అబ్బా.. ఏం ప్లాన్ వేశావమ్మా సరస్వతి! అసలు విషయం తెలిస్తే ఆమె ముఖం మీద "థూ" అని ఉమ్మేస్తారు

Written By:
Subscribe to Boldsky

వివాహామైన పది రోజులకే పాపం ఆ భర్త ప్రాణాలు వదిలాడు. అందరూ విధి కన్నెర్ర జేసింది అనుకున్నారు. బైక్‌పై భార్యతో వెళుతున్న భర్తపై ముగ్గురు దొంగలు దాడి చేశారు. వారిపై ఎదురుదాడికి దిగిన భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భార్యకు మాత్రం స్వల్పంలో చాలా స్వల్పంగా గాయాలయ్యాయి.

ఇదంతా జరిగింది ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో. గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలో తాజాగా ఈ సంఘటన జరిగింది.

శంకరరావు ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు

శంకరరావు ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావు (25)తో ఏప్రిల్ 28న వివాహమైంది.శంకరరావు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు.

పార్వతీపురం వచ్చారు

పార్వతీపురం వచ్చారు

వీరిద్దరూ మే 7 వ తేదీన ద్విచక్రవాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు పార్వతీపురం వచ్చారు. పనిలో పనిగా బంగారు దుకాణంలో నగలకు సంబంధించిన లావాదేవీలు చూసుకొని రాత్రి ఎనిమిదింటి తర్వాత స్వస్థలం చిట్టపులివలసకు బయల్దేరారు.

ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు

ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు

తిరిగి బయలుదేరి వెళ్తుండగా గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద సరస్వతి తనకు టాయ్ లెట్ వస్తుందని బైక్ ఆపమని భర్తకు చెప్పింది. ఇంతలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గౌరీ శంకర్రావును రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. దీంతో ఆయన రక్తపుమడుగులో కూలిపోయారు. సరస్వతిని బెదిరించి బంగారాన్ని లాక్కొని పరారయ్యారు.

ఇలాంటి అమ్మాయి కూడా ఉంటుందా

ఇలాంటి అమ్మాయి కూడా ఉంటుందా

ఆమె మెడలో ఉన్న సుమారు 6 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పరారయ్యారు. జనాలంతా కూడా ఇదే నిజం అనుకుని సోషల్ మీడియాలో పాపం అంటూ కన్నీళ్లు కార్చారు. ఇక అసలు విషయం తెలిస్తే ఎవరెవరు అయితే పాపం సరస్వతీ అన్నారో.. వారంతా ఇలాంటి అమ్మాయి కూడా ఉంటుందా అని ఆశ్యర్యపోతారు.

ప్లాన్‌ ప్రకారమే

ప్లాన్‌ ప్రకారమే

పెళ్లయిన పది రోజులకే భర్తను పోగొట్టుకుందని సానూభూతి చూపించిన వారంతా కూడా సరస్వతి ముఖం మీద థూ... అని ఉమ్మి వేస్తారు.

ఈ దాడి కేసులో ట్విస్ట్‌ బయటకు వచ్చింది. ప్లాన్‌ ప్రకారమే భర్త శంకర్‌ రావుపై భార్య దాడి చేయించింది. ఇష్టంలేని పెళ్లి కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడింది.

రౌడీషీటర్‌ తో భర్తను హత్య చేయించింది

రౌడీషీటర్‌ తో భర్తను హత్య చేయించింది

సరస్వతి తన మిత్రుడు శివ, విశాఖ రౌడీషీటర్‌ గోపితో భర్తను హత్య చేయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ.. పాలరాజుకు మనాపురం హైవేపై నిందితులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు భార్యనే పథకం ప్రకారం భర్తను హత్యచేయించిందని నిర్థారించారు.

అతనితో కాపురం చేయకుండా

అతనితో కాపురం చేయకుండా

ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంలో భార్య సరస్వతే భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వాస్తవానికి శివ సరస్వతి ప్రియుడు. కానీ పెద్దవాళ్లు ఇంకో పెళ్లి చేయడంతో అతనితో కాపురం చేయకుండా అతన్నే చంపేసింది సరస్వతి. ఇక తన ప్రియుడితో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటుందేమో.

భర్తల హత్యకు పథకాలు

భర్తల హత్యకు పథకాలు

చాలా మంది భార్యలు ఈ మధ్య భర్తల హత్యకు పథకాలు రచిస్తున్నారు. ఇష్టం లేని కారణంగా..అక్రమ సంబంధం బయటపడిందని..పడుతుందనే..ఇతరత్రా కారణాలతో హత్యలు చేసేస్తున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలా కేసులు బయటపడ్డాయి. తాజాగా సరస్వతి కేసు కూడా ఇలాంటిదే.

అంతటా హాట్ టాఫిక్

అంతటా హాట్ టాఫిక్

పెళ్లైన పది రోజులకే భర్తను అడ్డు తొలగించుకున్న ఈ నవ వధువు సరస్వతి ఇప్పుడు అంతటా హాట్ టాఫిక్ అయ్యింది. కానీ జనాలను మాత్రం వెర్రి పప్పలను బాగా చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని..భర్త చనిపోయాడని పోలీసులకే సరస్వతి కట్టు కథ చెప్పింది. దీంతో విజయనగరంల జిల్లా ఎస్పీ పాలరాజు కూడా కరిగిపోయి సరస్వతిని పరామర్శించారు. జాలి చూపించారు.

"థూ" అని ఉమ్మి వేస్తున్నారు

అసలు విషయం తెలిసే సరికి అందరూ కంగుతిన్నారు. ఇప్పుడు అదే సరస్వతి ముఖం మీద "థూ" అని ఉమ్మి వేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నా అమ్మాయిల మనసత్వాలు మారడం లేదు. పాపం.. అమాయకపు అబ్బాయిలు బలి అయిపోతున్నారు.

English summary

newly wed bride killed her husband

newly wed bride killed her husband
Story first published: Tuesday, May 8, 2018, 11:08 [IST]