For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాజహాన్ కన్న కూతుర్ని కూడా అనుభవించాడంట

By Bharath
|

షాజహాన్ అంటే అందరికీ గొర్తొచ్చేది గొప్ప ప్రేమికుడు. తాజ్ మహాల్ ద్వారా ప్రపంచంలోని ప్రజలందరిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న షాజహాన్ కు సంబంధించి చాలా విషయాలు ప్రపంచానికి తెలియవు. అసలు ముంతాజ్ పై ప్రేమతో తాజ్ మహాల్ కట్టించలేదని.. అలాగే ఆయన చాలా మంది అమ్మాయిలతో రాసలీలలు జరపారని కొందరు అంటుంటారు. షాజహాన్ కు సంబంధించిన కొన్ని విషయాలు మీకోసం..

ముంతాజ్ పేరు

ముంతాజ్ పేరు

షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ అని అందరూ అంటుంటారు. కానీ ఆమె పేరు ముంతాజ్ ఉల్ జామాని. ఆమె అసలు పేరు అంజుమంద్ బాను. తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించినట్టు గాని, ముంతాజ్ ను అక్కడ ఖననం చేసినట్టుగానీ, అనంతర కాలంలో షాజహాన్ ను అక్కడ పూడ్చినందుకు దాఖలాగా గానీ తాజ్ మహల్ వద్ద ఒక శాసనమూ లేదు. ఒక శిలాఫలకమూ లేదు. తాజ్ మహాల్ అనేది షాజహాన్ స్వాధీనం చేసుకున్న పురాతన రాజభవనం అట. దానికి నగిశీలు చెక్కి అలా అందంగా మార్చాడంట.

ముంతాజ్ తో పెళ్లి ఇలా

ముంతాజ్ తో పెళ్లి ఇలా

షాజహాన్ ను ఖుర్రం అని కూడా అంటారు. రాజకీయ తంత్రంలో భాగంగా తన మేనకోడలు ముంతాజ్ ను నూర్జహాన్ షాజహాన్ కు ఇచ్చి పెళ్లి చేయించింది. నూర్జహాన్ షాజహాన్ కు సవతి తల్లి. నూర్జహాన్ ను రాణిగా నియమించాడు జహంగీర్.

ముంతాజ్ కు అంతకు ముందే పెళ్లి

ముంతాజ్ కు అంతకు ముందే పెళ్లి

షాజహాన్ పెళ్లి చేసుకోకముందే ముంతాజ్ కు పెళ్లి అయ్యింది. అతన్ని షాజహాన్ చంపడంతో ముంతాజ్ ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఒక కథనం కూడా ఉంది. అలాగే ముంతాజ్ చనిపోయాక కూడా ఆమె సోదరిని వివాహం చేసుకున్నాడట షాజహాన్.

ముంతాజ్ పద్నాలుగు సార్లు తల్లి

ముంతాజ్ పద్నాలుగు సార్లు తల్లి

అయితే ముంతాజ్ రాచకన్య కాదు కనుక నిశ్చితార్థం చేసుకున్న ఐదేళ్లకు గానీ షాజహాన్ ఆమెను పెళ్ళాడలేదు. ఈలోపు ఓ పారసీక రాకుమారిని వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేశాడు. ముంతాజ్ షాజహాన్ తో కాపురం చేసి వరుసగా పద్నాలుగు సార్లు ప్రసవించింది. పద్నాలుగో సారి బిడ్డను కనే ప్రయత్నంలో పురుటిలోనే ముంతాజ్ బుహాన్ పూర్ లో మరణించింది. తర్వాత ఆమెను అక్కడే ఖననం చేశారు.

Image source : https://postober.com/

అప్పుడు అనుకున్నాడట

అప్పుడు అనుకున్నాడట

బులారా మహల్‌లో మొఘల్ రాణి ముంతాజ్ బేగం కన్నుమూసినప్పుడు ఆమె జ్ఞాపకార్థం షాజహాన్ ఒక అందమైన స్మారకమందిరాన్ని నిర్మించాలని భావించాడ అట. అలా ఆయన మనసులో తాజ్‌మహల్ రూపుదిద్దుకుందని అంటారు. మొదట్లో ఈ మందిరాన్ని బర్హాంపూర్‌లోనే నిర్మించాలని అనుకున్నప్పటికీ ఇతర కారణాల వల్ల దాన్ని ఆగ్రాలో నిర్మించారు అట.

