నువ్వు సల్మాన్ ఖాన్ అయితే ఏమిటి? మా జోలికి వస్తే ఇదే గతే ! మాది బిష్ణోయ్ సమాజం.. మాకు ఆ తిక్క ఎక్కువ

Written By:
Subscribe to Boldsky

మీరు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అయితే ఏమిటి? సల్లూ భాయ్ అయితే ఏంటి? మీరు ఎవరైతే మాకేంటి? మీరు తప్పు చేశారు.. మీరు ఎన్నో సార్లు తప్పు చేసి కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు బలహీనులు కాబట్టి విజయం సాధించి మురిసిపోయావు. కానీ మేము అలా కాదు.

మూగజీవాల జోలికి వస్తే ప్రాణాలకు తెగిస్తాం

మూగజీవాల జోలికి వస్తే ప్రాణాలకు తెగిస్తాం

మా మనోభావాలను దెబ్బతీస్తే... మా ప్రాణాలకు ప్రతిరూపాలైన మూగజీవాల జోలికి వస్తే ప్రాణాలకు తెగించైనా పోరాడతాం... ప్రాణాలైనా ఇస్తాం.. మేము బిష్ణోయ్‌ సమాజానికి చెందిన వాళ్లం. సల్మాన్ ఖాన్... మీరు అనుకోని ఉండి ఉండొచ్చు నా మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. అన్నింటినీ చాకచక్యంతో నేను ఎదుర్కొన్నానని.

బిష్ణోయ్‌ సమాజం ఊరుకోదు

బిష్ణోయ్‌ సమాజం ఊరుకోదు

మా విషయంలో తప్పు చేసి కూడా తప్పించుకోవాలని చూస్తే మా బిష్ణోయ్‌ సమాజం ఊరుకోదు. మేము ఎవరైనా మా ప్రాంతంలో చెట్టును నరికితే ప్రాణాలడ్డేస్తాం. కృష్ణ జింకను వేటాడి వెంటాడి ప్రాణం తీస్తే చూస్తూ ఊరుకోం. వాళ్లు ఎంతటి వారైనా చట్టం ప్రకారం శిక్ష పడే వరకు ప్రాణాలకు తెగించి పోరాడతాం.

దైవంతో సమానం

దైవంతో సమానం

మాది రాజస్థాన్‌. మేము బిష్ణోయ్‌ సమాజం తెగకు చెందిన వాళ్లం. మాకు ప్రకృతి అంటే ప్రాణం. చెట్లు, కృష్ణజింకలు మాకు దైవంతో సమానం. బికనీర్‌కు చెందిన గురు జంభేశ్వర్‌ 15వ శతాబ్దంలో

మా బిష్ణోయ్‌ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ప్రకృతిని పరిరక్షించుకోవడానికి, మూగ జీవాలను కాపాడుకోవడానికి మాకు చాలా సిద్ధాంతాలున్నాయి.

మేము సహించం

మేము సహించం

ఎవరైనా మా ప్రాంతంలో జంతువులను చంపినా... చెట్లను నరికానా మేము సహించం. మా తోటి ప్రాణం పోయినట్లు విలపిస్తాం. మా జీవాల ఆత్మకు శాంతికలిగేలా పోరాడతాం. వన్యప్రాణులను రక్షింకోవడమే మా లక్ష్యం.

చాలా ఉద్యమాలే చేపట్టాం

చాలా ఉద్యమాలే చేపట్టాం

జనాలందరికీ మేము సల్మాన్ ఖాన్ విషయంలో పట్టుబట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పడు కాదు... మేము గతంలో కూడా చాలా ఉద్యమాలే చేపట్టాం. 1730లో జోధ్‌పూర్‌ మహారాజు తన ప్యాలస్‌ నిర్మాణానికి ఖేజ్రీ చెట్లను కొట్టేయాలన్నారు. ఖేజ్రీ చెట్లు అంటే మాకు ప్రాణం.

మేము రాజునే సవాల్‌ చేశాం

మేము రాజునే సవాల్‌ చేశాం

మా బిడ్డల ప్రాణాలు పోయినా సహిస్తామేమో కానీ ఖేజ్రీ చెట్లను నరికితే మాత్రం సంహించమని చెప్పాము. అప్పట్లో మేము రాజునే సవాల్‌ చేశాం. మా బిష్ణోయ్ సమాజానికి చెందిన అమృతా దేవి అనే మహిళ, ఆమె ఇద్దరు కూతుర్లు సైనికులను అడ్డుకున్నారు. ఖేజ్రీ చెట్లు మా ప్రాణం.. వాటిని నరకాలంటే మొదట మా ప్రాణం తీయండని చెట్లను కౌగిలించుకున్నారు.

