For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మనిషి జుట్టు ఉపయోగించి చేసే విచిత్రమైన వస్తువుల జాబితా!

  By Gandiva Prasad Naraparaju
  |

  స్త్రీలు తమ పొడవైన కేశాలను ప్రదర్శించడానికి ఇష్టపడతారు, కానీ జుట్టు రాలుతుంటే ఎలా వుంటుంది? జుట్టు రాలుతుంటే ఆందోళన పడే వాళ్ళలో మనం ముందుంటాం.

  జుట్టు రాలడం చూసి ప్రజలు భయానికి గురవుతారు; అయితే ఈ ఊడిన జుట్టును ఉపయోగించి వ్యాపారం చేసి, ఈ జుట్టు తో ఉత్పత్తులను తయారుచేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే వారు కూడా ఉన్నారు. ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యపోకండి! మేము చెప్పే విషయాల గురించి వింటే మీరు “వావ్” అంటారు.

  Most Bizarre Ways Human Hair Has Been Used

  ఇక్కడ, ఈ వ్యాసంలో, మనిషి జుట్టును ఉపయోగించి తయారుచేసే అత్యంత విలక్షణమైన కొన్ని వస్తువుల జాబితాను మీకు పంచుతున్నాము!

  ఈ జాబితా ఖచ్చితంగా కొంతమందిని ఆశ్చర్యపరచవచ్చు, అలాగే కొంతమందికి కంపరం కూడా ఎత్తవచ్చు!!

  కాబట్టి, ఇదిగో ఆ జాబితా పరిశీలించండి...

  మనిషి జుట్టుతో కుర్చీ!

  మనిషి జుట్టుతో కుర్చీ!

  లండన్ కి చెందిన ఒకప్పటి హెయిర్ స్టైలిస్ట్ రోనాల్డ్ థాంప్సన్ కేశాలంకరణ చిట్కాలకు చాలా పేరుగాంచాడు. ఆయన ప్రముఖులకు, సూపర్ స్టార్లకు మాత్రమే పనిచేసేవారు. ఆయన “స్టిలేట్టో చైర్” అనే విలక్షణమైన మానవ చైర్ ని సృష్టించాడు. ఈ కుర్చీ కేవలం మనిషి జుట్టు తోనే తయారుచేయబడింది. లండన్ లోని బార్బర్ షాపులలో వదిలేసిన జుట్టు ఉపయోగించి ఊడ్చి పోగు చేసి ఈ కుర్చీని తయారుచేశారని ఆ శిరోజాలంకరణ నిపుణుడు తెలిపాడు.

  Image Courtesy:

  ఆభరణాలు

  ఆభరణాలు

  విక్టోరియన్లు చనిపోయినవారికి ప్రత్యేకమైన విధానంలో సంతాపం తెలిపేవారు. వారు చనిపోయిన వారి కేశాలను ఉపయోగించి ఆభరణాలు తయారు చేసే వారు. జుట్టు నుండి వారు నాగరాల లాంటి ఆభరణాలు తయారుచేసి వాటి మధ్యలో మృతుల జుట్టును అమర్చేవారు. చివరికి విక్టోరియా రాణి కూడా తన మెడ చుట్టూ చనిపోయిన రాజు గారి జుట్టుతో చేసిన లాకెట్ ను ధరి౦చేది!

  Image Courtesy:

  జుట్టుతో సోయా సాస్ !!

  జుట్టుతో సోయా సాస్ !!

  ఒకానొక చైనీస్ కంపెనీ వారు సోయా సాస్ కి మానవ కేశాల పొడిని, ద్రవాన్ని జోడించి ఒక కొత్త పదార్ధం తయారు చేస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. మానవ కేశాలు కూడా సోయా బీన్స్, గోధుమలు, తవుడు లాగే ప్రోటీన్లు అధికంగా కలిగి వుంటాయి కనుక తమకు మానవ కేశాలతో కూడిన సోయా సాస్ చేయాలన్న ఆలోచన వచ్చిందని సదరు కంపెనీ ప్రకటించింది.

  పంటలకు ఎరువు !!

  పంటలకు ఎరువు !!

  విచిత్రంగా అనిపించవచ్చు, కానీ పంటలకు ఎరువుగాను, కలుపు నివారకాలు గాను కూడా మానవ కేశాలను వినియోగిస్తున్నారు. ఇది చాలా విచిత్రమైన ఎరువే అయినా రసాయన ఎరువులకు గట్టి పోటీ ఇస్తోంది. పురాతన కాలంలో చైనా రైతులు మానవ కేశాలను, విసర్జితాలను కూడా ఎరువులుగా వాడే వారట!

  Image Courtesy:

  అగరుబత్తీ :

  అగరుబత్తీ :

  కాలిన జుట్టు నుంచి వచ్చే వాసన వికారంగా అనిపిస్తుంది, కానీ బాబాలు, ఆత్మలతో మాట్లాడే వారు ఆత్మలను వేల్లగోత్తదానికి మానవ కేశాలనే కాలుస్తారని మీకు తెలుసా? పైగా, మానవ కేశాలను పంది వ్యర్ధాలతో కలిపి కాలిస్తే వచ్చే వికృతమైన వాసన దెబ్బకు ఆత్మలు పారిపోతాయని కూడా అంటారు. సరే, ఇంకో దీర్ఘ శ్వాస తీసుకోండి, మీకు పిచ్చేక్కించే మరిన్ని ఉత్పత్తులు కూడా ఈ క్రింద ఇస్తున్నాం !

  బట్టలు !!

  బట్టలు !!

  మానవ కేశాలతో బికినీలు మొదలుకొని పెన్నీ లోఫర్లు, లో దుస్తులు, టోపీలు, చొక్కాలు, బనీన్లు లాంటివెన్నో తయారవుతున్నాయి. సరే, మానవ కేశాలతో చేసిన ఆ దుస్తులను ధరించడం చాలా భయంకర౦గా వుంటుంది అనేది పందెం కట్టి మరీ చెప్పచ్చు. మర్మావయవాల నుంచి సేకరించిన జుట్టుతో దుస్తులు తయారు చేసి సారా లూయీ బ్రియాన్ అనే ఆవిడ వాటిని ఆన్ లైన్ లో కూడా అమ్మిందట!! యాక్!!

  Image Courtesy:

  పశువులను అదిలించేందుకు :

  పశువులను అదిలించేందుకు :

  మీరు పశువులను పెద్దగా ప్రేమించని వారైతే, మీ అవాంచిత అతిదులైన జంతువులకు బాగా ఇష్టమయిన చోట మానవ కేశాలను ఒక బస్తాలోకి కట్టి వుంచండి! ఆ బస్తా అక్కడే ఉన్నంత సేపూ ఆ పశువులు ఆ ప్రదేశానికి, ఆ చాయలకు కూడా రావు! ప్రయత్నించి చూడండి!

  ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు మరిన్ని చదవాలనుకుంటే, ఈ క్రింద కామెంట్స్ సెక్షన్ ద్వారా మాకు తెలపండి.

  English summary

  Most Bizarre Ways Human Hair Has Been Used

  Most Bizarre Ways Human Hair Has Been Used,Can you imagine a chair which is made by using human hair? Well, find out about more such bizarre things that people have invented and created using human hair!
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more