పక్కనోడి పెళ్లాన్ని అనుభవించడంతో పాటు ఇంకా చాలా పనులు గరుడు పురాణం ప్రకారం మహాపాపాలు

Written By:
Subscribe to Boldsky

గ‌రుడ పురాణం అనేది అష్టాద‌శ పురాణాల్లో ఒక‌టి. వ్యాస మ‌హ‌ర్షి దీన్ని రాశారు. మ‌హావిష్ణువు త‌న వాహ‌న‌మైన గ‌రుడునికి దీని గురించి చెప్పారు. అందుకే దీన్ని గ‌రుడ పురాణం అంటారు. ఇందులో వ్య‌క్తులు చేసిన పాపాల‌కు న‌రకంలో విధించే శిక్ష‌లతో పాటు చాలా వివ‌రాలు ఉంటాయి. అలాగే మనుషులు బతికున్నంతకాలం వారు కొన్ని పాపాలు చేయకూడదని గరుడ పురాణంలో రాసి ఉంది. ఆ పాపాలు ఏమిటో ఒక్కసారి చూడండి.

బ్రాహ్మణ హత్య

బ్రాహ్మణ హత్య

కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. గరుణ పురాణం ప్రకారం బ్రహ్మహత్య మహాపాపం. అలాగే శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం, రహస్యంగా పాపపు పనులు చేయొద్దని గరడపురాణం చెబుతోంది. వీటితో పాటు ఇంకా చాలా పాపాలున్నాయి. వాటిలో ఏది చేసిన కూడా గరుణ పురాణం ప్రకారం పాపమే. అవి చేస్తే గరుణ పురాణం శిక్షలు దారుణంగా ఉంటాయి.

స్త్రీని చంపడం

స్త్రీని చంపడం

స్త్రీని చంపడం గరుణ పురాణం ప్రకారం పాపం. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా గరుణ పురాణం ప్రకారం పాపులే.

విషం ఇవ్వడం

విషం ఇవ్వడం

కొందరు కొందర్ని చాలా విశ్వాసంగా నమ్ముతారు. అలాంటి వారిని కూడా కొందరు దగ్గరున్న వాళ్లే మోసం చేసి వెన్నుపోటు పొడుస్తారు. లేదంటే చంపుతారు. కొందరు విషం ఇచ్చి చంపుతారు. ఇవన్నీ కూడా గరుణ పురాణం ప్రకారం పాపాలు. అలాంటి వారికి ఘోరమైన శిక్షలుంటాయి.

దేవతల్ని అనుమానించడం

దేవతల్ని అనుమానించడం

గురువులు, పండితులు, దేవతల్ని అనుమానించడం స్త్రీ, శిశు ధనం హరించడం కూడా గరుణ పురాణం ప్రకారం చాలా పాపం. వీటన్నింటికీ నరకంలో శిక్షలను అనుభవించాల్సిందే. పుణ్యస్థలాల్లో చేయకూడని పనులు చేసినా పాపమే. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట.

గొప్ప వారి భార్యలను

గొప్ప వారి భార్యలను

గొప్పగొప్ప వ్యక్తుల భార్యలను అనుమానించడం, వాళ్లను అనుభవించాలని మనస్సులో అనుకోవడం కూడా గరుడ పురాణం ప్రకారం పాపం. అలాంటి వారికి నరకంలో శిక్షలుంటాయి.

ప్రకృతిని హరించడం

ప్రకృతిని హరించడం

ప్రకృతిని హరించేవారు కూడా గరుడపురాణం ప్రకారం పాపులే. అలాంటి వారికి కూడా చాలా కఠిన శిక్షలుంటాయి. ప్రకృతికి ముప్పు వాటిల్లే ఏ పని చేసినా గరుడపురాణం ప్రకారం పాపం కిందకే వస్తుంది.

