అల్లాఉద్దీన్ ఖిల్జీ కంటికి నచ్చిన ప్రతి రాణిని అనుభవించాడు

Written By:
Subscribe to Boldsky

అల్లాఉద్దీన్ ఖిల్జీ రాజ్యకాంక్ష, మగువల పట్ల మోహం ఎక్కువ. అల్లాహ్‌ సృష్టించిన ప్రతి అందమైన దానిపై తనకు హక్కు ఉంటుంది అనుకునేవాడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ. అతనికున్న వాంఛలు తెలిస్తే షాక్ అవుతారు.పెళ్లి రోజుకూడా పరస్త్రీని కోరుకునేంత విచ్చలవిడితనం అతనిది. పిల్లనిచ్చిన మామను సింహాసనం కోసం చంపేసిన క్రూరుడు వాడు.

కిరీటం చాలా చెడ్డది

కిరీటం చాలా చెడ్డది

కిరీటం ఎంత చెడ్డది, అది తలల్నే మార్చేస్తుంది అని కదా మామా అంటూ మామని చంపి చమత్కరిస్తాడు అల్లాఉద్దీన్‌ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అడ్డ‌దారుల్లో ఢిల్లీ సింహాస‌నాన్ని అధిష్టించాడు. అతను ఒక కామ పిశాచి. అందుకోసం ఎంత‌టి దుర్మార్గ‌మైనా చేసేవాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ రాజ్యకాంక్ష, మగువల పట్ల మోహం ఎక్కువ.

దేవగిరి పై దండెత్తి

దేవగిరి పై దండెత్తి

క్రీ.శ. 1296లో అలావుద్దీన్ తన మామ సుల్తాన్ ఫిరోజ్ షా అనుమతి లేకుండా దేవగిరి పై దండెత్తుతాడు. దాడి ఊహించని దేవగిరి రాజు రామచంద్ర ఎనలేని సంపద ఇచ్చి సంధి చేసుకుంటాడు. విజయోత్సాహముతో తిరిగి వచ్చిన అలావుద్దీన్ ఖిల్జీ దేవగిరి నుంచి తీసుకొచ్చిన రాణిని బంధించి ఆమెను ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ సందర్భంలో ఖిల్జీ మామ వస్తాడు. అతన్ని ఎదురిస్తాడు ఖిల్జీ.

మాలిక్‌ కాఫుర్‌ పెళ్లాంలాంటోడు

మాలిక్‌ కాఫుర్‌ పెళ్లాంలాంటోడు

అల్లా ఉద్దీన్ ఖిల్జీ బైసెక్సువల్‌ కూడా. మాలిక్‌ కాఫుర్‌ అల్లాఉద్దీన్‌ ఖిల్జీకి పెళ్లాంలాంటివాడు. మాలిక్ కాఫర్ జన్మత హిందువైన మాలిక్ గుజరాత్ దాడిలో అల్లావుద్దీన్ ఖిల్జీచేత 1000 దీనారాలకు 1297లో తన సైన్యాధికారి నస్రత్ ఖాన్ చేత కొనబడతాడు. అందుకే మాలిక్ కాఫర్‌ను ‘వేయిదీనారాలు' అనే పేరుతో కూడా పిలిచేవారు. మాలిక్ కాఫర్ కు బుద్ధికుశలతగల నపుంసకుడు. అందగాడు. ఇతనికి ‘మాలిక్ తాజ్-ఉల్-మాలిక్ కాఫర్' అనే బిరుదు కూడా ఉంది.

ఖిల్జీనే చంపాడు

ఖిల్జీనే చంపాడు

అల్లాఉద్దీన్ ఖిల్జీ మాలిక్‌ కాఫుర్‌ కు దక్షిణ భారత్‌పై దాడులు చేసే బాధ్యత అప్పగిస్తాడు. మాలిక్‌ కాఫుర్‌ చాలా రాజ్యాలు జయించాడు. అయితే అల్లావుద్దీన్ మాలిక్‌ కాఫుర్‌ చేతిలో విష ప్రయోగంతో చనిపోతాడు. ఇతను చివరి రోజుల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది.

