ఆడవాళ్లతో ఆడుకున్నారు.. ప్రపంచాన్ని శాసించారు.. కుక్క చావు చచ్చారు

Written By:
Subscribe to Boldsky

వాళ్లు నరరూప రాక్షసులు. కొందరు ప్రజలను చిత్రహింసలు పెట్టారు. ఇంకొందరు కంటికి నచ్చిన ప్రతి అమ్మాయిని అనుభవించి కోరిక తీర్చుకున్నారు. ప్రపంచం మొత్తం వీరి గురించి మాట్లాడుకునేలా.. ప్రపంచం మొత్తాన్ని శాసించేలా వీరి పరిపాలనా చేశారు. ఆ నియంతలు చివరకు కుక్క చావు చచ్చారు. ఆడవాళ్లతో ఆడుకున్నారు.. ప్రపంచాన్ని శాసించారు.. చివరకు మాత్రం కుక్క చావు చచ్చారు. వాళ్లు ఎవరో మీరూ తెలుసుకోండి.

మొహమ్మద్ గడాఫీ

మొహమ్మద్ గడాఫీ

లిబియా నియంత మొహమ్మద్ గడాఫీ బతికి ఉన్నంతకాలం అరాచకం చేశాడు. తనకు నచ్చినట్లుగా పాలన చేశాడు. హింసించాడు. లిబియా నియంతగా గడాఫీ పేరు ప్రపంచం నలుమూలలా మారు మోగి పోయింది. ఆడవాళ్లతో కూడా ఈయన ఆడుకున్నాడు.

ఆయనకంటూ ప్రత్యేకంగా ఆడవాళ్ళు బాడీగార్డులుగా ఉండేవారు.

వారికి అమెజానియన్స్ గా పేరు ఉండేది. గడాఫీ నియంతగా ఎంత ఘోరంగా పాలించాడో.. అతని మరణం కూడా అంతే ఘోరంగా జరిగింది. లిబియా సివిల్ వార్ లో రెబెల్ మిలీషీయా చేతుల్లో 2011 అక్టోబర్ 20న గడాఫీ ఘోరంగా చనిపోయాడు. ఈడ్చుకుంటూ.. కొట్టుకుంటూ.. లాక్కొని వెళ్ళి అతన్ని చంపేశారు.

సద్దామ్ హుస్సేన్

సద్దామ్ హుస్సేన్

ఇరాక్ పూర్వ అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ బతికి ఉన్నప్పుడు అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. 2006 డిసెంబర్ 30 న ఉదయం 6 గంటల 7 నిమిషాలకు ఉరి తీయబడ్డాడు. ఆయన పదవిలో ఉన్నప్పుడు మానవీయతకు విరుద్ధంగా చాలా ఆకృత్యాలకు పాల్పడ్డాడు. 1982 లో దుజైల్ అనే పట్టణంలో 148 మంది షియాలను హతమార్చాడన్న అబియోగాన్ని నిర్దారించి ఈ శిక్షను అమలు జరిపింది.

బాగ్దాదుకు ఈశాన్యంగా ఉండి పూర్వం సద్దాం ఉపయోగించిన "కాంప్ జస్టిస్" అనే చోట ఈ శిక్షను అమలు చేశారు. 1980 వ దశకం చివర్లో దాదాపుగా ఒక లక్షా ఎనభై వేలమంది కుర్దులను విష ప్రయోగం ద్వారా హతమార్చాడన్న అభియోగాన్ని కూడా సద్దాం ఎదుర్కొన్నప్పటికీ ఎలాంటి శిక్ష పడకుండానే ఆ విచారణ ముగిసింది.

ముసోలిని

ముసోలిని

జర్మనీ పతనానికి ముందు ఇటలీ నియంత ముసోలిని ని స్ధానిక (మిలన్) ప్రజలు దాడి చేసి పట్టుకున్నారు. జర్మనీ సైన్యంతో కలిసి జర్మనీ సైనికుల యూనిఫారం ముసుగులో పారిపోతుండగా ముసోలినిని పట్టుకున్నారు. ఇటలీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ముసోలిని, అతని భార్యలను కాల్చి చంపగా జనం వారి శవాలను మిలన్ నగరంలో ఓ బహిరంగ ప్రదేశంలో తాళ్ళకు కట్టి తలకిందులుగా వేలాడదీశారు.

వేలాడదీసిన శవాలను కూడా వదలకుండా జనం ఇష్టం వచ్చినట్లు కొట్టి, తన్ని, లాగి, పీకి దాదాపు ఆనవాళ్ళు లేకుండా చేశారు. చివరికి అధికారులు, సైనికులే వారిని నియంత్రించవలసి వచ్చింది. ఏప్రిల్ 28, 1945 తేదీన ముసోలిని దంపతులను కాల్చి చంపారు. ఏప్రిల్ 29 తేదీన వారి శవాలను వేలాడదీసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు.

