ఆమె సొంతం సీఎం చెల్లెలు అయినా టీ అమ్ముకుని బతుకుతోంది.. గ్రేట్

Written By:
Subscribe to Boldsky

ఒక రాష్ట్రానికి ఉండే సీఎం దూర బంధువులు కూడా ముఖ్యమంత్రి ద్వారా ఏదో ఒక లబ్ది పొందాలని చూస్తారు. సీఎం పేరు చెప్పుకుని ఎంతో కొంత వెనకేసుకుంటారు. లేదంటే నేరుగా సీఎంను కలిసి ఏదో మాకు కొంత కాస్త చేయండి అని కోరతారు. కానీ సొంతం సీఎం సోదరి అయిన ఆమె మాత్రం తన సోదరుడిని ఏమి ఆశించకుండా తన బతుకు తానే బతుకుతుంది.

శశిసింగ్ (శశిపాయల్) జీవితం

శశిసింగ్ (శశిపాయల్) జీవితం

దేశంలోని అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ చెల్లెలు శశిసింగ్ (శశిపాయల్) జీవితం గురించి తెలుసుకుంటే అందరూ ఆశ్యర్యపోతారు. తన అన్న ముఖ్యమంత్రి అయినా ఈ చెల్లి మాత్రం ఇప్పటికీ టీ అమ్ముతూ సాధారణ జీవనం సాగిస్తోంది. యోగి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాదిపైనే అయిపోతుంది.

చాలా సార్లు ఎంపీగా

చాలా సార్లు ఎంపీగా

ఇక యోగి ఆదిత్యానాథ్‌ గతంలోనూ చాలా సార్లు ఎంపీగా కూడా చేశాడు. కానీ ఆయన చెల్లెలు శశిసింగ్ మాత్రం చాలా ఏళ్లుగా చిన్న టీ దుకాణంపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంది.

టీ కొట్టు నడుపుతోంది

టీ కొట్టు నడుపుతోంది

శశిపాయల్ ఉత్తరాఖండ్‌లోని కోఠార్‌ గ్రామంలో చిన్న టీ కొట్టు నడుపుతోంది. దాని ద్వారానే ఆమె తన కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.

చిన్న పూజా సామగ్రి దుకాణం

చిన్న పూజా సామగ్రి దుకాణం

ఇక కోఠార్ గ్రామంలో పార్వతి మందిరం సమీపంలో శశిపాయల్ భర్త పూరన్‌సింగ్‌ ఓ చిన్న పూజా సామగ్రి దుకాణం నడుపుతున్నారు. ఇలా ఈ ఇద్దరూ భార్యాభర్తలు ఒకరిపై ఆధారపడకుండా తమ పని తాము చేసుకుంటున్నారు.

చిన్నప్పుడు అలా అనేవాడట

చిన్నప్పుడు అలా అనేవాడట

శశిపాయల్ సోదరులందరి స్వభావం కూడా వైవిధ్యంగా ఉందట. ఇక చిన్నప్పుడు యోగి పెద్దయ్యాక అందరికీ సేవ చేస్తానని చెప్పేవాడట. అప్పడు ఆ మాటను యోగి కుటుంబం సభ్యులు చాలా తేలికగా తీసుకున్నారట. కానీ ఇప్పుడు అది నిజమైంది. ఇక శశిపాయల్ తన అన్న యోగికి రాఖీ కట్టి 23 ఏళ్లు పైగా అయ్యిందట.

ఆశ్చర్యపోతున్నారు

ఆశ్చర్యపోతున్నారు

వాస్తవానికి శశిపాయల్ స్థానంలో మరొకరు ఉంటే తన అన్న ముఖ్యమంత్రి అనే దర్పం కచ్చితంగా ప్రదర్శిస్తారు. ప్రదర్శించకుండా అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న శశిపాయల్‌ను చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు .

నిదర్శనం

నిదర్శనం

యూపీ సీఎం యోగి తన రాజకీయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులకు ఏమాత్రం స్థానం కల్పించలేదనడానికి ఇదొక్క సంఘటన నిదర్శనం.

Image credit (All photos)

English summary

meet the sister of up cm yogi adityanath who sells tea and pooja flowers

meet the sister of up cm yogi adityanath who sells tea and pooja flowers
Story first published: Saturday, March 24, 2018, 15:30 [IST]