For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీరెడ్డి లీక్స్: డ్యాష్ లేక మంగళవారం అన్నాడంటా, తెలుగమ్మాయిలు పక్కలోకే, అమ్మాయిల‌కే సెక్స్ కోరికలు

|

శ్రీరెడ్డి పేరు తెలియని తెలుగు వారు ఎవరూ ఉండరేమో. అంతగా పాప్ లర్ అయిపోయింది ఆమె పేరు.

శ్రీరెడ్డి నిత్యం ఫేస్ బుక్ ట్విట్టర్‌ల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉంటుంది.

"నా పోరాటం వ్యక్తుల మీద కాదు.. తెలుగు చిత్ర సీమలో మార్పుల కోసమే నా పోరాటం.. నిరసనను మళ్లీ మొదలుపెడతాను. నాకు ఎవరి మీదా పగ లేదు. ఒకరి తీరుతో హర్టయ్యాం. వారి మీద యుద్ధాన్ని ఆపేస్తున్నా "అంటూ కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇక శ్రీరెడ్డి దాడి ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ పోస్ట్ పెట్టిన తర్వత వెంటనే మళ్లీ కొందరు స్టార్లపై పోస్ట్ లు చేసింది.

ఎప్పుడు ఏ బాంబ్ ఎవరిపై వేస్తుందో

ఎప్పుడు ఏ బాంబ్ ఎవరిపై వేస్తుందో

తన ఒట్టు తీసి గట్టుమీద పెట్టేసి మళ్లీ యధామామూలుగానే అందరికీ చుక్కులు చూపిస్తోంది శ్రీరెడ్డి. బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఒక బాంబ్ బిగ్ బాస్ హౌస్ లో పై వేస్తారు. అక్కడ ఎలిమినేట్ అయితే వేస్తారేమో కానీ శ్రీరెడ్డి మాత్రం ఎప్పుడు ఏ బాంబ్ ఎవరిపై వేస్తుందో ఎవ్వరికీ తెలియదు.

సామ్రాట్ కు.. చెప్పులు, చీపుర్లతో స్వాగతం

తాజాగా శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ తనతో జరిపిన సంభాషణను లీక్ చేసింది. వాట్సాప్‌లో సామ్రాట్ ఏమేమి సందేశాలు పోస్టు చేశాడో వెల్లడించింది. ఓ స్క్రీన్ షాట్ తీసి మరీ షేర్ చేసింది. అతడు ఎప్పుడైతే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వస్తాడో ఆ వెంటనే అతడికి చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలుకుతామంటూ ఫేస్ బుక్కులో పోస్ట్ చేసింది.

సామ్రాట్ రెడ్డి వెడ్స్ శ్రీ రెడ్డి

సామ్రాట్ రెడ్డి వెడ్స్ శ్రీ రెడ్డి

ఫేస్ బుక్ పోస్టులో.. "సామ్రాట్ రెడ్డి వెడ్స్ శ్రీ రెడ్డి.. ఫన్ ఇన్ బిగ్ బాస్ రా.. ఆఫర్ పేరు చెప్పి వాడుకొని.. నా సంగతేంది రా అంటే.. ....లేక మంగళవారం అన్నాడంటా. మీ ఆవిడ రెడీ రా. బయటకు రా చెప్పులు, చీపుర్లతో రెడీగా ఉంటాం'అంది. బిగ్‌బాస్‌లో ఉన్న సామ్రాట్‌పై ఇలా ఓ రేంజ్‌లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దగ్గుబాటి అభిరామ్

సామాట్ర్ మాత్రమే కాదు గతంలో లీక్స్ పేరుతో చాలామంది బాగోతాలు బయటపెట్టింది శ్రీరెడ్డి. గతంలో కొందరు సినీ ప్రముఖులతో జరిపిన వాట్సాప్ సంభాషణలను కూడా బయటపెట్టింది శ్రీరెడ్డి. నిర్మాత సురేష్ బాబు కొడుకు, హీరో రానా సొదరుడు దగ్గుబాటి అభిరామ్ తనతో ఎలా మెలిగాడో తెలుపుతూ శ్రీరెడ్డి గతంలో బయటపెట్టిన స్టిల్స్ దుమ్ము దుమారం లేపాయి.

అభిరామ్ ట్రాన్స్ జెండర్ ను కూడా వదలడు

అభిరామ్ ట్రాన్స్ జెండర్ ను కూడా వదలడు

అవకాశాలు ఇస్తానని చెప్పి తనను బాగా వాడుకున్నాడని అభిరామ్ ను ఉద్దేశించి మాట్లాడింది శ్రీరెడ్డి. అభిరామ్ ట్రాన్స్ జెండర్ ను కూడా వదలడని ఆరోపణలు చేసింది. ఇక శ్రీరెడ్డి లీక్స్ తో కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టాయి. అలా శ్రీరెడ్డి లీకుల పర్వాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంది.

