అహల్య అన్నీ తెలిసే ఇంద్రుడితో శృంగారంలో పాల్గొందా?

Written By:
Subscribe to Boldsky

అహల్య ఈ పేరు మనం అందరం వినే ఉంటాము. అహల్య గురించి కూడా చాలామందికి కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి. గౌతముడి భార్య అయిన అహల్యపై ఇంద్రుడు కన్నెస్తాడు. తర్వాత అహల్య, గౌతముడు శాపానికి గురవుతారు అనే విషయం అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. కానీ అహల్య గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి.

మట్టి బొమ్మకు ప్రాణం పోస్తే

మట్టి బొమ్మకు ప్రాణం పోస్తే

దేవతల్లో అందచందాలను ఆరబోసే వారు ఎవరూ అంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల పేర్లు చెబుతారు. అయితే వారంతా కేవలం ఇంద్రుడుని రంజింపేజేసేందుకే ఉండేవాళ్లు. వాళ్లు కేవలం అందానికి మాత్రమే కేరాఫ్ అడ్రస్ లు. అయితే అందంతో పాటు మంచి మనస్సున్న వారు కూడా కొందరు దేవతల్లో ఉన్నారు. వీరందరి గురించి పక్కన పెడితే అందానికి మంచితనం కూడా తోడై మట్టి బొమ్మకు ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అహల్య.

సరస్వతీదేవిని మెప్పించేందుకు

సరస్వతీదేవిని మెప్పించేందుకు

ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. ఆమెను పెంచి పోషించే బాధ్యత గౌతమ మహర్షికి అప్పగిస్తాడు. ఆమెను బాగా చూసుకునే ధీరుడు అతనే అని అతని దగ్గరకి వెళ్తాడు. "నాయనా! ఈ అతిలోక సుందిరి నా పుత్రిక అహల్య. ఈమెను నీ ఆశ్రమములో వదిలి వెళుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళతాను" అని చెబుతాడు. గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు.

అందంమంటే అహల్యే

అందంమంటే అహల్యే

అందమంతా ఒక రాశి పోస్తే తయరైన బొమ్మలా ఉంటుంది అహల్య. ఎవరు చూసినా టెంప్ట్ అయిపోవాల్సిందే అంతటి అందం అహల్యది. చాలా మంచితనం కూడా ఉండేది. అందుకే చాలా మంది కన్ను అహల్యపై పడింది. ఒక్కసారైనా అహల్యను అనుభవించాలని అనుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇంద్రుడి దగ్గర అంతమంది అందగత్తెలున్నా అహల్యపైనే ఎందుకు కన్ను పడిందంటే అంతటి అందం ఆమె సొంతం కాబట్టే.

గౌతమ మహర్షి

గౌతమ మహర్షి

వేదకాలానికి చెందిన మహర్షులలో ఒకడు గౌతమ మహర్షి. మంత్రాల సృష్టికర్తగా, మంత్ర ధృష్టగా గౌతముడికి మంచి పేరుంది. ఋగ్వేదంలో గౌతముడి పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. గౌతమ మహర్షి అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కుమారుడు. దేవీ భాగవత పురాణం ప్రకారం... గోదావరి నది పేరు గౌతముడి పేరు మీదుగా వచ్చింది. గౌతముడికి వామదేవుడు, నోధసుడు అని ఇద్దరు కుమారులు. వీరు కూడా మంత్ర ధృష్టలే.

చాలా టాలెంటెడ్

చాలా టాలెంటెడ్

గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో చాలా టాలెంటెడ్. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందరినో ఆదుకున్నాడు. ఒకసారి బాగా కరువురావడంతో ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమైతే అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.

సేవలు చేసేందుకు

సేవలు చేసేందుకు

మహర్షికి సేవలు చేస్తూ, ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు చతుర్ముఖుడు ఏర్పాటు చేసిన ఆమెనే అహల్య. అహల్యను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఏ ఉద్దేశమూ లేదు. అహల్యను కేవలం గౌతమ మహర్షికి సేవలు చేసేందుకే నియమించాడు బ్రహ్మ. అహల్య కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గౌతమ మహర్షి దగ్గర ప్రతి పని చేసింది.

