ప్రేమలో చేయకూడని 8 తప్పులు ఇవే :

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ప్రేమలో పడడమంటే ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన భావాలలో ఒకటి. ఒక మంచి మరియు ఆరోగ్యకరమైన సంబంధం అనేది ప్రతి జంట కల. మరియు ఇక్కడ, నిజమైన నిజాయితీని భాగస్వామితో నిర్వహించడానికి ఒక నిర్దిష్టమైన, నీతిపరమైన విషయాలు కూడా ఉన్నాయి.

కొన్ని పనులను నేను ఎప్పటికీ చెయ్యను అని నిర్ణయం తీసుకోవడం ద్వారా , ప్రతి జంట ఒక ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండగలదు. ఆ చేయకూడని విషయాల గురించే ఈ వ్యాసం. ఏ సంబంధమైనా ఏర్పడడానికి సత్వర మార్గం ఉండదు. ప్రతి సంబంధం కొన్ని పరిస్థితుల మూలంగా ఏర్పడుతుంది, ఆ పరిస్థితులను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనివి గా ఉంటాయి .

మీరు ఈ ఆర్టికల్ చదువుతుంటే, ప్రేమలో ఒక సంతోషకరమైన సంబంధాన్ని కొనసాగించాలంటే పాటించవలసిన కొన్ని ముఖ్య సూత్రాలను ఇక్కడ పొందు పరచడం జరిగినది.

“చందమామ నాతో రాని ఈ మార్గాన , ఎన్నటికీ నా అడుగులు పడవు

నీ ప్రేమలో పడిన ఆ క్షణానే నాకు మరు జన్మ లభించిన అనుభూతి ,

ఈ అనుభూతిని, నీ చేయిని నా తుది శ్వాస వీడే వరకు వదలను.”

1.కొన్ని త్యజింపక తప్పదు:

1.కొన్ని త్యజింపక తప్పదు:

నిజమైన ప్రేమ కానీ, స్నేహం కానీ ఒకరికొకరు బహుమతులు ఇవ్వడం తీసుకోవడం పై ఆధారపడి ఉండదు.

నిజంగా ప్రేమించిన వ్యక్తులు వారి నుండి బహుమతులను ఆశించరు. ఈ బహుమతులు ఇవ్వడం తీసుకోవడం అనేది తాత్కాలికం, కేవలం వీటిమీదనే ప్రేమ నిలబడుతుంది అని భావిస్తే, అది ప్రేమ ఎన్నటికీ కాదు మరియు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ప్రేమ తన భాగస్వామి ముఖాన చిరునవ్వుని కోరుకుంటుంది. ఆ చిరునవ్వుకై అతను పడే తాపత్రయంలో ప్రేమని ఆస్వాదించగలుగుతుంది. మొండి వైఖరిని మాని , భాగస్వామి ఇష్టాఇష్టాలకు గౌరవం ఇచ్చి , ఏకాభిప్రాయం ఉండేలా చూసుకోవాలి. అన్నీ వేళలా మొండి పట్టుదలలు పనికి రావు.

2.వ్యక్తిగత స్వేచ్చ విషయం లో?

2.వ్యక్తిగత స్వేచ్చ విషయం లో?

కొందరు ప్రేమలో ఉన్నందువలన తమ స్వేచ్ఛను కోల్పోయినట్లుగా భావిస్తారు. అది ఎన్నటికీ సమంజసం కాదు. మీ భాగస్వామి మీలోని గుణాలను మనస్ఫూర్తిగా స్వీకరించి మీతో ప్రేమలో ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. మీ స్వేచ్చకి మీరు ఎక్కువ విలువ ఇస్తున్నారు అంటే , అంతే ఎక్కువ మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు. అదేవిధంగా మీరు మీ భాగస్వామి పై కూడా ప్రేమని కలిగి ఉన్నారో లేదో ఒక సారి చూసుకోండి. అలాoటి ప్రేమని మీరు నిజంగా కలిగి ఉంటే స్వేచ్ఛ ని కోల్పోయాము అన్న ప్రశ్నే మీకు ఉండదు. మీ సొంత సమగ్రతను కోల్పోవడం అనేది మీ సంబంధానికే ప్రమాదకరం. సంబంధం అనేది నాణేనికి రెండు వైపులా ఉంటుంది, అందులో కనీసం ఒక పక్క తన ప్రేమని పదిలపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది మరవకండి.

3.పోలుస్తున్నారా?

3.పోలుస్తున్నారా?

కొంతమందికి తమని వేరే వారితో పోల్చుకునే అలవాట్లు ఉంటాయి, ఇది కాల క్రమేణా మానసిక బలహీనతకు మరియు ఆర్ధిక సమస్యలకు సైతం దారితీస్తుంది. అదే విధంగా తమ ప్రేమను వేరే ప్రేమలతో పోల్చి చూసుకోవడం వలన ఆరోగ్యకరమైన సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రేమ స్వచ్ఛమైనది, ఆ స్వచ్ఛతని అవమానించడం వలన ప్రేమ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. దయచేసి పోల్చకండి.

4.మీ ప్రాధాన్యత ఎవరు?

4.మీ ప్రాధాన్యత ఎవరు?

