ఈమె అమర్చుకున్న సిలికాన్ ఇంప్లాంట్ ఆమె చర్మాన్ని విపరీతంగా చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రస్తుతం మనం ఉంటున్న ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మన శరీరాకృతిని ఆహార్యాన్ని మార్చివేయడంలో డబ్బు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కాస్మెటిక్ సర్జరీ అనేది సర్వసాధారణం అయిపొయింది. మన చుట్టూనే చాలా మంది తెలివిలేని వైద్యులు ప్రజలను అందంగా చూపిస్తాం అని చెప్పి చేతకాని వైద్యంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన ఏమిటంటే, ఒక మహిళ ముఖంపై పెద్ద గుంత ఏర్పడింది. తనను తానూ అందంగా మార్చుకోవడానికి తక్కువఖర్చులో నాణ్యతలేని రైనో ప్లాస్టీ సర్జరీ చేయించుకుంది. కానీ, చివరికి ఆమె యొక్క ఆకృతిని చికిత్స వల్ల కలిగిన ఫలితాన్ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు.

నాణ్యత లేని చికిత్స చేసుకోవడం వల్ల ఈ మహిళ జీవితం ఎలా తారు మరు అయ్యింది మరియు ఆమె కళ్ళ మధ్య ఎంత పెద్ద గుంత ఏర్పడి ఎంత అందవిహీనంగా మారింది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం....

ఈమె ఆమె యొక్క ముక్కుకు మంచి రూపుని తెప్పించాలని భావించింది.

ఈమె ఆమె యొక్క ముక్కుకు మంచి రూపుని తెప్పించాలని భావించింది.

ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న మహిళ పేరు బయటకు రాలేదు గాని, ఆమె అందంగా ఉన్నప్పటికీ మరింత అందంగా కనపడటానికి ఉవ్విలూరింది. దీంతో నాణ్యత లేని ఖర్చు తక్కువ అయిన రైనో ప్లాస్టీ సర్జరీ చేయించుకొని తనను తాను అందంగా మార్చుకోవాలని భావించింది. కానీ దురదృష్టవశాత్తు పరిస్థితి మరింత గా దిగజారింది. చికిత్స అనంతరం ఆమె ఎన్నో ఇన్ఫెక్షన్ లా భారిన పడింది. ఈమె కళ్ళ మధ్య అమర్చుకున్న ఇంప్లాంట్ ఏదైతే ఉందో అది చర్మాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది.

ఈమె అమర్చుకున్న ఇంప్లాంట్ చర్మాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది :

ఈమె అమర్చుకున్న ఇంప్లాంట్ చర్మాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది :

ఈమె కళ్ళ మధ్య అమర్చుకున్న ఇంప్లాంట్ చర్మాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అంతే కాకుండా ముక్కు ప్రదేశం నుండి పొడుచుకొని బయటకు వచ్చేసింది. ఆమె పరిస్థితి చూసిన వారందరికీ సిలికాన్ ఇంప్లాంట్ బయటకు వచ్చేసింది అనే విషయం అర్ధం అవడమే కాకుండా, ఆమెకు తక్షణమే వైద్య సహాయం అవసరం ఉంది లేదంటే, ఆమె పరిస్థితి ఇన్ఫెక్షన్ వల్ల మరింత దిగజారిపోయి ప్రమాదం ఉందని గుర్తించగలుగుతారు.

ఆసుపత్రి వర్గాలు బాధ్యత తీసుకోవడానికి నిరాకరించాయి :

ఆసుపత్రి వర్గాలు బాధ్యత తీసుకోవడానికి నిరాకరించాయి :

కొన్ని వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మహిళ ఏ ఆసుపత్రిలో అయితే చికిత్స చేయించుకుందో, ఆ ఆసుపత్రి వర్గాలు ఈమె యొక్క ప్రస్తుత పరిస్థితిలో వైద్యం చేయడానికి నిరాకరించారట. అంతేకాకుండా ఈమె యొక్క ప్రస్తుత పరిస్థితికి బాధ్యత వహించం అని తేల్చి చెప్పేశారట. దీంతో గత్యంతరంలేక ఆ మహిళ తన గోడుని సామజిక మాధ్యమాల్లో చెప్పుకుంది.

చివరకు ఆమెకు చికిత్సను అందించారు :

చివరకు ఆమెకు చికిత్సను అందించారు :

ఈ మహిళకు జరిగిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీంతో బ్యాంకాక్ లోని ప్రముఖ కాస్మెటిక్ క్లినిక్ ఈమెకు వైద్య సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు ఈమె యొక్క ఇంప్లాంట్ ని విజయవంతంగా తీసివేసి, ఆమెకు సోకిన ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గించారు.వీరు చికిత్సని అంతా ఉచితంగానే చేసారు. కానీ దురదృష్టవశాత్తు ముక్కు దగ్గర ఎక్కడైతే సిలికాన్ ఇంప్లాంట్ ఉందో ఆ ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడింది.

ఇది ఎలా జరిగిందంటే :

ఇది ఎలా జరిగిందంటే :

ప్రముఖ వైద్య నిపుణుల ప్రకారం, చికిత్స చేసే సమయంలో ఎప్పుడైతే సిలికాన్ ఇంప్లాంట్ ని చొప్పిస్తారో ఆ సమయంలో ఇంప్లాంట్ దాని చుట్టూ ఉన్న ఎముకలు మరియు కణజాలం తో అంత త్వరగా సఖ్యత ఏర్పరుచుకొని అక్కడ ఇమిడిపోదట. దీనికి బదులుగా చర్మం క్రింది భాగంలో అది ఇమిడినట్లు ఉంటుంది. ఇందువల్ల తరచూ ఆ ఇంప్లాంట్ పెట్టిన ప్రదేశం జరిగినప్పుడు ఆ ఇంప్లాంట్ గనుక సరైన పద్దతిలో పెట్టకపోతే, అది ఎక్కువగా కదలటం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు చోటు చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మంచి వైద్యులతో చికిత్స చేయించుకోండి, మీ భవిష్యత్తుని కాపాడుకోండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Her Botched Nose Job Left Her With A Silicone Implant Protruding Between Her Eyes

    A woman opted for a cheap rhinoplasty operation at a local clinic in Thailand. Reports state the unidentified clinic has refused to help her when her silicon implant correction that has protruded right out of her face. The woman shared her sad story with the world.
    Story first published: Thursday, January 4, 2018, 17:40 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more