నిస్వార్థంగా సేవలు

నిస్వార్థంగా సేవలు

అహల్య గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆయన కోసం నిస్వార్ధంగా సేవలు చేసేది. అహల్య నిజాయితీగా గౌతమ మహర్షి దగ్గర పని చేసేది. ఆయన అన్ని రకాల సపర్యలు చేసేది. గౌతమ మహర్షికి కూడా అహల్య సేవలు బాగా నచ్చాయి. ఆమె అంటే గౌరవం ఏర్పడింది గౌతమ మహర్షికి.

పెళ్లీడుకు వచ్చింది

పెళ్లీడుకు వచ్చింది

గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న అహల్య పెళ్లీడుకు వచ్చింది. దీంతో గౌతమ మహర్షి బ్రహ్మ దగ్గరకు వెళ్లి అహల్యకు మీరు నాకు అప్పగించారు. ఇప్పుడు ఆమె పెళ్లీడుకు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయండని గౌతమ మహర్షి బ్రహ్మకు చెబుతారు. నాకిచ్చిన బాధ్యత అయిపోయింది ఆమెను పెంచి పెద్ద చెయ్యమన్నారు చేశాను అని గౌతమ మహర్షి బ్రహ్మతో అంటాడు. అహల్యను చూసిన బ్రహ్మ తను పదహారేళ్ళ నిత్య యవ్వనరాలిగా ఉంటుందని దీవిస్తాడు.

పోటీ మాములుగా లేదు

పోటీ మాములుగా లేదు

అహల్య పెళ్లి గురించి బ్రహ్మ దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు అంత పోటీ ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అహల్యను ఎవరో ఒక మంచి వ్యక్తికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు బ్రహ్మ. కానీ అహల్యను పెళ్ళాడడానికి దేవతలు పోటిపడ్డారు. నాకివ్వంటే నాకివ్వని అహల్యకోసం బ్రహ్మను అర్థించారు. అహల్యకు ఇంత కాంపిటేషన్ ఉంటుందని బ్రహ్మకు అర్థం కాలేదు.

పోటీ పెట్టాలనుకున్నాడు

పోటీ పెట్టాలనుకున్నాడు

అహల్యకు చాలా మంది క్యూలో నిలబడే సరికి బ్రహ్మకు ఒక ఐడియా వచ్చింది. మంచి టఫ్ పోటీ పెట్టి అందులో నెగ్గిన వారికే అహల్యను ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. భూ ప్రదక్షిణం చేసిన వారికే అహల్య నిచ్చి పెళ్ళిచేస్తానన్నాడు బ్రహ్మ. దీంతో దేవతల్లో చాలామంది భూ ప్రదక్షిణ ఎలా చేయాలని ఆలోచించారు. కొందరు వెంటనే పోటీలోకి దిగారు. మొత్తానికి ఒక్కోక్కరు ఒక్కోరకంగా అష్టకష్టాలుపడి పోటీలో పాల్గొన్నారు.

గౌతముడు కూడా

గౌతముడు కూడా

గౌతముడు కూడా పోటీలో పాల్గొన్నాడు. ఈయన మంచి మహర్షి.. అందులో మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి కాస్త బుర్రను ఉపయోగించాడు. భూ ప్రపంచాన్ని మొత్తం చుట్టి రావడం అంటే కాస్త కష్టమే. అందుకే ఆయన భూ ప్రదక్షిణ చేసి రాలేదు. సగం ఈనిన గోవుచుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాడు. ప్రదక్షిణను సమతుల్యం చేశాడు. కానీ గౌతముడు అహల్యను బ్రహ్మకు అప్పగించిన తర్వాత తిరిగి వెళ్ళే దారిలో అప్పుడే జన్మనిచ్చిన ఒక ఆవును చూసి జస్ట్ అలా క్యాజ్ వల్ ఆవు చుట్టూ తిరగడానికి కొన్ని కథలున్నాయి.

