For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ప్రతికూలతలు ఆమె విజయాన్ని, ప్రాచుర్యాన్ని ఆపలేకపోయాయి

|

ఒక వ్యక్తి విజయాన్ని రుచి చూడాలంటే, అతడు / ఆమె అనేక అడ్డంకులను అధిగమించడానికి మరియు ఏ సమయంలోనైనా బలంగా ఉండేలా తమను తాము సమాయత్తపరచుకోవాలి. మన బలహీనతలను అంగీకరించి, క్రమంగా వాటిపై పనిచేయడం, పోరాడడం ద్వారా ఖచ్చితంగా విజయం సాధించగలరన్న మాట వాస్తవం.

అరుదైన జన్యుపరమైన రుగ్మతతో జన్మించిన ఒక మోడల్ కథనం ఇప్పుడు చెప్పుకుందాం. మెలానీ గైడోస్ పేరుని కలిగిన ఈమోడల్ అత్యంత అరుదైన జన్యు సంబంధమైన పరిస్థితి అయిన ఎక్టోధర్మల్ డైస్ప్లాసియా అనే వ్యాధితో జన్మించింది. కానీ ఇప్పుడు ఫాషన్ పరిశ్రమలోనే అత్యంత ప్రసిద్దిగాంచిన మోడల్ గా పేరు గణించింది. ఫాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఆమె పేరు తెలియని వారు లేరు అంటే ఆశ్చర్యం కలుగకమానదు. అందం కన్నా వ్యక్తిలో ఉండాల్సిన అంశాలు అనేకం ఉన్నాయంటూ, ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని అందంగా చూపి నవ్వులోనే భావాలను పలికించగల గొప్ప మోడల్ మెలానీ గైడోస్. చూడడానికే భయానకం కలిపించే రూపకం ఆమెది అంటన్న అనేక మంది చీత్కారాలను ఎదుర్కొంది కూడా.

ఈ ప్రతికూలతలు ఆమె విజయాన్ని, ప్రాచుర్యాన్ని ఆపలేకపోయాయి :

ఆమె తన వైద్య పరిస్థితిని ఎలా అధిగమించిందో తెలుసుకోవాలంటే, ఆమె కథ తెలుసుకోవలసిందే. ఆమె తన పెరుగుదలలో కూడా అసాధారణతలను ఎదుర్కొంది. కానీ అన్ని సమస్యలను బద్దలుకొట్టి ఇప్పుడు ఒక ఉన్నతమైన పేరు సంపాదించుకుంది, క్రమంగా అనేక మంది ఆత్మన్యూనతలు తొలగడానికి ఒక మార్గదర్శిగా నిలిచింది.

ఆమె గురించిన మరిన్ని వివరాలు ...

All Images Source

ఆమె ఈ జన్యు సంబంధిత సమస్యతో జన్మించింది ...

ఆమె ఈ జన్యు సంబంధిత సమస్యతో జన్మించింది ...

మెలానీ గైడోస్, ఎక్టోడెర్మల్ అనే అసహజ జన్యుపరమైన రుగ్మతతో జన్మించింది. ఈ పరిస్థితిలో, దంతాలు, మృదులాస్థి, గోర్లు మరియు శరీరంలోని చిన్న ఎముకలు కూడా అసాధారణ ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాయి. క్రమంగా, మెలానీ శరీరమంతా ఎటువంటి వెంట్రుకలు లేకుండా బాల్డ్ లుక్ కలిగి, ఎటువంటి వయోజన దంతాలు కూడా లేకుండా అత్యంత దీన స్థితికి లోనైంది.

ఇలా బ్రతకడం అంత సులభమైన విషయమేమీ కాదు

ఇలా బ్రతకడం అంత సులభమైన విషయమేమీ కాదు

ఈ సమస్య, ఆమె జీవితంలోని ప్రతి దశలోనూ అనేక విమర్శలు ఎదుర్కోడానికి కారణమైనప్పటికీ, కనీసం కృత్రిమ దంతాల అమరికకు కూడా వెళ్ళకుండా, స్థిరమైన ఆలోచనా దృక్పధాన్ని చూపించింది. మరియు ఈ ఫాషన్ పరిశ్రమలో సులభమైన ప్రయాణం అంటూ ఎన్నడూ జరగలేదు; ఒడిదుడుకులు, హేళనల మద్య ఉన్నప్పటికీ తన మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా అడుగులు ముందు వేసింది మెలానీ.

