యముడు వాళ్లని ముందే చంపేస్తాడు.. చంపే ముందు సూచనలు కూడా ఇస్తాడు

Written By:
Subscribe to Boldsky

యముడుని యమధర్మరాజు అని అంటారు. ఈయన నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. మనుషులు చేసే పాపాలను లెక్క వేస్తూ ఉంటాడు. లెక్కకు మించి పాపాలు చేస్తే మనుషుల ప్రాణాలు తీసి నరకానికి తీసుకెళ్తాడని అంటుంటారు. ఇదే యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి. యముని పాశాన్ని కాలపాశము అంటారు. యముడు దున్నపోతును తన వాహనంగా ఉపయోగించుకుంటడు. యముడి వద్ద ఉంటూ పాపుల పద్దులను లెక్కించడంలో చిత్రగుప్తుడు నిమగ్నమై ఉంటాడు.

వారికి సౌమ్యంగానే కనపడతాడు

వారికి సౌమ్యంగానే కనపడతాడు

యముడి చెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానం ఉండదు. యముడి నియమాలు చాలా కఠోరమైనవి. పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడు. పాఫులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్త నేత్రాలతో, మెకెపులు చిమ్మే నాలుకతో, నిక్కబొడుచుకొన్న వెంట్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనబడతాడని స్కంద పురాణంలో కాశీ ఖండములో ఉంది.

గొప్ప జ్ఞాని

గొప్ప జ్ఞాని

యముడు గొప్ప జ్ఞాని. భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు. భూలోకంలో మొట్టమొదట మరణం పొంది పరలోకమునకు వెళ్లిన మొదటి వ్యక్తి యముడని అంటుంటారు. యముడికి వైవస్వతుడు, శని సోదరులున్నారు. అలాగే యమున, తపతి అనే సోదరీమణులున్నారు.

మరణం మాత్రం తప్పదు

మరణం మాత్రం తప్పదు

పుట్టిన ప్రతి మనిషి ఎదో ఒకరోజు కచ్చితంగా చనిపోతాడు కాకపొతే కొద్దిగా వెనుక ముందు కానీ కచ్చితంగా మరణం మాత్రం తప్పదు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం మనిషి ఆయువు తీరిన తర్వాత యమధర్మ రాజు వచ్చి వారి ఆత్మలను తీసుకువెళ్తాడని నమ్మకం. కానీ యమధర్మ రాజు మనుషులు బతికుండగానే వారు మరణానికి దగ్గరగా ఉన్నారు అని కొన్ని సూచనలను ఇస్తాడట.

యుముడి కోసం తపస్సు

యుముడి కోసం తపస్సు

పురాణ కాలంలో యమునా నది వడ్డున అమృతుడనే వ్యక్తి నివసించేవాడు. ఒక సందర్భంలో అతనికి తానూ చనిపోతే ఎలా అనే ఆలోచన పట్టుకొని మృత్యువు ఎప్పుడు ఎక్కడి నుండి వస్తుందో, ఎలా చనిపోతానో అని రోజు తలచుకుంటూ బయపడేవాడు. దీంతో అతను ఈ మృత్యు భయం పోవాలంటే యమధర్మరాజు ప్రత్యక్షం కోసం ఘోర తపస్సు చేశాడు అలా చేయడం వలన యమధర్మరాజు ప్రత్యక్షం అయ్యాడు.

మరణం ఎప్పుడొస్తుందో చెబుతాడు

మరణం ఎప్పుడొస్తుందో చెబుతాడు

వెంటనే యమధర్మరాజు ఏమి వరం కావాలో కోరుకో అని అడగ్గా అందుకు అమృతుడు తానూ ఎప్పుడు చనిపోతానో, నేను చనిపోయే ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలిసేలా చేయాలనీ కోరుతాడు. అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుంది అనేది సృష్టి రహస్యం అని దానిని తెలుపలేను అని కాకపొతే మరణం వచ్చే ముందు కొన్ని సూచనలు మాత్రం పంపుతానని వాటి ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో ఒక అంచనాకు రావొచ్చు అని యముడు అమృతుడికి వరం ఇచ్చి మాయం అవుతాడు.