ప్రేమలో పడడం అంటే మానసికంగా ఆ వ్యక్తిని తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆహ్వానించడమే. అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అన్న వంటి బంధాలకు ఎంత ప్రాధాన్యతని ఇస్తామో, అంతే ప్రాధాన్యత భాగస్వామికి మీరు మనస్ఫూర్తిగా ఇస్తున్నారో లేదో మీకంటూ ఒక అంచనా ఉండాలి. ఆ ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో అభిప్రాయభేధాలు రావడం, తద్వారా ప్రేమ అదఃపాతాళానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రేమించడం అనేది ఒక భాద్యతగా ఉండాలి. భాగస్వామిపై ఒక గౌరవాన్ని సృష్టించగలగాలి. అవి లేనప్పుడు అది ప్రేమ కానేరదు ఎన్నటికీ.

5.ప్రేమిస్తున్నారా? నటిస్తున్నారా?

5.ప్రేమిస్తున్నారా? నటిస్తున్నారా?

ముందుగా ఈ ప్రశ్న రియలైజ్ అవ్వండి. కొందరు తమ భాగస్వామి ముందు ఒకలా, వెనుక మరోలా ప్రవర్తిస్తుంటారు. ఎగతాళి చెయ్యడాలు, వెనుక మాటలు మాట్లాడటం, వేరొక వ్యక్తితో భాగస్వామి గురించిన వివరాలను(మంచైనా /చెడైనా ) పంచుకోవడం వంటివి భాగస్వాముల మద్య సంబంధాలను ఎన్నటికీ నిలబెట్టలేవు. ఇలాంటి అలవాట్లు ఏనాటికైనా ప్రమాదమే. ఈ అలవాట్లు మీలో ఉంటే ముందు మిమ్మల్ని మీరు సరిచేసుకోండి.

6.పద్దతి మార్చుకోవాలని సలహా ఇస్తున్నారా?

6.పద్దతి మార్చుకోవాలని సలహా ఇస్తున్నారా?

భాగస్వాముల మద్య ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండడం చాలా ముఖ్యం. కానీ కొందరు తమ భాగస్వామి తనకు అనువుగా మారడానికి, సూచనలివ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక చెడు వ్యసనాన్ని మానాలని కోరడం తప్పు కాదు, కానీ తమకు అనుకూలంగా లేవని వారి వ్యక్తిగత అభిప్రాయాలను , పద్దతులను మార్చుకోమని సలహా ఇవ్వడం మొదటికే మోసం తెస్తుంది. తద్వారా సంబంధాలు నాశనమయ్యే అవకాశం ఉంది.

7.టిట్ ఫర్ టాట్ ఆలోచనలకు తావివ్వకండి.

7.టిట్ ఫర్ టాట్ ఆలోచనలకు తావివ్వకండి.

కొందరు తమాషాగా ఆటపట్టించే చర్యలకు పూనుకుంటే, ఒక్కోసారి భాగస్వామి తీవ్రమైన చర్యలుగా భావించి సరైన గుణపాఠం నేర్పడానికి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పద్దతి ఎన్నటికీ సరైనది కాదు. ఆటపట్టించే చర్యలు అక్కడికే పరిమితం కావాలి కానీ ప్రతీకారేచ్చగా మారకూడదు. అలాంటివి ఒక్కోసారి ద్వేషాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి.

8.మోసం

8.మోసం

ఒక బంధంలోకి రావడమంటేనే ఇద్దరు భాగస్వాముల నిర్ణయం, ఇక్కడ మోసం అనే మాటకు ఎన్నటికీ తావివ్వకూడదు. ఒకరి మద్య ఒకరికి అవగాహన ఉండాలి, ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసి ఉండాలి. మీలో మంచి చెడులను ఆహ్వానించేలా ఉండాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. కొన్ని దాపరికాలు, బయటపడిన రోజున మోసపోయామన్న భావనని కలుగజేస్తాయి. ఇది ప్రేమ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తుంది. మరో వైపు ప్రేమలో ఉన్నప్పుడు, భాగస్వామి తనకే సొంతం అన్న భావనలో ఉండడం సహజం. కానీ ఈ భావనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఆ భాగస్వామి ఎన్నటికీ తట్టుకోలేరు. తద్వారా కొందరు మానసిక దృడత్వంలేని వారు ప్రాణాలకు సైతం తెగబడుతారు. ఆ పాపం చేయకండి.

ఈ ఎనిమిది సూత్రాలను పాటించడం ద్వారా , ఆనందకరమైన సంబంధాలను కలిగి ఉండవచ్చు.

మీరు"నేను ఎప్పటికీ ఈ 8 పనులు చెయ్యను " అని నిర్ణయం తీసుకున్నారా ? లేకపోతే, ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోండి, ఒక వేళ నిర్ణయం తీసుకుంటే మీ మాటను మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

English summary

8 "I Won't Ever" In A Relationship

For a happy relationship you need to know of certain "I won't ever" lists that would help you in having a successful and happy relationship. If you are reading this article you need to remember these are the key points for having a successful relationship and the way you do it is entirely up to you.
Story first published: Monday, March 19, 2018, 13:30 [IST]