చాలా దుర్మార్గుడు

చాలా దుర్మార్గుడు

తన మామను హతమార్చి ఢిల్లీ పీఠంను ఆక్రమించిన వంచకుడు అల్లాఉద్దీన్ ఖిల్జీ. ఎందరో ధన మాన ప్రాణాలను హరించిన రాక్షసుడు. తను కావాలనుకున్న ప్రతిదీ దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించేవాడు అల్లాఉద్దీన్ ఖిల్జీ.

లైంగిక బానిసలుగా

లైంగిక బానిసలుగా

చాలామంది యువకులను సైతం లైంగిక బానిసలుగా మార్చుకున్నాడు అల్లాఉద్దీన్ ఖిల్జీ. తన అధికార రాజమహల్ లో అనేక వేల మంది నవ యువకులను అతని వద్ద ఉంచుకున్నాడని చరిత్ర చెబుతుంది. అలాగే తనకు కంటికి నచ్చిన ప్రతి రాణిని అల్లాఉద్దీన్ ఖిల్జీ అనుభవించాడు. అందరూ చూస్తుండగానే బందీలుగా తీసుకొచ్చిన రాణులతో అల్లాఉద్దీన్ ఖిల్జీ శృంగారం చేసేవాడు.

మాలిక్ కాఫర్ చెప్పినట్లు వినేవాడు

మాలిక్ కాఫర్ చెప్పినట్లు వినేవాడు

మాలిక్ కాఫర్ అనే నపుంసకుడు ఖిల్జీ యొక్క బలహీనతను సానుకూలంగా తీసుకొని కాఫర్ ముఖ్య సలదారుగా అధికారం చెలాయించేవాడు. అతను పూర్తి ప్రయోజనాన్ని పొందేవాడు. అతను ఎలా చెబితే ఖిల్జీ అలా వినేవాడు. అతను చెప్పిన మాటకు ఖిల్జీ అస్సలు ఎదురు చెప్పేవాడు కాదు.

అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ మధ్య శృంగారం

అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ మధ్య శృంగారం

తారిఖ్ -ఇ ఫిరుజ్ షాహిలో అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ మధ్య శృంగార సంబంధం గురించి చరిత్రకారుడు "జియాదుద్దీన్ బరనీ" ప్రస్తావించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ భార్యాభర్తల్లాగా ఉండేవారంట. ఇద్దరూ చాలా సార్లు శృంగారంలో పాల్గొనేవారంట. ఈ విషయంలో అప్పట్లో అందరికీ బహిరంగంగానే తెలుసంట.

ఖిల్జీకి అవి అంటే కూడా బాగా ఇష్టం

ఖిల్జీకి అవి అంటే కూడా బాగా ఇష్టం

ఖిల్జీకి కవితలు అంటే కూడా బాగా ఇష్టం. బాధలో ఉన్నా సంతోషంతో ఉన్నా ఎలా ఉన్న సరే అతను కవితలు చెప్పేవాడు. అతని చుట్టూ ఉండేవారు వాటిని విని అతన్ని పొగిడేవారు.

కాకతీయ ప్రతాపరుద్రుడిని ఓడించి

కాకతీయ ప్రతాపరుద్రుడిని ఓడించి

720 సంవత్సరాల కిందట అంటే క్రీ.శ1303 సంవత్సరంలో రాణి పద్మావతి మేవాడ్ రాజు భార్యగా ఉండేది. అప్పుడు ఢిల్లీని మధ్య ఆసియా (ఇరాన్ - ఇరాక్ - సౌదీ అరేబియా - తుర్క్ మెనిస్థాన్ తదితర) దేశాల నుంచి వచ్చారని భావిస్తున్న సుల్తానులు పాలిస్తుండేవారు. వీరిలో ఖిల్జీ వంశస్తుల్లో అగ్రగణ్యుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సుల్తాన్ గా ఉన్నాడు. సుల్తాన్ సామ్రాజ్యంలో రాజపుత్ర రాజ్యం అంటే మేవాడ్ మినహాయించి మన తెలుగు రాష్ట్రాల వరకు దేశమంతా ఉండేది. మన తెలుగు పాలకులైన కాకతీయ ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా ఖిల్జీ సామ్రాజ్యంలో కలిపేశాడు ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్.