ఆ మాటలన్నీ మరిచిపోతాడు

ఆ మాటలన్నీ మరిచిపోతాడు

కొన్ని రోజుల తర్వాత అమృతుడు యముడు చెప్పిన మాటలు మరచిపోతాడు. అలా ఏళ్ళు గడిచిపోయినా తరువాత తనకు పెళ్లి అవడం, పిల్లలు పుట్టడం, సంసారం వృద్ధి చేసుకోవడంలో అలాగే తన పిల్లలు పెద్దవారై వారికి పెళ్లి చేయడంలో మునిగిపోతాడు. ఒకరోజు అమృతుడికి యముడితో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. కానీ తనకు యముడు నుండి ఎలాంటి సూచనలు రాకపోవడంతో తనకు ఇంకా చాలా ఆయువు ఉందనుకొంటాడు.

అప్పటికీ ఆయువు తీరలేదు అనుకుంటాడు

అప్పటికీ ఆయువు తీరలేదు అనుకుంటాడు

ఒక రోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోతాయి, చర్మం అంత ముడుతలుబడిపోతుంది. మరో రోజు తన పళ్లన్ని ఊడిపోతాయి అప్పుడు కూడా తన ఆయువు తీరలేదు అనుకుంటాడు. మరి కొంత కాలానికి తనకి కళ్లు కనిపించకుండా పోతాయి. చివరికి పక్షావాతం వచ్చి మంచాన పడుతాడు. ఈ రెండు సందర్భాలలో కూడా తన ఆయువు తీరలేదు అనుకుంటాడు.

చావు సూచనలు ఎలాంటివి రాలేదు కదా

చావు సూచనలు ఎలాంటివి రాలేదు కదా

ఇక చివరికి ఒక రోజు యముడు వచ్చి నీఆయువు తీరింది అని అందుకే నీ ప్రాణాలను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అమృతుడితో చెబుతాడు. ఆ మాటలకూ ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు మరి చెప్పినట్టు చావు సూచనలు ఎలాంటివి రాలేదని, అయినా మీరు వచ్చి నా ప్రాణాలను తీసుకుపోతున్నారు మరి నాకు ఇచ్చిన వరం ఏమిటి అని అడుగుతాడు.

నేను నాలుగు సూచనలు ఇచ్చాను

నేను నాలుగు సూచనలు ఇచ్చాను

కానీ యముడు నీ ఆయువు తీరింది నిన్ను తీసుకుపోవలసిందే అంటాడు. యముడు నీకు ఇచ్చిన వరం ప్రకారం నాలుగు సూచనలు పంపించాను అని అవే నాలుగు అనారోగ్యాలు అని అంటాడు. వెంట్రుకలు తెల్లబడటం, పళ్లు ఊడిపోవడం, చూపు కోల్పోవడం, పక్షవాతం రావడం అనేవే నేను ఇచ్చిన సూచనలు అని యముడు చెబుతాడు. దాంతో నిజం తెలుసుకొని అమృతుడు యముని వెంట వెళ్ళిపోతాడు.

ఆరోగ్యం క్షీణిస్తే మరణమే

ఆరోగ్యం క్షీణిస్తే మరణమే

దీనిని బట్టి మనకు తెలిసిన విషయం మన ఆరోగ్యమే మనకు రక్ష, ఆరోగ్యం చెడిపోయిందో ఇక మనకు చావే గతి తెలుసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే ఎంత ధనవంతుడైన, ఎంత పేదవాడు అయినా పుట్టుక చావు ఎవ్వరు ఆపలేరని తెలుసుకోవాలి. బతికున్న రోజులు మనం చనిపోయిన బతికున్నవారి మనసులో ఎలా చిరంజీవిగా ఉండాలో తెలుసుకోవాలి.