భార్యను నిర్లక్ష్యం చేయడం

భార్యను నిర్లక్ష్యం చేయడం

భార్యను నిర్లక్ష్యం చేయడం ఆమెను కొట్టడం, తిట్టడం, బాధించడం వంటివి కూడా గరుడపురాణం ప్రకారం పాపమే. అలాంటి వారు కూడా గరుడపురాణం ప్రకారం నరకంలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది.పక్కవారి భార్యపై మోజుపడడం వారిని అనుభవించాలని అనుకోవడం..వారితో గడపడం వింతతువులను అనుభవించడం కూడా గరుణ పురాణం ప్రకారం పాపమే.

ప్రజలను పట్టించుకోకుంటే

ప్రజలను పట్టించుకోకుంటే

ప్ర‌జ‌ల‌ను స‌రిగ్గా పాలించకుండా, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే వారికి గరుడపురాణ ప్రకారం శిక్ష అనుభవిస్తారు. ఇలాంటి వారికోసం న‌ర‌కంలో ప్రత్యేక శిక్ష ఉంటుంది. వీరి శ‌రీరాల‌ను పిప్పి పిప్పి చేస్తారు. అంత‌కు ముందు దారుణంగా కొడ‌తారు. ఆ త‌రువాత శ‌రీరాల‌ను ఒక పెద్ద గుండు కింద వేసి న‌లిపేస్తారు.

దోపిడీ చేస్తే

దోపిడీ చేస్తే

ప్ర‌జ‌ల ధ‌నం, వ‌స్తువులు దోపిడీ చేయడం కూడా గరుడపురాణం ప్రకారం మహాపాపం. అలాంటి వారికి న‌ర‌కంలో గరుడపురాణం ప్రకారం చాలా కఠిన శిక్షలుంటాయి. వారిని య‌మ‌భ‌టులు తాళ్ల‌తో దారుణంగా క‌ట్టేసి రక్తం వ‌చ్చే వ‌ర‌కు కొడ‌తారు. ర‌క్తాలు కారుతున్న‌ప్ప‌టికీ కొట్ట‌డం ఆప‌రు. వారు ప‌డిపోయే వ‌ర‌కు అలా కొడుతూనే ఉంటారు.

జంతువులను చంపితే

జంతువులను చంపితే

జంతుల‌ను చంపడం కూడా గరుడపురాణం ప్రకారం పాపం. అలాంటి వారికి న‌ర‌కంలో భారీ శిక్షలుంటాయి. వారిని జంతుల‌ను న‌రికిన‌ట్టే ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి పోగులు పెడ‌తార‌ట‌.

లైంగికంగా వేధిస్తే

లైంగికంగా వేధిస్తే

ఆడ‌, మ‌గ ఎవ‌రైనా సరే ఇంకొక‌రిని లైంగికంగా వేధిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. అలాగే అత్యాచారం చేస్తే కూడా శిక్ష ఉంటుంది. అందుల్ల ఇలాంటి పాపం చేయకండి. ఇలా చేస్తే న‌ర‌కంలో జ‌న‌నావ‌య‌వాల‌ను క‌త్తిరిస్తారు.

మద్యం సేవిస్తే

మద్యం సేవిస్తే

మ‌ద్యం సేవించడం కూడా గరుడపురాణం ప్రకారం పాపం. దీనికి న‌ర‌కంలో శిక్ష ఉంటుంది. వారి చేత ద్ర‌వ రూపంలో ఉన్న వేడి ఇనుమును తాగిస్తార‌ట‌.

అన్నం పెట్టకుండా తింటే

అన్నం పెట్టకుండా తింటే

ఆకలితో అలమటిస్తూ పేద‌ల‌కు అన్నం పెట్ట‌కుండా తినడం కూడా గరుడపురాణం ప్రకారం పాపం. అలాంటి వారికి న‌ర‌కంలో శిక్ష ఉంటుంది. వారి శ‌రీరాన్ని ప‌క్షుల‌కు ఆహారంగా వేస్తారట.

