ఫేస్‌బుక్‌ లో అంతా ఫేక్ అకౌంట్లే.. రమ్య కూడా అలా చేస్తే ఫేక్ అకౌంట్స్ పెరగవా?

Written By:
Subscribe to Boldsky

"నాకు ఫేస్‌బుక్‌లో అఫిషియల్ అకౌంట్ ఒకటుంది. అలాగే పేజ్ కూడా ఉంది. కావాలంటే సహచరుల కోసం ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి అందులో తప్పేంలేదు." ఇలాంటి మాటలు ఒక ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు చెబితే ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్స్ ఎందుకు పెరగవు.

ఫేస్‌బుక్‌ అంటే ఇప్పుడు తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు.. అలాగే ప్రపంచంలో ఉన్న అందరికి ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్ తప్పనిసరిగా ఉంటది. అయితే ఫేస్‌బుక్‌ అకౌంట్లలో చాలా వరకు నకిలీవే ఉన్నాయట. ఈ విషయాన్ని ఫేస్ బుక్ సంస్థ స్వయంగా ప్రకటించిది.

2017 డిసెంబర్‌ చివరి నాటికి 2.13 బిలియన్ల నెలవారీ యాక్టివ్‌ వినియోగదార్లతో దూసుకు పోతోన్న ఫేస్‌బుక్‌కు నకిలీ అకౌంట్ల సమస్య కూడా అధికమేనని తేలింది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ అంచనా ప్రకారం... 2017 డిసెంబర్‌ చివరి నాటికి దాదాపు 200 మిలియన్‌ అకౌంట్లు(20 కోట్ల అకౌంట్లు) ఫేస్‌బుక్‌లో నకిలీవే ఉన్నాయట.

భారత్ లోనే ఎక్కువగా

భారత్ లోనే ఎక్కువగా

నకిలీ అకౌంట్లు భారత్‌లోనే అత్యధికంగా ఉన్నాయట. ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ వెల్లడించింది. భారత్‌ తోపాటు, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయట.

10శాతం మంది నకిలీ అకౌంట్లు

10శాతం మంది నకిలీ అకౌంట్లు

గతేడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్యలో సుమారు 10 శాతం మందికినకిలీ అకౌంట్లు వున్నాయని ఫేస్‌బుక్‌ తన వార్షిక రిపోర్టులో తెలిపింది

చాలా నకిలీ అకౌంట్లు

చాలా నకిలీ అకౌంట్లు

కొత్త కొత్త ఫీచర్లు తో ఫేస్‌బుక్‌ జనాలను ఆకర్షిస్తుంది.. యువత కూడా చదువులు పక్కనపెట్టి నిత్యం ఫేస్‌బుక్‌ లో గడుపుతున్నారు.. ఈ ఫేస్‌బుక్‌ ద్వారా ఎంత లాభము ఉందొ అంతే చేదు కూడా ఉంది.. అబ్బాయి పేరు మీద అమ్మాయి, అమ్మాయి పేరు మీద అబ్బాయి.. ఇలా ఫేక్‌ అకౌంట్లు సృష్టించి, యూజర్లను కొందరు తప్పుదోవ పట్టిస్తున్న సంగతి తెలిసిందే..

మతిపోవాల్సిందే

మతిపోవాల్సిందే

అయితే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది.. ఫేస్‌బుక్‌ లో ఫేక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే మతిపోవాల్సిందే.. ఈ మేరకు ఫేస్‌బుక్‌ సంస్థ కొన్ని లెక్కలు వివరించింది..

200 మిలియన్ల అకౌంట్లు

200 మిలియన్ల అకౌంట్లు

ఈ లెక్కలో 2017 డిసెంబర్‌ ముగింపు నాటికి దాదాపు 200 మిలియన్‌ అకౌంట్లు(20 కోట్ల అకౌంట్లు) ఫేస్‌బుక్‌లో నకిలీవని తేలింది.. అంతేకాక భారత్‌లోనే అత్యధికంగా ఉన్నాయని నెట్‌వర్కింగ్‌ సైట్‌ వెల్లడించింది..

డూప్లికేట్ అకౌంట్లు వాడుతున్నారట

డూప్లికేట్ అకౌంట్లు వాడుతున్నారట

ఈ ప్రపంచంలో బాగా అభివృధి చెందిన దేశాలు ఉన్నాయి.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి.. అయితే అభివృద్ధి చెందిన దేశాలకంటే చెందుతున్న దేశాలు ఇలాంటి డూప్లికేట్‌ అకౌంట్ల వాడుతున్నారట.