హిట్లర్

హిట్లర్

ముసోలిని మరణం సమాచారం హిట్లర్ కు చేరింది. తన పరిస్ధితి కూడా అదే అవుతుందని హిట్లర్ భావించాడు. శత్రువుకు పట్టుబడడం జరగనే కూడదని శపధం చేశాడు. అనుకున్నట్లే హిట్లర్ తన నిర్ణయాన్ని తన సహచరులకు తెలిపాడు. చనిపోవడానికి 40 గంటల ముందు తన ఫియాన్సే ఇవా బ్రౌన్ ను పెళ్లి చేసుకున్నాడు. హిట్లర్ బతికున్నంతకాలం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించాడు.

అయితే ఆయన ఎలా చనిపోయాడన్న విషయంపై చాలా కాలం వరకు చర్చోపచర్చలు నడిచాయి. అసలు ఆయన అందరూ చెబుతున్నట్లు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అన్నది ఒక అనుమానం. ఆత్మహత్య చేసుకుంటే విషం మింగి చనిపోయాడా లేక తుపాకీతో కాల్చుకుని చనిపోయాడా అన్నది మరో అనుమానం. అయితే అతని మరణం మాత్రం చాలా దారుణంగా చోటుచేసుకుంది.

స్టాలిన్

స్టాలిన్

స్టాలిన్ పూర్తి పేరు జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్. అతను అధికారాన్ని పటిష్ఠం చేసుకొని సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు అయ్యాడు. ఆ కాలాన్ని సోవియట్ యూనియన్ చరిత్రలో స్టాలినిజమ్ అంటారు. అయితే ఇతని అరాచకాలతో ప్రజలు చాలా ఇబ్బందులుపడ్డారు. ఈయన మరణం కూడా చాలా దుర్బరంగా ఉంది. ఇతను కూడా చాలా దారుణంగా చనిపోయాడు.

మావో జెడాంగ్

మావో జెడాంగ్

హిట్లర్‌ లేదా స్టాలిన్‌ ఎంతటి దుష్టులో మావో కూడా అంతే. వారితో సమానంగా మానవాళికి తీవ్ర నష్టం కలిగించారు

అయితే ఐరోపా నుంచి పెద్దగా నిరసనలు ఎదురు కాకుండా, తన ప్రతిష్ట తగ్గిపోకుండా మావో జాగ్రత్త పడ్డారు. మావోతో దుష్ట చతుష్టయంగా భావించే మావో భార్య జింగ్‌ పింగ్‌, జ్హంగ్‌ చున్కిఒ, యో వెన్యుఅన్‌, వాంగ్‌ ¬న్గ్వేన్‌లతో పాటు జనరల్‌ లిం బయోలు కూడా చైనాలో అప్పట్లో నెలకొన్న అరాచకానికి బాధ్యులు ప్రపంచంలో అతి పెద్ద మారణ కాండకు కారణమైన వారు ఎవరు? చాలామంది హోలోకాస్ట్ (యూదుల మారణకాండ )కు కారణమైన అడాల్ఫ్ హిట్లర్ అనుకుంటారు.

లేకపోతే హిట్లర్ కంటే ఎక్కువమందిని చంపించిన రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్ అనుకుంటారు. కానీ వీరిద్దరిని మించిపోయి అమ్మయకుల్ని పొట్టన పెట్టుకున్నది మాత్రం మావో జెడాంగ్. 1958 నుండి 1962 వరకు ఆయన అమలు చేసిన `ముందడుగు విధానం వల్ల 45 మిలియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రికార్డులకు ఎక్కిన అతి పెద్ద మారణకాండ ఇదే. ఇలా ప్రజలతో ఆడుకున్న ఈ క్రూరుడు హార్ట్ టాక్ తో చనిపోయాడు. జనమంతా పండుగ చేసుకున్నారు.

కిమ్ ఇల్ సంగ్

కిమ్ ఇల్ సంగ్

ఇప్పుడు ఉత్తర కొరియాను పాలించే కిమ్ ఎలా అయితే నిరంకుశత్వం ప్రదర్శిస్తున్నారో అతని తాత కిమ్ ఇల్ సంగ్ కూడా అంతకన్నా దారుణంగా చేశాడు. ప్రస్తుతం ఉత్తర కొరియా పాలన మొత్తం కిమ్ ఇల్ సంగ్ వంశం సాగిస్తోంది. జంగ్ ఇల్ సంగ్ మరణాంతరం ఆ బాధ్యతలను కిమ్ జంగ్ ఇల్, ఆ తర్వాత అంటే ప్రస్తుతం కిమ్ జంగ్ ఉన్ పరిపాలన సాగిస్తున్నారు.