బ్రహ్మకు నచ్చాడు

బ్రహ్మకు నచ్చాడు

గౌతమ మహర్షి గో మాతను ప్రార్దిస్తూ చుట్టూ ప్రదిక్షణ లు చేసిన విషయాన్ని బ్రహ్మ తన దివ్య దృష్టితో చూస్తాడు. కామధేనువు భూమి తో సమానమని ఆ ప్రదిక్షణ ను భూమి చుట్టు భావించి పెంచి పెద్ద చేసిన గౌతమునికే ఇచ్చి వివాహం చేస్తాడు బ్రహ్మ. వివాహ కానుకగా బ్రహ్మగిరి అనే పర్వతాన్ని కూడా కానుకగా ఇస్తాడు. మొత్తానికి గౌతమ మహర్షిని బ్రహ్మ మెచ్చాడు. అహల్యనిచ్చి పెళ్ళి చేశాడు. స్వయంగా బ్రహ్మదేవుడే దగ్గరుండి, అహల్యా, గౌతముల వివాహం జరిపించాడు. వారిని వనదేవతలు దీవించాయి. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ.

ఇంద్రుడుకి కోపం

ఇంద్రుడుకి కోపం

అహల్యను దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. అందులో ఇంద్రుడు ప్రథముడు. ఆయన కచ్చితంగా అహల్యను తానే దక్కించుకుని అహల్యను ఇంద్రలోకానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ ఆయన ఆలోచన రివర్స్ అయ్యింది. పోటీలో ఓడిపోయి అహల్యను చేజార్చుకోవాల్సి వచ్చింది. అయినా ఆమెతో ఒక్కసారైనా గడపాలని ఇంద్రుని మనస్సులో బలంగా ఉండేది.

దేవతలంతా ఇంద్రుడికి అండగా

దేవతలంతా ఇంద్రుడికి అండగా

అహల్యా గౌతములకు శతానందుడు అనే కొడుకు పుట్టాడు. తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపో దీక్ష పూనాడు. ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే, స్వర్గాన్ని కదిలించేలా ఉంది.దేవేంద్రుడికి భయం కలిగింది. గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. దేవతల సహాయం అడిగాడు. అందరూ సరేనన్నారు.

కొత్త ఐడియా వచ్చింది

కొత్త ఐడియా వచ్చింది

వివాహం అయిన ఇంద్రునికి అహల్య పై కోరిక పోదు ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడానికి గౌతముని దిన చర్య ఇంద్రుడు పరిశీలిస్తాడు.ఆయనకు వచ్చిన కొత్త ఐడియా ఇదే. దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంలో వెళ్లి ఆమెను అనుభవించాలి అనుకున్నాడు. కానీ దేవతలందరికీ మాత్రం గౌతముడి వల్ల మనం ఇబ్బందులుపడాల్సి వస్తుంది అందుకే నేను గౌతముడి ఆశ్రమానికి మారువేషంలో వెళ్తా మీరు సహాయం చేయండని కోరాడు.

తపస్సు భగ్నం కాదు.. తనివి తీరా అనుభవించాలని

తపస్సు భగ్నం కాదు.. తనివి తీరా అనుభవించాలని

ఇంద్రుడు దేవతలందరికీ గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేస్తానని చెప్పాడు. కానీ అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం. దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమం చేరాడు. ఇంకా తెల్లవారకముందే ఆ కోడి కూసింది. గౌతమముని ఉలిక్కిపడి లేచాడు. బ్రహ్మముహూర్తం అని భ్రమించి, సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చేందుకు లేచాడు. పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరాడు గౌతమ మహర్షి.

చంద్రుడితో కలిపి పక్కా ప్లాన్

చంద్రుడితో కలిపి పక్కా ప్లాన్

ఒక రోజు చంద్రున్ని మబ్బుల వెనుక దాగి ఉండమని చెప్పి ,ఇంద్రుడు ఒక కోడై కూస్తాడు. అప్పుడు గౌతముడు తెల్లవారింది అనుకోని స్నానానికి నదికి వెళ్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యతో తన కోరికను తీర్చుకోవాలనుకునంటాడు.

అహల్యకు తెలిసి కూడా శృంగారం లో

అహల్యకు తెలిసి కూడా శృంగారం లో

అయితే అహల్యకి దివ్య దృష్టితో ఉంటుందని వచ్చింది ఇంద్రుడు అని తెలిసిన దేవుళ్ళకు రాజు కాబట్టి అతనికి లోంగిపోతుందని కొన్ని పురాణాల్లో ఉంది. అయితే మరికొన్ని చోట్ల మాత్రం నిజంగా గౌతముడే అనుకోని అహల్య ఇంద్రుడితో శృంగారం లో పాల్గోనింది అని ఉంది.

