వాహనాలు డీజిల్ కు బదులుగా కాఫీ తాగుతాయి! మురుగు నుంచి వచ్చే దాని నుంచి కూడా వాహనాలు నడుస్తాయి

Written By:
Subscribe to Boldsky

చాలా మందికి కాఫీ అంటే చాలా ఇష్టం. ఒక కప్ కాఫీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుందని చాలా మంది భావించి తాగుతూ ఉంటారు. మరి బస్సులు కూడా కాఫీ తాగుతాయా అంటే అవి కూడా తాగుతాయంటా. లండన్‌లోని డీజిల్ కు కాకుండా కాఫీకి అలవాటుపడ్డాయి. కాఫీ ద్వారానే అవి తిరుగుతున్నాయి.

కాఫీ గింజల వ్యర్థాలు

కాఫీ గింజల వ్యర్థాలు

బయో ఫ్యూయల్ తయారీలో కాఫీ గింజల వ్యర్థాలనూ వినియోగిస్తారు. అలా తయారు చేసిన ఇంధనంతో లండన్ లో కొన్ని బస్సులు తిరిగాయి.

చాలా ప్రయోజనాలు

చాలా ప్రయోజనాలు

ఇలా కాఫీ ఆయిల్‌ ఆధారంగా బస్సులు నడవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వాతావరణ కాలుష్యం అస్సలు ఉండదు. ఇప్పటికే వంట నూనెలు, మాంసం తయారీలో వస్తున్న వ్యర్థాల ద్వారా తయారుచేస్తున్న బయో ఫ్యూయల్‌ ద్వారా లండన్ చాలా బస్సులు నడుస్తున్నాయి.

దాన్ని మొత్తాన్ని ఉపయోగించి బయో ఫ్యూయల్

దాన్ని మొత్తాన్ని ఉపయోగించి బయో ఫ్యూయల్

ఇక కాఫీ గింజల పిప్పితో తయారైన బయో ఫ్యూయల్‌ ద్వారా కూడా బస్సులు నడవడం మొదలైంది. లండన్‌లో యేటా 2 లక్షల టన్నుల కాఫీ వృథా అవుతోందట. దాన్ని మొత్తాన్ని ఉపయోగించి బయో ఫ్యూయల్ తయారు చేస్తున్నారు.

ఇంజన్లను మార్చాల్సిన అవసరం లేదు

ఇంజన్లను మార్చాల్సిన అవసరం లేదు

ఇక డీజిల్‌తో కలిపి తయారు చేసే ఈ ఇంధనం వినియోగానికి బస్సు ఇంజన్లను మార్చాల్సిన అవసరం కూడా లేదట. ఒక బస్సు ఏడాది మొత్తం నడవాలంటే 25 లక్షల 50 వేల కప్పుల కాఫీ వ్యర్థాలు అవసరం అట.

కాఫీతోనే వాహనాలు

కాఫీతోనే వాహనాలు

లండన్ లో ఈ కాఫీ ఆయిల్‌ను బయో బీన్ టెక్నాలజీ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఇక భవిష్యత్‌లో పూర్తిగా డీజిల్ తో కాకుండా కాఫీతోనే వాహనాలు నడిచే అవకాశం కూడా ఉంది.

డీజిల్ కు బదులుగా

డీజిల్ కు బదులుగా

చాలా దేశాలు పెట్రోలు, డీజిల్ వంటి వాటికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తూనే ఉన్నాయి. ఇక కాఫీ వ్యర్థాల నుంచి 15 నుంచి 20 శాతం ఇంధనం వస్తుంది.

స్వీడన్ చాలా ఫాస్ట్

స్వీడన్ చాలా ఫాస్ట్

ఇక జీవ ఇంధనాల వినియోగంలో స్వీడన్ చాలా ఫాస్ట్ ఉంది. స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో చాలా వరకు వాహనాలు ఇలాంటి ఇంధనాలతోనే నడుస్తున్నాయి.

మురుగు నుంచి మీథేన్

మురుగు నుంచి మీథేన్

స్పీడన్ లో మురుగు నుంచి మీథేన్ ఉత్పత్తి చేసి దాన్ని బయోగ్యాస్‌గా వాడుతున్నారు. అలాగే ఆహారవ్యర్థాల నుంచి కూడా ఇంధనాలు తయారు చేసే పనిలో ఉన్నారు.

థర్మల్ పవర్ తగ్గుతోంది

థర్మల్ పవర్ తగ్గుతోంది

అలాగే చాలా చోట్ల థర్మల్ పవర్ తగ్గుతోంది. సోలార్ పవర్ పెరుగుతోంది. విద్యుత్‌తో నడిచే వాహనాలను కూడా చాలా దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు.

జీవ ఇంధనాలనూ వినియోగిస్తున్నారు

జీవ ఇంధనాలనూ వినియోగిస్తున్నారు

అలాగే జీవ ఇంధనాలనూ కూడా వినియోగిస్తున్నారు. మొత్తానికి కాఫీ వ్యర్థాల నుంచి తయారు చేసే బయో ఇందనం ద్వారానే వాహనాలన్నీ నడిస్తే కాలుష్యం చాలా మేరకు తగ్గిపోతుంది.

English summary

london buses to be powered by waste coffee grounds

london buses to be powered by waste coffee grounds
Story first published: Wednesday, March 21, 2018, 15:30 [IST]