For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాలిన్ నగ్న చిత్రాలు గీసేవాడు.. ముస్సోలిని ముక్కల పక్కులు తినేవాడు

By Bharath
|

వాళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలు. అగ్రదేశాలకు సైతం ముచ్చెమటలు పట్టించారు. అందరినీ ఒక ఆట ఆడుకున్నారు. వారే ప్రపంచ నియంతలు.. డిక్టేటర్స్ హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్. కానీ వీరికున్న దరిద్రపు అలవాట్లు గురించి తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. వీరికి ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉండేది. వీరితో పాటు ఉగాండ జనాలను పీడించిన ఇడీ అమీన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.

ముస్సోలిని విచిత్ర అలవాటు

ముస్సోలిని విచిత్ర అలవాటు

ఇటలీ నియంతగా ముస్సోలిని పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఈయన ఇటలీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత హిట్లర్‌తో చేతులు కలిపాడు రెండో ప్రపంచయుద్ధం తలెత్తడానికి ఇతను కూడా ప్రధాన కారకుడు. ఇటలీ వైభవాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు ఈయన. రాజకీయం గా కర్కశం గా ఉన్నా ప్రజలకు కొన్ని రకాల పనులతో ఎంతో మేలు చేశాడు ఈయన.

నియంతగా మారాడు

నియంతగా మారాడు

1922 నవంబర్ పదహారున ప్రధానిగా బాధ్యతలు చేబట్టాడు .1926 అధికారాలనాన్ని హస్తగతం చేసుకొని అధికార కేంద్రంగా నియంత గా మారాడు . అప్పట్లో ప్రజలందరికి ఐడెంటిటి కార్డ్ లు ఇచ్చిన ఘనత ముస్సోలినీదే. ప్రజలను కష్టకాలంలో ఆదుకున్నాడు. ముస్సోలిని. దేశ వైభవాన్ని పెంచాడు. దురదృష్టవశాత్తు ఇతడి మనుషులే ఇతన్ని కాల్చి చంపారు.

ముక్కులోని పక్కులు తినేవాడంట

ముక్కులోని పక్కులు తినేవాడంట

ముస్సోలినికి ఒక విచిత్రమైన అల వాటు ఉండేది. ఆయన తన ముక్కులోని పక్కులను, ఉండలను చేతి వేలితో కెలికి బయటకు తీసుకుని వాటిని తినేవాడట. ఆ వ్యర్థాన్ని ఎలా తింటాడని ముస్సోలిని దగ్గర ఉండే చాలామంది అనుకునేవారట. కానీ వారి ఎదురుగానే ఈయన జుగుప్సకర పని చేసేవాటడ. దీన్ని ఆయన సన్నిహితులు అసహ్యించుకునేవారట. కానీ ముస్సోలిని మాత్రం ఈ అలవాటును మానలేదట.

సద్దాంలో మంచి రచయిత కూడా ఉన్నాడు

సద్దాంలో మంచి రచయిత కూడా ఉన్నాడు

అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ ఆయిల్ కంపెనీల సామ్రాజ్యవాదులను గడగడలాడించిన ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్. 1976 జూలై 16 నుంచి 2003 ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇరాక్‌ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్ హుస్సేన్‌ను 2006 డిసెంబరు 20వ తేదీన ఉరి తీశారు.

ఉరిశిక్ష

ఉరిశిక్ష

సద్దాం హుస్సేన్ అధికారంలో ఉన్నంత కాలం ఇరాక్ రాజుగానే కాకుండా ప్రపంచ దేశాలపై సైతం తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయారు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత ఉరిశిక్షకు గురయ్యారు.

సద్దాం హుస్సేన్ అధికారంలో ఉన్నంత కాలం ఇరాక్ రాజుగానే కాకుండా ప్రపంచ దేశాలపై సైతం తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయారు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత ఉరిశిక్షకు గురయ్యారు.

