For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ సపోర్ట్ ఆగిపోయే ముందు, చివరి హగ్ : కళ్ళల్లో నీళ్ళు తిరగక మానదు

|

ప్రేమించిన వ్యక్తి దూరమవడం అంటే ఆ బాధ వర్ణించశక్యం కానిది. ప్రపంచంలో వందలమంది, స్నేహితులు, సన్నిహితులు, ప్రియమైన వారు, శ్రేయోభిలాషులు, బంధువులు ఉండవచ్చు. కానీ, మనకోసం అంటూ బ్రతికే వ్యక్తి మాత్రం ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు పడే భాద తీవ్రత అనంతం. కొందరైతే భాదను తట్టుకోలేక గుండెపోటుకు కూడా గురై మరణిస్తుంటారు.

Girl Giving Boyfriend Last Hug Before His Life Support Is Turned Off Will Break Your Heart

తన “బాయ్ ఫ్రెండ్” ని హగ్ చేసుకున్నట్లుగా ఉన్న ఈ ఫోటో వెనుక విషాదాంతం దాగి ఉంది. తన “బాయ్ ఫ్రెండ్” లైఫ్ సపోర్ట్ ఆపేసే చివరి క్షణాల్లో హగ్ చేసుకున్న దృశ్యమిది.

మనసున్న ప్రతి మనిషిని కలిచివేసే ఉదంతమిది.

ఈ ఫోటోలో ఉన్న కపుల్ పేర్లు, స్టెఫానీ-రే (15), మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ బ్లేక్ వార్డ్(16). వీరిరువురూ వారి స్నేహితులతో ఫామిలీ ట్రిప్ వెళ్ళిన క్రమంలో, ప్రమాదానికి గురైన వీరు తమ ఆనందకర జీవితానికి విషాదాంతం ఉంటుందని గమనించలేకపోయారు.

మిగిలిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి తెలియరాలేదు. కానీ బ్లేక్ మాత్రం మరణంతో పోటీ పడలేక ఓడిపోయాడు. క్రమంగా తన కుటుంబానికి, తన “గాళ్ ఫ్రెండ్” కి తీరని లోటుని మిగిల్చి వెళ్ళిపోయాడు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో, అతని లైఫ్ సపోర్ట్ తీసి వేసే కొన్ని క్షణాల ముందు తీసిన ఫోటో.

ఈ ఫోటోను స్టెఫానీ తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకుంది, అంతేకాకుండా గుండెనిండా ఉన్న తన భావాలను అతనికి అంకితం చేస్తూ ఫేస్బుక్ పోస్టు పెట్టింది.

ఆ పోస్ట్ ఏమిటో చూడండి:

ఇప్పటిదాకా అతనితోనే ఉన్నాను, నేను ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా అతన్ని వదిలి ఉండలేదు. మీ అందరికీ తెలుసు, బ్లేక్ ఎంత జాగ్రత్తపరుడో, మరియు తన అనుకున్న వారికోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటాడని. బ్లేక్ మెదడు దారుణంగా దెబ్బతింది మరియు పనితీరుని పూర్తిగా కోల్పోయాడు తిరిగి కోలుకోలేని విధంగా. తప్పక, మనసొప్పక తీసుకున్న కఠిన నిర్ణయం, లైఫ్ సపోర్ట్ ఆపివేయడం. నా జీవితంలోనే ప్రత్యేకమైన వ్యక్తి, మరియు మేమందరం అతనితో ప్రత్యేకమైన జ్ఞాపకాలను కలిగి ఉన్నాము. జీవితంలో అనేక ఒడిదుడుకులలో మేము కలిసే ఉన్నాము. అవెప్పుడూ మా మదిలోనే ఉంటాయి.

గుండె గాయం అంటే ఇలా ఉంటుందని తెలీదు :

"కానీ ఈ క్షణాన బ్లేక్ ఎటువంటి నొప్పిని కలిగి లేడు, కానీ మా అందరికీ గుండె గాయాన్ని చేసి వెళ్తున్నాడు. మరియు తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల మద్యనే ప్రాణాలు వదిలి దూరంగా వెళ్ళిపోయాడు,. మేము అతన్ని మిస్ అవుతున్నాం, కానీ అతను ఎల్లప్పుడూ నా గుండెలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాడు. నేను నా జీవితంలో ఎప్పటికీ నిన్ను మరిచిపోలేను బ్లేక్, నువ్వు గర్వపడేలా నా జీవితాన్ని గడుపుతాను.

జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదుర్కొనే దారుణమైన అంశం, ప్రియమైన వారిని కోల్పోవడం. ఆ క్షణాన, ఎవరు కూడా ఆ భాదను తీర్చలేరు. పైన చెప్పిన సంఘటన, మీకు కొన్ని జ్ఞాపకాలను మదిలోకి తెస్తున్నాయా? నిజం ఇటువంటి సంఘటనలు మన భావోద్వేగాలను ఖచ్చితంగా వెలికితీస్తాయి. మీరు కూడా ఇటువంటి కథనాన్ని మీ జీవితంలో కలిగి ఉంటే, మాతో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Girl Giving Boyfriend Last Hug Before His Life Support Is Turned Off Will Break Your Heart

A sad picture of a girl hugging her boyfriend just before his life support was pulled off has been going viral for all emotional reasons. The boy in the picture is Blake Ward who was only 16 years old. He died after he got swept into the sea along with two other teenagers during a family trip. His girlfriend is seen hugging him for the last time.
Story first published: Monday, August 13, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more