మేమిస్తాం.. ప్రాణాలిస్తాం

మేమిస్తాం.. ప్రాణాలిస్తాం

చెట్ల కోసం ప్రాణాలిచ్చే వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు.. కానీ మేమిస్తాం.. ప్రాణాలిస్తాం. ఇప్పటికీ ఎప్పటికీ. చరిత్రలో మా జాతి ఉన్నంత వరకు మా బిష్ణోయ్ సమాజం బతికున్నంత వరకూ మేము మూగ జీవాల కోసం ప్రాణాలిస్తాం. ప్రకృతిని పరిరక్షించుకోవడానికి ప్రాణాలిస్తాం.

అవును మాకు తిక్కే..

అవును మాకు తిక్కే..

వీళ్లకేమైనా తిక్కనా అని మీరు అనుకోవొచ్చు. అవును మాకు తిక్కే.. ప్రకృతి అంటే పిచ్చే. తిప్పి కొడితే ఆరు అడుగులుండని మనిషికే ఇంత పొగరుంటే.. నిన్ను తరతరాలుగా భరిస్తూ... నీలాంటి కోట్లాది మందికి ఆవాసం కల్పిస్తున్న మేము పూజించే ప్రకృతికి ఎంతో శక్తి ఉంటుందో మాకు మాత్రమే తెలుసు. అందుకే మాకు ప్రకృతి అన్నా.. మూగజీవాలు అన్నా ప్రాణం.

పసి పిల్లలకన్నా ఎక్కువగా భావిస్తాం

పసి పిల్లలకన్నా ఎక్కువగా భావిస్తాం

మేము ప్రాణంగా భావించే దాని జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టం. కృష్ణ జింకలను మేము మా పసి పిల్లలకన్నా ఎక్కువగా భావిస్తాం. మా పిల్లల మాదిరిగానే వాటిని ఊయలలో వేసి జోల పాడుతాం. అలాంటి మా దైవాలను వేటాడి వెంటాడి చంపితే మేము ఊరుకోవడానికి దద్దమ్మలమా.

ప్రాణాలు వదిలారు

ప్రాణాలు వదిలారు

అప్పట్లో వందలాది మా బిష్ణోయ్‌ పురుషులు, మహిళలు, పిల్లలు ఖేజ్రీ చెట్లను రక్షించడానికి ప్రాణాలు వదిలారు. ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన చిప్కో ఉద్యమానికి కూడా మా అమృతాదేవి స్ఫూర్తి. మా బిష్ణోయ్‌ జాతి వారంతా శాఖాహారమే తింటారు. మేము వంట చేసుకోవడానికి కూడా చెట్లను నరకం.

సొంత పిల్లల్లాగా సాకుకుంటారు

సొంత పిల్లల్లాగా సాకుకుంటారు

కింద పడ్డ పుల్లలతోనే వంట చేసుకుంటాం. కృష్ణ జింకలను మా ఆడోళ్లు సొంత పిల్లల్లాగా సాకుకుంటారు. మా ఆడవారు వారి కడపున పుట్టిన పిల్లలతో సమానంగా కృష్ణ జింకలకు చనుబాలు ఇస్తారు. ఇది మా గొప్పతనం మేము చెప్పుకోం.

డబ్బున్న వాళ్లం కాదు

డబ్బున్న వాళ్లం కాదు

మేమందరం సల్మాన్ ఖాన్ లాగా బాగా డబ్బున్న వాళ్లం కాదు. మేము కాయకష్టం చేసుకుని బతికేటోళ్లం. మరి బాలీవుడ్‌ సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ తో పోరాడే ధైర్యం మీకెలా వచ్చింది అని మీరు అనుకోవొచ్చు. అన్ని ఒత్తిళ్లను తట్టుకుని 20 ఏళ్లుగా న్యాయస్థానంలో ఎలా పోరాడుతన్నారనుకోవొచ్చు.

ప్రాణాలు పోయినా సరే..

ప్రాణాలు పోయినా సరే..

మేము మా గురువు కోసం దేనికైనా సిద్ధం. మా గురువుకి మా బిష్ణోయ్ సమాజం మాటిచ్చింది. ప్రాణాలు పోయినా ప్రకృతిని, మూగజీవాలను కాపాడుకుంటామని చెప్పాం. 500 ఏళ్ల క్రితం మా గురువు జంభేశ్వర్‌కి మా పూర్వీకులు మాటిచ్చారు.

మా మనిషి చూశాడు

మా మనిషి చూశాడు

ఆ రోజు సల్మాన్‌ ఖాన్‌ కృష్ణజింకను వేటాడటాన్ని మా బిష్ణోయ్ సమాజం మనిషి చూశాడు. కంకానీ గ్రామం వద్ద భగోడా కి ధనిలో సల్మాన్‌.. కృష్ణజింకను వేటాడడం మా పూనమ్‌చంద్‌ బిష్ణోయ్‌ చూశాడు. పూనమ్‌చంద్‌ బిష్ణోయ్‌ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అక్కడికి వెళ్లినప్పుడు తుపాకీ కాల్పుల శబ్దం వచ్చింది.