జంతువులను హింసించడం

జంతువులను హింసించడం

తమ సంతోషం కోసం జంతువుల‌ను హింసించడం లేదా వాటిని హింసిస్తుంటే వేడుకగా చూడడం కూడా గరుడపురాణం ప్రకారం పాపం. అలా చేసినా, అలాంటి చూస్తూ ఊరుకున్నా కూడా న‌ర‌కంలో శిక్ష ప‌డుతుంది. వారిని స‌ల స‌ల కాగే నూనెలో ఫ్రై అయ్యేలా వేయిస్తార‌ట‌.

మోసం, అబద్దం

మోసం, అబద్దం

ఇత‌రుల‌ను మోసం చేయడం, అబ‌ద్దాలు ఆడడం కూడా గరుడపురాణం ప్రకారం పాపం. అలాంటి వారికి కూడా న‌ర‌కంలో ఘోరమైన శిక్షలుంటాయి. వారిని నరకంలో త‌ల‌కిందులుగా వేలాడ‌దీసి క్రూర‌మైన జంతువుల‌ చేత హింసింప‌జేస్తారు.

అధికార దుర్వినియోగం

అధికార దుర్వినియోగం

అధికార దుర్వినియోగానికి పాల్ప‌డడం కూడా గరుడపురాణం ప్రకారం పాపం. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని త‌ప్పుడు ప‌నులు చేయడం తప్పు. ఇలాంటి వారికి న‌ర‌కంలో శిక్ష ఉంటుంది. వారిని మాన‌వుని వ్య‌ర్థాల‌తో కూడిన న‌దిలో పారేస్తారు. అందులో మాన‌వుల‌కు చెందిన మ‌లం, మూత్రం, ఇతర వ్య‌ర్థాలు ఉంటాయి. వాటిని తాగుతూ వారు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది.

సహాయం చేయకుంటే

సహాయం చేయకుంటే

ఇత‌రుల‌కు స‌హాయం చేయ‌కపోవడం కూడా గరుడపురాణం ప్రకారం పాపం. ఇలాంటి వారికి న‌ర‌కంలో శిక్ష ఉంటుంది. వారి ఎత్త‌యిన లోయ‌లోంచి కింద‌కు విసిరేస్తారు. అక్క‌డ ప్ర‌మాద‌క‌ర‌మైన పాములు, తేళ్లు వంటి విష పురుగుల‌తో కుట్టిస్తారు. ఆ త‌రువాత క్రూర జంతువుల‌తో హింసిస్తారు.

పెద్దలకు గౌరవం ఇవ్వకుంటే

పెద్దలకు గౌరవం ఇవ్వకుంటే

పెద్ద‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌కపోవడం కూడా గరుడపురాణం ప్రకారం పాపం. పెద్దలను నిర్ల‌క్ష్యం చేసే వారికి కూడా న‌ర‌కంలో శిక్ష ఉంటుంది. వారిని బాగా వేడిగా ఉండే ప్ర‌దేశంలో ఉంచుతారు. ఆ బాధ‌కు త‌ట్టుకోకున్నా స‌రే అందులో ఉండాల్సిందే.

వేదాంతశాస్త్రాలను దూషించేవారు

వేదాంతశాస్త్రాలను దూషించేవారు

పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు.. ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు కూడా గరుణపురాణం ప్రకారం పాపులే.

పరనింద చేసేవారు

పరనింద చేసేవారు

పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు కూడా గరుణపురాణం ప్రకారం పాపులే. నీచమైన పనులు చేసేవారు కూడా గరుణపురాణం ప్రకారం పాపులే. వీరందరూ నరకంలో శిక్షలు అనుభవించాల్సిందే.

అవమానించేవారు

అవమానించేవారు

తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు కూడా గరుడపురాణం ప్రకారం పాపులే.

దానాన్ని ఆపేవారు

దానాన్ని ఆపేవారు

దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు కూడా పాపులే.

Images Source :https://www.speakingtree.in

English summary

sins according to garuda purana

sins according to garuda purana
Story first published: Friday, February 2, 2018, 16:30 [IST]
Subscribe Newsletter