రసికరాజుల్లో కంటి మీద కునుకు లేదు

రసికరాజుల్లో కంటి మీద కునుకు లేదు

ఇక శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి పేరును బయటపెడుతుందోనని టాలీవుడ్ రసికరాజుల్లో కంటి మీద కునుకు లేకుండా పోయింది. శ్రీరెడ్డి లీక్ వీరుల్లో వరుసగా... సింగర్ ఇండియన్ ఐడల్ శ్రీరామ్, వైవా హర్ష, నిర్మాత పుప్పాల రమేష్, రచయిత కోన వెంకట్, దర్శకుడు కొరటాలతో పాటు బడా ప్రొడ్యుసర్ దగ్గుబాటి సురేష్ పుత్రరత్నం దగ్గుబాటి అభిరామ్‌‌ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్న భయపడాలి

వందల మంది ఆడ పిల్లల మానాలు నలిగిన రామానాయుడు స్టూడియోస్ నుంచి ఆ అమ్మాయిలకి న్యాయం జరగాలి.. అభిరామ్ లాంటి వాళ్ళని నిర్బయ చట్టం కింద అరెస్ట్ చేయాలి ఇక ముందు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్న భయపడాలి నా ఉద్యమానికి మరకలు అంటించే వాళ్ళకి ఇదే నా సవాల్ అంటూ శ్రీరెడ్డి ఆ మధ్య ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా బహిరంగ సవాల్ విసిరారు.

పచ్చగడ్డి వేస్తె భగ్గు మంటాది

కానీ కొన్ని రోజులుగా నానిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు మాత్రం చూపడం లేదు. "నానికి, నాకు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గు మంటాది. ఏం చేద్దాం నాని మరి??" అని ఓసారి ట్వీట్ చేశారు.

నాని + శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్.

అలాగే "నాని + శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్... ఎప్పుడు? కమింగ్ సూన్! ఆన్ ద వే. నానిగాడి రాసలీలలు అన్ని బయట పెడతా. కాసుకోర నాని... నీ కాపురంలో నిప్పులే" అని శ్రీరెడ్డి చేసిన ట్వీట్ కూడా సంచలనమైంది.

బక్కపీచు సోగ్గాడు శేఖర్ కమ్ముల

బక్కపీచు సోగ్గాడు శేఖర్ కమ్ముల

తనతో రొమాంటిక్ కార్యకలాపాలు ట్రై చేశారంటూ ఒక్కొక్కరి పేర్లూ బయటపెడుతోన్న నటి శ్రీరెడ్డి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే."పెద్ద డైరెక్టర్ అని పొగరని.. తెలుగమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని నమ్మే వ్యక్తి.. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే కొమ్ములు వచ్చిన శేఖర్ " అంటూ శేఖర్ కమ్ములను పరోక్షంగా ఆ మధ్య శ్రీరెడ్డి ఏకిపారేసింది.

అసభ్యం.. అవమానకరం

ఈ కామెంట్స్‌పై శేఖర్ కమ్ముల సీరియస్ అయ్యారు. తానెప్పుడు కలవని, చూడని, కనీసం ఫోనులో కూడా మాట్లాడని అమ్మాయి తన గురించి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం షాకింగ్‌గా ఉందని ఆ మధ్య శేఖర్ కమ్ముల చెప్పారు.

ఈ వ్యవహారంలో శేఖర్ కమ్ముల కూడా ఓ పోస్టు చేశారు. ‘‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.

వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం

వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం

స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను." అని వ్యాఖ్యానించారు.

ఏంటి శేఖర్ కమ్ముల గారు సీరియస్ అయ్యారట

ఏంటి శేఖర్ కమ్ముల గారు సీరియస్ అయ్యారట

అయితే, శ్రీరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన శేఖర్ కమ్ముల క్షమాపణ చెప్పకుంటే పోలీస్ కేసు పెడతానంటూ అదే ఫేస్ బుక్ వేదికగా హెచ్చరించారు దీంతో శ్రీరెడ్డి శేఖర్ కమ్ములను ఉద్దేశిస్తూ మరో పోస్టింగ్ పెట్టింది.. ‘ఏంటి శేఖర్ కమ్ముల గారు సీరియస్ అయ్యారట, మాలాంటి చిన్న వాళ్ల మీద జులుం ఏంటి సర్.. నేనేదో కల్పితమైన బెడ్ టైం కథలు రాస్తూ ఉంటా నా పేజ్ లో, నా ఫ్యాన్స్ కోసం.. నా హాబీ.. మీరేం ఫీల్ అవకండి.. మీరేం చెయ్యలేదుగా అలాంటప్పుడు ఎందుకు లొల్లి..' అంటూ రాసుకొచ్చింది శ్రీరెడ్డి. అయితే, ఈ పోస్ట్ పెట్టిన అరగంట తర్వాత శ్రీరెడ్డి దీనిని తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి డిలీట్ చేయడం విశేషం.