అలా చేస్తే యముడు ముందుగానే తీసుకెళ్తాడు

అలా చేస్తే యముడు ముందుగానే తీసుకెళ్తాడు

అలాగే యమధర్మరాజు ఎవరెవరిని కాస్త ముందుగానే మరణించేటట్లు చేస్తాడనే విషయం, ఎవరినీ నరకానికి తీసుకెళ్తాడనే విషయం కూడా కొన్ని పురణాల్లో ఉంది. పెద్దలను పెద్దగా గౌరవించకపోవడాన్ని యముడు అస్సలు సహించడంట. ఇతరుల ముందు కాలుపై కాలు వేసుకుని కూర్చొనే వాళ్లు కూడా చచ్చిపోతారంట. అలాగే వారిని యముడు నరకానికే తీసుకెళ్తాడంట.

అక్రమ సంబంధాలు

అక్రమ సంబంధాలు

ఎవరితో అంటే వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఏ వ్యక్తిని యముడు వదిలిపెట్డడంట. కొందరు వారికి ఇష్టం వచ్చినట్లు పడుకుంటూ ఉంటారు. అంటే కాళ్లు ఏ దిశకు పెట్టాలో తెలియకుండా పడుకుంటూ ఉంటారు. అలాంటి వారిని కూడా యముడు వదిలిపెట్టడంట.

చీకటిలో పడుకుంటే

చీకటిలో పడుకుంటే

ఎప్పుడూ ఎక్కువగా చీకట్లలో పడుకునే వారిని కూడా యముడు త్వరగా తీసుకెళ్తాడంట. విరిగిపోయిన మంచాలపై పడుకునే వారిని కూడా యముడు త్వరగా తీసుకెళ్తాడంట. ఒక వ్యక్తి గురించి ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడేవాళ్లన యముడు వదిలిపెట్టడంట.

సృష్టి అంతా క‌నిపిస్తుంద‌ట‌

సృష్టి అంతా క‌నిపిస్తుంద‌ట‌

మ‌నిషి చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది? అత‌ని శ‌రీరాన్న‌యితే ఖ‌న‌నం చేస్తారు. మ‌రి ఆత్మ సంగ‌తి? అది ఎక్క‌డికి వెళ్తుంది? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది. మ‌నిషి మ‌ర‌ణానంత‌రం జ‌రిగే ప‌రిణామాల గురించి హిందూ శాస్త్రం ప్ర‌కారం గ‌రుడ పురాణంలో ఉంది. మ‌రికొద్ది క్షణాల్లో చ‌నిపోతాడ‌న‌గా మ‌నిషికి సృష్టి అంతా క‌నిపిస్తుంద‌ట‌.

దివ్య దృష్టి

దివ్య దృష్టి

త‌నకు ఆ స‌మయంలో దివ్య దృష్టి లాంటిది వ‌స్తుంద‌ట‌. దీంతో అత‌ను ప్ర‌పంచాన్నంత‌టినీ అర్థం చేసుకుంటాడ‌ట. కానీ ఆ క్ష‌ణంలో ఏమీ మాట్లాడ‌లేడ‌ట‌. అయితే ఆ స‌మ‌యంలోనే మ‌నిషి య‌మ‌దూత‌ల‌ను చూస్తాడ‌ట‌. వారు అత్యంత వికారంగా, న‌ల్ల‌గా, త‌ల అనేది ఒక స‌రైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్ల‌తో అత్యంత భ‌యంక‌రంగా వారు క‌నిపిస్తార‌ట‌. అనంత‌రం అన్ని స్పృహ‌ల‌ను కోల్పోయి చివ‌రికి ప్రాణం పోతుంద‌ట‌. దీంతో ఆ ప్రాణాన్ని (ఆత్మ‌ను) య‌మ‌దూత‌లు న‌ర‌కానికి తీసుకువెళ్తార‌ట‌.

