అందంలోనూ.. అందులోనూ నీకెవ్వరూ సాటి

Written By:
Subscribe to Boldsky

అశోకచక్ర అవార్డు పొందిన నీర్జా భానోత్ పేరు ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. అసలు ఎవరు ఈమె. ఎందుకు ఈమె గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. అసలు ఎవరు ఈమె ఇప్పుడు అందరూ ఎందుకు ఈమె గురించే మాట్లాడుకుంటున్నారో మీరూ తెలుసుకోండి.

హైజాక్‌ చేశారు

హైజాక్‌ చేశారు

అమెరికాకు చెందిన పాన్‌ ఆమ్‌-73 విమానం ముంబైలోని సహార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి పాకిస్తాన్‌లోని కరాచీ జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తోంది. సరిగ్గా ఉదయం 5 గంటల ప్రాంతంలో కరాచీలో ఆ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్‌ చేశారు.

కరాచీలో ఆగింది

కరాచీలో ఆగింది

విమానం ముంబై నుంచి కరాచీ మీదుగా ఫ్రాంక్‌ఫర్ట్‌ వెళ్లాల్సి ఉంది. దీంతో కరాచీలో విమానం కొద్ది సేపు ఆగింది. అప్పటికే పక్కా ప్లాన్ వేసుకున్న కొందరు టెర్రరిస్ట్ లు సేమ్ విమాన సిబ్బంది మాదిరిగానే రెడీ అయ్యారు. ఫ్లైట్ బయల్దేరే సమయంలో నలుగురు ఉగ్రవాదులు సిబ్బంది దుస్తులు ధరించి విమానంలోకి వచ్చారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వారిని ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు.

కాల్పులు

కాల్పులు

ఉగ్రవాదులు వచ్చేటప్పుడే మెషిన్‌ గన్‌లు తీసుకొచ్చుకున్నారు. విమానం కదిలిన కొద్దిసేపటికే ఒక ఇద్దరు ఉగ్రవాదులు ప్రయాణికులను భయపించారు. మరో ఇద్దరు సిబ్బందిని భయపించారు. మొదట సిబ్బంది భయపకపోడంతో కాల్పులు జరిపారు.విమానాన్ని వారు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అందరినీ చెప్పినట్లు వినాలని భయపించారు. విమానాన్ని హైజాగ్ చేశారు. అయితే అందులో కొందరు ప్రయాణికులు ఉగ్రమూకలకు వ్యతిరేకంగా మాట్లాడడంతో వారిని అక్కడికక్కడే చంపారు.

పాస్‌పోర్టులను దాచిపెట్టింది

పాస్‌పోర్టులను దాచిపెట్టింది

అందులో ఉన్న 365 మంది ప్రయాణికులు, 13 మంది విమాన సిబ్బందిని నిర్బంధించారు. అయితే అమెరికన్లే లక్ష్యంగా వచ్చిన ఉగ్రవాదులు.. వారిని గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తుండగా నీర్జాకు ప్రయాణికుల వద్ద ఉన్న పాస్‌పోర్టులన్నింటినీ చిక్కకుండా దాచేసింది.

బాంబు పేల్చాలనుకున్నారు

బాంబు పేల్చాలనుకున్నారు

దీంతో ఉగ్రవాదులకు అమెరికన్లెవరో? విదేశీయులెవరో తెలుసుకోలేకపోయారు. దాదాపు చాలా గంటల పాటు డ్రామా నడిచింది. చివరకు లాభం లేదనుకుని విమానంలో బాంబులు పేల్చేందుకు సిద్ధమయ్యారు.

బయటకు పంపేందుకు ప్రయత్నం

బయటకు పంపేందుకు ప్రయత్నం

గంటల కొద్దీ ఉగ్రవాదులను తికమక పెట్టిన నీర్జా.. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంది. విమానంలోని అత్యవసర ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను బయటకు పంపడానికి ప్రయత్నించింది.

