For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాలుని శరీరంలో బందీ అయిన పురుషుని కథ:

|

ఇది 60 సెంటీమీటర్ల ఎత్తు 5 కేజీల బరువు ఉండే వ్యక్తి కథ. అతని పేరు “మన్ ప్రీత్ సింగ్”

తన చీకీ స్మైల్ జనాల దృష్టిని ఆకర్షిస్తుంది మరియు అతని అమాయకత్వం అతనిపై ఒక జాలిని కలిగిస్తుంది. కానీ అతని చమత్కారమైన ట్రిక్స్ మిమ్మల్ని నిశ్చేష్టులని చేస్తుంది. ముద్దుగా అందరూ అతన్ని రియల్ ప్రాంక్స్టర్ అంటారు.

ఈ మన్ ప్రీత్ సింగ్ వయసు 23సంవత్సరాలే. భారతదేశంలో ఒక మారుమూల గ్రామంలో నివసించే ఇతను, తన గ్రామ ప్రజల అశేష ప్రేమను చూరగొన్నవాడిగా ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే దేవుని అవతారంగా ఈ మన్ ప్రీత్ ను భావిస్తారు అంటే అతిశయోక్తి కాదు.

పూర్తి వివరాలకై ఈ వ్యాసం చదవండి:

Mysterious Condition Stopped The Growth Of This 23-year-old Man

పుట్టింది భారత దేశంలోనే :
భారత దేశంలో వాయవ్య దిక్కున ఉన్న పంజాబ్ రాష్ట్రంలో మన్ ప్రీత్ జన్మించాడు. 5కేజీల బరువును కలిగి 60 సెంటీమీటర్లు (1.96 అడుగులు) ఎత్తుతో ఉంటారు. ఈ ఎదిగీ ఎదగని శరీరం వలన అనేక చిత్రమైన సమస్యలను సైతం ఎదుర్కొన్నాడు. నడవలేకపోవడం మరియు “మా , మామా” వంటి కొన్ని పదాలే మాట్లాడడం వంటివి. ఇతను నడవలేని కారణంగా, ఎక్కడికెళ్ళినా ఎత్తుకుని వెళ్ళాల్సిందే.

ఇతన్ని 'పిన్ట్-సైజ్డ్ మ్యాన్' అని పిలుస్తారు :
మన్ప్రీత్ జన్మించినప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ అతని ఎదుగుదలలో అసాధారణ మార్పులు చోటుచేసుకున్నాయి. సంవత్సరం తర్వాత కొద్దిగా నడవగలగడం, మాట్లాడడం కూడా చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం అతని పట్ల పసిపిల్లల వంటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు ఎక్కడికెళ్ళినా తన అత్తా మామల సహాయంతోనే కదులుతుంటాడు. ముఖ్యంగా ఎక్కడికెళ్ళినా ఎత్తుకోవలసిందే.

అతని గురించి మరికొంత :

మన్ప్రీత్ వాపుతో కూడిన అరచేతులు, పాదాలతో బాధపడుతుందని చెబుతారు. మరియు అతను సాగిన చర్మంతో పెద్ద ముఖం కలిగి ఉంటాడు. అతని మామయ్య చెప్పిన ప్రకారం అతను కేవలం కొన్ని పదాలను మాత్రమే చెప్పగలడు మరియు అతను ముఖ్యంగా సంజ్ఞల ద్వారా సంభాషించేవాడు. మన్ప్రీత్ నవ్వవచ్చు, బిగ్గరగా అరవడo మరియు కేకలు వేయడం చేయవచ్చు; అయితే, అతను మాట్లాడలేడు లేదా సంభాషణను కలిగి ఉండలేడు.

అతని కుటుంబం గురించి :

మన్ప్రీత్ కు 17ఏళ్ళ వయస్సులో ఉన్న ఒక సోదరి ఉంది, మరియు మంగళ్ దీప్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. ఈ తోబుట్టువులు ఇద్దరూ మన్ ప్రీత్ కు భిన్నంగా భౌతికంగా మరియు మానసికంగా ఎదుగుదలను కలిగి ఉన్నారు కూడా. మన్ప్రీత్ వారి అత్త మరియు మామలతోనే కలిసి ఉంటాడు, అతను వారితో మాత్రమే సంతోషంగా ఉండగలడు.

మన్ ప్రీత్ ను తన నివాసంలో కొన్నిసార్లు వదిలినా, అతను విచారంగా ఉండడం మరియు ఆహారం తినడానికి నిరాకరించే చర్యలకు పూనుకునేవాడు. కానీ అతను తన అత్తామామలతో ఉన్నప్పుడు మాత్రం ఆనందకరమైన స్థితిలో ఉండేవాడని అతని అత్త వెల్లడించింది. అందువల్ల వారు అతన్ని దత్తత తీసుకోవలసి వచ్చింది కూడా.

