ఉత్తర కొరియా ఆడ సైనికులను అక్కడి ఆఫీసర్లు ఇష్టానుసారంగా అనుభవిస్తున్నారు

Posted By:
Subscribe to Boldsky

ఉత్తరకొరియాలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఎలా చెబితే అలా సాగుతుంది. ఆయన మాటే అక్కడ శాసనం అనే విషయం అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యాలను బయపెట్టిస్తున్న ఆయన ఉత్తరకొరియాలోని ప్రజలను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. వారు నిత్యం ఎన్ని కష్టాలుపడుతున్నా కిమ్ కు మాత్రం పట్టదు. అక్కడి ప్రజలతో ఆర్మీలో పని చేసే మహిళలు దీనవ్యవస్థలో మగ్గిపోతున్నారు.

పోషకాహార లోపం

పోషకాహార లోపం

ఉత్తరకొరియా వాసులు పోషకాహార లోపం, పారిశుద్ధ్య సమస్యలతో సతమతమవుతున్నది ఈ మధ్య వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ నిషేధంతో ఏకాకిగా మారిన ఉత్తర కొరియాలో చాలా దుర్భర పరిస్థితులున్నాయి. అక్కడి ప్రజలు సరైన ఆహారం లేక చాలా ఇబ్బందులుపడుతున్నారు.

ఆడవారి పరిస్థితి దారుణం

ఆడవారి పరిస్థితి దారుణం

ఆ మధ్య ఉత్తర కొరియా సైనికుడు దక్షిణకొరియాకు పారిపోతుండడగా ఉత్తరకొరియా సైనికులు కాల్పులు జరిపారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సైనికుడికి చికిత్స చేసినప్పుడు అతని కడుపులో పురుగులు, పొడవైన పరాన్నజీవులు కనిపించాయని దక్షిణ కొరియాకు చెందిన ఒక డాక్టర్ చెప్పాడు. ఇక ఉత్తర కొరియా సైన్యంలో మగవారి పరిస్థితే చాలా దారుణంగా ఉంటే ఆడవారి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవొచ్చు.

అత్యాచారాలు

అత్యాచారాలు

ఉత్తర కొరియా సైన్యంలో చాలా మంది మహిళలపై అత్యాచారాలు సాగుతూనే ఉన్నాయంట. అంతేకాదు ఉత్తరకొరియా ఆర్మీ మహిళలకు సరైన పోషకాహరం కూడా అందడం లేదంట. దీంతో వారికి నెలసరి కూడా సరిగ్గా రావడం లేదంట.

వయసుకొచ్చిన ప్రతి మహిళా

వయసుకొచ్చిన ప్రతి మహిళా

ఉత్తరకొరియాలో వయసొచ్చిన ప్రతి మహిళ సైన్యంలో చేరాలి. స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి రంగాల్లో ప్రతిభ చూపించే మహిళలు మాత్రం సైన్యంలో చేరాల్సిన అవసరం లేదు. మిగతా యువతులంతా 18ఏళ్లు వచ్చాయంటే తమవంతుగా సైన్యానికి సేవలందించడానికి సిద్ధంకావాలి.

చిన్నచిన్న గదులు

చిన్నచిన్న గదులు

ఉత్తర కొరియా ఆర్మీలో పని చేసే మహిళల కోసం చిన్న గదులు కేటాయిస్తారు. ఒక్కో గదిలో పదమూడు మంది ఉంటారు. ప్రతీ మహిళకు ఓ చిన్న చెక్క డబ్బా ఇస్తారు. అందులోనే బట్టలు పెట్టుకోవాలి.

రెండు ఫొటోలు

రెండు ఫొటోలు

ఇక ఆ డబ్బా పై రెండు ఫొటోలుంటాయి. ఒకటి ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్‌ది, రెండోది ఉత్తరకొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్‌ది. ఈ బొమ్మలు ప్రతి సైనికురాలికి ఇచ్చిన పెట్టెలపై ఉంటాయి.

బెడ్ ఎలాగుంటుందో తెలుసా ?

బెడ్ ఎలాగుంటుందో తెలుసా ?

సైనికురాళ్ల గదుల్లో వరి పొట్టుతో తయారు చేసిన బెడ్స్ ఉంటాయి. వాటిపైనే పడుకోవాలి. ఆ మహిళలు ఎన్ని ఇబ్బందులుపడ్డా సరే.. వాటి నుంచి ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే ఆ బెడ్స్ నే ఉపయోగించాలి.

