అబ్బాయిలను ఎత్తికెళ్లి మరి పెళ్లి చేసుకుంటున్నారంటా!

Written By:
Subscribe to Boldsky

కొన్ని ప్రాంతాల్లో పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా మారింది. దీంతో పెళ్లిళ్లు కష్టమయ్యాయి. అయితే ఇంకొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు దొరకుతున్నా.. అబ్బాయిలకు కట్నం ఇవ్వడం కష్టం అయ్యింది. దీంతో ఏకంగా అబ్బాయిల్ని ఎత్తుకెళ్లి.. బలవంతంగా అమ్మాయిలతో వివాహం జరిపిస్తుండడం ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది.

అబ్బాయి దొరికితే చాలు

అబ్బాయి దొరికితే చాలు

ఇలాంటి బలవంతపు పెళ్లిళ్లు బిహార్‌ రాష్ట్రంలో పెరిగిపోయాయి. ఇంట్లో అమ్మాయి పెళ్లికి వచ్చిందంటే ఏం చెయ్యాలో అర్థంకానీ పరిస్థితుల్లో బిహార్ లో చాలా మంది తల్లిదండ్రులున్నారు. దీంతో ఏ అబ్బాయి దొరికితే అతన్ని అపహరించి, తలకు గన్ను గురిపెట్టి బలవంతంగా ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టించేస్తున్నారు.

3,400 పెళ్లిళ్లు

3,400 పెళ్లిళ్లు

బిహార్ గతేడాది ఇలా 3,400 పెళ్లిళ్లు జరిగాయంట. పెళ్లికొడుకుకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా బలవంతంగా బిహార్ లో పెళ్లిళ్లు చేస్తున్నారంటా. ఈ పద్ధతిని బిహార్‌లో పకడ్వా వివాహ్‌ అంటారు.

3,400 పెళ్లిళ్లు

3,400 పెళ్లిళ్లు

బిహార్ గతేడాది ఇలా 3,400 పెళ్లిళ్లు జరిగాయంట. పెళ్లికొడుకుకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా బలవంతంగా బిహార్ లో పెళ్లిళ్లు చేస్తున్నారంటా. ఈ పద్ధతిని బిహార్‌లో పకడ్వా వివాహ్‌ అంటారు.

ఎక్కడంటే అక్కడ కిడ్నాప్ లు

ఎక్కడంటే అక్కడ కిడ్నాప్ లు

బిహార్‌లో అబ్బాయిలు ఎక్కడ దొరికితే అక్కడ కిడ్నాప్ చేస్తున్నారు. ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ చదువుతున్న అబ్బాయిలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. గతేడాది ఎక్కువగా పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న అబ్బాయిలే కిడ్నాప్ నకు గురయ్యారు.

పోలీసులను కూడా కిడ్నాప్‌ చేశారు

పోలీసులను కూడా కిడ్నాప్‌ చేశారు

అబ్బాయి ఏ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాడనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. బిహార్‌లో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే అబ్బాయిలను కూడా చాలామందిని గతంలో కిడ్నాప్ చేశారు.

అందరూ అండగా

అందరూ అండగా

ఇక కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చిన అబ్బాయితో పెళ్లి జరిగిపించేందుకు గ్రామస్థులంతా కూడా అండగా నిలుస్తారు. అబ్బాయి తరఫువారు ఎంత ధనవంతులైనా, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఊర్లోని వారంతా కలిసి అమ్మాయి పెళ్లి జరిపిస్తుంది.

ఎందుకు ఇలా చేస్తున్నారు

ఎందుకు ఇలా చేస్తున్నారు

బిహార్ లో అబ్బాయిల కొరత ఏమి లేదు. అబ్బాయిలు బాగానే ఉన్నారు. అయితే కట్నాలు ఇవ్వలేక చాలా మంది వధువుల తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు. చాలా మంది అబ్బాయిల తల్లిద్రండులు ఎక్కువ కట్నాన్ని ఆశిస్తూ ఉంటారు.

కట్నాలు ఇవ్వలేక

కట్నాలు ఇవ్వలేక

ఇక లక్షలకు లక్షలు కట్నాలు ఇవ్వలేని ఆడపిల్ల తల్లిదండ్రులు స్థానిక గ్యాంగులతో వరుడిని కిడ్నాప్‌ చేయిస్తున్నారు. ఇలా తప్పనిపరిస్థితుల్లో తాము బలవంతపు పెళ్లిళ్లు చేస్తున్నామని అమ్మాయిల తల్లిదండ్రులు, సోదరలు అంటున్నారు.

కాపురం ఎలా?

కాపురం ఎలా?

బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేశారని తర్వాత అమ్మాయితో అబ్బాయి సక్రమంగా కాపురం చెయ్యకుండా ఉండే కాకుండా మళ్లీ బెదిరింపులు మొదలవుతాయి. అబ్బాయి అమ్మాయిని ఏమన్నా అంటే అమ్మాయి తరఫువారు అస్సలు ఊరుకోరు.

మళ్లీ పెళ్లిళ్ల సీజన్

మళ్లీ పెళ్లిళ్ల సీజన్

ఈ ఏడాది ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. మళ్లీ అబ్బాయిల వేటకు బిహార్ లో అమ్మాయి తరఫు వారు సిద్ధమవుతున్నారంట. అయితే ఈ ఏడాది పకడ్వా వివాహ్‌ లు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. చూద్దాం ఈ ఏడాదైనా కిడ్నాప్ లు తగ్గుతాయో లేదో.

English summary

have you heard of pakadua vivah?

It may be a cultural shock for many, but more than 3,400 youths were kidnapped for forced marriage, locally known as "Pakadua Vivah" in Bihar last year, official data revealed."Pakadua Vivah is rampant in Bihar. About 3,405 youths have been kidnapped for forced marriage in the state. In most of the cases, Pakadua Vivah was solemnised at gun point or threats to their life and their families,"
Story first published: Saturday, February 17, 2018, 17:30 [IST]