అతనే, తన విజయం వెనుక :

అతనే, తన విజయం వెనుక :

ప్రతి మగవాని విజయం వెనుకా ఒక ఆడది ఉంటుంది అంటారు, కానీ అనేకమంది ఆడవారి విజయాల వెనుక మగవారి ప్రోత్సాహకరం కూడా ఉందన్న విషయం కూడా గుర్తుంచుకోవాలని, ఇటువంటి కథనాలు సూచిస్తూంటాయి. తన విజయానికి, తనను ప్రోత్సహించిన వ్యక్తిగా తన “బాయ్ ఫ్రెండ్” ని పేర్కొంటుంది మెలానీ. అతనొక్కడే తన మనసు అర్ధం చేసుకున్న వ్యక్తిగా, అతని అండతోనే తనకంటూ ఒక గుర్తింపు వచ్చిందని గర్వంగా చెప్తుంది మెలానీ.

నలుగురిలో ఉండాలంటే ..

నలుగురిలో ఉండాలంటే ..

తనకు సరైన రీతిలో దంతాలు లేని కారణాన, మరియు కృత్రిమ దంతాల అమరికను ఏర్పాటు చేసుకోని కారణంగా, నలుగురిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూసింత అసౌకర్యానికి లోనవుతూ ఉంటుంది.

ఆమె ఇంకా బాధపడుతోంది ... ఎందుచేతనంటే?

ఆమె ఇంకా బాధపడుతోంది ... ఎందుచేతనంటే?

ఉన్న సమస్యలతో పాటు గ్రహణం మొర్రి సమస్యను, మరియు అలోపేసియా కారణంగా శరీరంలో వెంట్రుక చాయలు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ జన్యు స్థితి సహజమైన జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. 8 నెలల పాటు కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకున్నా కూడా, అసౌకర్యానికి గురై వాటిని తీసివేసింది కూడా.

జీవితంలో తీసుకున్న మలుపు ...

జీవితంలో తీసుకున్న మలుపు ...

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది, “ ఎటువంటి కృత్రిమ మెరుగుదలలకు పోకుండా, నేను నాలాగే ఉండడం ద్వారా సౌకర్యవంతంగా ఉంటున్నాను. అందరూ నేను అసంపూర్ణంగా ఉన్నాను అని భావించవచ్చు, ఆ ఆలోచనలు వారి వారి మానసిక ఎదుగుదలమీద ఆధారపడి ఉంటుంది" , కేవలం వారు దంతాలను కలిగి ఉన్నందువలన, అవి లేనప్పుడు కలిగే భాదను వారు అర్ధం చేసుకోలేకపోవచ్చు., దంతాలను కలిగి లేనందున నేనెప్పుడూ బాధ పడలేదు, ఎందుకంటే నేను పుట్టుకతోనే వాటిని కలిగిలేను కాబట్టి”

 ఆమె పనికి తగ్గ గుర్తింపు పొందడానికి, తనకంటూ ఒక ప్రాచుర్యం కలగడానికి తాను తీసుకున్న నిర్ణయం :

ఆమె పనికి తగ్గ గుర్తింపు పొందడానికి, తనకంటూ ఒక ప్రాచుర్యం కలగడానికి తాను తీసుకున్న నిర్ణయం :

నేను ఎలా ఉన్నా, ఎటువంటి విధివిధానాలను కలిగి ఉన్నా, నాకంటూ నామీద ఒక నమ్మకం ఉంది. హేళనలను, వ్యతిరేకతలను పక్కన పెట్టి, నా మోడలింగ్ మరియు కెరీర్ మీద దృష్టి సారించాను. నాలోని ఆత్మ విశ్వాసం, నమ్మకం, పట్టుదల, ధైర్యం, తెగింపు మాత్రమే కాకుండా నా ఆత్మ సంతృప్తి కూడా నాకొక గుర్తింపును, సంతోషాన్ని తెచ్చిందని బలంగా నమ్ముతాను అని చెప్పింది మెలానీ.

నిజంగా స్పూర్తిదాయకంగా ఉంది కదూ... మనిషిని మనిషిలా చూడడం మానివేసి, ఇతరులలో లోపాలు ఎత్తి చూపించే అనేకమందికి బుద్దొచ్చేలా తన ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించిన మెలానీ, ఎందరికో ఆదర్శప్రాయం కాగలదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, జీవన శైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

She Is A Famous Model Who Has A Rare Genetic Disorder

Melanie Gaydos is a model who has ectodermal dysplasia, which is a genetic disorder that affects the growth of teeth, nails, pores, cartilage and bones. Though she suffers from this condition, Melanie is said to have forged a successful career as a model. She claims that her medical condition 'doesn't bother' her and 'it never did'.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more