కాల్చు.. కాల్చు అన్నారు

కాల్చు.. కాల్చు అన్నారు

జీపులో ముందు వరసలో సల్మాన్‌, సైఫ్‌ అలీఖాన్‌లు, వెనుక సీట్లలో టబు, నీలమ్‌, సోనాలీ బింద్రేలు కూర్చోవడాన్ని మా పూనమ్‌చంద్‌ బిష్ణోయ్‌ గమనించాడు. సల్మాన్ ఖాన్ కృష్ణజింకను వేటాడుతుంటే వాహనంలోని మిగతావారంతా కాల్చు.. కాల్చు పైశాచిక ఆనందం చెందారు. సల్మాన్‌.. రెండు కృష్ణ జింకలను కాల్చాడు.

కానీ పారిపోయారు

కానీ పారిపోయారు

ఆ నటులను మా పూనమ్‌చంద్‌ బిష్ణోయ్‌ అక్కడే నిలదీశాడు. కానీ పారిపోయారు. జీపు నెంబర్‌ను రాసుకొని అటవీశాఖలో ఫిర్యాదు చేసి సుమారు 20 ఏళ్లు పోరాడం. చివరకు గెలిచాం. సల్మాన్ ఖాన్ జైలు పాలయ్యాడు.

ఇంకెంత లేచిపోయిన వ్యక్తి వచ్చినా సరే

ఇంకెంత లేచిపోయిన వ్యక్తి వచ్చినా సరే

మా గురువు జంభేశ్వర్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మేము దేనికైనా రెడీ. బిష్ణోయ్‌ సమాజం బతికున్నంత వరకూ ప్రకృతి, మూగజీవాల జోలికి ఎవరైనా వస్తే సహించే ప్రసక్తే లేదు. సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు... ఇంకెంత లేచిపోయిన వ్యక్తి వచ్చినా సరే వదిలే ప్రసక్తే లేదు.

పర్యావరణ పరిరక్షణే మా మతం

పర్యావరణ పరిరక్షణే మా మతం

మా బిష్ణోయ్ సమాజం రాజస్థాన్‌లో ప్రధానంగాను, హర్యానా, పంజాబ్‌లలో విస్తరించింది. మా సమాజంలో ఎందరో ప్రకృతి కోసం, మూగజీవాల కోసం ప్రాణాలర్పించారు. 1996 అక్టోబర్‌లో నిహాల్‌ చంద్‌ బిష్ణోయ్‌, 2014లో లోహట్‌ గ్రామంలో బీర్బల్‌ బిష్ణోయ్‌ అనే ఉపాధ్యాయుడు వన్య ప్రాణ సంరక్షణ కోసం ప్రాణాలర్పించారు. మా మత ఆచార వ్యవహారాలు విశ్వాసాలుగా, ఒక భావజాలంగా మా ప్రజల్లో కొనసాగుతున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణే మా మతం.

సల్మాన్ ను బెదిరించాడు

సల్మాన్ ను బెదిరించాడు

మా బిష్ణోయ్ సమాజానికి చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ ఆ మధ్య వార్తల్లో నిలిచాడు. అతని పేరు లారెన్స్ బిష్ణోయ్. ఇతను గతంలో సల్మాన్ ను బెదిరించాడు. జోధ్‌పూర్ కోర్టు ప్రాంగణంలో విచారణకు హాజరైన సల్మాన్ కోర్టు ప్రాంగణంలోనే లారెన్స్ బిష్ణోయ్ చంపేస్తా అని బెదిరించాడు. కానీ అలాంటి గ్యాంగ్ స్టర్ లకు మేము వ్యతిరేకం.

మేము న్యాయాన్నే నమ్ముతాం

మేము న్యాయాన్నే నమ్ముతాం

‘సల్మాన్‌ఖాన్‌ని ఇక్కడే, జోధ్‌పూర్‌లోనే చంపేస్తా... అప్పుడైనా మా సత్తా ఏంటో అతడికి తెలుస్తుంది..' అని అప్పట్లో లారెన్స్ బిష్ణోయ్ అన్నాడు. కానీ మా బిష్ణోయ్ సమాజంలోని వ్యక్తులం అలా బెదిరించం. మేము న్యాయాన్నే నమ్ముతాం. న్యాయ ప్రకారం వెళ్తాం. మాకు అన్యాయం జరిగితే ప్రాణాలైనా అర్పిస్తాం.

English summary

how a committed and inspired bishnoi community did salman khan in

how a committed and inspired bishnoi community did salman khan in..The Bishnois are from north India and have since generations strived to protect the biodiversity around them. Even though they are not a large community, they have always set an example in environmental welfare activities.If you look up Bishnois on Google, you will find images of women breastfeeding young fawns along with their own babies. These images clear all doubts about how committed the Bishnois are to the cause of animal welfare.