అపురూప సౌందర్యవతి

అపురూప సౌందర్యవతి

పద్మావతి ఎలాంటి అపురూప సౌందర్యవతి అంటే ఆమె నీడ కూడా మోహం కలిగించేంత అందం ఆమె సొంతం. సింహళద్వీపం మహారాజు గంధర్వసేన్‌, మహారాణి చంపావతి. వారి ముద్దుల కుమార్తె పద్మావతి. అందాల భరిణ ఆమె.

వేట అంటే చాలా ఇష్టం

వేట అంటే చాలా ఇష్టం

సింహళ దేశపు యువరాణి పద్మావతికి వేట అంటే చాలా ఇష్టం. వేటాడుతుండగా పద్మావతి బాణం తగిలి మేవాడ్ వంశానికి చెందిన రావల్ రతన్ సింగ్ గాయపడుతాడు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం జరుగుతుంది. వారిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. తన ప్రేమను వ్యక్తం చేసిన రతన్ సింగ్.. పద్మావతిని పెళ్లాడటమే కాకుండా తన దేశం చిత్తోర్‌గఢ్‌కు తీసుకెళ్తాడు.

ఏకాంతంగా ఉన్నప్పుడు చూస్తాడు

ఏకాంతంగా ఉన్నప్పుడు చూస్తాడు

మేవాడ్ రాజ గురువు రాఘ‌వ చింత‌నుడు వారిద్దరూ ఏకంతంగా ఉన్నప్పుడు చూడడానికి ప్రయత్నిస్తాడు. అతడు చేసిన అప‌రాధం వ‌ల్ల ర‌త‌న్ సింగ్ అత‌న్ని దేశ బ‌హిష్క‌ర‌ణ చేయిస్తాడు. రాఘ‌వ్ క‌క్ష‌తో అల్లావుద్ధీన్‌ వద్దకు చేరుతాడు. ప‌ద్మావ‌తి అందం గురించి వివరిస్తారు. త‌నో రాజ్‌పుత్‌ వంశానికి చెందిన వీర‌నారి. దీంతో ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలన్న ప్రతినబూనుతాడు.

ఆ పేరు వింటనే..

ఆ పేరు వింటనే..

పద్మిని పేరు వింటూనే ఖిల్జీ మనసు కరిగి ప్రేమ నదై, వరదై పొంగి పొర్లింది. ఆమెను చూడక ముందే హృదయం పారేసుకొన్నాడు. మేవాడ్‌ అధీనం, రాణి పద్మిని స్వాధీనం చేసుకోవాలని అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ అనుకున్నాడు.

అంత సులభం కాదని

అంత సులభం కాదని

1303 జనవరి 28న అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ లక్షలాది సైనికులతో మేవాడ్‌ చేరుకొన్నాడు. కోటకి పదిమైళ్ల దూరంలో మకాం వేశాడు. నాలుక చీలిన నాగులా అంతెత్తు ఆకాశాన్ని తాకుతూ నిలబడిన చిత్తోడ్‌గఢ్‌ని సొంతం చేసుకోవడం సులభం కాదని అర్థమైపోయింది. కుత్సిత కుతంత్రంతో చావుదెబ్బ తీయాలనుకొన్నాడు.

అన్ని మర్యాదలు చేస్తాడు

అన్ని మర్యాదలు చేస్తాడు

ఖిల్జీ తన సేనాని మాలిక్ తో రాణా రతన్‌సేన్‌కి కబురు పెట్టాడు. తనను ఒక్కసారి వచ్చి కలుస్తానని ఖిల్జీ ఆ కబురులో పేర్కొంటాడు. ఆ లేఖ చూసి మేవాడ్‌ రాజు సరే అంటాడు. శత్రువు ఇంటికి వచ్చిన కూడా రాణా రతన్‌సేన్‌ చాలా సంస్కారవంతంగా ప్రవర్తిస్తాడు. అతనికి అన్ని మర్యాదలు చేస్తాడు. కానీ ఖిల్జీ రాణా రతన్‌సేన్‌ భార్యను చూస్తానంటాడు. మొదట రాణా రతన్‌సేన్‌ కత్తి దూస్తాడు. కానీ ఖిల్జీ తన మాయ మాటలతో రాణా రతన్‌సేన్‌ని శాంతపరుస్తాడు.