Image source : https://postober.com/

ఇప్పటికే ముంతాజ్ ఆత్మ అక్కడే

ఇప్పటికే ముంతాజ్ ఆత్మ అక్కడే

తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాతే ముంతాజ్ దేహాన్ని బులారా మహల్‌ కు తరలించారు. అయితే ముంతాజ్ మృతదేహాన్ని మాత్రమే అక్కడినుంచి తీసుకుపోయారు తప్ప ఆమె ఆత్మ మాత్రం ఇప్పటికీ బులారా మహల్‌లోనే ఉండిపోయిందని స్థానికులు బులారా మహల్ నుంచి ఇప్పటికీ పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, ఏడుపులు వినిపిస్తుంటాయట.

ముంతాజ్ తో పాటు

ముంతాజ్ తో పాటు

తాజ్ మహల్ సముదాయంలో తర్వాత ముంతాజ్ ను ఖననం చేసి గొప్ప సమాధి సౌధంగా మార్చారు. అయితే అందులో ఖననం చేసింది కేవలం ముంతాజ్ ను మాత్రమే కాదు షాజహాన్ ఇంకో భార్య సిర్హింద్ బేగంను కూడా అక్కడే ఖననం చేశారు.

ముంతాజ్ పరిచారికను కూడా

ముంతాజ్ పరిచారికను కూడా

ముంతాజ్ బేగం రాణికి ఇష్టమైన పరిచారిక సతీఉన్నీసా చనిపోవడంతో ఆమెను కూడా తాజ్ మహాల్ లోనే ఖననం చేశారు. షాజహాన్ తాజ్ మహల్ ను తనకు సంబంధించిన చాలా మందిని ఖననం చేసేందుకు ఉపయోగించాలనుకున్నాడు. కేవలం ముంతాజ్ దివ్యస్మృతికే తాజ్ మహాల్ ను నిర్మించాలని ఆయన అనుకోలేదంట. రాణికి, పరిచారికకు ఒకే విధమైన సమాధులు కట్టించాడు షాజహాన్. దీన్ని బట్టీ ముంతాజ్ పై ఆయనకు ఎంతమేర ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది.

చాలా క్రూరుడు

చాలా క్రూరుడు

షాజహాన్ చాలా క్రూరుడు. గుడ్డివాడయిన అన్నను తన రక్షణలో ఉంచమని తండ్రికి చెప్పి, రాత్రివేళ రహస్యంగా ఖూనీ చేయించాడు. జహంగీర్ మరణాంతరం లైన్ క్లియరయింది నీవు రావొచ్చునని మామ ఆసఫ్ఖాన్ కబురంపాక డక్కన్ నుంచి తాను తిరిగి వచ్చి గద్దెనెక్కేలోపే తన సోదరులను, దాయాదులను అందరినీ సఫా చేసెయ్యమని చెప్పిన వైనమే షాజహాన్ క్రూర స్వభావాన్ని వెల్లడిస్తుంది.

సొంతకూతురితో కూడా

సొంతకూతురితో కూడా

షాజహాన్ అంటే అతని ఎనలేని ప్రేమనే మనకు గుర్తొస్తుంది. అయితే ఆయనకు భార్య ముంతాజ్ తో పాటు చాలామంది అమ్మాయిలతో సంబంధాలుండేవి. షాజహాన్ కు మొత్తం ఏడుగురు భార్యలు. ముంతాజ్ నాలుగో భార్య. అలాగే వందలాది మంది స్త్రీలతో షాజహాన్ కు సంబంధాలుండేవి. ఆఖరికి సొంత కూతురిని కూడా షాజహాన్ అనుభవించాడు అట.

ఇప్పటికీ చెక్కు చెదరకుండా

ఇప్పటికీ చెక్కు చెదరకుండా

భారతీయ, ఇస్లాం, పర్షియన్ వాస్తు సమ్మిశ్రితంగా నిర్మించిన తాజ్ మహల్, 400 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శోభాయమానంగానే ఉంది. తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేలమంది వాస్తు కళాకారులు, శిల్పులు, ఇతర పనివాళ్ళు పాల్గొన్నారు. 1983లో యునెస్కో "ప్రపంచ పూర్వా సంస్కృతి ప్రదేశం"గా తాజ్ మహల్ ను గుర్తించింది.