ఆ దేశాల్లో కూడా

ఆ దేశాల్లో కూడా

2016 డిసెంబర్‌ చివరితో పోలిస్తే 2017 లో 14 శాతం అధికంగా ఉన్నాయట.. భారత్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాల్లో ఈ ఫేక్ అకౌంట్స్ వాడకం అధికంగా ఉంది..

రాజకీయ పార్టీలు కూడా

రాజకీయ పార్టీలు కూడా

ఫేస్ బుక్ లలో ఫేక్ అకౌంట్లనే కొన్ని రాజకీయ పార్టీలు కూడా క్రియేట్ చేస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ నాయకురాలు రమ్య ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేలా ఆమె ప్రోత్సహిస్తున్నారట.

రమ్య అలాగే చేసిందట

రమ్య అలాగే చేసిందట

రమ్య ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, డిజిటల్ విభాగాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశంలో ఆమె పిలుపునిచ్చారట.

సూచనలు ఇలా ఇచ్చారట

సూచనలు ఇలా ఇచ్చారట

ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ సోషల్‌మీడియా టీమ్‌కు రమ్య పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అందులో భాగంగా ఫేక్ అకౌంట్ల గురించి రమ్య వివరించారు. ఒక వ్యక్తికి రెండు మూడు అకౌంట్లు ఉండొచ్చని, అంత మాత్రాన అవి ఫేక్ అకౌంట్లు కావని ఆమె అన్నారు.

ఫేక్ అకౌంట్స్‌తో ప్రచారం తప్పుకాదట

ఫేక్ అకౌంట్స్‌తో ప్రచారం తప్పుకాదట

ఫేక్ అకౌంట్స్‌తో ఇలాంటి ప్రచారం చేయడం తప్పుకాదని ఆమె వ్యాఖ్యానించారట. ఈ వీడియోను ఎవరో మీడియాకు లీక్ చేయడంతో రాజకీయ వివాదం రాజుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎడింగ్ చేశారట

ఎడింగ్ చేశారట

అయితే తనపై వచ్చిన ఆరోపణలను రమ్య తోసిపుచ్చింది. ఎడిటింగ్ చేసిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పెట్టిందని చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి...సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించింది.

వీడియోలో ఇలా ఉంది

వీడియోలో ఇలా ఉంది

‘‘నాకు ఫేస్‌బుక్‌లో అఫిషియల్ అకౌంట్ ఒకటుంది. అలాగే పేజ్ కూడా ఉంది. కావాలంటే సహచరుల కోసం ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి అందులో తప్పేంలేదు. అవి కూడా వాట్సాప్ గ్రూపులాంటివే. మీరు బూత్‌ లెవెల్‌లో అందరూ వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకుంటే ఢిల్లీ నుంచి మాండ్యా వరకూ ఒకే ఒక్క నిమిషంలో సమాచారం వచ్చేస్తుంది.'' అని కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు రమ్య బోధించినట్లు ఆ వీడియోలో ఉందని ప్రచారం జరుగుతోంది.

రమ్యకు అదే కలిసొచ్చింది

రమ్యకు అదే కలిసొచ్చింది

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండడమే రమ్యకు కాంగ్రెస్ లో బాగా కలిసొచ్చిందట. కాంగ్రెస్ పార్టీలో చేరి ఫైర్‌బ్రాండ్ పేరు తెచ్చుకున్న రమ్య ఇప్పుడు కాంగ్రెస్ డిజిటల్ కమ్యూనికేషన్స్‌కి అధినేత్రి. రాహుల్ ఆఫీస్ సహా, సోషల్ మీడియా, ఐటీ బాధ్యతలన్నీ ఆమె చూస్తున్నారు.

అలా చెబితే ఫేక్ అకౌంట్స్ పెరగవా?

అలా చెబితే ఫేక్ అకౌంట్స్ పెరగవా?

గతంలో ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పాపులర్ అయిందంటే అదంతా రమ్య వల్లే. అయితే రమ్యలాంటి వారు ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడండిన చెబితే భారతదేశంలో ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్స్ పెరగకుండా మరి ఏమవుతాయి.

English summary

facebook may have over 200 million fake or duplicate accounts

facebook may have over 200 million fake or duplicate accounts