భర్తను విడిచి పెట్టి ఫేస్ బుక్ ఫ్రెండ్ తో కాపురం చేయాలనుకుంటున్న వివాహిత,కాదంటేచచ్చిపోవాలనుకున్నారు

Written By:
Subscribe to Boldsky

సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నవారందరినీ కూడా దగ్గరకు చేస్తూ ఉంది. అలా చాలా మంది ఒక్కటి అవుతూ ఉంటారు. కొందరు సోషల్ మీడియా వల్ల దారుణంగా మోసపోతూ ఉంటారు.

ఇంకొందరేమో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పరుచుకుని తర్వాత స్నేహం చేసి ఇంకో అడుగు ముందుకేసి ప్రేమించుకుని.. పెళ్లి కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రేమ పెళ్లి దాకా వెళ్లకపోతే కొందరు అమాయకులు ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి స్టోరీనే ఇది.

ఫేస్‌బుక్‌లో పరిచయం

ఫేస్‌బుక్‌లో పరిచయం

ఫేస్‌బుక్‌లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక అబ్బాయి... తెలంగాణకు చెందిన ఒక అమ్మాయి మొదట పరిచయం అయ్యారు. తర్వాత స్నేహం చేశారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ వీరి కథ అడ్డం తిరిగింది.

పెద్దలు అడ్డుకుంటారని..

పెద్దలు అడ్డుకుంటారని..

వీరి పెళ్లిని పెద్దలు అడ్డుకుంటారేమోనని భావించి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా (మే14న) కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులో జరిగింది. ఆయా వివరాలను మూడో పట్టణ ఎస్సై రామ్‌నాయక్‌, బాధితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కర్నూలు జిల్లా అబ్బాయి

కర్నూలు జిల్లా అబ్బాయి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని నందవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు మురళీకృష్ణ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా దరసపల్లె మండలం దోమమండలం గ్రామానికి చెందిన చంద్రకళ అనే యువతితో ఏడాదిన్నర కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

ఫేస్ బుక్ లో.. ప్రేమ ముచ్చట్లు

ఫేస్ బుక్ లో.. ప్రేమ ముచ్చట్లు

ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇద్దరూ అప్పుడప్పుడు కలిసేవారు. అది కాస్త ప్రేమగా మారింది. ఫేస్ బుక్ లో.. ప్రేమ ముచ్చట్లు మచ్చటించేవారు. ఇద్దరూ ఒకరంటే ఒకరు లేకుంటే బతకలేము అన్నట్లుగా మారారు.

చంద్రకళకు వివాహం

చంద్రకళకు వివాహం

చంద్రకళకు ఐదేళ్ల కిందటే భీమయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ నెల 11వ తేదీన చంద్రకళ ఇంటి నుంచి బయటకు వచ్చి మురళీకృష్ణను కలిసింది. ఆ తర్వాత వారిద్దరూ బెంగళూరుకు వెళ్లారు.

తల్లిదండ్రులను ఆరాతీశాడు

తల్లిదండ్రులను ఆరాతీశాడు

చంద్రకళ భర్త భీమయ్య తన భార్య ఆచూకీ కోసం ఫేస్‌బుక్‌, ఫోన్‌ను పరిశీలించాడు. ఫోన్‌ నెంబరు సాయంతో భీమయ్య నందవరానివెళ్లి మురళీకృష్ణ తల్లిదండ్రులు మల్లికార్జున, పార్వతిలను ఆరాతీశాడు.

పోలీస్‌స్టేషన్‌లో కేసు

పోలీస్‌స్టేషన్‌లో కేసు

తమ కుమారుడు ఇంట్లో లేడని, తామూ వెతుకుతున్నామని వారు చెప్పారు. దీంతో ఇద్దరూ కలసి వెళ్లినట్లు నిర్ధారించుకున్న భీమయ్య.. నందవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. తన భార్యను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని పోలీసులను కోరాడు.