గౌతమ మహర్షికి డౌట్ వస్తుంది

గౌతమ మహర్షికి డౌట్ వస్తుంది

గౌతమ మహర్షి బయటకు వెళ్తే ఏదో డౌట్ గా అనిపిస్తుంది. ఏదో తేడా కొడుతుంది. కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్ధం చేసుకుంటాడు గౌతముడు. కొద్ది దూరం పోయి తిరిగి వెనక్కి వస్తాడు. తీరా మహర్షి వచ్చేసరికి, దేవేంద్రుడు, తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు. ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా... తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా.. అని గౌతమమహర్షికి కోపం వస్తుంది.

ముగ్గురిని శపిస్తాడు

ముగ్గురిని శపిస్తాడు

అతనితో శృంగారం లో పాల్గొన్న అహల్యను, ఇంద్రుడని, అందుకు సహకరించిన చంద్రుడిని గౌతముడు శపిస్తాడు. దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు. సహాయం చేసినందుకు చంద్రుని ఒంటి నిండా మచ్చలు ఉంటాయని శపిస్తాడు. ఏ అందం వల్ల అహల్యకు ఈ పరిస్థితి వచ్చిందో ఆ అందం ఉండొద్దని అహల్యని రాయి గా మారుతావని శపిస్తాడు. వీటన్నిటికి కారణమైనా ఇంద్రుణ్ణి చూసి కోపం తో ఇక పై నీ పురుషాంగం ఉండదని, దేని కోసం అయితే ఈ దారుణానికి పాల్పడ్డావో అది నీ ఒంటి నిండా కలిగి ఉంటుందని శపిస్తాడు.

ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు

ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు

ఇంద్రుడు ఆశపడ్డది యోని కోసమే కాబట్టి అతని ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు వస్తాయి. ఈ విషయం ప్రపంచమంతా తెలియడం వల్ల ఇంద్రుడు ఒక గుహలో దాగి ఉంటాడు. ఇంద్రుడు తన బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో ప్రపంచం మొత్తం స్తంభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ శివునికి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మ కోరుతాడు.

యోని రూపాలన్నీ.. కన్నులుగా మారుతాయి

యోని రూపాలన్నీ.. కన్నులుగా మారుతాయి

శివుడు ఆ వెయ్యి యోనులను వెయ్యి కన్నులుగా మారుస్తాడు. అందుకే ఇంద్రునికి ఒంటినిండా వెయ్యి కన్నులు ఉంటాయి.

ఇంద్రుడికి శరీరం అంతా కళ్ళు ఉంటాయి. అందుకే ఎవరైనా తదేకంగా చూస్తుంటే ఈ మనిషికి ఒళ్ళంతా కళ్ళే అంటారు. దీనికి అసలు అర్ధం తనది కానిదాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధిఅన్నమాట.

అహల్య తప్పు లేదట

అహల్య తప్పు లేదట

అహల్య తప్పు ఏమీ లేదని గౌతముడు మహర్షి తర్వాత అనుకుంటాడు. ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగక క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు. నువ్వు రాయిగా మారిపో అని శపించాడు. దివ్యదృష్టితో చూస్తే అహల్య తప్పులేదని అనుకుంటాడు. రాముడి పాదం తాకినప్పుడు.. రాయి నుంచి స్త్రీగా మారుతావు అని అహల్యకు గౌతమ మహర్షి శాపవిమోచనం ప్రసాదించాడు.

భర్తే అనుకుని అలా చేసిందట

భర్తే అనుకుని అలా చేసిందట

అహల్య ఎంతో సాత్వికురాలుని.. ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సరసాలు ఆడినప్పుడు, భర్తే అనుకుని మురిసిపోయింది తప్ప, ఆమెకు పర పురుష వ్యామోహం అనేది కలలో కూడా లేదని కొన్ని పురాణాల్లో ఉంది. భర్త తొందరపాటుతో శాపం పెట్టినా కోపగించుకోలేదని.. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారు అని సరిపెట్టుకుందట.

Image Source :https://www.speakingtree.in/

English summary

lesser known facts about ahalya wife of gautama maharishi

lesser known facts about ahalya wife of gautama maharishi