For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్తరకొరియా స్త్రీలను లైంగికంగా వాడుకున్నారు.. అమెరికాపై కోపానికి కారణం అదే

1931లో మంచూరియా (కొరియాకు అనుకుని ఉండే ఈశాన్య చైనా) ను ఆక్రమించాక జపాన్ అణచివేత మరింత ఎక్కువైంది. కొరియా, మంచూరియాల్లోని స్త్రీలను జపాన్ సైనికులు, అధికారులు లైంగిక బానిసలుగా మార్చుకున్నారు.

|

ఆయన ఉత్తర కొరియాకు జాతిపిత.. ప్రస్తుతం ఉత్తరకొరియాకు దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాత.. ఆయన పేరు కిమ్ ఇల్ సంగ్. కిమ్ ఇల్ సంగ్ ఉత్తరకొరియాలో చరిత్ర లిఖించాడు. అక్కడి చరిత్రలో నిలచిపోయాడు. అక్కడి ప్రజల గుండెల్లో ఆయనకంటూ ఒక స్థానం సంపాదించాడు. అయితే ఉత్తరకొరియా గతంలో పడ్డ బాధలు చాలానే ఉన్నాయి.

జాతీయ సెలవు రోజులు

జాతీయ సెలవు రోజులు

ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి, తాత పుట్టిన తేదీలను ఉత్తరకొరియాలో జాతీయ సెలవు రోజులుగా గుర్తించారు. ఈ విధానం అక్కడ వారి మరణానికి ముందు నుంచే అమలులో ఉంది. అయితే ప్రస్తుతం ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు సంబంధించి మాత్రం ఇలాంటి విధానం ఏదీ కూడా అమల్లో లేదు.

డే ఆఫ్ ద సన్

డే ఆఫ్ ద సన్

ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ పుట్టిన రోజు ఏప్రిల్ 15. ఆ రోజు ఉత్తరకొరియాలో డే ఆఫ్ ద సన్ గా అందరూ ఘనంగా నిర్వహించుకుంటారు. అలాగే తన తండ్రి కిమ్ జాంగ్ ఉన్ దివంగత కిమ్ జాంగ్ ఇల్ పుట్టిన రోజును కూడా ఫిబ్రవరి 16న డే ఆఫ్ ద షైనింగ్ స్టార్ గా ఘనంగా జరుపుకుంటారు.

ఆటల్లో మంచి ప్రావీణ్యం

ఆటల్లో మంచి ప్రావీణ్యం

ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ కు ఆటల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఈయన గోల్ప్ క్రీడను బాగా ఆడేవారు. ఆ ఆటకోసం ప్రత్యేకంగా తన సమయాన్ని కేటాయించేవారు. కిమ్ ఇల్-సంగ్ ఏప్రిల్ 15, 1912 న జన్మించాడు.

సోషలిస్టు దేశం కాదు

సోషలిస్టు దేశం కాదు

ఉత్తర కొరియా సోషలిస్టు దేశం అస్సలు కాదు. ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ కూడా సోషలిస్టు సమాజాన్ని నిర్మించే లక్ష్యం ఏమీ లేదు. ఇక కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాం లోనే ఉత్తర కొరియాలో మార్కెట్ సంస్కరణలు ప్రారంభం అయ్యాయి.

స్వతంత్ర్యంగా ఎదగాలి

స్వతంత్ర్యంగా ఎదగాలి

కిమ్ ఇల్ సంగ్ బతికి ఉన్నప్పుడు అక్కడి ప్రజలకు చాలా విషయాలు నూరి పోశారు. మనం స్వతంత్రంగా బతుకుదాం. మన మనుగడే మనకు ముఖ్యం అనే సిద్దాంతాన్ని కిమ్ ఇల్ సంగ్ పాటించేవాడు. అలాగే కిమ్ ఇల్ సంగ్ కుమారుడు అధికారంలోకి వచ్చాక కూడా అలాంటి విధానాలే అమలు అయ్యాయి. ఆ తర్వాత కిమ్ ఇల్ సంగ్ మనువడు ప్రస్తుత ఆదేశ అధ్య

క్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా తన తాత అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు.

తాతను మించిన మనువడు

తాతను మించిన మనువడు

కిమ్ ఇల్ సంగ్ ను మించి పోయాడు ఆయన మనువడు కిమ్ జాంగ్ ఉన్. తన తాత చెప్పినట్లుగా స్వతంత్ర ప్రతిపత్తికి మొదటి ప్రాధాన్యం ఇస్తాడు కిమ్ జాంగ్ ఉన్. తమ దేశం ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేదని కిమ్ జాంగ్ ఉన్ ఉద్దేశం. అయితే పెట్టుబడిదారీ అభివృద్ధి లక్ష్యాన్ని చేరడంలో ఎవరి సహాయాన్నయినా స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగా అగ్రరాజ్యాలకు తెలియజేస్తూనే ఉంటాడు కిమ్ జాంగ్ ఉన్.