జనాలు దేవునిగా భావించడం మొదలుపెట్టారు :

అతను దత్తత తీసుకున్న ఇంటిలో స్థానికులు మన్ప్రీత్ ను దేవునిలా ఆరాధించారని నమ్ముతారు, ఎందుకంటే అతను దేవుడి అవతారం అని భావిస్తారు కాబట్టి. చాలామంది గ్రామస్తులు తరచూ మన్ ప్రీత్ ఇంటికి వెళ్లి అతని నుండి దీవెనలు అందుకుంటారు. అతనిని సందర్శించడం మరియు అతని కాళ్ళ ముందు మోకరిస్తూ ఉన్న భక్తుల ప్రవాహాన్ని చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. భక్తుల తలపై మన్ప్రీత్ సరదాగా ఎలా తాకుతాడో కూడా చూడవచ్చు.

అతని పరిస్థితి గురించి వైద్యుల కథనం :

వైద్యులు ఈ యువ మన్ప్రీత్ "లారోన్ సిండ్రోమ్" అనే వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది అరుదైన జన్యు పరమైన రోగమని తెలియజేసారు. కానీ, దురదృష్టవశాత్తు అతని కుటుంబ నేపథ్య పరంగా, వైద్య ఖర్చుల నిమిత్తం £5000 అనగా సుమారు నాలుగు లక్షలా 50 వేల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చయ్యే ప్రాథమిక దర్యాప్తులకు సైతం చెల్లించలేక పోయింది. తద్వారా అతని చికిత్స కూడా ప్రశ్నార్ధకం అయింది.

అతని పరిస్థితి గురించి :

"లారోన్ సిండ్రోమ్" అనే జన్యుపరమైన రోగoతో నివసించే ప్రజలు, ఇన్సులిన్ వంటి ఒకటవ రకం పెరుగుదల కారకం వలన లేదా ఐ.జి.ఎఫ్-1 అని పిలువబడే హార్మోన్ లేకపోవడం వలన బాధపడుతున్నారు. నిజానికి ఈ హార్మోన్లు కణ పెరుగుదలని ప్రేరేపించి మరియు కొత్త కణాలను ఏర్పరచడానికి సహాయ పడుతాయి.

అతని కుటుంబము చూపిన ప్రత్యేక శ్రద్ద :

కుటుంబం అతని పరిస్థితికి మరియు అతని భవిష్యత్ గురించి భయపడి, ఎక్కడెక్కడో వైద్యులను కూడా సంప్రదించారు. కానీ నిధుల కొరత కారణంగా, కనీస వైద్య పరీక్షలు చేయలేని నేపధ్యంలో మిన్నకుండి పోయారు. కానీ, స్థానికులు, వైద్యులు కొంతమేర సహాయం చేస్తున్నారు.

ఇలా జన్యుపరమైన సమస్యలతో, ఫ్లోరైడ్, పోలియో వంటి సమస్యలతో అనేకులు ఈ భారత దేశంలో ఉన్నారు. వీళ్ళను చూసి జాలి పడకపోయినా పర్లేదు కానీ, చులకన చేసి మాత్రం చూడవద్దు. వారి భాదను అనుభవించే వారికే తెలుస్తుంది. కొందరు భాదను తగ్గించాల్సింది పోయి సూటి పోటి మాటలతో వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటారు. ఒక్క రూపాయ్ ఆదాయం లేకపోయినా. ఇటువంటి చర్యల వలన ఎవరు అసలైన దివ్యాంగులు అని కూడా అర్ధమవుతుంది. శారీరిక బలహీనత వారి తప్పు కాదు, కానీ సూటి పోటి మాటలతో వారిని వేధించడం మాత్రం, ఒకరకమైన మానసిక రోగం కిందకే వస్తుంది. ఇక్కడ ఆసక్తికలిగించే విషయం అని మేము చెప్పినా, మా ఆలోచన మాత్రం అటువంటి వారి పరిస్థితి మీ ముందుకు తీసుకుని రావడమే.

ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? మీ అభిప్రాయాలను మా కామెంట్ సెక్షన్ లో తెలుపండి.

English summary

Mysterious Condition Stopped The Growth Of This 23-year-old Man

Manpreet Singh is a 23-year-old man who was born in a small town in Punjab, India. He just weighs 11 lbs but as he grew, his height stunted and he stopped growing. The locals in his village treat him with utmost love and attention, as they believe he is an incarnation of the God! He is called the 'pint-sized man'.
Desktop Bottom Promotion