For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈజిప్ట్ లో పురాతన కాలం నాటి శవపేటిక తెరిచారు, ఇలా చేస్తే శాపం, డేర్ చేశారు

ఈజిప్ట్ అనే పేరు ప్రపంచంలో అందరికీ తెలుసు. అక్కడి పిరిమిడ్స్ వల్ల ఈ పేరు ప్రపంచానికి సుపరిచితం అయ్యింది. ఈజిప్ట్ పిరమిడ్లను ఎంతో సాంకేతికంగా నిర్మించారు. ఈజిప్టు రాజుల సమాధులు చాలా భిన్నంగా ఉంటాయి.

|

ఈజిప్ట్ అనే పేరు ప్రపంచంలో అందరికీ తెలుసు. అక్కడి పిరిమిడ్స్ వల్ల ఈ పేరు ప్రపంచానికి సుపరిచితం అయ్యింది. ఈజిప్ట్ పిరమిడ్లను ఎంతో సాంకేతికంగా నిర్మించారు. ఈజిప్టు రాజుల సమాధులు చాలా భిన్నంగా ఉంటాయి. అందులో గ్రేట్ పిరమిడ్ అనేది బాగా పాప్ లర్. ప్రముఖులు చనిపోయిన తర్వాత వారి మృతదేహాలను ఉంచేందుకు వీరు చాలా జాగ్రత్తలు తీసుకునేవార. ప్రత్యేకమైన సార్కోఫాగస్‌, కాఫిల్స్ లలో వాటిని భద్రపరేచేవారు.

మమ్మీలుగా మార్చేవారు

మమ్మీలుగా మార్చేవారు

అలాగే ఈజిప్టులో పెద్ద కుటుంబాలకు చనిపోయిన వారి శరీరాలను మమ్మీలుగా మార్చేవారు. అలా శరీరాలను శవపేటిలో భద్రంగా ఉంచితే వారి ఆత్మ శాంతిస్తుందని వారి నమ్మకం. మమ్మీలను తయారు చేసేటప్పుడు మృతదేహంలోని కొన్ని శరీర అవయవాలను తొలగించేవారు, అయితే కొన్ని మమ్మీలను మాత్రం అవయవాలు ఉంచే భద్రపరిచేవారు. మమ్మీల సంరక్షణకు ఈజిప్షియన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే ఈ సార్కోఫాగస్‌ లను తెరవడం అశుభంగా భావిస్తారు.

నల్లటి శవపేటికను తెరిచి పరిశీలించారు

నల్లటి శవపేటికను తెరిచి పరిశీలించారు

అయితే తాజాగా ఒక నల్లటి శవపేటికను ఈజిప్ట్ ఆస్ట్రాలజీ అధికారులు తెరిచి పరిశీలించారు. ఈజిప్టు లోని పోర్ట్ సిటీ అయిన అలెగ్జాండ్రియాలో సుమారు రెండు వేల ఏళ్ల కిందట దీన్ని భద్రపరిచారు. భూమిలో పదహారు అడుగుల లోతులో దీన్ని భద్రపరిచారు.

ఒక నల్లరాయి చుట్టూ కవచంలాగా ఏర్పాటు చేసి దీన్ని భద్రపరిచారు. ఇది సుమారు పది అడుగుల పొడువుతో ముప్పై టన్నుల బరువుతో ఉంది. దీన్ని తెరవడానికి కూడా ఆస్ట్రాలజీ అధికారులు చాలా శ్రమపడ్డారు. దీన్ని కాస్త తెరవగానే ఒక రకమైన స్మెల్ వచ్చింది. అందులో ఒక రకమైన ద్రవ పదార్థం నిండి ఉంది.

మూడు పుర్రెలను బయటకు తీశారు

మూడు పుర్రెలను బయటకు తీశారు

దానిలో నుంచి మూడు పుర్రెలను బయటకు తీశారు. వాస్తవానికి దీన్ని తెరవడానికి మొదట అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలాగే దాన్ని తెరిస్తే అన్నీ అరిష్టాలు కలుగుతాయని అక్కడి స్థానిక ప్రజలు భావించారు. కానీ ఈజిప్ట్ ఆర్కియాలజీ విభాగానికి చెందిన ముస్తఫా వాజిరీ మాత్రం పట్టుబట్టి దీన్ని తెరిచారు.

శవపేటికపై అలెగ్జాండర్‌

దీన్ని ఓపెన్ చేసినప్పుడు మొదట చాలా పుకార్లు వచ్చాయి. ఇది ఒక రోమన్‌ రాజుల ఫ్యామిలీకి చెందినది అని అందరూ అనుకున్నారు. అయితే ఆ శవపేటికపై అలెగ్జాండర్‌ పేరు ఉండడంతో అందరూ ఇది గ్రేట్ అలెగ్జాండర్ ది అనుకున్నారు. దీంతో అందరూ అలెగ్జాండర్ సమాధిని తెరుస్తున్నారని ప్రచారం చేశారు.

అలెగ్జాండర్ సమాధి కాదు

అలెగ్జాండర్ సమాధి కాదు

కానీ ఇది అందరూ అనుకునే ఆ అలెగ్జాండర్ సమాధి కాదని పరిశోధకులు నిర్ధారించారు. అలెగ్జాండర్‌ కు సంబంధించిన సార్కోఫాగస్‌ ఒక రేంజ్ లో ఉంటుందని ఇంత చిన్నగా ఉండదని వారు పేర్కొన్నారు.

Image credit (all pics)

English summary

egypts mystery sarcophagus opened who is inside the coffin

egypts mystery sarcophagus opened who is inside the coffin
Story first published:Thursday, July 26, 2018, 14:17 [IST]
Desktop Bottom Promotion