నగ్నంగా ఫొటోలు పంపు

శ్రీరెడ్డి నానిపై కామెంట్ చేసినందుకు ఆయన భార్య రియాక్ట్ అయ్యారు. అందుకు శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన వైవా హర్ష గురించి శ్రీరెడ్డి గతంలో ఓ పోస్టు పెట్టారు. షార్ట్ ఫిలింస్‌లో విషయంలో హెల్ప్ అడిగినందుకు అతడు ఎలా ప్రవర్తించాడో వెల్లడిస్తూ.... వాట్సాప్ చాటింగ్ విషయాలను ఆమె విడుదల చేశారు. ఏదైనా చేసుకుని బ్రతకొచ్చుకదా అన్న వారికి ఇది నా సమాధానం. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, చివరకు షార్ట్ ఫిల్మ్స్ అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని..... శ్రీరెడ్డి చెప్పింది.

వాట్సాప్ చాట్ చాలా దారుణంగా

శ్రీరెడ్డి వైవా హర్షతో చేసిన వాట్సాప్ చాట్ చాలా దారుణంగా ఉంది. ‘నగ్నంగా ఫొటోలు పంపు'.. ‘నా రూంకు వస్తావా' అంటూ వైవా హర్ష ఇంకా చాలా రకాలుగా ప్రలోభపెట్టాడని ఆ చాట్ ను బయటపెట్టింది. ఆ వాట్సాప్ చాట్ లో శ్రీరెడ్డి తన హాట్ పర్సనల్ ఫొటోలు కూడా వైవా హర్షకు పంపడం విశేషం.. ఇలా హర్ష బండారం బయటపెట్టి శ్రీరెడ్డి అప్పట్లో దుమారం లేపింది..

షేమ్ ఆన్ యూ శ్రీరామ్

ఇక బడా ప్రొడ్యుసర్ రమేష్ పుప్పాలపై విమ‌ర్శ‌లు కురిపించింది శ్రీరెడ్డి. అలాగే శ్రీరెడ్డి ఇండియన్ ఐడ‌ల్ విన్న‌ర్‌, సింగ‌ర్ శ్రీరామ్ చాట్‌తో పాటు ఆయ‌న‌తో దిగిన ప‌లు ఫోటోల‌ని లీక్ చేసింది.షేమ్ ఆన్ యూ శ్రీరామ్ .. నీ పేరులో శ్రీరామ్ అనే ప‌దం తొల‌గించుకో..ఈ పేరు నీకు క‌రెక్ట్ కాదు అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా లీక్ చేసేసింది శ్రీరెడ్డి. శ్రీరామ్ ప‌లు మార్లు హాట్‌ ఫోటోలు పంపించ‌మ‌ని అడ‌గ‌డం, వీలుంటే ఓసారి క‌లుద్దామ‌ని చెప్ప‌డం లీక్ చాట్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

అబ్బాయిల‌క‌న్నా.. అమ్మాయిల‌కే సెక్స్ కోరిక‌లు ఎక్కువ‌

అబ్బాయిల‌క‌న్నా.. అమ్మాయిల‌కే సెక్స్ కోరిక‌లు ఎక్కువ‌

శ్రీరెడ్డి ఏ విషయం గురించి అయినా డేర్ గా మాట్లాడతారు. అందులో నో డౌట్. గతంలో ఒక ఛానెల్‌కు శ్రీ‌రెడ్డి చాలా బోల్డ్ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. మీరు నోరు తెరిస్తే సెక్స్‌.. సెక్స్ అంటుంటారు క‌దా.. సెక్స్ అంటే మీకు ఇష్ట‌మా..? అని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇచ్చింది. ఇంకా సెక్స్ గురించి వ‌ర్ణిస్తూ అబ్బాయిల‌క‌న్నా.. అమ్మాయిల‌కే సెక్స్ కోరిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నిపించిన ప్ర‌తీ అబ్బాయిని సెక్సీగా ఉన్నాడా..? లేడా..? అనే కోణంలో అమ్మాయిలు చూస్తార‌ని చెప్పింది. తాను చెప్పిన ఈ విష‌యాలు ఇటీవ‌ల ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లోనూ వెల్ల‌డైంద‌ని, అయితే, మ‌న దేశంలో సెక్స్ గురించి బాహాటంగా మాట్లాడితే పెద్ద‌లు త‌ప్పుబ‌డ‌తార‌ని చెప్పుకొచ్చింది.

