

ఇక ఇంటర్నెట్ అంటే.. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఉండే ఉన్నతస్థాయిలోని కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉత్తర కొరియాలోని జైళ్లు కూడా దారుణంగా ఉంటాయి. ఉత్తర కొరియాలో 80,000 నుంచి 1,20,000 మంది వరకూ ప్రజలు జైళ్లలో ఉన్నారు.

మరణశిక్ష

మరణశిక్ష

అక్కడ ఏ సాకుతోనైనా ప్రజలని జైళ్లలో పెట్టేయవచ్చునని ఉద్యమకారులు చెప్తారు. ఇక మరణశిక్షలను ఉత్తర కొరియా ఎక్కువగా విధిస్తుంటుంది. మరణశిక్షలను బహిరంగంగా అమలు చేయటానికి ఆ దేశం పెట్టింది పేరు.

కిడ్నాప్

కిడ్నాప్

1970ల్లో జపాన్ పౌరులు 13 మందిని కిడ్నాప్ చేసినట్లు కూడా ఉత్తర కొరియా అంగీకరించింది. జపాన్ భాష, ఆచారవ్యవహారాల్లో తమ గూఢచారులకు శిక్షణనివ్వటానికి వారిని ఉపయోగించుకుంది. ఇలాంటి కిడ్నాప్‌లు చాలానే ఉన్నాయి.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

ఇక సైన్యంలో లైంగిక వేధింపులు అధికంగా ఉన్నాయని ఉత్తర కొరియా మహిళలు కొందరు చెప్తారు.నిర్బంధంలోని మహిళలు హింస, అత్యాచారం, ఇతర లైంగిక దాడులను ఎదుర్కొంటున్నట్లు, సైన్యంలో లైంగిక వేధింపులు విస్తృతంగా ఉన్నట్లు తరచుగా వార్తలు వస్తుంటాయి.

స్వప్రయోజనాలే

స్వప్రయోజనాలే

ట్రంప్ - కిమ్ శిఖరాగ్ర భేటీ జరిగినప్పటికీ.. అందరూ తమ తమ స్వప్రయోజనాలనే చూసుకుంటున్నారు.. కానీ ఉత్తర కొరియా ప్రజల ప్రయోజనాల గురించి ఎవరూ పట్టించుకోరని.. ఉత్తర కొరియా ప్రజలకు జరిగే అరాచకాలను ట్రంప్ కిమ్ అస్సలు చర్చింకపోవచ్చని తాజాగా హెచ్‌ఆర్‌డబ్ల్యూ ప్రతినిధి ఆడమ్స్ అన్నారు.

భద్రత కట్టుదిట్టం

భద్రత కట్టుదిట్టం

ఇద్దరు నేతలు తమ సొంత వ్యక్తిగత భద్రతా బలగాలను వెంట తెచ్చుకుంటున్నప్పటికీ.. వేదిక జరిగే ప్రాంగణం, వారు బస చేసే హోటల్‌, నేతలు ప్రయాణించే రోడ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సింగపూర్‌ పోలీసులతో పాటు గూర్ఖాలు కూడా ఈ భద్రతా చర్యల్లో పాల్గొనున్నారు.

యంగ్ చోల్

యంగ్ చోల్

ఇక ట్రంప్- కిమ్‌ల భేటీ ఏర్పాటయ్యేలా చేసింది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ కిమ్ యంగ్ చోల్. ఈయన ఉత్తర కొరియాలోని అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. సింగపూర్‌లో జరగాల్సిన ట్రంప్-కిమ్‌ల భేటీపై అనుమానాలు నెలకొన్న క్రమంలో చోల్ మళ్లీ దాన్ని చక్కదిద్దారు.

కిమ్ యంగ్ చోల్ గురించి..

కిమ్ యంగ్ చోల్ గురించి..

దక్షిణ కొరియా దృష్టిలో జనరల్ కిమ్(72) అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చర్చలకు సంధానకర్తగా ఆయన పనిచేశారు. మిలటరీ ఇంటెలిజెన్స్ ముఖ్యఅధికారిగా ఉన్నప్పుడు దక్షిణకొరియాపై దాడులు చేశారని, టార్పెడోతో దక్షిణకొరియా యుద్ధనౌకను కూల్చి 46 మంది మరణానికి జనరల్ కిమ్ కారకుడయ్యారని ఆరోపణలున్నాయి.

వ్యక్తిగత ఆంక్షలు

వ్యక్తిగత ఆంక్షలు

2014లో సోనీ పిక్చర్స్ హ్యాకింగ్‌లోనూ ఆయన ప్రమేయం ఉందని అంటారు. వీటి ఫలితంగానే అమెరికా అతడిపై 2010 నుంచి 2015 వరకు వ్యక్తిగత ఆంక్షలు విధించింది.దాదాపు 20 ఏళ్ల కాలంలో అమెరికాను సందర్శించిన ఉత్తర కొరియా అత్యున్నతస్థాయి అధికారి చోల్. ఇటీవలి వరకు ఆయన్ను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.18 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ అమెరికాలో అడుగుపెట్టారు. మొత్తానికి ట్రంప్, కిమ్ భేటీ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఇలాంటి భేటీ ప్రపంచంలో ఎప్పుడూ జరగదేమో.

English summary

Donald Trump and Kim Jong Un set to meet 9 am on 12 June in Singapore for 'historic' summit

Donald Trump and Kim Jong Un set to meet 9 am on 12 June in Singapore for 'historic' summit
Story first published:Tuesday, June 5, 2018, 16:16 [IST]
Desktop Bottom Promotion