అమెరికాపై అందుకే కోపం

అమెరికాపై అందుకే కోపం

అమెరికాపై ఉత్తరకొరియాకు ఉన్న కోపం ఈనాటికాదు. 1950-53 కొరియా యుద్ధంలో ఉత్తర కొరియా పైనా అమెరికా వ్యవహరించిన తీరు ఇప్పటికీ అక్కడి ప్రజలకు గుర్తుంది. అలాగే కిమ్ వంశానికి కూడా అమెరికా అంటే అస్సలు గిట్టదు.

ఊచకోత

ఊచకోత

స్వయం పాలన నిర్వహించుకుంటున్న లక్షలాది కొరియా ప్రజా కమిటీలను అమెరికా సైన్యం, కొరియా కులీన భూస్వామ్య వర్గాలు కలిసి ఊచకోత కోశాయి. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఏటా జరిపే సంయుక్త యుద్ధ విన్యాసాల పట్ల అందుకే ఉత్తర కొరియా వ్యతిరేకత వహిస్తుంది.

జపాను ఆక్రమించేందుకు ప్రయత్నం

జపాను ఆక్రమించేందుకు ప్రయత్నం

జపాన్ అప్పట్లో ఉమ్మడి కొరియాను ఆక్రమించుకోవాలనుకుంది.అప్పటి ఉమ్మడి కొరియాలోని కులీన దోపిడీ వర్గాలు జపాన్ తో కుమ్మక్కు అయ్యాయి. 1905 నాటికి కొరియా, జపాన్ రక్షిత ప్రాంతం (ప్రొటెక్టరేట్) గా అవతరించింది. 1910 నాటికి జపాన్, కొరియాను పూర్తి స్థాయిలో ప్రత్యక్ష వలసగా మార్చుకుంది.

భూస్వాముల దోపిడికి గురయ్యారు

భూస్వాముల దోపిడికి గురయ్యారు

అనేక శతాబ్దాలుగా అప్పటి ఉమ్మడి కొరియా ప్రజలు భూస్వాముల దోపిడి అణచివేతలో భయంభయంగా కాలం వెళ్లదీశారు. అప్పట్లో కొరియన్లు అంతా అర్ధ ఆకలితో కాలం వెళ్లదీశారు.

నరకం చూపించారు

నరకం చూపించారు

జపాన్ భూస్వాములకు వత్తాసు పలికేది. వారికి మంచి సౌకర్యాలు అందజేసి వారిని జపాన్ తమ ఆధీనంలో ఉంచుకుంది. ముప్పై సంవత్సరాల పాటు జపాన్, కొరియాలోని భూస్వాములు కలిసి ఉమ్మడి కొరియా ప్రజలకు నరకం చూపించారు.

ఇష్టానుసారంగా ప్రవర్తించింది

ఇష్టానుసారంగా ప్రవర్తించింది

కొరియన్లపై అప్పట్లో జపాన్ ఇష్టానుసారంగా ప్రవర్తించింది. కొరియా ప్రజల భాష, సంస్కృతులను అణిచివేసింది. జపాస్ లోని ఇంటి పేర్లను కొరియన్లు కూడా ఇంటి పేర్లుగా పెట్టుకోవాలని బలవంతం చేసింది. కొరియన్ వారసత్వ సంపదను, ప్రాచీన కళలను నాశనం చేసింది జపాన్.

పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు

పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు

కొరియా ప్రజలు తమ మీద జరిగే ఆగడాలపై చాలా సార్లు ప్రతిఘటించారు. అయితే జపాన్ సైన్యం కొరియన్లను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపింది.

లైంగిక బానిసలుగా చేశారు

లైంగిక బానిసలుగా చేశారు

1931లో మంచూరియా (కొరియాకు అనుకుని ఉండే ఈశాన్య చైనా) ను ఆక్రమించాక జపాన్ అణచివేత మరింత ఎక్కువైంది. కొరియా, మంచూరియాల్లోని స్త్రీలను జపాన్ సైనికులు, అధికారులు లైంగిక బానిసలుగా మార్చుకున్నారు. వారితో లైంగిక పనులన్నీ చేయించుకునేవారు.

అప్పుడొచ్చాడు నాయకుడు కిమ్ ఇల్ సంగ్

అప్పుడొచ్చాడు నాయకుడు కిమ్ ఇల్ సంగ్

వేధనలు చూశారు.. వేధింపులను బరించారు. అలాంటి సమయంలో కొరియాలో ఉత్తర ప్రాంతంలో అవతరించాడు ఒక నాయకుడు అతనే ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యకుడు కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్.

కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు

కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు

అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ నేత మావో-జెడాంగ్ బోధించిన కమ్యూనిస్టు సిద్ధాంతాలు కిమ్ ఇల్ సంగ్ లో స్ఫూర్తిని నింపాయి.ఆయన ఉద్యమం లేవనేత్తగానే కొరియా భూస్వాములు వ్యతిరేకంగా ఉద్యమించారు. కానీ కొరియాలోని ఉత్తర ప్రాంత ప్రజలు మొత్తం కిమ్ ఇల్ సంగ్ వైపు నిలిచారు.