సెక్స్‌ను బ‌హిరంగంగా మాట్లాడుకోక‌పోవ‌డం మూర్ఖ‌త్వం

మ‌న సంప్ర‌దాయాల ప్ర‌కారం, అలాగే, దేవాల‌యాల్లో, గోపురాల్లో, పుస్త‌కాల్లో సెక్స్ గురించే ఉంటాయ‌ని, కానీ, సెక్స్‌ను బ‌హిరంగంగా మాట్లాడుకోక‌పోవ‌డం మ‌న మూర్ఖ‌త్వం అంటూ శ్రీ‌రెడ్డి ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. చివ‌ర‌కు అమ్మ‌వారిని వ‌ర్ణించే స‌మ‌యంలోనూ.. అంగాంగ వ‌ర్ణ‌న ఉంటుంద‌ని చెప్పింది. సెక్స్ గురించి మీరు ఏ విధంగా త‌ప్పు బ‌డ‌తారో ఇప్పుడు చెప్పండి అంటూ స‌వాల్ విసిరింది శ్రీ‌రెడ్డి. శృంగారం చేసే స‌మ‌యంలో చ‌నిపోయినా ప‌ర్వాలేద‌ని అనుకుంటార‌ని శ్రీ‌రెడ్డి పేర్కొంది.

ఇష్టం లేని వారితో శృంగారం చేస్తూ

తెర‌ముందు కాకుండా... తెర వెనుక జ‌రిగే భాగోతాన్ని కూడా గతంలో శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్టింది. ఆఖ‌రుకు రేపో మాపో పోయే వారిని సైతం భ‌రించాల్సి వ‌స్తుంది అంటూ క‌న్నీరు పెడుతూ శ్రీ‌రెడ్డి చెప్ప‌డం ప‌లువురిని కంట‌త‌డి పెట్టించింది. మ‌న‌సుకు న‌చ్చిన వారితో చేసే వారితో రిలీజ‌య్యే ఆమ్లాలు వేరే ఉంటాయి. ఇష్టం లేని వారితో శృంగారం చేస్తూ రాని మూలుగుల‌ను మూలుగుతూ.. మ‌నం న‌టించాల్సింది కెమెరా ముందు క‌దా..? ఇలా ఎందుకు చేయాల్సి వ‌స్తుంది..? నా లైఫ్ ఇంతేనా..? ప‌లు ప్ర‌శ్న‌లు న‌న్ను వేధిస్తుంటాయి.

తెల్ల‌చీర, మ‌ల్లెపూలు క‌ట్టుకు రమ్మంటాడు

తెల్ల‌చీర, మ‌ల్లెపూలు క‌ట్టుకు రమ్మంటాడు

అటువంటి ఘ‌ట‌నలు న‌న్ను వేధించాయి అంటూ చెప్పుకొచ్చింది శ్రీ‌రెడ్డి. కేవ‌లం నా క‌ల‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు నేనొక బొమ్మ‌లా త‌యార‌వుతా, ఒక‌డేమో తెల్ల‌చీర, మ‌ల్లెపూలు క‌ట్టుకు రమ్మంటాడు.. మ‌రొక‌డేమో ప‌సుపు చీర‌..క‌న‌కాంబ‌రాలు పెట్టుకుర‌మ్మంటాడు. ఇంకొక‌డు ఫోన్ చేసి సేఫ్టీస్ తెమ్మంటాడు.. ఇలా అనేక ర‌కాలుగా నా గ‌త జీవితాన్ని అనుభ‌వించాను అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

క్యాస్టింగ్ కౌచ్ లో బలవుతున్న సమిధ శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్ లో బలవుతున్న సమిధ శ్రీరెడ్డి

శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో ఎంతో కొంత న్యాయం లేకపోతే చాలా మంది జనాలు ఆమెకు సపోర్ట్ చెయ్యరు. అవకాశాల కోసం వెళ్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆమెను ఆసరగా తీసుకుని వాడుకున్నారు. మరి శ్రీరెడ్డి కూడా వారికి సహకరించింది కదా అని కొందరు అంటున్నారు.. కానీ ఏ పరిస్థితుల్లో తాను అలా చేసిందో కూడా అర్థం చేసుకోవాలి. టాలీవుడ్ లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సమాజానికి తెలపడానికి బలవుతున్న సమిధ శ్రీరెడ్డి. నెస్ట్ శ్రీరెడ్డి టార్గెట్ ఎవరో... నెట్టింట్లో ఆమె ఎవరు గుడ్డలు ఊడదీయనుందో వేచి చూద్దాం.

English summary

sri reddy leaks who is sri reddys next target

sri reddy leaks who is sri reddys next target, Samrat Reddy weds Sri Reddy: Bigg Boss Telugu 2 contestant's intimate chat leaked.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more