ఉద్యానవనం

ఉద్యానవనం

మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ ఎదురుగా మెహ్‌తాబ్ బాగ్ ఉద్యానవనంలో ఆయనకు ఇష్టమైన వేసవి బంగ్లా కూడా ఉండేదట. భారత పురావస్తు సంస్థ(ఏఎస్‌ఐ) జరిపిన తవ్వకాల్లో శతాబ్దాల నాటి బారాదరి లాంటి మండపం గోడలు, శిథిలాలు ఇటీవల వెలుగుచూశాయి. మెహ్‌తాబ్(అంటే ఉర్దూలో వెన్నెల) బాగ్‌లోని ఆ మండపంలో రాత్రిపూట సేదతీరుతూ షాజహాన్ తాజ్‌మహల్‌ను చూస్తూ గడుపుతుండేవాడట.

శిథిలాలు

శిథిలాలు

భారీ వరదలు లేదా నిర్మాణంలో లోపం కారణంగానే ఈ వేసవి బంగ్లా భూగర్భంలోకి కూరుకుపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. మెహ్‌తాబ్ బాగ్‌లో తూర్పువైపున 1997-99 మధ్యలో ఏఎస్‌ఐ జరిపిన తవ్వకాల్లో కూడా 25 ఫౌంటెయిన్లతో కూడిన ఓ ట్యాంకు, ఓ బారాదరి (అన్ని వైపుల నుంచీ గాలి వీచేలా కట్టిన మండపం) శిథిలాలు వెలుగుచూశాయి.

నల్లరాతి భవనం

నల్లరాతి భవనం

తాజాగా తాజ్‌మహల్‌కు సూటిగా మెహ్‌తాబ్ బాగ్‌లో దక్షిణం వైపు జరుపుతున్న తవ్వకాల్లో వేసవి బంగ్లా అవశేషాలు బయటపడ్డాయి. కాగా, ఇప్పుడున్న పాలరాతి తాజ్‌మహల్ ఎదురుగా ఓ నల్లరాతి తాజ్‌మహల్‌ను కూడా నిర్మించాలని, ఆ రెండింటినీ ఓ వారధితో అనుసంధానం చేయాలనీ అప్పట్లో షాజహాన్ భావించారన్న ప్రచారమూ ఉంది.

ఆభరణాలపై పిచ్చి

ఆభరణాలపై పిచ్చి

షాజహాన్ కు ఆభరణాలపై విపరీతమైన పిచ్చి ఉండేది. ఆయన స్వంతనగల ఖరీదు అప్పట్లోనే ఐదు కోట్ల రూపాయలు ఉండేది. రాజకుమారులకు ఇచ్చిన ఆభరణాల ఖరీదు మరో రెండు కోట్ల రూపాయలు. ఐదుకోట్ల రూపాయల విలువైన స్వంతనగల్లో నిత్యం ధరించే నగల విలువ రెండుకోట్ల రూపాయలుగా ఉండేది.

నగలన్నీ అక్కడే

నగలన్నీ అక్కడే

నగలు నిత్యం అంత:పురంలో పరిచారికల వశంలో చక్రవర్తి ఎప్పుడంటే అప్పుడు ధరించేందుకు తయారుగా ఉండేవి. మిగిలిన మూడుకోట్ల రూపాలయల ఖరీదైన నగలు కూడా కావాల్సినప్పుడు ధరించడానికి గాను ఇతర గదుల్లో ఉండేవి. షాజహాన్ చక్రవర్తి తలపాగాకు చుట్టుకునే బంగారు సరిగపట్టకు గుచ్చిన సర్పేస్ అనే కెంపుల కలికితురాయి విలువే అప్పట్లోనే పన్నెండు లక్షల రూపాయలు ఉండేది.

కొడుకే ఖైదు చేశాడు

కొడుకే ఖైదు చేశాడు

వ్యాధిగ్రస్తుడైన తండ్రి షాజహాన్‌ను కుమారుడు ఔరంగజేబు

ఖైదు చేశాడు. ముగ్గురు సోదరులనూ- అగ్ర వారసుడు దారా షుకో, షా షుజా, మురాద్‌- హత్య చేశాడు. కుమారుడి పెట్టిన నరకయాతన షాజహాన్ తట్టుకోలేకపోయాడు. షాజహాన్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతు చనిపోయాడు. అయితే ఔరంగజేబు షాజహాన్ ను చనిపోయేంత వరకు ఆగ్రాకోటలోనే బందీగా ఉంచాడు.

English summary

some unknown facts about mughal emperor shahjahan

some unknown facts about mughal emperor shahjahan
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more