పద్మావతిని చూస్తాడు

పద్మావతిని చూస్తాడు

ఆకాశం నుంచి వెండి కుండలతో వెన్నెల పడుతోంది. కోటలోపల చక్కటి వనం. ఆ పక్కనే కొలను. దానికి ఈవల ఖిల్జీ తదితరులు. ఆవల పాము కుబుసమంతటి పల్చటి వస్త్రం వెనుక పద్మిని. కనిపించికనిపించని ఆమె మోముని చూస్తాడు ఖిల్జీ. ఉన్మత్తుడైపోయాడు. రాణి దర్శన ఉత్సవం ముగిసింది.

సాగనంపమంటూ అంటాడు

సాగనంపమంటూ అంటాడు

తమ గుడారాల దాకా వచ్చి సాగనంపమంటూ రతన్‌సేన్‌ని కోరాడు ఖిల్జీ. రాణి పద్మిని రాజుని వారించింది. ఖిల్జీ మకాంకి చేరుకుంటాడు రాణా రతన్‌సేన్‌. సుల్తాన్‌ను విడిచి ఇక తాను వెనుదిరుగుతానంటూ కరచాలనం చేస్తాడు రాజు రాణా రతన్‌ సేన్‌. కానీ కనికరం లేకుండా రాజుని బందీ చేస్తాడు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ.

నువ్వు వస్తేనే

నువ్వు వస్తేనే

నువ్వు వస్తేనే నీ పతిప్రాణాలు దక్కుతాయి అనే సందేశాన్ని రాణి పద్మినికి పంపుతాడు ఖిల్జీ. ఆమె కంగారు పడలేదు. దుఃఖించలేదు. మెదడుకి పదును పెట్టింది. సరే వస్తాను అంది. ఆమె బంగారు మేనాలో బయలుదేరింది. 150 పల్లకీలు, ఒక్కో పల్లకీలో నలుగురేసి చెలికత్తెలు, మోసేందుకు ఆరుగురేసి బోయీలు... అంగరంగవైభవంగా వెళ్లింది రాణి పద్మిని.

ఖిల్జీకి ఎదురు తిరిగి

ఖిల్జీకి ఎదురు తిరిగి

ఖిల్జీకి ఎదురు తిరిగి అక్కడి నుంచి రాజ్యానికి వస్తారు రాణి పద్మావతి ఆమె భర్త. దీనికి ఖిల్జీ భార్య మల్లికయే సాయం చేస్తుంది. ఖిల్జీ సైనికులపై సింహాల్లా విరుచుకుపడుతారు బోయీల వేషంలో ఉన్న పద్మిని సైనికులు, చెలికత్తెల వేషాల్లో ఉన్న సాయుధులు. సుల్తాన్‌ సేన ప్రతిదాడి చేసేలోపే రాణి పద్మిని రాజుని తీసుకెళ్లిపోయింది. మేవాడ్‌ చేరుకొంది. రాజపుత్ర సైనికులు ఖిల్జీ సైన్యంతో పోరాడి మేవార్‌ వైపు రాకుండా అడ్డుకుంటారు. చాలామంది చనిపోతారు.

ఊరిస్తాడు రాజగురువు

ఊరిస్తాడు రాజగురువు

ఖిల్జీ చిత్తోఢ్‌ మీదకు యుద్దానికి వెళ్తాడు. చిత్తోఢ్‌కు భారీ ఫిరంగులతో వెళ్తాడు. ఆ ఫిరంగి సామర్థ్యం చిత్తోఢ్‌కు లేదు. రతన్‌సింగ్‌ ను యుద్ధంలో దొంగ దెబ్బ తీసి చంపేస్తాడు ఖిల్జీ సేనాని మాలిక్. భర్త మరణించాడని తెలిసిన పద్మావతి సహా ఏడువందలమంది రాజపుత్రికలు సతీసహగమానానికి పాల్పడతారు. పద్మావతి కొనగోటిని కాదుగదా, కనీసం కొనచూపుతో కూడా చూడకుండానే ఆమె బూడిదైపోతుంది.

Images Source :https://www.speakingtree.in/

English summary

interesting facts about alauddin khilji

interesting facts about alauddin khilji
Subscribe Newsletter