తన మరణం అనంతరం కూడా ప్రస్తుత విధానంలోనే దేశం నడవాలని, తన మరణాంతరం సంస్కరణలు తీసుకొచ్చి దేశ పాలన విషయాల్లో మార్పులు చేసేందుకు తన వారసులు ప్రయత్నిస్తే కాల్చి పారేయండని కిమ్ ఇల్ సంగ్ బతికి ఉన్నప్పుడే సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఇల్ సంగ్ పాలనలో జనాలంతా అల్లాడిపోయారు. అమ్మాయిలతో జీవితాలతో ఆడుకున్నాడు కిమ్ ఇల్ సంగ్. చివరకు ఇతను కూడా గుండె జబ్బుతోనే మరణించాడు.

చిలీ మాజీ అధ్యక్షుడు అగస్టో పినోచెట్‌

చిలీ మాజీ అధ్యక్షుడు అగస్టో పినోచెట్‌

చిలీ మాజీ అధ్యక్షుడు అగస్టో పినోచెట్‌ నియంతగా పేరుగాంచాడు. వందల కోట్ల పెసోల విలువైన దేశ సంపదను ఇతను కొల్లగొట్టాడు. చిలీలో ప్రతి ఒక్కరినీ హింసించాడు. వేధించాడు. ఇతను చనిపోయినప్పుడు జనమంతా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.

ఇడీ అమీన్ ఉగాండ

ఇడీ అమీన్ ఉగాండ

దక్షిణాఫ్రికా ఖండపు తూర్పుభాగంలోని సూడాన్, కాంగో, టాంజానియా, కెన్యా, ఇథియోపియాల నడుమ ఉన్న చిన్న దేశం ఉగాండా. ఆ దేశానికి 1962లో బ్రిటిష్‌వారి నుంచి స్వాతంత్య్రం వచ్చింది. అంతలోనే 1971లో ఆ స్వాతంత్య్రం చేజారిపోయింది! అయితే దాన్ని చేజిక్కించుకున్నవాడు ఎవరో పరాయిదేశ పాలకుడు కాదు. వాళ్ల మనిషే. పేరు ఇడీ అమీన్. అప్పటికి ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు మిల్టన్ ఒబోటే. అతడి ప్రభుత్వంలో అమీన్ ఒక సైనికాధికారి. 1971 జనవరి 25న ఒబొటే సింగపూర్‌లో ఒక సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అదే అదనుగా అమీన్ సైనిక తిరుగుబాటు లేవనెత్తాడు. ఒబొటే ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. తర్వాత ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన పాలన చేశాడు.

ఉంగాండా ప్రజలకు తొమ్మిదేళ్లపాటు నరకం చూపించాడు ఇడీ అమీన్. ఉగాండా కసాయి'గా పేరుమోశాడు ఇడీ అమీన్. అమీన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కనీసం 3 లక్షల మంది పౌరులు అతడి వివక్షకు, వైషమ్యాలకు బలయ్యారు. అమీన్‌కు వ్యతిరేకంగా ఉగాండా జాతీయవాదులు టాంజానియా సేనలకు సహకరించడంతో వారు ఉగాండా సేనలపై పైచేయి సాధించారు. వాళ్లకు చిక్కకుండా అమీన్ మొదట లిబియా పారిపోయాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా చేరుకున్నాడు. అలా రెండు దశాబ్దాలకుపైగా అజ్ఞాతంలో గడిపి, ఆరోగ్యం క్షీణించి, కోమాలోకి జారుకుని 2003 ఆగస్టు 16న మరణించాడు. ఉగాండా ప్రభుత్వం అతడి మృతదేహాన్ని అడిగింది. ఒకవేళ ఇచ్చి ఉంటే ముసోలిన్ శవాన్ని కొట్టినట్లుగా చెప్పులతో కొట్టేవారేమో. కానీ సౌదీ అరేబియా అప్పటికే ఖననం చేయించింది.

అన్వర్ ఏఈ సదాత్

అన్వర్ ఏఈ సదాత్

మాజీ ఈజిప్షియన్ దేశాధ్యక్షుడు అయిన అన్వర్ ఏఈ సదాత్ కు హిట్లర్ అంటే చాలా ఇష్టం. ఈయన హిట్లర్ లానే పాలనా సాగించాడు. ఈయనది కూడా దారుణమైన పాలన. చివరకు కుక్కుచావు చచ్చారు.

English summary

how the worlds worst dictators died

how the worlds worst dictators died
Story first published: Saturday, January 27, 2018, 10:00 [IST]
Subscribe Newsletter