47 రోజుల సమయం పడుతుందంట

47 రోజుల సమయం పడుతుందంట

య‌మ‌దూత‌లు ఆత్మ‌ల‌ను న‌రకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో దారిలో ఆత్మ‌ల‌ను య‌మ‌దూత‌లు అనేక చిత్ర‌హింస‌లు పెడ‌తార‌ట‌. త‌మ‌ను చూసి భ‌య‌ప‌డినా, ఎక్క‌డైనా ఆగినా ఆత్మ‌ల‌ను కొర‌డాల వంటి ఆయుధాల‌తో చిత‌క్కొడుతూ య‌మ‌దూత‌లు తీసుకెళ్తార‌ట‌.

ఆత్మలు ఏడుస్తాయట

ఆత్మలు ఏడుస్తాయట

దీంతోపాటు న‌రకంలో విధించే శిక్ష‌ల‌ను గురించి య‌మ‌దూత‌లు ఆత్మ‌ల‌కు క‌థ‌లు క‌థ‌లుగా చెబుతార‌ట‌. దీంతో ఆత్మ‌లు ఏడుస్తాయ‌ట‌. త‌మ‌ను అక్క‌డికి తీసుకువెళ్ల‌వ‌ద్ద‌ని ప్రార్థిస్తాయ‌ట‌. అయినా య‌మ‌దూత‌లు క‌నిక‌రించ‌రు స‌రి కదా, ఇంకాస్త క‌ఠినంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఆత్మ‌ల‌ను య‌మ‌ధ‌ర్మ రాజు ముందు ప్ర‌వేశ‌పెడ‌తార‌ట‌.

వాటికి త‌ప్ప‌నిస‌రిగా శిక్ష

వాటికి త‌ప్ప‌నిస‌రిగా శిక్ష

న‌ర‌కంలో య‌మ‌ధ‌ర్మ‌రాజు మ‌నుషుల ఆత్మ‌ల‌కు వారు చేసిన పాప‌, పుణ్యాల ప్ర‌కారం శిక్ష‌లు వేస్తాడ‌ట‌. చిన్న చిన్న త‌ప్పులు చేసి ప‌శ్చాత్తాప ప‌డుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద య‌మ‌ధ‌ర్మ రాజు చూడ‌డ‌ట‌. కానీ దొంగ‌త‌నం, హ‌త్య వంటి నేరాల‌కు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా శిక్ష ప‌డే తీరుతుంద‌ట‌. అబ‌ద్దాన్ని కూడా పాపం గానే ప‌రిగ‌ణిస్తార‌ట‌. అయితే పాప‌, పుణ్యాల‌ను లెక్కించ‌డానికి ముందు య‌ముడు ఆత్మ‌ల‌ను మ‌రోసారి భూలోకానికి వారి బంధువుల వ‌ద్ద‌కు పంపిస్తాడ‌ట‌.

ఇవన్నీ అందులో ఉన్నాయి

ఇవన్నీ అందులో ఉన్నాయి

ఈ క్ర‌మంలో ఆత్మ‌కు చెందిన వారు హిందూ ధ‌ర్మ శాస్త్రం ప్ర‌కారం క‌ర్మ‌కాండ‌లు, పిండ ప్ర‌దానాలు అన్నీ చేయాల్సి ఉంటుంద‌ట‌. ఇవ‌న్నీ మ‌నిషి చ‌నిపోయిన పది రోజుల్లో పూర్తి చేయాల‌ట‌. లేదంటే య‌మ‌లోకం నుంచి వ‌చ్చిన ఆత్మ అక్క‌డే చెట్ల‌పై తిరుగుతుంద‌ట‌. ఈ క‌థంతా విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉంటుంది కానీ, గ‌రుడ పురాణంలో దీన్ని చెప్పార‌ట‌. అది చ‌దివితే ఇంకా మ‌రిన్ని విష‌యాలు తెలిసేందుకు అవ‌కాశం ఉంటుంది.

Image Source : https://www.speakingtree.in/

English summary

surprising things that will lead to an early death

surprising things that will lead to an early death
Story first published: Tuesday, January 30, 2018, 17:00 [IST]
Subscribe Newsletter