సద్దాం హుస్సేన్ లోనూ రొమాంటిక్ యాంగిల్

సద్దాం హుస్సేన్ లోనూ రొమాంటిక్ యాంగిల్

సద్దాం హుస్సేన్‌ లో ఎక్కువగా సైద్ధాంతిక భావాలుండేవి. అంతటి క్రూరుడిలో కూడా ఒక రొమాంటిక్‌ యాంగిల్‌ ఉండేది. ఆయన ఎక్కువగా నవలలు రాసేవారు. అవి కూడా రొమాంటిక్‌ నవలలు. ఇరాక్‌ చరిత్ర ఆధారంగా జబీబా అండ్‌ ది కింగ్‌ అనే నవలను ఈయన రాశారు. ఒక క్రూరమైన భర్త అందమైన భార్యపై చేసిన అత్యాచారానికి అద్దంపట్టిన నవలిది. సద్దాం హుసేన్ ఆయన రాసే రచనలన్నీ చాలా రొమాంటిక్ గా ఉండేవి. మొత్తానికి ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా దాగుంది.

ఆ విషయంలో హిట్లర్‌ చాలా భయపడ్డాడు

ఆ విషయంలో హిట్లర్‌ చాలా భయపడ్డాడు

జర్మనీ నియంత అనే విషయం అందరికీ తెలిసిందే. ఈయనలో ఎవరికీ తెలియనని కొన్ని కళలున్నాయి. క్రియేటివిటీకి ఈయన చాలా ప్రాముఖ్యం ఇచ్చేవారు. అడాల్ఫ్ హిట్లర్ 20 ఏప్రిల్ 1889 నుంచి 30 ఏప్రిల్ 1945 వరకు ఈ భూమిపై ఉన్నాడు. ఇతడు నేషనల్ సోషలిసట్ జర్మన్ వర్కరస్ పార్టీ వ్యవస్థాపకుడు.దీనినే నాజీ పార్టీ అంటారు.

హిట్లర్ పుట్టింది అక్కడ

హిట్లర్ పుట్టింది అక్కడ

బ్రౌనౌ అం ఇన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో హిట్లర్ పుట్టాడు. హిట్లర్ తండ్రి అలోఇస్ హిట్లర్ (అసలు పేరు శ్చిక్కల్ గ్రుబర్) వాణిజ్య శాఖలో గుమాస్తా. హిట్లర్ తల్లి క్లారా పోలజ్. అలోఇస్ కు ఆమె రెండో మరదలు. అలాగే ఆయనకు మూడో భార్య. వీరికి కలిగిన ఆరుగురు సంతనంలో హిట్లర్, అతని చెల్లెలు పౌలా మాత్రమే బతికారు. అలోఇస్ జూనియర్, ఏంజెలా, ఈ ఇద్దరు అలోఇస్ కు రెండవ భార్య వలన కలిగిన సంతానం. అలోఇస్ మొదటి భార్యకు పిల్లలు లేరు.

హిట్లర్ ప్రేమ

హిట్లర్ ప్రేమ

హిట్లర్ న్ వ్యతిరేకించేవారితో పాటు సమర్థించేవారు కూడా చాలామందే ఉన్నారు. లక్షలాదిమందిని గ్యాస్‌ ఛాంబర్స్‌ లో తోసి హతమార్చిన ఈ క్రూరుడికు కూడా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతడి మొదటి ప్రేమికురాలు ఓ యూదు అమ్మాయి. ప్రపంచాన్ని మొత్తం తన చెప్పు చేతుల్లో పెట్టుకున్న హిట్లర్ తను ప్రేమించిన అమ్మాయికి మాత్రం ఐ లవ్‌ యూ చెప్పడానికి చాలా భయపడ్డాడట.