ఆ నీటితోనే స్నానం చెయ్యాలి

ఆ నీటితోనే స్నానం చెయ్యాలి

సైన్యంలో పని చేసే మహిళలు స్నానం చేసేందుకు సరిగ్గా బాత్రూమ్ లు కూడా ఉండవు. సాధారణంగా అక్కడ చలి చాలా దారుణంగా ఉంటుంది. అయినా కూడా ఆడ సైనికులు చల్లటి నీటితోనే స్నానం చెయ్యాలి. కొండల నుంచి కిందకు వచ్చే నీటికి ఓ పైపు ఉంటుంది. దాంతో వచ్చే నీటి ద్వారానే స్నానం చెయ్యాలి. అది కూడా ఆరుబయటే.

ఒక్కపూట తిండికోసమే

ఒక్కపూట తిండికోసమే

కనీసం ఒక్కపూటయినా తిండి దొరుకుతుందనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరిన మహిళలు ఉత్తరకొరియాలో చాలా మంది ఉన్నారు. ఆకలి కష్టాల నుంచి గట్టేక్కేందుకే ఇలా సైన్యంలో చేరే మహిళలు ఉత్తరకొరియాలో చాలా మంది ఇప్పటికీ ఉన్నారు.

పురుషాధిక్యం ఎక్కువ

పురుషాధిక్యం ఎక్కువ

ఉత్తరకొరియాలో మహిళలకు అస్సలు విలువ లేదు. ఇక్కడ పురుషాధిక్యంగా ఎక్కువగా ఉంటుంది. ఇక సైన్యంలో పని చేసే పురుషులకు అన్ని పనులు ఒకేలా అప్పగిస్తారు. ఇంకా ఎక్కువగా మహిళలతోనే చేయిస్తారు. శుభ్రం చేసే పనులు మొత్తం మహిళలకే అప్పగిస్తారు. అలాగే వంట చేసే బాధ్యత కూడా మహిళలదే.

పని ఎక్కువ తిండి తక్కువ

పని ఎక్కువ తిండి తక్కువ

ఉత్తర కొరియా ఆర్మీలో పని చేసే ఆడవారికి పని చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తిండి చాలా తక్కువగా ఉంటుంది.

అలాగే కఠోర శిక్షణ ఉంటుంది. దీంతో చాలామంది మహిళలు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.

నెలసరి రాదు

నెలసరి రాదు

ఉత్తర కొరియాలోని ఆడ సైనికులకు నెలసరి కూడా అంతంతమాత్రంగానే వస్తుంటుంది. చాలా సందర్భాల్లో నెలల తరబడి మహిళలకు నెలసరి రాదు. దాదాపు ఆరు నెలలకొకసారి నెలసరి అయ్యే మహిళలు చాలామందే ఉండేవారు. కొందరు మహిళలు ఏళ్ల తరబడి నెలసరి రాకుండానే బతుకుతున్నారు.

మరుగుదొడ్లు ఉండవు

మరుగుదొడ్లు ఉండవు

ఎప్పుడో సంవత్సరానికొకసాని కదా నెలసరి వచ్చేది అనుకుంటుందో ఏమో ఉత్తరకొరియా ప్రభుత్వం అందుకే మహిళ సైనికులకు శానిటరీ ప్యాడ్స్‌ ఇవ్వరు. ఇటీవల శానీటరీ ప్యాడ్స్ ఇస్తున్నా అవి కూడా అరకొరనే. ఇక మహిళా సైనికులకు మరుగుదొడ్లు ఉండవు. అందరూ ఆరుబయటికే వెళ్లాలి. ఒక కొందరు పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుంది.

ఇష్టానుసారంగా అత్యాచారాలు

ఇష్టానుసారంగా అత్యాచారాలు

ఉత్తరకొరియాలోని మహిళ సైనికులు నిత్యం అత్యాచారాలకు గురవుతూనే ఉంటారు. ఇష్టానుసారంగా అత్యాచారాలు జరిగిన పట్టించుకునే నాథుడే ఉండడు. చాలా మంది మహిళా సైనికులపై అత్యాచారం రోజూ అక్కడ జరుగుతూనే ఉంటుంది.

కమాండర్లు

కమాండర్లు

ఉత్తరకొరియా ఆర్మీ కంపెనీ కమాండర్లు గదుల్లోకి మహిళా సైనికులను పిలిపించుకుంటారు. వారికిష్టం ఉన్నా లేకున్నా వారిని రాత్రి మొత్తం వారి గదుల్లోనే ఉంచుకుని సెక్స్ చేస్తారు. అలా రోజు చాలామంది మహిళలను ఉత్తరకొరియా ఆర్మీ ఆఫీసర్లు అనుభవిస్తూనే ఉంటారు. అయినా ఎవరూ పట్టించుకోరు.

English summary

life as woman in north korea army soldiers raped and periods stop

life as woman in north korea army soldiers raped and periods stop.. A former soldier says life as a woman in the world's fourth-largest army was so tough that most soon stopped menstruating. And rape, she says, was a fact of life for many of those she served with.
Subscribe Newsletter