చిన్నారులకు అడ్డుగా

చిన్నారులకు అడ్డుగా

దీంతో టెర్రరిస్ట్ లు విమానంలో పిల్లలపై తూటాల వర్షం కురిపించడానికి ప్రయత్నించారు. చిన్నారులకు అడ్డుగా నిలిచింది నీర్జా. చిన్నారులను ప్రాణాలను రక్షించి నీర్జా మాత్రం తూటాలకు కుప్పకూలిపోయింది. అక్కడున్న చిన్నారుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను కాపాడుకునే సాహసం చేయలేకపోయారు. ప్రయాణికులను రక్షించేందుంకు ఆమె అన్ని రకాలుగా ప్రయత్నించారు. ధైర్యంగా ఉగ్రమూకలకు ఎదురెల్లారు. దీంతో నీర్జా ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది.

అశోకచక్ర

అశోకచక్ర

అయితే విమానంలో వందల మంది ప్రయాణికులు క్షేమంగా బయట పడడానికి కారణం నీర్జా ధీరత్వమే. ఉగ్రవాదుల తూటాలకు తీవ్రంగా గాయపడిన ఆ ధీరవనిత అదేరోజు (సెప్టెంబరు 5, 1986)న ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. మరణానంతరం నీర్జా ధైర్యసాహసాలకు గుర్తుగా భారత ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది.

తండ్రి జర్నలిస్ట్

తండ్రి జర్నలిస్ట్

నీరజా భానోట్ చండీగఢ్ లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈమె తల్లిదండ్రులు రమా భానోట్, హరీష్ భానోట్. ఈమె తండ్రి ముంబైలో జర్నలిస్ట్ గా పని చేసేవారు. హిందుస్తాన్‌ టైమ్స్ లో ఈయన 30 ఏళ్ల పాటు సేవలందించి తన 86వ ఏట 2008 జనవరిలో కన్నుమూశారు.

చంపింది వీరే

చంపింది వీరే

ఈ హైజాక్‌కు కారణమని భావిస్తున్న ఉగ్రవాదుల ఫొటోలను ఎఫ్‌బీఐ 2000 సంవత్సరంలో సేకరించింది. ఇప్పుడు వాటిని ఏజ్‌ ప్రొగ్రేషన్‌ సాయంతో మార్పులు చేసి విడుదల చేసింది. వారి పేర్లు వదౌద్‌ మహ్మద్‌ హఫీజ్‌ అల్‌ తుర్కీ, జమల్‌ సయీద్‌ అబ్దుల్‌ రహీమ్‌, మహ్మద్‌ అబ్దుల్లా ఖలీల్‌ హుస్సేన్‌ అర్‌రహయ్యల్‌, మహ్మద్‌ అహ్మద్‌ అల్‌ మునావర్‌ అని పేర్కొంది.

అబు నిదాల్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు

అబు నిదాల్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు

వీరంతా అబు నిదాల్‌ ఆర్గనైజేషన్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారని తెలిపింది.వీరిని పట్టించిన వారికి లేదా వీరి గురించి వివరాలు తెలిపిన వారికి రివార్డు అందిస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఒక్కో ఉగ్రవాది తలపై 5 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఇటీవలే నీర్జా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో నీర్జా సినిమాను తెరకెక్కించారు.

మోడల్

మోడల్

ఈమె విమాన సిబ్బందిగానే కాకుండా అంతకు పలు యాడ్స్ లోనూ నటించింది. మోడల్ గా పని చేసింది. ఈమెపై తీసిన మూవీకి అప్పట్లో మంచి క్రేజ్ వచ్చింది. రామ్ మధ్వాని దర్శకత్వంలో నీర్జా భానోత్ కథను సినిమా తీశారు. నీర్జా భనోత్‌గా సోనమ్ కపూర్ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 19 2016 న విడుదల అయ్యింది. అచ్చం హీరోయిన్ లాగే ఉండేది ఈమె.

English summary

neerja bhanot redefining hero

neerja bhanot redefining hero