హిట్లర్ కు అంత ధైర్యం లేదు

హిట్లర్ కు అంత ధైర్యం లేదు

తన ప్రేమను చెప్పడానికి అతనికి అంత ధైర్యం ఉండేది కాదట. ఆ అమ్మాయిపై మోజుపడ్డాడు.. పెళ్లి చేసుకోవాలనుకున్నాడట కానీ కొన్ని కారణాల వల్ల అతను పెళ్లి చేసుకోలేకపోయాడంట. ఎంతటి వీరుడైనా ఏదో ఒక విషయంలో వీక్ గా ఉంటాడు మరి.

హిట్లర్ లో ఆ కళ కూడా ఉంది

హిట్లర్ లో ఆ కళ కూడా ఉంది

హిట్లర్ చిన్నప్పుడు అందరితో బాగానే ఉండేవాడట. విద్యార్థిగా ఉన్నప్పుడు ఈయనలో చాలా క్వాలిటీలుండేవి. ఈయన చిన్నప్పుడు మంచిమంచి బొమ్మలు గీసేవాడు. వాల్ట్‌ డిస్నీ అంటే ఎంతో ఇష్టపడేవాడు హిట్లర్‌. ఖాళీ సమయం దొరికిందంటే చాలు డిస్నీ బొమ్మలు గీస్తూ కాలం గడిపేవాడట.

స్టాలిన్ కూడా బొమ్మలు వేయడం అంటే ఇష్టం

స్టాలిన్ కూడా బొమ్మలు వేయడం అంటే ఇష్టం

రష్యా నియంత స్టాలిన్ కు కూడా బొమ్మలు వేయడం అంటే భలే ఇష్టముండేది. స్టాలిన్ అప్పట్లో డిక్టేటర్ గా ఉండేవాడు. ఇతని ఆదేశాలతో లక్షలాదిమంది అమాయక జనాలు చనిపోయారు. అయితే రష్యాను మాత్రం గొప్ప సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దాడు. స్టాలిన్‌ ప్రవర్తనను అసహ్యించుకునేవారితో పాటు ఇష్టపడేవారు కూడా చాలా మందే ఉన్నారు.

స్టాలిన్‌ కు వింత అలవాటు

స్టాలిన్‌ కు వింత అలవాటు

స్టాలిన్‌కు ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. స్టాలిన్ ఎప్పుడూ నగ్నంగా ఉండే పురుషుడి చిత్రాన్ని గీసేవాడు. మంచి నగ్న రూపంలోని బొమ్మలు గీయడమంటే స్టాలిన్ కు బాగా ఇష్టం ఉండేది. ఒక్కొక్కరిదీ ఒక్కో అలవాటు మరి.

మనిషి మాంసం తినే ఇడీ అమీన్

మనిషి మాంసం తినే ఇడీ అమీన్

ఇడీ అమీన్.. ఉగాండా నియంతగా పేరుగాంచాడు. ఇడీ అమీన్ ఉంగాండా ప్రజలకు తొమ్మిదేళ్లపాటు నరకం చూపించాడు. చాలా మంది ప్రజలు ఈయన పాలనలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇడీ అమీన్ అప్పట్లో నేను మనిషి మాంసం తిన్నాను.. అంత రుచికరంగా లేదు అని కూడా అన్నాడు.

ఇడీ అమీన్ కు ఆరుగురు భార్యలు

ఇడీ అమీన్ కు ఆరుగురు భార్యలు

అమీన్ పొడగరి 6 అడుగుల పైనే ఎత్తు ఉండేవాడు. బాక్సింగ్, స్విమ్మింగ్ ఛాంపియన్ కూడా. సైన్యంలో త్వరత్వరగా ఎదగడానికి సైనిక విచారణల్లో అమానుషంగా ప్రవర్తించేవాడు. ఇతనికి ఆరుగురు భార్యలు. ఈయన 43 మంది పిల్లలు. క్రూరత్వంలోనే కాదు రొమాంటిక్ లోనే ఈయన ముందే ఉన్నాడు.

Image Source : http://www.weirdworm.com/

English summary

fun facts about hitler mussolini stalin idi amin

fun facts about hitler mussolini stalin idi amin
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more