ఎక్కడున్నా వెంటనే రావాలి

ఎక్కడున్నా వెంటనే రావాలి

విచారణ చేపట్టిన పోలీసులు మురళీకృష్ణ తల్లిదండ్రులను పిలిపించి వారితో కుమారుడికి ఫోన్‌ చేయించారు. ఎక్కడున్నా వెంటనే రావాలని కోరారు. అమ్మాయి పంచాయితీ కూడా సెటిల్‌ చేస్తామని చెప్పారు. ఊరికొస్తానని, గ్రామసర్పంచ్‌ విరుపాక్షరెడ్డితోపాటు మరికొందర్ని తీసుకురావాలని మురళీకృష్ణ కోరాడు.

ఆదోని వచ్చామని చెప్పడంతో..

ఆదోని వచ్చామని చెప్పడంతో..

మురళీకృష్ణ, చంద్రకళ బెంగుళూరు నుంచి కర్నూలు జిల్లా నందవరానికి బయల్దేరారు. తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. నందవరం మండలం గంగవరం గ్రామ సర్పంచి విరుపాక్షిరెడ్డికి మురళీకృష్ణ ఫోన్‌ చేసి తాము ఆదోని (కర్నూలు జిల్లా) కి వచ్చామని చెప్పడంతో సర్పంచితో పాటు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కలిసి ఆదోని మండలం నెట్టేకల్లు సమీపంలోని పొలాల వద్ద ఉన్న మురళీకృష్ణ, చంద్రకళలను కలిశారు. సర్పంచ్, మరికొంత మంది వెళ్లి పంచాయితీ చేయడానికి సిద్ధమయ్యారు.

భర్త వద్దకెళ్లి కాపురం చేసుకోమంటారేమోనని

భర్త వద్దకెళ్లి కాపురం చేసుకోమంటారేమోనని

అయితే తనను తిరిగి భర్త వద్దకెళ్లి కాపురం చేసుకోమంటారేమో అని భయపడింది చంద్రకళ. ఇద్దరితో మాట్లాడుతుండగానే తమ వివాహం జరగదన్న ఉద్దేశంతో చంద్రకళ మూత్రవిసర్జనకు వెళ్తానని చెప్పి సమీపంలోని కొండ చివరకు వెళ్లింది. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఇద్దరూ పురుగుల మందు తాగి

ఇద్దరూ పురుగుల మందు తాగి

ఎంతసేపటికి రాకపోవడంతో మురళీకృష్ణ కొండ వద్దకు వెళ్లి చూసే సరికి చంద్రకళ పరిస్థితిని చూసి అతనూ పురుగుమందు తాగాడు. ఇద్దర్నీ గుర్తించిన సర్పంచి, కుటుంబ సభ్యులు హుటాహుటిన వాహనంలో ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారి ఆరోగ్య పరిస్థితి ఫర్వాలేదు. కానీ వారి జీవితాల పరిస్థితే ఇంకా ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

మురళీకృష్ణతోనే ఉండాలనుకుంటుంది

మురళీకృష్ణతోనే ఉండాలనుకుంటుంది

చంద్రకళకు వివాహమైంది. ఆమె భర్త ఆమెను వీడేందుకు సిద్ధంగా లేడు.. మురళీకృష్ణ కూడా ఆమెనే కోరుకుంటున్నాడు. చంద్రకళ కూడా మురళీకృష్ణతోనే ఉండాలనుకుంటుంది. అయితే సోషల్ మీడియా వల్ల ఇలా సంసారాలు కూడా నాశనం అవుతూ ఉంటాయి. ఇప్పుడు భీమయ్య పరిస్థితి అలాగే ఉంది. తన భార్య ఇంకో వ్యక్తి కోసం చనిపోతానంటే ఏం చేయాలో అర్థంకానీ పరిస్థితి. తన భార్యకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఒక వ్యక్తికి అప్పగించి నిస్సిగ్గుగా ఊరికి రాలేని పరిస్థితి అతనిది. ఇలాంటి పరిస్థితి ఏ భర్తకు రాకూడదు.

English summary

facebook friends commit suicide attempt

facebook friends commit suicide attempt
Story first published: Tuesday, May 15, 2018, 17:00 [IST]