కొరియాకు విముక్తి

కొరియాకు విముక్తి

ఇంతో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. యుద్ధంలో జపాన్ గర్వం మొత్తం పోయింది. దాంతో కొరియాకు విముక్తి లభించింది. కొరియన్లు అంతా కొంతకాలం సంతోషంగా గడిపారు. ఇక మనకు మనమే రాజులం అనుకున్నారు.

ఇంతలోనే మళ్లీ కష్టాలు

ఇంతలోనే మళ్లీ కష్టాలు

ఒకప్పుడు కొరియాలో నాయకుడు ప్రజల తరుఫున పోరాడిన కిమ్ ఇల్ సంగ్ ఆధ్వర్యంలోనే ఉత్తర ప్రాంతంలోని ప్రజలు కొత్తసమాజ నిర్మాణం చేపట్టారు. ఇక దక్షిణ ప్రాంతంలోని ప్రజలు పీపుల్స్ కమిటీ పాలనను ఆచరణలోకి తెచ్చుకున్నారు.

పీపుల్స్ కమిటీలు బాగా పని చేశాయి

పీపుల్స్ కమిటీలు బాగా పని చేశాయి

పీపుల్స్ కమిటీలు కార్మికుల ఆధ్వర్యంలో నడిచాయి. ఈ కమిటీలు ప్రజల, కార్మికుల హక్కులను కాపాడాయి. ప్రజా కమిటీల ఉద్యమంతో అప్పటి వరకున్న భూస్వామ్య, వ్యాపార వర్గాలు భయభ్రాంతులకు గురి అయ్యాయి.

అగ్రరాజ్య జోక్యం

అగ్రరాజ్య జోక్యం

ఉత్తర ప్రాంతంలో కమ్యూనిస్టు స్ఫూర్తితో సామాజిక నిర్మాణం జరగడం, దక్షిణ భాగంలో పీపుల్స్ కమిటీ ఉద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో అగ్రరాజ్యం అమెరికా కొరియా విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అమెరికా కొరియా విభజనకు కారణం అయింది. కొరియా విభజనతో దక్షిణ కొరియా ప్రజలు బాగా నష్టపోయారు. అప్పటివరకూ జపాన్ వలస పాలనలో మగ్గిన దక్షిణ కొరియా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆక్రమణలోకి వెళ్లింది.

అమెరికా మిలటరీ బలగాలు

అమెరికా మిలటరీ బలగాలు

ఇక ఉత్తర కొరియాలో కిమ్ ఇల్ సంగ్ నేతృత్వంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా డి‌పి‌ఆర్‌కే ఏర్పడింది. కొన్నాళ్లకు కొరియా యుద్ధం ఏర్పడ్డప్పుడు లక్షలాది మంది ప్రజలు మరణించాల్సి వచ్చింది. ఉత్తర కొరియాను చేజిక్కించుకోవడం కోసం ఆ దేశ నేత కిమ్ ఇల్ సంగ్ ను అణచాలనుకుంది అమెరికా. దీంతో అమెరికా మిలటరీ మరిన్ని బలగాలను కొరియా యుద్ధంలో ప్రవేశపెట్టింది.

సర్వనాశనం

సర్వనాశనం

యుద్ధం ఆరంభంలో దక్షిణ కొరియా సేనలపై ఉత్తర కొరియా పై చేయి సాధించింది. అమెరికా బలగాల ప్రవేశంతో పరిస్ధితి తారుమారు అయింది. అమెరికా సాగించిన ఉత్తర కొరియాను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఉత్తర కొరియా ప్రజలపై 32,000 టన్నుల విషపూరిత నాపామ్ బాంబులను అమెరికా వేసింది.

నేలమట్టం

నేలమట్టం

రాజధాని ప్యోంగ్ యాంగ్ లో 75 శాతం భాగాన్ని బాంబు దాడులతో నేలమట్టం చేసింది. అణు బాంబులతో దాడి చేస్తామని అమెరికా ఉత్తరకొరియాను హెచ్చరించింది. అమెరికా సాగించిన అణు దాడి బెదిరింపుల వల్ల ఉత్తర కొరియా ప్రజలు చాలా రోజులు భయపడ్డారు.

20శాతం జనాభా

20శాతం జనాభా

అణు బాంబు ప్రయోగం పేరుతో అమెరికా సన్నాహాలు చేసిన ప్రతిసారీ ఉత్తర కొరియా ప్రభుత్వం భయపడేది. కొరియా యుద్ధంలో అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఉత్తర కొరియా ప్రజలు చాలామందిచనిపోయారు. ఉత్తర కొరియాలోని 20 శాతం జనాభాని కొరియా యుద్ధంలో అమెరికా చంపేసింది.

అందుకే ప్రస్తుత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అంతు చూడాలని చూస్తున్నాడు.

Image Source :http://www.telegraph.co.uk/

English summary

secrets of the korean war

secrets of the korean war
Desktop Bottom Promotion